Pages

May 14, 2023

David Hill | డేవిడ్ హిల్

డేవిడ్ హిల్ గారి జీవిత చరిత్ర

  • జననం : 1840
  • మహిమ ప్రవేశం : 18-04-1896
  • స్వస్థలం : యార్క్
  • దేశం        :      ఇంగ్లాండు
  • దర్శన స్థలము : చైనా

ఆంగ్లేయుడైన డేవిడ్ హిల్ చైనా దేశములో సేవ చేసిన ఒక మెథడిస్టు మిషనరీ. ఇంగ్లాండు దేశంలోని యార్క్‌లో జన్మించిన అతను దేవుని యందలి భయభక్తులు కలిగిన యువకునిగా ఎదిగారు. యవ్వన దశలో ఉన్నప్పుడు ఆత్మీయ విషయముల పట్ల అతను ఎంత ఉత్సాహమును మరియు ఆసక్తిని కలిగియుండేవారంటే మిషనరీ సేవకు సహాయమందించవలెనని అధిక సమయం పని చేసేవారు. అతను యార్క్ మరియు చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఎంతో దీనత్వము కలిగి బోధించడం ప్రారంభించినప్పుడు అతనికి కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే. వెస్లియన్ మెథడిస్టు చర్చి వేదాంతశాస్త్రమును అభ్యసించుటకు అతనిని రిచ్మండ్ నగరమునకు పంపింది. అక్కడ అతని వ్యక్తిత్వం మరియు దైవభక్తి ద్వారా తోటి విద్యార్థులలో కొంతమంది మరింత చిత్తశుద్ధితో నమ్మకముగా తమ ప్రభువును సేవించుటకు ఒప్పించబడ్డారు. 1864వ సంll లో పట్టాపొంది, సేవచేయుటకు నియామక అభిషేకం పొందిన తరువాత అతను "సెంట్రల్ చైనా మిషన్" కొరకు పనిచేయుటకు నియమించబడ్డారు.


హుబీ పరిధి ప్రాంతములో అతను నియమితులవ్వగా, అక్కడ అతను సంచార సేవకునిగా పనిచేశారు. అక్కడి వాతావరణ పరిస్థితులు అతనికి అనుకూలంగా లేనప్పటికీ, అతి త్వరలోనే తనను తాను అక్కడి పరిస్థితులకు అలవరచుకున్నారు. మొదటి రెండు సంవత్సరాలు అతను చైనా భాష మాట్లాడలేకపోయినప్పటికీ, అది అతని పరిచర్యకు అవరోధమవ్వలేదు. ఏలయనగా ప్రజలు సువార్తను అర్థం చేసుకొనులాగున అతను తనతో నిఘంటువులను తీసుకువెళ్ళేవారు. అధిక సమయం అతను సువార్త రచనలను చైనా భాషలోనికి అనువదించుటలోను మరియు స్థానిక ప్రజలకు గంటల తరబడి లేఖనములను బోధించుటలోను గడిపారు. స్థానిక ప్రజలకు క్రీస్తు ప్రేమను కనుపరచుటకు అతను చేసిన ప్రయత్నాలు పలు మార్లు ఆ ప్రజల ఆగ్రహానికి గురయ్యాయి. అయితే హిల్ యొక్క స్వభావం ఎటువంటిదంటే ఏ ప్రజల గురించి గానీ లేక ప్రదేశం గురించి గానీ ఎటువంటి పరిస్థితులలోను నిరీక్షణ కోల్పోక ఇతరులు నిరుత్సాహపడినప్పటికీ తాను మాత్రం సేవలో ముందుకు సాగిపోయేవారు.


హిల్ యొక్క సేవ సామాజిక సేవా దృష్టిని కూడా కలిగి ఉంది. 1878వ సంll లో షాంకి పరిధి ప్రాంతములో కరువు కలిగినప్పుడు అతను మరికొందరు మిషనరీలతో కలిసి అక్కడి ప్రజలను చేరుకొని రెండేళ్లపాటు సహాయక చర్యలను చేపట్టారు. తరువాతి సంవత్సరాలలో అతను  ఒక ఆసుపత్రిని మరియు వృద్ధులు, అంధులు మరియు అనాధల కొరకు గృహములను స్థాపించారు. “సెంట్రల్ చైనా రిలిజియస్ ట్రాక్ట్ సొసైటీ” స్థాపించబడడంలోను మరియు షాంఘై మిషనరీ కాన్ఫరెన్స్ ను నడిపించడంలోను అతను అందించిన సహకారం చైనాలో సువార్త ప్రకటనను వేగవంతం చేసింది. ఎల్లప్పుడూ చిరునవ్వుతోను మరియు ప్రతి ఒక్కరిని కూడా దయగల మాటలతో పలుకరించే డేవిడ్ హిల్, తన తుది శ్వాస వరకు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యునిగా జీవించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, సర్వశక్తిమంతుడైన దేవునికి సేవ చేస్తున్నప్పుడు దీన స్వభావమును మీరు కలిగియుంటున్నారా? 

ప్రార్థన :

"ప్రభువా, దీనత్వముతో మీ పరిచర్యను కొనసాగించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


No comments:

Post a Comment