Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

May 14, 2023

Saint Athanasius | అథనాసియస్

అథనాసియస్ గారి జీవిత చరిత్ర

  • జననం : ~ క్రీ.శ. 293
  • మరణం : క్రీ.శ. 373
  • స్వస్థలం : అలెగ్జాండ్రియా
  • దేశం : ఈజిప్ట్
  • దర్శన స్థలము : ఈజిప్ట్

అరియానిజం. తండ్రియైన దేవుని ద్వారా క్రీస్తుకు దైవత్వం ఇవ్వబడినదే గానీ, ఆయన తండ్రితో సరిసమానుడు కాడు, క్రీస్తు యొక్క సారూప్యం తండ్రియైన దేవుని వంటిది కాదు మొదలగు తప్పుడు సిద్ధాంతములతో కూడిన బోధలతో ప్రారంభ శతాబ్దములలో క్రైస్తవ సంఘములోకి చొరబడి సంఘమును సత్యము నుండి మళ్ళించి తప్పు త్రోవ పట్టించుటకు ప్రయత్నించిన ఒక తప్పుడు బోధన. 4 వ శతాబ్దంలో అరియానిజానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో క్రైస్తవ మూల సిద్దాంతములను సమర్థిస్తూ వాటిని పరిరక్షించుటకు నిలబడినవారిలో ప్రధానమైనవారే ఈ అథనాసియస్. అతను అలెగ్జాండ్రియాలో తత్వ మరియు వేదాంతశాస్త్రములను అభ్యసించారు. అప్పటి అలెగ్జాండ్రియా బిషప్పు అయిన అలెగ్జాండర్ మరణం తరువాత, అథనాసియస్ అలెగ్జాండ్రియా యొక్క బిషప్పుగా నియమించబడ్డారు. క్రీస్తు యొక్క దైవత్వమును గురించిన సిద్ధాంతమును సమర్థించినందుకుగాను నలుగురు రోమా సామ్రాజ్య చక్రవర్తులచే ఐదుసార్లు బహిష్కరించబడ్డారు అథనాసియస్. కాగా అతను అలెగ్జాండ్రియా యొక్క బిషప్పుగా సేవలందించిన నలభైయైదు సంవత్సరాలలో పదిహేడు సంవత్సరాలు బహిష్కరణలోనే గడిపారు.


అరియానిజం ఆవిర్భావానికి కారకులైన అరియస్‌కు వ్యతిరేకంగా క్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వమును వేదాంతపరముగా సమర్థిస్తూ అథనాసియస్ నిలబడడంతో అది ప్రజలలో క్రైస్తవ విశ్వాసం పెంపొందించబడుటకు సహాయపడింది. అరియానిజానికి వ్యతిరేకంగా సంకల్పించిన ఈ పోరాటంలో విజయం సులభంగా లభిస్తుందని అథనాసియస్ ప్రారంభంలో భావించినప్పటికీ, పరిస్థితి బహు క్లిష్టమైనదిగా నిర్ధారితమైంది. తూరు పట్టణ ఆలోచన సభ (కౌన్సిల్ ఆఫ్ తైర్) వివిధ కారణాల వలన పిలువబడింది మరియు కాన్‌స్టాంటైన్ చక్రవర్తి అథనాసియస్‌ను ఉత్తర గౌల్‌కు బహిష్కరించాడు. అపొస్తలుడైన పౌలు జీవితమును జ్ఞప్తికి తీసుకువచ్చే అథనాసియస్‌ యొక్క ప్రయాణాలు మరియు అతను ఎదుర్కొనిన బహిష్కరణలలో ఈ బహిష్కరణ మొదటిది.


కాన్‌స్టాంటైన్ మరణం తరువాత అతని కుమారుడు అథనాసియస్‌ను తిరిగి బిషప్పుగా నియమించాడు. అయితే ఇది కేవలం ఒక సంవత్సరం మాత్రమే నిలిచింది. ఏలయనగా అరియానిజంను సమర్ధించే బిషప్పుల కూటమి చేత అథనాసియస్‌ తిరిగి పదవి నుండి తొలగింపబడ్డారు. బహిష్కరణలో ఉన్నప్పుడు అతను రచనలను చేస్తూ తన సమయమును గడిపారు. అతను వ్రాసిన రచనలలో అధిక భాగం క్రైస్తవ సనాతన లేదా మూల సిద్ధాంతములను సమర్థించేవిగా ఉన్నాయి. చివరిగా అతను తిరిగి అలెగ్జాండ్రియాకు వచ్చినప్పుడు శ్రమదినములు మరియు ఈస్టర్ వంటి ముఖ్యమైన పండుగల తేదీలను నిర్ణయించుటకు బిషప్పుగా తన పరిధిలో ఉన్న క్రైస్తవ సంఘములకు లేఖలు వ్రాశారు. ఈ లేఖల ద్వారా క్రొత్త నిబంధనలో ఉండవలసిన పుస్తకములని తాను ఏ పుస్తకములను విశ్వసిస్తున్నారో అది కూడా అతను తెలియచేశారు. మతపరమైన సిద్ధాంతములను సమర్ధిస్తూ, వాటిని నిరూపిస్తూ చేసే రచనలైన అపోలొజెటిక్స్ రచనలకు సంబంధించి రెండు భాగాల రచనలను కూడా అతను ప్రచురించారు. అవేమనగా "ఎగైనెస్ట్ ది హీథన్" (అన్యజనులకు వ్యతిరేకముగా) మరియు "ది ఇంకార్నేషన్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్" (దేవుని వాక్యము యొక్క శరీరధారణ). అతని రచనలు అరియానిజం యొక్క ప్రతి అంశాన్ని వ్యతిరేకించేవిగా ఉన్నాయి.


క్రైస్తవ విశ్వాసమును గురించి మరియు సంఘము కలిగియున్న స్వాతంత్య్రమును గురించి తాను కలిగియున్న అవగాహనను బట్టి విశ్వసించినదానిని పరిరక్షించుటకు అథనాసియస్ తన సంపూర్ణ శక్తిని ఉపయోగించి అలసిపోక చేసిన పోరాటం క్రైస్తవ సంఘ చరిత్రలో అతనికి ప్రముఖ స్థానాన్ని సంపాదించింది.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ విశ్వాసమునకు నమ్మకముగా నిలిచియుండవలెననే పిలుపుకు మీరు ఏ విధముగా స్పందిస్తున్నారు?

ప్రార్థన : "ప్రభువా, అధిగమించుటకు అసాధ్యమనిపించే వ్యతిరేకతను ఎదుర్కొనే సమయాలలో కూడా నా విశ్వాసంలో స్థిరముగా నిలబడుటకు నాకు మీ కృపను అనుగ్రహించుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !

ప్రార్థన :

  • WhatsApp
  • Augustine of Hippo | హిప్పోకు చెందిన అగస్టిన్

    హిప్పోకు చెందిన అగస్టిన్ గారి జీవిత చరిత్ర

    • జననం : 13-11-354
    • మహిమ ప్రవేశం : 28-08-430
    • స్వదేశం : అల్జీరియా, ఉత్తర ఆఫ్రికా
    • దర్శన స్థలము : ఉత్తర ఆఫ్రికా

    అంతర్గత అబద్ద బోధకుల నుండి ఆదికాల సంఘము అనేక దాడులను ఎదుర్కొంది. నిజమైన క్రైస్తవ సంఘ సిద్ధాంతము నశించునేమోయన్న అపాయకరమైన పరిస్థితులలో సెయింట్ అగస్టిన్ ఎంతో జ్ఞానయుక్తముగా అందుకు ప్రతిస్పందించారు. అతని యొక్క ప్రతిస్పందనల రచనలు క్రైస్తవ సంఘమునకు పరిశుద్ధ గ్రంథమైన బైబిలు తరువాత అతి ముఖ్యమైన రచనలుగా కొందరు ఈ నాటికీ భావిస్తారు. అతను వ్రాసిన ‘కన్ఫెషన్స్’ (ఒప్పుకోలు) మరియు ‘ది సిటీ ఆఫ్ గాడ్’ (దేవుని పట్టణం) మొదలగు అనేక రచనలు బైబిలు లేఖనముల భావములను వివరించు పద్ధతికి ఒక రూపమును చేకూర్చినవిగాను మరియు ఆధునిక క్రైస్తవ ఆలోచనా విధమునకు పునాది వేసినవిగాను ఉన్నాయి.


    రోమా సమాజంలో గౌరవప్రదమైన తరగతికి చెందిన కుటుంబంలో జన్మించారు అగస్టిన్. తన యవ్వనప్రాయంలో అతను స్వార్థపూరితమైన జీవితమును జీవించుటకు ఎంచుకొని, లోకేచ్ఛలను అనుసరించి ఇహలోక భోగములను వెన్నంటి జీవించారు. కార్తేజ్‌లో విద్యాభ్యాసమును ముగించిన పిమ్మట కొంతకాలం అక్కడే బోధించిన అతను, తదుపరి రోమ్‌కు తిరిగి వెళ్ళారు. అటు పిమ్మట తన భవిష్యత్తు పురోగతి కొరకై మిలన్‌కు వెళ్ళారు. అయితే అక్కడ కొన్ని సంవత్సరములు నిరాశాజనకమైన పని చేసిన తరువాత అతను రాజీనామా చేసి తన స్వస్థలమునకు తిరిగి వచ్చారు. ఆ విధముగా తన భవిష్యత్తు అనూహ్యమైన రీతిలో పతనమవడం మరియు తన ఏకైక కుమారుని కోల్పోవడం తన ఆత్మీయ స్థితిని గురించి మరియు దేవునితో తన సహవాసమును గురించి అతనిని ఆలోచింపచేశాయి. ఒకానొక రోజు అతను తన తోటలో నడుస్తున్నప్పుడు, పిల్లవాడు పాడుతున్నట్లు “తీసుకొని చదువు” అని తిరిగి తిరిగి చెబుతున్న ఒక స్వరమును విన్నారు. అప్పుడు అక్కడ ఒక బల్లపై అపొస్తలుడైన పౌలు వ్రాసిన పత్రిక ఉండగా, అతను దానిని తీసుకొని చదవడం ప్రారంభించారు. అతను రోమీయులకు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం చదువుచున్నప్పుడు తనలో మార్పు కలుగవలసిన ఆవశ్యకతను గురించి అతని మనస్సాక్షి అతనిని ఎంతగానో ఒప్పింపజేసింది. ఆ దినాన దేవుని ప్రేమ ద్వారా అతని జీవితం రూపాంతరం చెందింది.


    మారుమనస్సు పొందిన అగస్టిన్, ఆపై స్వార్థపూరితముగా జీవించలేదు. అతను తన ఆశయాలను మరియు ఆస్తులన్నింటినీ వదులుకున్నారు. లేఖనములను అధ్యయనం చేయుటకును మరియు ప్రార్థనలో సమయమును గడుపుటకును అతను తన స్నేహితులతో కలిసి మతపరమైన శిక్షణ పొందియుండనవసరం లేని ఒక క్రైస్తవ సన్యాసి సంఘమును స్థాపించారు. పిమ్మట హిప్పో యొక్క బిషప్పుగా నియమించబడిన అతను, తరువాతి 35 సంవత్సరాలు అక్కడ బోధించుచూ, కూడికలు నిర్వహించుచూ మరియు స్థానిక వివాదములను పరిష్కరించుచూ సేవలో ముందుకు సాగిపోయారు. ఎంతో జాగ్రత్తగా లేఖనముల భావములను వివరించినవిగా ఉండే అతని ప్రసంగాల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తి బయలుపరచబడేది. అనేక వివాదాస్పద మరియు తప్పుడు బోధకులకు వ్యతిరేకంగా సమర్ధవంతంగా పోరాడి, తప్పుడు త్రోవలోనికి తొలగిపోకుండా తన మందను జాగ్రత్తగా కాచారు అగస్టిన్.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు మీ పాపముల కొరకు పశ్చాత్తాపమొంది దేవునితో మిమ్మును సమాధానపరచుకున్నారా? 

    ప్రార్థన :  

    "ప్రభువా, నన్ను వెదకి కనుగొని మీతో సమాధానపరచిన మీ యొక్క గొప్ప ప్రేమకై మీకు వందనములు. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jul 25, 2022

    Alice Maud Clark | అలిస్ మౌడ్ క్లార్క్

    అలిస్ మౌడ్ క్లార్క్ జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only



    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


    అలిస్ మౌడ్ క్లార్క్ అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని అయోవా రాష్ట్రంలో స్టెనోగ్రాఫర్‌గా (మాటలను శబ్ద సంకేతాలలో సంక్షిప్తంగా వ్రాసే హ్రస్వ లిపి వ్రాసేవారు) పనిచేస్తున్నప్పుడు, తన జీవితమును దేవుని సేవకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నారు. మిషనరీగా విదేశాలలో సేవ చేయాలనే కోరికతో ఆమె ఒక నర్సుగా శిక్షణ పొందుటకు ఎంచుకున్నారు. అందుకొరకుగాను నర్సులకు శిక్షణ ఇచ్చే ‘జాన్ హాప్కిన్స్ ట్రైనియింగ్ స్కూల్’ లో చేరిన ఆమె, 1924వ సంll లో పట్టభద్రురాలయ్యారు. అటు పిమ్మట ఆమె కాలేజ్ ఆఫ్ మిషన్స్‌లోను మరియు బట్లర్ కాలేజీలోను చదివారు. అక్కడి నుండి 1928వ సంll లో పట్టా పొందిన తరువాత ఆమె భారతదేశానికి పయనమయ్యారు. 


