నబీల్ ఆసిఫ్ ఖురేషి | Nabeel Asif Qureshi
- జననం: 13-04-1983
- మహిమ ప్రవేశం: 16-09-2017
- స్వస్థలం: కాలిఫోర్నియా
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
“యేసు ప్రభువు నా తల్లిదండ్రులకు నన్ను వ్యతిరేకునిగా మారుస్తున్నాడని కాదు. నా కుటుంబం దేవునికి వ్యతిరేకంగా నిలబడితే నేను వారిరువురిలో ఒకరిని ఎంచుకోవాలి. వారిలో దేవుడే ఉత్తముడనేది నిశ్చయం. ఆ నిర్ణయం నా కుటుంబమునకు నన్ను వ్యతిరేకునిగా చేసినప్పటికీ అదే నిజం. కానీ ఎలా? ఎలా అంతటి బాధను నేను భరించగలను?” అనునవి ఒకప్పుడు ఉద్వేగభరితమైన ఇస్లాం పండితునిగా ఉండి తదుపరి క్రైస్తవ్యానికి బలమైన ప్రతిపాదకునిగా మారిన నబీల్ ఆసిఫ్ ఖురేషీ పలికిన మాటలు.
ఖురాన్‌ను అనువదించేవారైన ఒక పాకిస్తానీ అహ్మదీ కుటుంబములో జన్మించారు నబీల్. అతని తాతలు కూడా ఇండోనేషియాకు ముస్లిం మిషనరీలుగా వెళ్ళినవారై ఉన్నారు. అటువంటి దృఢమైన ఇస్లాం మత నేపథ్యం ఉన్న నబీల్, ఒకవైపు వైద్యశాస్త్రమును అభ్యసిస్తూనే ఇస్లాం మతాన్ని కూడా అభ్యసించారు. అతను క్రైస్తవులతో మతపరమైన చర్చలను కలిగియుండేవారు. ఆ విధంగా ఒకసారి అతని స్నేహితుడైన డేవిడ్ వుడ్‌తో ఒక సంవత్సరం పాటు కొనసాగిన సంభాషణలో యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును నిర్ధారించే విషయములను మరియు ఆయన దేవుడని పిలువబడుటకు కారణములను కనుగొన్నారు నబీల్. ఒకవైపు అద్వితీయ సత్య దేవుడు, మరొకవైపు తన కుటుంబం. వారిరువురిలో ఎవరిని ఎంచుకోవాలి అని ఎంతో సతమతమైపోయిన నబీల్, చివరికి ప్రభువైన యేసుక్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. అతను చెప్పినది ఏమంటే “యేసును వెంబడించుటకు సమస్తమైన శ్రమలను అనుభవించడం తగినదే. ఎందుకంటే ఆయన అంతటి అద్భుతమైనవాడు.”
వైద్యునిగా పట్టభద్రులైన నబీల్ వేదాంతశాస్త్రం మరియు తత్వశాస్త్రములను కూడా అభ్యసించారు. రవి జకరియాస్‌తో కలిసి పనిచేసిన అతను, క్రైస్తవ్యానికి సంబంధించిన క్లిష్టమైన మరియు నిర్దిష్టమైన ప్రశ్నలకు సున్నితంగాను మరియు గౌరవంగాను సమాధానమిచ్చేవారు. అతను అరబ్బుల పండుగ వేడుకలకు వెళ్ళి, యేసుక్రీస్తు యొక్క దైవత్వంలోని సత్యమును గురించి ముస్లింలతో అద్భుతమైన రీతిలో సంభాషించేవారు. అతను శక్తివంతమైన వక్త మరియు బలముగా చర్చించగలరు. అతని మాటలు ఎంతో మంది హృదయములను తాకాయి. అయితే, ఈ కారణంగానే అతను పలుమార్లు అరెస్టు చేయబడ్డారు. అయితే విడుదలైన ప్రతిసారీ అతను క్రీస్తును గురించి బోధించుటకు నేరుగా ముస్లింల యొద్దకే వెళ్ళేవారు. ఏలయనగా, ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని అతను బాగుగా ఎరిగియున్నారు. అంతేకాకుండా ఎంతో మంది ముస్లింలు క్రీస్తు వైపు తిరగుటకు సహాయపడిన పలు పుస్తకములను కూడా అతను రచించారు.
అయితే ఊహించని విధంగా నబీల్‌కు కడుపు క్యాన్సర్ నాలుగవ స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించబడింది. చివరికి అతని పొట్ట భాగమును కూడా తీసివేసినంతటి ఎంతో తీవ్రమైన చికిత్సను పొందిన తరువాత, కేవలం 34 సంll ల మిగుల లేత ప్రాయంలోనే ప్రభువునందు నిద్రించారు నబీల్ ఆసిఫ్ ఖురేషి.
🚸 *ప్రియమైనవారలారా, మీరు ఏమి ఎంచుకుంటున్నారు? మీ స్నేహితులను మరియు కుటుంబమునా? లేక దేవునినా?* 🚸
🛐 *"ప్రభువా, ప్రతి పరిస్థితిలోనూ అందరికంటే పైగా నేను మిమ్ములను ఎన్నుకొనుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"* 🛐
*******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
No comments:
Post a Comment