Pages

Aug 23, 2021

Yaakobu dhaevudaapadha | యాకోబు దేవుడాపద

"ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక!" కీర్తన Psalm 20

పల్లవి : యాకోబు దేవుడాపద కాలంబుల యందు
నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక!
1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును
సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును || యాకోబు ||

2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు
నీ దహన బలులను అంగీకరించును గాక || యాకోబు ||

3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన
యంతటిని సఫలము చేసి నిన్ను గాచును || యాకోబు ||


4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుము
మా దేవుని నామమున ధ్యజము నెత్తెదము || యాకోబు ||


5. నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచును
యెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక || యాకోబు ||


6. రక్షించి దక్షిణ హస్తబలమును చూపును
యుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి ||యాకోబు ||


7. అతిశయ పడుదురు రథ గుఱ్ఱములతో
యెహోవా నామములో మనము అతిశయింతుము || యాకోబు ||


8. వారు కృంగి నేలమీదపడి లేవకున్నారు
మనము లేచి చక్కగా నిలుచుచున్నాము || యాకోబు ||

No comments:

Post a Comment