    స్థానిక భాషలను నేర్చుకొనుటకుగాను భాషా అధ్యయనమును పూర్తి చేసిన తరువాత ఆమె బిలాస్‌పూర్‌లోని జాక్మన్ మెమోరియల్ ఆసుపత్రి మరియు నర్సుల శిక్షణా పాఠశాలలో సేవ చేయుటకు నియమించబడ్డారు. ఈ ఆసుపత్రి మరియు దాని ఔషధశాల బిలాస్‌పూర్ మరియు దాని చుట్టుప్రక్కల గ్రామాలలో ఉన్న 30,000 మంది జనాభాకు సేవలు అందించాయి మరియు ఇది అప్పటిలో ఆ ప్రాంతములో మహిళలు మరియు పిల్లలకు ఉన్న ఏకైక ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో క్లార్క్ ఏకైక అమెరికన్ నర్సుగా ఉన్నారు. కొన్ని సార్లు వైద్యుడు లేనప్పుడు ఆ పెద్ద ఆసుపత్రితో పాటు నర్సుల శిక్షణా పాఠశాలను పర్యవేక్షించే బాధ్యత ఆమెపై ఉండేది. ఆమె తన సేవ పట్ల ఎంత సమర్పణ కలిగియుండేవారంటే, ఒకసారి వైద్యుడు లేనప్పుడు ఆమె కూడా అక్కడ లేకుండా ఉండకూడదని తన పని వేళలు ముగిసినప్పటికీ ఆమె ఇంటికి వెళ్ళలేదు. 


    అలిస్ స్థానిక క్రైస్తవ సంఘములో కూడా సేవలందించారు మరియు నర్సుల కొరకు పాఠ్యపుస్తకాలను అనువదించడంలో సహాయమందించారు. తొమ్మిది సంవత్సరాల పాటు భారతదేశంలో సేవ చేసిన తరువాత, అనస్థీషియాపై (శస్త్ర చికిత్సలలో మత్తు మందునిచ్చుటపై) భారతీయ నర్సులకు శిక్షణనివ్వవలెనని దానిని అభ్యసించుటకు ఆమె తిరిగి అమెరికాకు వెళ్ళారు. ప్రభువుకు నమ్మకముగా సేవ చేయడంలో ఆమె చూపిన సమర్పణ మరియు అంకింతభావం వలన ఎంతో మంది భారతీయులు ఆత్మీయ మరియు శారీరక లబ్ధి పొందారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, దేవుని సేవించడంలో మీరు ఎంతటి శ్రద్ధను కనుబరుచుచున్నారు?


    ప్రార్థన :

    "ప్రభువా, అలిస్ క్లార్క్ వలెనే చిత్తశుద్ధి మరియు సమర్పణ కలిగి మిమ్ములను సేవించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"  


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Jun 19, 2022

    Anni Kaalambula Nunna Yehova | అన్ని కాలంబుల నున్న

    దైవస్తుతి(1-57) 1:1,2,3,4

    Anni Kaalambula Nunna Yehova | అన్ని కాలంబుల నున్న

    1.అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నఁదరంబయో కన్న తండ్రి వన్నె కెక్కిన మోక్ష వాసాళి సన్నుతు లున్నతమై యుండ మున్నె నీకు ||నన్ని||

    2.నిన్నుఁ బ్రకటన సేయ నిఖిల లోకములను బన్నుగఁ జేసిన బలుఁడ వీవె ఉన్న లోకంబుల -నుడుగక కరుణా సం-పన్నతతో నేలు ప్రభుఁడ వీవె అన్ని జీవుల నెఱిఁగి యాహార మిచ్చుచు నున్న సర్వజ్ఞుం డవు నీవే ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకు నేఁ జాలుదునా ||యన్ని||

    3.పుట్టింప నీవంచుఁ బోషింప నీవంచుఁ గిట్టింప నీవంచు గీర్తింతును నట్టి పనికి మాలి నట్టి మానవుల చే పట్టి రక్షింపం బాధ్యుండ వంచు దట్టమైన కృపను దరిఁజేర్చ నాకిచ్చి పట్టయి నిలచియుండు ప్రభుఁడ వంచుఁ గట్టడచేఁ గడ ముట్టుదనుక నా పట్టుకొలఁది నిన్నుఁ బ్రస్తు తింతు ||నన్ని||

    4.కారుణ్యనిధి వీవు కఠినాత్ముఁడను నేను భూరి శుద్ధుఁడ వీవు పాపి నేను సార భాగ్యుడ వీవు జగతిలో నాకన్న దారిద్రుఁడే లేఁడు తరచి చూడ సార సద్గుణముల సంపన్నుఁడవు నీవు ఘోర దుర్గుణ సంచారి, నేను ఏ రీతి స్తుతియింతు నే రీతి సేవింతు నేర మెన్నక ప్రోవ నెర నమ్మితి ||నన్ని||

  • WhatsApp
  • Apr 7, 2022

    Amanda Smith | అమండా స్మిత్

    అమండా స్మిత్  జీవిత చరిత్ర         








    • జననం : 23-01-1837
    • మరణం : 24-02-1915
    • స్వస్థలం : మేరీల్యాండ్
    • దేశం  : యునైటెడ్ స్టేట్స్
    • దర్శన స్థలము : భారతదేశం, ఇంగ్లాండు, ఆఫ్రికా


    1837వ సంll లో శామ్యూల్ మరియు మిరియం బెర్రీలకు బానిసత్వంలో జన్మించారు అమండా బెర్రీ స్మిత్. కాగా, శామ్యూల్ బెర్రీ ఎంతో కష్టపడి తన కుటుంబమునకు స్వేచ్ఛను సంపాదించి, పిమ్మట పెన్సిల్వేనియాలో స్థిరపడ్డారు. ఆఫ్రికా జాతికి చెందిన అమెరికా పిల్లలకు సాధారణ పాఠశాలలో సరైన విద్యను పొందడం చాలా కష్టం. కాబట్టి అమండా ఇంటి యొద్దనే విద్యనభ్యసించారు. అయినప్పటికీ, ఆమె గొప్ప వ్యక్తిత్వం మరియు ఆత్మీయ బలం కలిగినవారై ఒక గొప్ప వక్తగా ఎదుగగలిగారు. మెథడిస్ట్ ఎపిస్కోపల్ సంఘములో ఒక ఉజ్జీవ కూడికకు హాజరైనప్పుడు, ఆమె క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించి, దేవుని సేవకు తనను తాను సమర్పించుకున్నారు.


