Pages

Jul 25, 2022

Alice Maud Clark | అలిస్ మౌడ్ క్లార్క్

అలిస్ మౌడ్ క్లార్క్ జీవిత చరిత్ర

Pictures shown are for illustration purpose only



  • జననం: -
  • మహిమ ప్రవేశం: -
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: భారతదేశం


అలిస్ మౌడ్ క్లార్క్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని అయోవా రాష్ట్రంలో స్టెనోగ్రాఫర్‌గా (మాటలను శబ్ద సంకేతాలలో సంక్షిప్తంగా వ్రాసే హ్రస్వ లిపి వ్రాసేవారు) పనిచేస్తున్నప్పుడు, తన జీవితమును దేవుని సేవకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. మిషనరీగా విదేశాలలో సేవ చేయాలనే కోరికతో ఆమె ఒక నర్సుగా శిక్షణ పొందుటకు ఎంచుకున్నారు. అందుకొరకుగాను నర్సులకు శిక్షణ ఇచ్చే ‘జాన్ హాప్కిన్స్ ట్రైనియింగ్ స్కూల్’ లో చేరిన ఆమె, 1924వ సంll లో పట్టభద్రురాలయ్యారు. అటు పిమ్మట ఆమె కాలేజ్ ఆఫ్ మిషన్స్‌లోను మరియు బట్లర్ కాలేజీలోను చదివారు. అక్కడి నుండి 1928వ సంll లో పట్టా పొందిన తరువాత ఆమె భారతదేశానికి పయనమయ్యారు. 


స్థానిక భాషలను నేర్చుకొనుటకుగాను భాషా అధ్యయనమును పూర్తి చేసిన తరువాత ఆమె బిలాస్‌పూర్‌లోని జాక్మన్ మెమోరియల్ ఆసుపత్రి మరియు నర్సుల శిక్షణా పాఠశాలలో సేవ చేయుటకు నియమించబడ్డారు. ఈ ఆసుపత్రి మరియు దాని ఔషధశాల బిలాస్‌పూర్ మరియు దాని చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న 30,000 మంది జనాభాకు సేవలు అందించాయి మరియు ఇది అప్పటిలో ఆ ప్రాంతములో మహిళలు మరియు పిల్లలకు ఉన్న ఏకైక ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో క్లార్క్ ఏకైక అమెరికన్ నర్సుగా ఉన్నారు. కొన్ని సార్లు వైద్యుడు లేనప్పుడు ఆ పెద్ద ఆసుపత్రితో పాటు నర్సుల శిక్షణా పాఠశాలను పర్యవేక్షించే బాధ్యత ఆమెపై ఉండేది. ఆమె తన సేవ పట్ల ఎంత సమర్పణ కలిగియుండేవారంటే, ఒకసారి వైద్యుడు లేనప్పుడు ఆమె కూడా అక్కడ లేకుండా ఉండకూడదని తన పని వేళలు ముగిసినప్పటికీ ఆమె ఇంటికి వెళ్ళలేదు. 


అలిస్ స్థానిక క్రైస్తవ సంఘములో కూడా సేవలందించారు మరియు నర్సుల కొరకు పాఠ్యపుస్తకాలను అనువదించడంలో సహాయమందించారు. తొమ్మిది సంవత్సరాల పాటు భారతదేశంలో సేవ చేసిన తరువాత, అనస్థీషియాపై (శస్త్ర చికిత్సలలో మత్తు మందునిచ్చుటపై) భారతీయ నర్సులకు శిక్షణనివ్వవలెనని దానిని అభ్యసించుటకు ఆమె తిరిగి అమెరికాకు వెళ్ళారు. ప్రభువుకు నమ్మకముగా సేవ చేయడంలో ఆమె చూపిన సమర్పణ మరియు అంకింతభావం వలన ఎంతో మంది భారతీయులు ఆత్మీయ మరియు శారీరక లబ్ధి పొందారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, దేవుని సేవించడంలో మీరు ఎంతటి శ్రద్ధను కనుబరుచుచున్నారు?


ప్రార్థన :

"ప్రభువా, అలిస్ క్లార్క్ వలెనే చిత్తశుద్ధి మరియు సమర్పణ కలిగి మిమ్ములను సేవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"  


దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment