Pages

Sep 15, 2021

Harold St. John | హెరాల్డ్ సెయింట్ జాన్

హెరాల్డ్ సెయింట్ జాన్ | Harold St. John

  • జననం: 02-09-1876
  • మహిమ ప్రవేశం: 11-05-1957
  • స్వదేశం: యునైటెడ్ కింగ్‌డమ్
  • దర్శన స్థలము: ప్రపంచవ్యాప్తంగా

అతని కాలంలో అత్యంత ప్రతిభావంతులైన బైబిలు ఉపదేశకులలో ఒకరు హెరాల్డ్ సెయింట్ జాన్. దేవుని యందలి భయభక్తులతో పెరిగిన అతను, 18 సంll ల వయస్సులో క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి కూడా అతను తాను కలుసుకున్న ప్రతి ఒక్కరికీ సువార్త చెప్పడం అలవాటు చేసుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయములో చదువుకోవాలని అతను ఆకాంక్షించారు గానీ, తన తండ్రి యొక్క అకాల మరణం కారణంగా దానిని సాధించలేకపోయారు. తదుపరి అతను లండన్‌లోని ఒక బ్యాంకులో పని చేయడం ప్రారంభించారు. అక్కడ పని చేయు వేళలు సుదీర్ఘముగా ఉన్నప్పటికీ, అతను తన ఖాళీ సమయాన్ని సువార్త ప్రకటించుటకు కేటాయించేవారు.

ఈస్ట్ లండన్ మరియు హైడ్ పార్క్‌లలో బోధించారు హెరాల్డ్. అయితే అతని ఆసక్తి ముఖ్యముగా మురికివాడలలో పరిచర్య చేయడం పట్ల ఉండెడిది. కానీ తన బోధనల ద్వారా ప్రజలు ఒప్పింపబడుటలేదనియు మరియు వారి నుండి అంతగా స్పందన లేదనియు అతను భావించారు. దానికి కారణం తాను పట్టు వస్త్రాలు ధరించి, క్రీస్తు యొక్క శ్రమలను గురించి బోధిస్తే ఎవరూ తన మాటలను ఆలకించరని  గ్రహించారు హెరాల్డ్. కావున, ఒకనాటి సాయంత్రం అతను చౌకైన దుస్తులు ధరించి, దాదాపు 200 మంది నివసించే ఒక మురికివాడకు వెళ్ళారు. వారు కూర్చున్న చోట అతను కూర్చున్నారు, వారు తినేదే అతను కూడా తిన్నారు మరియు వారిని కుట్టిన మిన్నల్లి పురుగులు అతనిని కూడా కుట్టాయి. అతను ఆ రాత్రంతా వారి అవసరాలను, బాధలను వింటూ వారితో గడిపారు. పిమ్మట ఒకనాడు ఉదయం ఆరు గంటలకు అతను లేచి వారితో మాట్లాడటం ప్రారంభించారు. ఇప్పుడు అతని బోధనను వినిన ప్రజలు అతను చెప్పినదానిని అంగీకరిస్తున్నట్లు కనిపించింది. ఆ రోజున లండన్ నగర మురికివాడలలో ఒక ఆత్మీయ ఉజ్జీవం ప్రారంభమైంది.

మంచి జీతం వస్తున్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన పూర్తి సమయమును పరిచర్యకు సమర్పించుకున్నారు హెరాల్డ్. అటువంటి పరిచర్యనే తరువాతి 30 సంll ల పాటు కొనసాగించిన అతను, క్రీస్తు కొరకు వేలాది ఆత్మలను సంపాదించారు. అతను తన భార్యతో పాటు బ్రెజిల్, బొలీవియా, పెరాగ్వే, ఉరుగ్వే మరియు అర్జెంటీనా మొదలగు దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఆత్మలో శక్తివంతమైన అభిషేకమును పొందుకొనినవారై, తాను వెళ్ళిన ప్రతి ప్రదేశములోను పెద్దసంఖ్యలో జన సమూహాలను ఆకర్షించారు హెరాల్డ్. అతను తన జీవితాంతం కూడా సంచార మిషనరీగా దేవుని కొరకై జీవించారు.

“నేను రాజును చూచుటకు వెళ్ళినప్పుడు అది ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది... తన సౌందర్యముతో ఉన్న రాజు... నా పాపాలు, నా భయాలు అన్నీ, సమస్తమూ పోయాయి... ఇప్పుడు క్రీస్తు మాత్రమే... నేను జీవించి ఉన్నవారిలో సంతోషకరమైన వ్యక్తిని... అది అంతా ప్రకాశవంతంగా ఉంది, అంతా ప్రకాశవంతంగా ఉంది!” అను మాటలు తాను మరణించబోయే ముందు హెరాల్డ్ సెయింట్ జాన్ మెల్లని స్వరముతో పలికిన మాటలు. 

🚸 *ప్రియమైనవారలారా, మీ జీవనశైలి క్రీస్తు యొక్క శ్రమలను సూచించేదిగా ఉన్నదా?* 🚸

🛐 *"ప్రభువా, వాక్యమును బోధించుటకు ముందు నేను దానిని పాటించునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"* 🛐

*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

No comments:

Post a Comment