    చాలా చిన్న వయస్సులోనే ఆమె తన ఐదుగురు పిల్లలలో నలుగురిని అనారోగ్య కారణంగా కోల్పోయారు. ఆ అనుభవాలు ఆమెను నిరాశలోకి త్రోసివేయగా, ప్రార్థన మరియు ఉజ్జీవ కూడికల ద్వారా ఆమె ఆదరణను పొందుకున్నారు. 1869వ సంll లో తన భర్త మరణించిన తరువాత, ఆమె పూర్తిగా సంఘ కార్యకలాపాలలో మునిగిపోయారు. ప్రార్థనే తాను నడిచే జీవిత మార్గముగా మార్చుకున్న ఆమె, సువార్త సభలు మరియు క్రైస్తవ సంఘములలో బోధించుటకు తనకు వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. శ్రావ్యముగా పాడటం మరియు శక్తివంతంగా ప్రసంగించడం ఆమె కలిగియున్న తలాంతులు. అవి ఆమెను ప్రపంచ నలుమూలలా అనేక ప్రాంతాలకు దేవుని సేవ చేయుటకు తీసుకొనివెళ్ళాయి. ఆమె ఇంగ్లాండు, ఐర్లాండు, స్కాట్లాండు, భారతదేశం మరియు ఆఫ్రికాలోని వివిధ దేశాలకు ప్రయాణించి, పరిశుద్ధ కూడికలను నిర్వహించారు. ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె సేవను కొనసాగించి అక్కడి క్రైస్తవ సంఘములతో కలిసి పనిచేశారు. అంతేకాకుండా, మద్యపానాన్ని నియంత్రించుటకు మద్యపానానికి వ్యతిరేకముగా పోరాడే 'టెంపరెన్స్ సొసైటీలను' స్థాపించుటలో తోడ్పాటునందించారు. పిమ్మట 1892వ సంll లో అమెరికాకు తిరిగి వచ్చిన అమండా, ఆఫ్రికా జాతికి చెందిన అమెరికావారి మధ్య దేవుని సేవను కొనసాగించారు.


    ఒక అంతర్జాతీయ సువార్తికురాలిగా ఎదిగినప్పటికీ, తన జీవితమంతా దీనురాలిగానే మిగిలిపోయారు అమండా. తగు మాత్రపు వస్త్రములను ధరించి సభ్యసంస్కారాలతో కూడిన వస్త్రధారణను కలిగియుండే ఆమె, ప్రతి కోణంలోనూ ప్రభువును కనుపరచవలెనని ఇతర స్త్రీలను కూడా ప్రోత్సహించేవారు. వివక్షకు గురైన నల్లజాతి పిల్లల పట్ల ఆమె కలిగియున్న భారం "అమండా స్మిత్ ఆర్ఫన్ హోమ్ ఫర్ అబాండాన్డ్ అండ్ డెస్టిట్యూట్ కలర్డ్ చిల్డ్రన్" అనే అనాథాశ్రమ స్థాపనకు కారణమయ్యింది. 1899వ సంll లో ఇల్లినాయిస్‌లోని హార్వే నగరములో స్థాపించబడిన ఈ సంస్థ, వివక్షను అనుభవిస్తున్న పిల్లలకు ఆశ్రయం కల్పించి, వారు స్వతహాగా తమంతటతామే జీవించుటకు వారికి శిక్షణ ఇచ్చింది. 1915వ సంll లో సంస్థ యొక్క బాధ్యతల నుండి విరమించుకున్న అమండా స్మిత్, అదే సంవత్సరం తన 75 ఏళ్ళ వయసులో మహిమలో ప్రవేశించారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ జీవితంలోని ప్రతి అంశంలో మీరు ప్రభువును కనుపరుస్తున్నారా?


    ప్రార్థన :

    "ప్రభువా, నేను నమ్రత కలిగిన మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తూ, నేను చేసే ప్రతి పనిలోనూ మీకు మహిమతెచ్చునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Alexander Duff | అలెగ్జాండర్ డఫ్

    అలెగ్జాండర్ డఫ్ జీవిత చరిత్ర




    • జననం : 15-04-1806
    • మరణం : 12-02-1878
    • స్వస్థలం : పెర్త్‌షైర్
    • దేశం       : స్కాట్లాండు
    • దర్శన స్థలము : భారతదేశం


    ఒక రోజు ఒక ప్రముఖ మిషనరీ భారతదేశంలో మిషనరీ సేవను గురించి స్కాట్లాండ్ చర్చిలో విజ్ఞప్తి చేశారు. అయితే ఎటువంటి స్పందన రాలేదు. ఆ ప్రసంగం మధ్యలోనే అతనికి గుండెపోటు వచ్చి మూర్ఛపోయారు. అయినప్పటికీ, వైద్యుల సలహాలను కూడా పక్కనపెట్టి, తన ప్రసంగాన్ని ముగించుటకు అతను మళ్ళీ వెళ్ళి వేదిక మీద నిలబడ్డారు. అప్పుడు అతను "విక్టోరియా రాణి భారతదేశానికి వెళ్ళుటకు ఎవరు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు అని పిలిచినట్లయితే వందలాది మంది యువకులు స్పందిస్తారు. కానీ, రాజులకు రాజైన యేసు ప్రభువు పిలుస్తుంటే మాత్రం ఎవరూ ముందుకురారు" అని చెప్పినప్పటికీ నిశ్శబ్దం మాత్రమే జవాబయ్యింది. కాగా ఆ మిషనరీ ఇలా ముగించారు, “మంచిది, కాబట్టి, నేను వృద్ధాప్యములో ఉన్నప్పటికీ తిరిగి భారతదేశానికి వెళ్తాను. అక్కడ గంగా నది ఒడ్డున పడుకొని, నా తనువు చాలిస్తాను. తద్వారా వారిని ప్రేమిస్తున్న ఒక వ్యక్తి స్కాట్లాండులో ఉన్నారని భారతదేశ ప్రజలకు తెలియజేస్తాను”. ఆ మాటలతో ఒక్కసారిగా ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ “నేను వెళ్తాను! నేను వెళ్తాను!” అనే అనేక మంది యువకుల గొంతులు వినిపించాయి. ఆ ప్రసంగమిచ్చిన ప్రముఖ మిషనరీ మరెవరో కాదు, డాll అలెగ్జాండర్ డఫ్.


    స్కాట్లాండులోని పెర్త్‌షైర్‌కు చెందిన అలెగ్జాండర్ ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించారు. సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అతను, ఆర్ట్స్ మరియు వేదాంతశాస్త్రములలో పట్టం పొందారు. చదువుకుంటున్న రోజులలో అక్కడ అతను ఒక విద్యార్థి మిషనరీ సొసైటీని స్థాపించారు. చదువు పూర్తిచేసుకొనిన తరువాత చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ తరుఫున భారతదేశానికి వెళుతున్న మొదటి మిషనరీగా అతనికి వచ్చిన అవకాశాన్ని అతను జారవిడువలేదు. సముద్రయానములో రెండుమార్లు ఓడ ప్రమాదముల నుండి బయటపడిన అలెగ్జాండర్, 1830వ సంll లో తన భార్యతో కలిసి భారతదేశంలోని కలకత్తా నగరానికి చేరుకున్నారు.


    ఆరంభములో తన శక్తి సామర్థ్యాలన్నింటినీ పాఠశాలలను స్థాపించుటలోనే వినియోగించారు అలెగ్జాండర్. ఉన్నత కుల హిందువులను మరియు ముస్లింలను చేరుకొనుటకు మార్గమును సిద్ధపరిచే సువార్త సాధనం విద్య అని అతను దృఢంగా విశ్వసించారు. స్థానిక మత విశ్వాసాలను సవాలు చేయుటకుగాను బైబిలు పఠనములను విజ్ఞానశాస్త్రముతో సమీకరించి, క్రైస్తవ తత్వజ్ఞానముతో కూడుకొనిన పాశ్చాత్య విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. స్కాటిష్ చర్చ్ కళాశాల, కలకత్తా విశ్వవిద్యాలయం మొదలగునవి భారతదేశంలో విద్యారంగములో అతను చేసిన కృషికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. అతని యొక్క సేవలు భారతదేశానికి వెలుపల కూడా విస్తరించాయి. అతను అమెరికా, ఐరోపా మరియు ఆఫ్రికా ఖండములంతటా ప్రసంగిస్తూ సువార్త యొక్క పరిధులను విస్తరింపజేశారు మరియు వివిధ ప్రాంతాలలో మిషనరీలను నియమించారు. ఈ లోకములో క్రీస్తు కొరకు వేలాది మంది ఆత్మలను సంపాదించి, క్రీస్తును సేవించుటకు వందలాది మంది సేవకులకు శిక్షణనిచ్చిన అలెగ్జాండర్ డఫ్, 1878వ సంll లో తన పరలోకపు వాసస్థలమునకు పయనమయ్యారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, అజ్ఞానమనే చీకటిని పారద్రోలుటకు మీవంటి వారు ముందుకు రావలసిన ఆవశ్యకం లేదా?

    ప్రార్థన :

    "ప్రభువా, మీ కొరకు మండుచున్న దివిటీ వలె నన్ను ప్రజ్వలింపజేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Jan 30, 2022

    Algernon Stanley Smith Life History

    అల్జర్నాన్ స్టాన్లీ స్మిత్ గారి జీవిత చరిత్ర




     

    • జననం: 14-02-1890
    • మహిమ ప్రవేశం: 28-07-1978
    • స్వస్థలం: లురా షాన్సీ
    • దేశం: చైనా
    • దర్శన స్థలము: ఉగాండా మరియు రువాండా


    అల్జీ అని ఆప్యాయంగా పిలువబడే అల్జర్నాన్ స్టాన్లీ స్మిత్, ఉగాండా మరియు రువాండాలలో పరిచర్య జరిగించిన బ్రిటిష్ ప్రొటెస్టంట్ వైద్య మిషనరీ. అతని తండ్రి ‘ది కేంబ్రిడ్జ్ సెవెన్’ అని పిలువబడే ఏడుగురు మిషనరీలలో ఒకరైన స్టాన్లీ స్మిత్. కేంబ్రిడ్జ్‌కు చెందిన అతను చైనాలో సేవ చేశారు. ఒక ఏడాది వయస్సున్నప్పుడు తన తల్లిని కోల్పోయిన అల్జీ, క్రైస్తవ పరిచర్యలో ఆసక్తి కలిగియున్న అలిస్ మరియు ఎమిలీ వాట్నీ అనేవారి సంరక్షణలో ఇంగ్లాండులో పెరిగారు. వారి నుండి పొందిన ఆర్థిక సహాయంతో అతను కేంబ్రిడ్జ్‌లోని ట్రినిటీ కళాశాలలో వైద్య శాస్త్రమును అభ్యసించి 1914వ సంll లో వైద్య పట్టాను పొందారు.


    అతని తల్లిదండ్రులు మిషనరీలు అయినప్పటికీ మిషనరీ సేవకైన దేవుని పిలుపు వ్యక్తిగతమైనదని అల్జీ విశ్వసించారు. కేంబ్రిడ్జ్‌లో చదువుకుంటున్న సమయంలో అల్జీ మరియు అతని స్నేహితుడు డాll లియోనార్డ్ షార్ప్ ఆఫ్రికాలో వైద్య మిషనరీ పని యొక్క ఆవశ్యకతను గురించి వినడం జరుగగా, అందుకొరకు దేవుడు తమకు బలమైన పిలుపునిస్తున్నట్లు వారు భావించారు. కావున, ఆఫ్రికాలోని ఉగాండాలో సేవ చేసేందుకు వారిరువురూ ‘చర్చి మిషనరీ సొసైటీ’ (సి.ఎమ్.ఎస్.) అనే సంస్థతో కలిసి పనిచేయుటకు ముందుకు వచ్చారు.


    1916వ సంll లో లియోనార్డ్ షార్ప్‌తో కలిసి ఉగాండా చేరుకున్న అల్జీ, కంపాలా అనే ప్రాంతంలో వైద్య సేవను ప్రారంభించారు. తరువాత వారు పరిచర్యను విస్తరింపజేయుటకుగాను చుట్టుప్రక్కల గ్రామాలను పరిశీలించుటకు వాటిని సందర్శించడం ప్రారంభించారు. అయితే, నిధుల కొరత కారణంగా మిషన్ విస్తరణకు సి.ఎమ్.ఎస్. సంస్థవారు అంగీకరించలేదు. ఇది వారిని నిరుత్సాహపరచలేదు సరికదా, బదులుగా వారు విశ్వాసము పైనే ఆధారపడి చుట్టుప్రక్కల గ్రామాలలో పరిచర్య చేయడం ప్రారంభించారు. దేవుడు వారి విశ్వాసాన్ని ఘనపరిచాడు. కాగా ఏ సంస్థ సహాయం లేకుండానే వారు తదుపరి నాలుగు సంవత్సరాలలో అనేక గ్రామాలకు మిషన్ పనిని విస్తరింపజేశారు.


