Pages

Jul 25, 2022

Herman Reynolds | హెర్మన్ రేనాల్డ్స్

హెర్మన్ రేనాల్డ్స్ జీవిత చరిత్ర

Pictures shown are for illustration purpose only



  • జననం: -
  • మహిమ ప్రవేశం: -
  • స్వస్థలం: వెస్ట్ వర్జీనియా
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: భారతదేశం


హెర్మన్ రేనాల్డ్స్ మధ్య భారతదేశంలో సేవచేసిన ఒక అమెరికన్ మిషనరీ. ‘లించ్‌బర్గ్ క్రిస్టియన్ కాలేజీ’ నుండి పట్టభద్రులైన అతను, తరువాత సేవ కొరకైన శిక్షణ నిమిత్తం వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో చేరారు. మిషనరీ సేవ కొరకైన భారం కలిగియున్న మిల్డ్రెడ్ ప్రిట్చెట్‌తో అతనికి వివాహం జరుగగా వారిరువురూ కలిసి ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్‌’ కు వెళ్ళారు. అక్కడ వారు ఒకవైపు మిషనరీ సేవ కొరకు సిద్ధమవుతూ, మరొకవైపు యేల్‌లో పాదిరి పరిచర్యను చేశారు. తదుపరి వారు పరిశుద్దాత్మ చేత నడిపించబడినవారై 1927వ సంll లో ఇండియన్ మిషన్‌లో చేరారు. తద్వారా, మధ్య భారతదేశంలోని జబల్‌పూర్ అనే ప్రదేశానికి చేరుకున్న ఈ మిషనరీ దంపతులు, స్థానిక భాషను  అభ్యసించుటలో కొంత కాలం గడిపిన పిమ్మట,  ఛత్తీస్‌గడ్‌లోని కోట్మి వద్ద ఉన్న క్రొత్త మిషన్ స్టేషన్‌కు వెళ్ళారు.


అభివృద్ధి చెందని అనాగరికులు మరియు నిరక్షరాస్యులు అయినటువంటి కోట్మిలోని ప్రజలకు సువార్తను అందించడం బహు కష్టతరమైనది. అయినప్పటికీ, హెర్మన్ ఒక స్నేహితునిగా వారి మధ్యకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. అతను గ్రామ శివార్లలో తన గుడారాన్ని వేసుకొని, అవకాశం వచ్చినప్పుడల్లా తన భార్యతో కలిసి గ్రామస్థులను వారి గృహములలో సంధించేవారు. హెర్మన్ లేఖనములను బోధిస్తూ మరియు క్రియారూపకముగా పలు వృత్తిసంబంధ నైపుణ్యములను నేర్పిస్తూ పురుషుల మధ్య సేవజరిగించగా, మహిళలు మరియు పిల్లల యొక్క నమ్మకమును గెలుచుకున్న మిల్డ్రెడ్, వారికి గృహసంబంధమైన నైపుణ్యములను నేర్పించారు. అంతేకాకుండా వారిరువురూ కలిసి ఒక పాఠశాలను మరియు ఔషధాలయమును తెరిచారు మరియు ఆ ప్రాంతము యొక్క సామాజిక స్థితిగతులను మెరుగుపరిచారు. దేవుడు వారి పరిచర్యను ఆశీర్వదించగా అనేకమంది క్రీస్తు వైపుకు ఆకర్షించబడ్డారు. తదుపరి కొంత కాలం పాటు ముంగేలికి వెళ్ళి సత్నామి ప్రజల మధ్య ఎంతో తీవ్రతతో సువార్త సేవ చేశారు హెర్మన్. పిమ్మట కోట్మికి తిరిగి వెళ్ళి, అక్కడి తన మిషనరీ కార్యకలాపాలను కొనసాగించారు. 


దేవుని ప్రేమను రుచి చూసినవారు పనిచేయకుండా ఊరికే కూర్చొనలేరు. అపొస్తలుడైన పౌలు 2 కోరింథీ 5:14లో ఇలా చెప్పారు – “క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది…” అటువలెనే హెర్మన్, తాను స్వదేశానికి వెళ్ళి వచ్చే కొద్దిపాటి పర్యటనలలో కూడా అమెరికాలో క్రైస్తవ సంఘ ప్రయోజనం కొరకు నిరంతరం పని చేశారు. మిన్నెసోటాలో ప్రార్థనా మందిర నాయకునిగా సేవ చేశారు మరియు తన లోతైన ప్రసంగాల ద్వారా అమెరికాలోని క్రైస్తవ సంఘ విశ్వాసులను  ప్రోత్సహించారు.


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, సువార్తను ప్రకటించుటకు క్రీస్తు ప్రేమ మిమ్ములను బలవంతము చేయుచున్నదా? 


ప్రార్థన :

"ప్రభువా, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించుటకు నేను సిద్ధముగా ఉండునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


No comments:

Post a Comment