Pages

Aug 29, 2021

W. C. MacDougall | డబ్ల్యు. సి. మాక్‌డౌగల్

డబ్ల్యు. సి. మాక్‌డౌగల్ | W. C. MacDougall

జననం: -
  • మహిమ ప్రవేశం: 1935
  • స్వస్థలం: ఓంటారియో
  • దేశం: కెనడా
  • దర్శన స్థలము: భారతదేశం

 డబ్ల్యు. సి. మాక్‌డౌగల్ కెనడాలోని ఓంటారియోలో జన్మించారు. అతను ఔషధ రసాయన శాస్త్రవేత్త. హీరామ్ కళాశాలలో చదువుకుంటున్న సమయంలో అతను విద్యార్థుల మధ్య పరిచర్య చేశారు. తరువాత అతను ఒక క్రైస్తవ సంఘములో పాదిరిగాను మరియు సెయింట్ థామస్‌లోని డిసైపుల్స్ కాలేజీ (శిష్యుల కళాశాల) ప్రిన్సిపాల్‌గాను పనిచేశారు. అయితే భారతదేశంలో మిషనరీల కొరకు ఉన్న అవసరతను తెలుసుకొనిన పిమ్మట అతను పూర్తి సమయం మిషనరీ సేవ చేయుటకు తనను సమర్పించున్చుకున్నారు.

 తదుపరి భారతదేశానికి చేరుకున్న మాక్‌డౌగల్ మొదట కలకత్తాలో ఉన్నారు. అక్కడ విద్యార్థుల మధ్య పరిచర్య జరిగించుటకు అతనికి విస్తృతముగా అవకాశములు లభించగా అతను క్రమం తప్పకుండా బైబిలు తరగతులను నిర్వహించారు. 1910వ సంll లో పెండ్రా రోడ్డుకు వెళ్ళిన అతను, అక్కడ నీల్స్ మాడ్సన్ తరువాత ఆ పరిచర్య బాధ్యతలను చేపట్టారు. అతను పెండ్రా రోడ్డులో సువార్త, విద్యా మరియు వైద్య సంబంధిత సేవలను నిర్వహించారు. పిమ్మట జబల్‌పూర్‌కు వెళ్ళిన అతనికి తదుపరి డియోగఢ్‌లో మహిళల మధ్య చురుకుగా పరిచర్య చేస్తున్న అన్నీ లాకీతో వివాహం జరిగింది.

 మాక్‌డౌగల్ ప్రభావితం చేయగల బోధకుడు మరియు సువార్తికుడు. అయితే భారతదేశానికి అతను అందించిన సేవలలో అత్యంత ముఖ్యమైనది జబల్‌పూర్‌లోని బైబిలు కళాశాలలో ఉపాధ్యాయునిగాను మరియు కళాశాల ప్రిన్సిపాల్‌గాను పని చేయడం. అక్కడ అతను అనేక మంది భారతీయ క్రైస్తవ నాయకులకు శిక్షణనిచ్చారు. ఆ విధంగా శిక్షణ పొందిన దైవసేవకులు భారతదేశంలోని మారుమూల ప్రాంతములకు సువార్తను తీసుకువెళ్ళారు. అతను ఒక శిక్షణ పొందిన వైద్యుడు కానప్పటికీ, సమయమునకు తగిన వైద్యమును ఎలా చేయాలో అనుభవపూర్వకముగా ఎంతో జ్ఞానమును కలిగియున్నారు. తాను సువార్త ప్రకటించుటకు చేసే పర్యటనలలో అతను సాధారణ రోగములకు చికిత్స చేసేవారు మరియు అనారోగ్యముతో ఉన్నవారికి సలహాలనిచ్చేవారు. మిషనరీ పరిచర్య మాత్రమే కాకుండా ‘సహాయక పత్రిక’ అనే మిషన్ వారపత్రికకు సంపాదకులుగా కూడా వ్యవహరించారు మాక్‌డౌగల్. మరొక వైపు అతని భార్యయైన అన్నీ లాకీ బైబిలు కళాశాలలో చదువుకుంటున్న పురుషుల యొక్క భార్యలకు బోధించేవారు. అవసరతలలో ఉన్నవారికి దుస్తులు, ఆహారం మరియు సంరక్షణను అందించి వారికి సేవలందించడములో సంతోషమును తృప్తిని కనుగొనే కనికరముగలిగిన స్త్రీ అన్నీ లాకీ.

 1926వ సంll లో మాక్‌డౌగల్ కుటుంబ సమేతంగా భారతదేశాన్ని విడిచి కెనడాకు తిరిగి వెళ్ళారు. అక్కడ డాll మాక్‌డౌగల్ హిల్‌క్రెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ యొక్క పాదిరిగా నియమితులయ్యారు. అక్కడ అతను కెనడియన్ స్కూల్ ఆఫ్ మిషన్స్‌లో కూడా బోధించారు. 1935వ సంll లో డాll మాక్‌డౌగల్ ప్రభువునందు నిద్రించగా, అన్నీ లాకీ మిషనరీ సేవ కొరకు భారతదేశానికి వెళ్ళుటకు సిద్ధపడుటలో తన ఇద్దరు కుమార్తెలకు సహకారమందిస్తూ ఓంటారియోలోని టొరంటోలోనే నివసించడం కొనసాగించారు. 

🚸 *ప్రియమైనవారలారా, క్రీస్తులో ఎదుగునట్లు యవ్వనస్థులను మీరు ప్రోత్సహించుచున్నారా?* 🚸

🛐 *"ప్రభువా, నేను కలిగియున్న జ్ఞాన నైపుణ్యములను మీ రాజ్య పురోభివృద్ధి కొరకు ఉపయోగించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

No comments:

Post a Comment