    1921వ సంll లో తన భార్యతో కలిసి కబాలే చేరుకున్నారు అల్జీ. ఈ పర్యాయం అతను వైద్య సేవ మరియు సువార్త పరిచర్య మాత్రమే కాకుండా విద్యాసంబంధమైన పనిని కూడా ప్రారంభించారు. క్రీస్తు యొక్క జ్ఞానంలో ఎదుగులాగున ప్రస్తుత తరం పిల్లలకు బోధించినట్లయితే ఉగాండా యొక్క భవిష్యత్తు సురక్షితముగా ఉంటుందని అతను విశ్వసించారు. దేశానికి మరియు క్రైస్తవ సంఘమునకు కూడా సేవ చేయునట్లు విద్యార్థులకు శిక్షణనిచ్చుటను కూడా పాఠశాల పాఠ్యప్రణాళికలో పొందుపరిచారు. అంతేకాదు, రువాండా మిషన్‌ను ఏర్పాటు చేయడంలో కూడా అల్జీ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ మిషన్ ద్వారా అనేక మంది మిషనరీలు ఉగాండా, రువాండా, బురుండి మరియు తూర్పు కాంగోలోని ప్రాంతాలకు సిలువ సందేశమును తీసుకువెళ్ళారు.


    ఉగాండా మరియు రువాండా యొక్క జనాభాలో 80% కంటే ఎక్కువ మంది క్రైస్తవులుగా ఉండుటకు కారణమైన కొద్ది మంది వ్యక్తులలో అల్జర్నాన్ స్టాన్లీ స్మిత్ ఖచ్చితముగా ఒకరిగా నిలుస్తారు.


    ప్రియమైనవారలారా, మీరు వెలి చూపువలన కాక విశ్వాసమువలననే నడుచుకొనుచున్నారా?


    ప్రభువా, సందేహం మరియు భయం వలన కలిగే అపోహలను నిరోధించి, విశ్వాసముతో ధైర్యముగా మీ కొరకు పని చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!


     దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Dec 8, 2021

    Alfred Saker Life History

    ఆల్ఫ్రెడ్ సేకర్ గారి జీవిత చరిత్ర






    • జననం: 21-07-1814
    • మహిమ ప్రవేశం: 12-03-1880
    • స్వస్థలం: బోరో గ్రీన్, కెంట్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: కామెరూన్స్, ఆఫ్రికా

    ఆల్ఫ్రెడ్ సేకర్ మిల్లు యంత్రాల నిర్వాహకుని కుమారుడు. పుస్తకముల యెడల మరియు జ్ఞానమును సంపాదించుకొనుట పట్ల ఎంతో వాంఛ కలిగియున్నప్పటికీ, కొద్దిపాటి చదువును మాత్రమే పొందగలిగిన అతను, తన తండ్రి యొక్క కార్ఖానాలో పని చేయడం ప్రారంభించారు. ఒకసారి అతను ఒక ప్రార్థనా మందిరాన్ని దాటుతున్నప్పుడు పాడుచుండుటను విని లోపలికి ప్రవేశించారు. అతను అక్కడ గాయక బృందానికి సహాయం చేయడం ప్రారంభించారు. 

    తదుపరి కూడా చర్చి కార్యకలాపాలలో పాల్గొనుచూ వచ్చారు. చివరికి దేవుని వైపుకు ఆకర్షించబడిన అతను, బాప్తిస్మం పొందారు. తదుపరి అతను సంఘ సభ్యుల గృహములను సందర్శించడం ప్రారంభించారు మరియు చుట్టుప్రక్కల గ్రామాలన్నింటినీ దర్శించారు. కాగా, త్వరలోనే సంఘము సువార్త పరిచర్య చేయుటకు అతను కలిగియున్న తలాంతును గుర్తించి, దానిని సేవలో ఉపయోగపరచి అభివృద్ధి చేసుకొనుటకు అతనికి పిలుపునిచ్చింది.

    క్రైస్తవునిగా మారిన ప్రారంభ దినముల నుండి సేకర్‌కు ఆఫ్రికాలో దేవుని సేవ చేయాలనే కోరిక ఉండేది. అందుకు అతని భార్య హెలెన్ జెస్సప్ నుండి మంచి ప్రోత్సాహం మరియు మద్దతు లభించింది. బాప్తిస్టు మిషనరీ సొసైటీవారు అతనిని అంగీకరించగా, 1843వ సంll లో అతని మిషనరీ సేవ ప్రారంభమయ్యింది.

    బాప్తిస్టు మిషనరీల ప్రధాన కార్యాలయమైన ఫెర్నాండో పో (ఇప్పుడు బయోకో)కి చేరుకున్నారు సేకర్. కామెరూన్స్ తీరం వెంబడి ఉన్న తెగలను దర్శించిన అతను, మిషన్ పని కొరకు అక్కడ ఒక గృహమును నిర్మించారు. రెండు సంవత్సరాలలో అతను స్థానిక భాషయైన డౌలాలో ప్రావీణ్యం సంపాదించి, దానికి లిపిని రూపొందించారు. అతని పరిచర్య మూలముగా 1849 నాటికి కామెరూన్స్‌లో ఒక క్రెస్తవ సంఘము ఏర్పడింది.

     ప్రజల జీవితాలపై అతను చూపిన ప్రభావం గొప్పది. వారికి అతను పారిశ్రామిక వృత్తి నైపుణ్యాలను మరియు వ్యవసాయమును నేర్పించి, వారిని నాగరికులుగా తీర్చిదిద్దారు. అతను తన జీవితకాలమంతా చేసి సాధించిన ఒక పని ఏమంటే బైబిలును డౌలా భాషలోకి అనువదించి ముద్రించడం అని చెప్పవచ్చు.

    1851వ సంll నాటికి అతనితో పాటు అక్కడికి వచ్చిన తోటి పరిచారకులందరూ ఆఫ్రికాను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తరువాతి సంవత్సరాలలో స్పానిష్ ప్రభుత్వం ఫెర్నాండో పో నుండి ప్రొటెస్టెంట్ మిషనరీలందరినీ తరిమికొట్టింది. కష్టతరమైన పరిస్థితులలో కూడా వెనుదిరిగి చూడని సేకర్, కామెరూన్స్‌లో విస్తారమైన భూమిని కొనుగోలు చేసి, విక్టోరియా నగరాన్ని (ఇప్పుడు లింబే) నిర్మించారు మరియు అక్కడ క్రొత్త మిషన్ కేంద్రమును స్థాపించారు. ఆఫ్రికాలోని ప్రాణాంతకమైనటువంటి వాతావరణంలో ముప్పై రెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆల్ఫ్రెడ్ సేకర్, చివరికి 1876వ సంll లో తన స్వదేశానికి తిరిగి వెళ్ళారు.

