Pages

Mar 5, 2022

Preme shashwathamaina | ప్రేమే శాశ్వతమైన | Hosanna Songs 2022

Preme  shashwathamaina | ప్రేమే శాశ్వతమైన | Hosanna Songs 2022

ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు (2)

మనసే మందిరమాయే - నా మదిలో దీపము నీవే

నిన్ను ఆశ్రయించిన వారిని - ఉదయించు సూర్యుని వలె

నిరంతరం నీమాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే||


1. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుదిరం -

ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తన క్షేత్రము (2)

ఇన్నాళ్లుగా నను స్నేహించి - ఇంతగా ఫలింపచేసితివి 

ఈ స్వరసంపదనంతటితో- అభినయించి నేపాడెదను

ఉండలేను బ్రతకలేను - నీ తోడు లేకుండా - నీ నీడ లేకుండా ||ప్రేమే|| 


2. కమ్మనైన నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో 

ఖడ్గముకంటే బలమైన వాక్యము - ధైర్యమిచ్చే నా శ్రమలో (2)

కరువు సీమలో సిరులొలికించెను - నీ వాక్య ప్రవాహము 

గగనముచీల్చి మొపైన - దీవెన వర్షము కురిపించితివి

ఘనమైన నీకార్యములు - వివరింప నాతరమా వర్ణింప నాతరమా ||ప్రేమే|| 


3. విధి రాసిన విషాద గీతం - సమసిపోయె నీ దయతో

సంబరమైన వాగ్దానములతో - నాట్యముగా మార్చితివి (2)

మమతల వంతెన దాటించి - మహిమలో స్నానము నిచ్చితివి 

నీ రాజ్యములో శ్రేష్టులతో - యుగయుగములు నే ప్రకాశించనా

నా పైన ఎందుకింత - గాఢమైన ప్రేమ నీకు - మరువలేను యేసయ్య ||ప్రేమే|| 





No comments:

Post a Comment