Pages

Oct 10, 2021

Sarah Longworth Hosmon | శారా లాంగ్‌వర్త్ హోస్మోన్

శారా లాంగ్‌వర్త్ హోస్మోన్ |  Sarah Longworth Hosmon



  • జననం: 16-09-1883
  • మహిమ ప్రవేశం: 25-07-1964
  • స్వస్థలం: కెంటకీ
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శనము: ముస్లిం ప్రజలు

పిలుపునందుకొనినప్పుడు, ఒకరు – నేనొక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెననెను; మరొకరు – నేను యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాననెను; ఇంకొకరు – నేనొక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను. (లూకా 14: 18-20). అన్నింటినీ కలిగియున్నప్పుడు మనము నెపములు చెబుతాము, ఏదైనా కొరవడినట్లయితే ఫిర్యాదులు చేస్తాము. అలా అయితే దేవునికి మనం ఎప్పుడు అందుబాటులో ఉండగలము?


  ఇదిగో ఒక స్త్రీ. 12 ఏళ్ళ వయస్సులో కాలు కోల్పోయిన ఈమె “ఎందుకు ప్రభువా” అని దేవునిని ప్రశ్నించలేదు కానీ, రెండు సంవత్సరాల తరువాత ఆయన స్వరమును వినినప్పుడు తన జీవితమును ఆయనకు సమర్పించింది. ఆమె ఇతర పిల్లల వలె ఆడుకోలేకపోయినప్పుడు ఆ సమయమును ప్రార్థించుట కొరకు ఉపయోగించాలని ఆకాంక్షించింది. ఆమె సుదూర దేశాలకు ప్రయాణించింది, వ్యతిరేకులుగా ఉన్న ప్రజల మధ్య నివసించింది మరియు తన రక్షకుని సేవించింది. ఆ స్త్రీ పేరు డాll శారా లాంగ్‌వర్త్ హోస్మోన్.


  వైద్య శాస్త్రమును అభ్యసించుచున్న ఒక విద్యార్థి శారా. ఆ సమయంలో, ముస్లిం ప్రజల మధ్యలో మిషనరీ సేవ చేయుటను గురించి డాll శామ్యూల్ జ్వెమర్ ఆమెను సవాలు చేశారు. తద్వారా 1911వ సంll లో ముస్లింల కొరకైన ఆమె మిషనరీ ప్రయాణం ప్రారంభమైంది. అనేక సంవత్సరాలు మస్కట్‌లో సేవ చేసిన ఆమె, తన వైద్య నైపుణ్యాలను ఉపయోగించి ప్రజల భౌతిక మరియు ఆత్మీయ అవసరతలను తీర్చుటకు శ్రమించారు. అక్కడ ఆమె ఒక ప్రసూతి వైద్యశాలను ప్రారంభించారు. ప్రతి రోజూ ఉదయం ఆసుపత్రి తెరవడానికి ముందు, వేచి ఉన్న రోగులకు అక్కడ బైబిలు చదువబడుతుంది. ప్రారంభంలో, మహిళలు మరియు పిల్లలకు మాత్రమే వైద్య సేవలు అందించబడినప్పటికీ, సంవత్సరాలు గడిచే కొద్దీ పురుషులు కూడా ఆసుపత్రికి రావడం ప్రారంభించారు. ఆమె ఓమన్ నగరము యొక్క బటినా తీరంలో 200 మైళ్ల పొడవునా ఉన్న గ్రామాలను దర్శించి వైద్య సేవలను అందించారు. 1941వ సంll లో ఆమె బటినా తీరంలోని సహమ్ అనే పట్టణంలో వైద్య సేవలను అందించడం ప్రారంభించారు. ఆమె ఎల్లప్పుడూ తన వైద్య సేవను సువార్త సేవతో మిళితం చేసేవారు.


  అప్పటిలో అరేబియా ద్వీపకల్పం ఆంగ్లేయుల నియంత్రణలో ఉండేది. కాగా, అరబ్బు దేశంలోని షార్జాలో ఉన్న కాల్బా అనే ప్రాంతమునకు వెళ్ళుటకు తనను అనుమతించవలసినదిగా 1944వ సంll నుండి బ్రిటిషువారిని ఆమె అభ్యర్థిస్తూ ఉన్నారు. చివరకు 1951వ సంll లో ఆమెకు అనుమతి మంజూరు చేయబడగా, 66 ఏళ్ళ వయస్సులో ఈ ఒంటి కాలి మిషనరీ కాల్బాకు పయనమయ్యారు. అక్కడ ఆమె ఒక వైద్యశాలను ప్రారంభించగా, అది డాll శారా హోస్మోన్ ఆసుపత్రిగా పేరుగాంచింది. తన పరిచర్య యొక్క ఆఖరి సంవత్సరాలలో నర్సులకు సలహాదారుగా పనిచేస్తూ, రోగులకు దేవుని వాక్యమును బోధించడం కొనసాగించారు డాll శారా లాంగ్‌వర్త్ హోస్మోన్.


ప్రియమైనవారలారా, ఇదిగో మీకు పిలుపు, ఉన్నపాటున మీరు ముందుకు వచ్చెదరా?


"ప్రభువా, ఎటువంటి నెపములు చెప్పక, ఎలాంటి ఫిర్యాదులూ చూపక, ఇదిగో మీకు సేవ చేయుటకు నేను వచ్చుచున్నాను. ఆమేన్!"


దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment