Pages

Sep 28, 2021

Yehova Naa Deva | యెహోవా నా దేవా

జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి." కీర్తన Psalm 30

పల్లవి : యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

1. యెహోవా నా శత్రువులను
నా పై సంతోషింప నీయక
నీవు నన్నుద్ధరించినందుకై నేను
నిన్ను కొనియాడుచున్నాను || యెహోవా ||

2. నేను నీకు మొరపెట్టగా
నీవు నన్ స్వస్థపరచితివి
పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి
భక్తులారా ప్రభున్ కీర్తించుడు || యెహోవా ||

3. యెహోవా పాతాళములో నుండి
నా ప్రాణము లేవదీసితివి
నేను సమాధిలోకి దిగకుండగ
నీవు నన్ను బ్రతికించితివి || యెహోవా ||

4. ఆయన కోపము నిమిషమే
దయ ఆయుష్కాలముండును
ఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయ
మున సంతోషము కలుగును || యెహోవా ||

5. నే నెన్నడు కదలనని నా
క్షేమ కాలమున తలచితి
యెహోవా దయ కలిగి నీవే నా
పర్వతము స్థిరపరచితివి || యెహోవా ||

6. నీ ముఖము నీవు దాచిన
యపుడు నేను క్షోభిల్లితి
యెహోవా నీకే మొర పెట్టితిని
నా ప్రభువును బ్రతిమాలు కొంటిని || యెహోవా ||

7. నేను సమాధిలోకి దిగిన
నా ప్రాణము వలన లాభమా
మన్ను నిన్ను స్తుతించునా?
నీ సత్యమును గూర్చి అది వివరించునా? || యెహోవా ||

8. నా అంగలార్పును నీవేగా
నాట్యముగా మార్చియుంటివి
నా గోనెపట్ట విడిపించి సంతోష
వస్త్రము ధరింప జేసితివి || యెహోవా ||

No comments:

Post a Comment