    అతను కామెరూన్స్ ప్రాంతములో మొదటిగా సేవ చేసిన మార్గదర్శక మిషనరీలలో ఒకరు. అక్కడ మొట్టమొదటి బ్రిటిషు మిషన్‌ను స్థాపించినవారు. అంతేకాదు, అతను విక్టోరియా నగరమును నిర్మించారు. బైబిలును డౌలా భాషలోకి అనువదించారు. అయినప్పటికీ, మరే ఇతర హోదాలో పిలువబడక “ఆఫ్రికాకు మిషనరీ” అని మాత్రమే ఇతరులకు తెలియబడవలెనని కోరుకున్నారు ఆల్ఫ్రెడ్ సేకర్.


    ప్రియమైనవారలారా, మీరు మీ బిరుదులను, పేరును మరియు కీర్తిని త్యజించి, కేవలం దేవుని మహిమ కొరకే పనిచేయగలరా?

    "ప్రభువా, మీ సేవకుడు/సేవకురాలు అని మాత్రమే పిలువబడవలెననునదే నా హృదయ వాంఛ అగునట్లు కృపననుగ్రహించుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Nov 17, 2021

    Archibald Reekie | ఆర్చుబాల్డ్ రీకీ

    ఆర్చుబాల్డ్ రీకీ గారి జీవిత చరిత్ర




    • జననం: 1862
    • మహిమ ప్రవేశం: 1942
    • స్వస్థలం: ఆర్మో
    • దేశం: కెనడా
    • దర్శన స్థలము: బొలీవియా

     కెనడాకు చెందిన ఆర్చుబాల్డ్ రీకీ బొలీవియాలో తన పరిచర్యకు ప్రసిద్ధి చెందిన ఒక మార్గదర్శక మిషనరీ. నిరుపేద కుటుంబములో పుట్టిన అతను, తన బాల్యములో పంట పొలాలలో పనివానిగా పనిచేశారు. శారీరకంగా బలహీనముగా ఉండే రీకీ, తన యవ్వనప్రాయంలో జ్వరం బారిన పడి దాదాపు మరణించినంత అనుభవం గుండా వెళ్ళారు. అయితే, మన బలహీనతయందు తన శక్తి పరిపూర్ణమగుచున్నదని సెలవిచ్చుచున్న మన దేవుడు కొన్ని కఠినమైన వాతావరణ పరిస్థితులలో ఆర్చుబాల్డ్‌ను తన సేవ కొరకు వాడుకున్నాడు.

     వారి సంఘ పాదిరి యొక్క అంత్యక్రియల కార్యక్రమంలో, దేవుడు తనను మిషనరీ సేవ చేయుటకు పిలుచుచున్నట్లు గ్రహించారు రీకీ. కాగా అతను బైబిలు వేదాంత శాస్త్రమును అభ్యసించుటకు టొరంటోలోని మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయంలో చేరగా, అక్కడ బొలీవియాలో మిషనరీ పని యొక్క ఆవశ్యకత గురించి వినడం జరిగింది. తనకు ఎటువంటి ధన సహాయము లేనప్పటికీ, వేసవి సెలవులలో బొలీవియాను సందర్శించాలని నిర్ణయించుకున్నారు రీకీ. కాగా 1896వ సంll లో తన ప్రయాణమును ప్రారంభించిన అతను, మహాసముద్రాలను దాటుకుంటూ వెళ్ళారు; పనామా యొక్క భయంకరమైన వేడిని భరించారు; పెరులోని మంచుతో కప్పబడిన పర్వతాలను దాటారు; చివరకు బొలీవియాలోని లా పాజ్ నగరమును చేరుకున్నారు. అక్కడి స్థానిక భాషలలో ఒకటైన స్పానిష్ భాష అతనికి తెలియక పోయినప్పటికీ, అతను అక్కడ కరపత్రాలను పంచిపెడుతూ, బైబిళ్లను విక్రయించారు. ఒంటరిగా అతను చేసిన ఈ ప్రయాణంలో అతను ప్రాణాలతో క్షేమముగా ఉండడం అనేది అతని విషయంలో ఒక అద్భుతమే! కాగా బొలీవియాలో మిషనరీ సేవ కొరకైన తన పిలుపును ధృవీకరించుకొనుటకు రీకీకి వేరే ఆనవాలు అవసరం లేకుండా పోయింది.

     లా పాజ్‌లో అతని యొక్క ఆ చిన్న అనుభవం త్వరలోనే మెక్‌మాస్టర్ విశ్వవిద్యాలయంలోని అనేక విద్యార్థులకు ప్రేరణగా మారింది. ఒప్పించుటకు అతను ఎంతో తీవ్రముగా ప్రయత్నించిన తరువాత, 1897వ సంll లో ‘బాప్టిస్ట్ కన్వెన్షన్ ఆఫ్ ఓంటారియో’ సంస్థవారు రీకీ యొక్క బొలీవియా మిషనుకు తమ మద్దతును తెలియపరిచారు.

     1898వ సంll లో బొలీవియా నగరమైన ఒరురోకు వచ్చిన రీకీ, అక్కడ ఒక మిషన్ కేంద్రమును ఏర్పాటు చేశారు. అక్కడికి వలస వచ్చిన భవన నిర్మాణ కార్మికుల మధ్య అతను సేవ చేయడం ప్రారంభించారు. అంతేకాకుండా, ఒక పాఠశాలను కూడా నిర్వహించారు. త్వరలోనే క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను సంపాదించగలిగారు రీకీ. పైగా ధైర్యసాహసాలతో కూడుకొనిన అతని కథ అనేక మంది బాప్తిస్టు మిషనరీలను ప్రేరేపించినధై, వారు బొలీవియాకు వచ్చుటకు కారణమైంది. తత్ఫలితముగా పరిచర్య మరింతగా అభివృద్ధి చెంది ఫలభరితమైంది!

     విశ్వాసము పైనే ఆధారపడి తన పరిచర్యను జరిగించారు రీకీ. మిషన్ ఎంతో విజయవంతం అయినప్పటికీ మరియు నిధులు ప్రవాహము వలె వచ్చినప్పటికీ, అతను దీనత్వముతో మట్టి నేలను కలిగియున్న కుటీరంలో ఉండుటకే మొగ్గుచూపారు. పరిచర్య కాలంలో, అతను తన మొదటి బిడ్డను అంగుడువాపు (డిఫ్తీరియా) వ్యాధి కారణంగా కోల్పోవడం జరిగింది మరియు అతను కూడా తన భార్యతో పాటు కఠినమైన వాతావరణం కారణంగా అనేక సార్లు అనారోగ్యానికి గురయ్యారు. అయినప్పటికీ, అన్నింటినీ ఓర్చుకొనిన అతను ఏనాడూ వెనుకంజ వేయలేదు. అయితే, తీవ్రమైన అనారోగ్యం కారణంగా 1916వ సంll లో అతను కెనడాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ తన మరణం వరకు కూడా ఓంటారియోలోని అనేక గ్రామాలలో క్రైస్తవ సంఘాలకు పాదిరిగా సేవలందిస్తూ దేవుని సేవలో ముందుకు సాగిపోయిన ఆర్చుబాల్డ్ రీకీ, 1942వ సంll లో కన్నుమూశారు. 

