Pages

Aug 4, 2021

Yehova maa prabhuvaa | యెహోవా మా ప్రభువా

"యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది." కీర్తన Psalm 8

పల్లవి : యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో
మహిమగల నీ నామము గొప్పది

1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ
బాలుర స్తుతి స్తోత్రములతో
స్థాపించితివి నీవొక దుర్గము
నేదాగునట్లు ఆశ్రయ దుర్గము || యెహోవా ||

2. నీ చేతి పనియైన ఆకాశమును
చంద్ర నక్షత్రములనే చూడగా
వాని దర్శించి జ్ఞాపకము చేయ
మానవుండు ఏపాటివాడు || యెహోవా ||

3. నీకంటె మానవుని కొంచెముగా
తక్కువ వానిగా చేసితివి
మహిమ ప్రభావ కిరీటమును
వానికి ధరింపజేసితివి || యెహోవా ||

4. అడవి మృగములు ఆకాశపక్షులు
సముద్ర మత్స్యములు పశువులు
వాని పాదముల క్రిందనుంచి
అధికారము వానికిచ్చితివి || యెహోవా ||

5. నీ నామము మా ప్రభువా యెహోవా
ఎంతో ఘనత ప్రభావము గలది
ఆ నామమును బట్టి మా కిచ్చితివి
నీ రూపమును మాకు హల్లెలూయ || యెహోవా||

No comments:

Post a Comment