Pages

Aug 1, 2021

MANASERIGINA YESAYYA | మనసెరిగిన యేసయ్యా

MANASERIGINA YESAYYA | మనసెరిగిన యేసయ్యా

మనసెరిగిన యేసయ్యా - మదిలోన జతగా నిలిచావు 
హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి - నీ పత్రికనుగా మార్చావు

నిర్జీవ క్రియలను విడిచి - పరిపూర్ణ పరిశుద్ధతకై 
సాగిపోదును నేను - ఆగిపోలేనుగా 
సాహసక్రియలు చేయు - నీ హస్తముతో 
నన్ను పట్టుకొంటివే - విడువలేవు ఎన్నడు    || మన || 

వెనుకున్న వాటిని మరిచి - నీ తోడు నేను కోరి 
ఆత్మీయ యాత్రలో నేను - సొమ్మసిల్లి పోనుగా 
ఆశ్చర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో 
నన్ను ఆదుకొంటివే - ఎదబాయవు ఎన్నడు || మన || 

మర్త్యమైన దేహము వదిలి - అమర్త్యతను పొందుటకై 
ప్రభుబల్లారాధనకు - దూరము కాలేనుగా 
నేలమంటితో నన్ను రూపించిన హస్తములే 
నన్ను కౌగిలించెనే - వదలేవు ఎన్నడు         || మన ||

No comments:

Post a Comment