    ప్రియమైనవారలారా, మీ బలహీన సమయములయందు దేవుని శక్తి పరిపూర్ణమగుటను మీరు అనుభవించుచున్నారా?

    ప్రభువా, మీ కొరకు మరియు కేవలం మీ మహిమ కొరకు మీ శక్తితో నేను సమస్తమునూ చేయగలుగుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Nov 16, 2021

    Andala Taara | అందాల తార | Telugu Christmas Song

    Andala Taara | అందాల తార | Telugu Christmas Song


    అందాల తార అరుదెంచె నాకై - అంబర వీధిలో 
    అవతారమూర్తి యేసయ్య కీర్తి -అవని చాటుచున్ 
    ఆనందసంద్ర ముప్పోంగెనాలో - అమరకాంతిలో 
    ఆది దేవుని జూడ - అశింపమనసు పయనమైతిమి                        

    1. విశ్వాసయాత్ర - దూరమెంతైన - విందుగా దోచెను 
    వింతైన శాంతి - వర్షంచెనాలో - విజయపధమున 
    విశ్వాలనేలెడి - దేవకుమారుని - వీక్షించు దీక్షలో 
    విరజిమ్మె బలము - ప్రవహించె ప్రేమ - విశ్రాంతి నొసగుచున్ 

     2.యెరూషలేము - రాజనగరిలో - ఏసును వెదకుచు 
    ఎరిగిన దారి - తొలగిన వేల - ఎదలో క్రంగితి 
    ఏసయ్యతార - ఎప్పటివోలె - ఎదురాయె త్రోవలో 
    ఎంతో యబ్బురపడుచు - విస్మయ మొందుచు ఏగితి స్వామి కడకు 

     3.ప్రభుజన్మస్ధలము - పాకయేగాని పరలోక సౌధమే 
    బాలునిజూడ - జీవితమెంత - పావనమాయెను 
    ప్రభుపాదపూజ - దీవెనకాగా - ప్రసరించె పుణ్యము 
    బ్రతుకె మందిరమాయె - అర్పణలే సిరులాయె ఫలియించె ప్రార్ధన



  • WhatsApp
  • Oct 1, 2021

    Ashbel Green Simonton | అష్బెల్ గ్రీన్ సైమన్‌టన్

    అష్బెల్ గ్రీన్ సైమన్‌టన్  | Ashbel Green Simonton



    • జననం: 20-01-1833
    • మహిమ ప్రవేశం: 09-12-1867
    • స్వస్థలం: పెన్సిల్వేనియా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: బ్రెజిల్

      అమెరికాకు చెందిన అష్బెల్ గ్రీన్ సైమన్‌టన్ బ్రెజిల్‌లో మొట్టమొదటి ప్రొటెస్టెంట్ స్సంఘమును ప్రారంభించిన ఒక మార్గదర్శక మిషనరీ. అతని తల్లి అతనిని దేవుని సేవ కొరకు సమర్పించారు. దైవిక వాతావరణంలో పెరిగిన అతను, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు మరియు న్యాయశాస్త్ర విద్యను కూడా అభ్యసించారు. అయితే, దేవుడు అతని తల్లి యొక్క ప్రార్థనలకు సమాధానమిచ్చి, 1855వ సంll లో జరిగిన ఒక ఉజ్జీవ కూడికలో ఎంతో శక్తివంతంగా సైమన్‌టన్‌తో మాట్లాడాడు.

      దేవుని పిలుపుకు విధేయత చూపించిన సైమన్‌టన్, మంచి భవిష్యత్తు ఉన్న తన ఉపాధిని వదులుకొని బైబిలు వేదాంత శాస్త్రములో శిక్షణ కొరకు ప్రిన్స్‌టన్ సెమినరీలో చేరారు. అక్కడ ఉన్నప్పుడు అతను విదేశాలలో మిషనరీ సేవ చేయుటను గురించి డాll చార్లెస్ హోడ్జ్ ఇచ్చిన ప్రసంగము ద్వారా లోతుగా కదిలింపబడ్డారు. ప్రార్థనాపూర్వకంగా అతను ‘ప్రెస్బిటేరియన్ బోర్డ్ ఆఫ్ ఫారిన్ మిషన్స్‌’ కు తన సేవలను అందించుటకు ముందుకువచ్చారు. కాగా, ఆ సంస్థ బ్రెజిల్‌లో మిషనరీ పరిచర్య చేయుటకు అతనిని నియమించింది.

     1859వ సంll లో రియో డి జనీరోకు చేరుకొనిన సైమన్‌టన్, అక్కడ సువార్త పరిచర్యను, మరిముఖ్యంగా పిల్లల మధ్య సువార్త సేవను ప్రారంభించారు. అతను 5 మంది పిల్లలతో మొదటి ఆదివారపు బైబిలు పాఠశాలను నిర్వహించారు మరియు కేవలం ఇద్దరు విశ్వాసులతో బైబిల్ పఠన కూడికను ప్రారంభించారు. అక్కడి స్థానిక కాథలిక్కులకు విశ్వాసం ద్వారా మాత్రమే క్రీస్తులో రక్షణ అనే ఉపదేశం వారు మునుపు విననిది. పరలోకం మరియు నరకం గురించి బైబిలు ఆధారముగా ఇచ్చిన వివరణలను అనేక మంది అంగీకరించారు మరియు క్రమంగా ఆచారములతో కూడుకొనియున్న తమ క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టారు. అటువంటి వారిలో ఒకరైన జోస్ మనోయెల్ అనే ఒక కాథలిక్ పాదిరి అష్బెల్ చేత బాప్తిస్మము పొంది, తదుపరి పరిచర్యలో అతని సహచరులు అయ్యారు.

     రియోలో పరిచర్య జరిగించడమే కాకుండా తీరప్రాంత నగరాలను పర్యటించి క్రైస్తవ సంఘములను మరియు సెమినరీలను (బైబిలు వేదాంత కళాశాలలు) స్థాపించారు సైమన్‌టన్. స్థానికుల ఆత్మలను గెలుచుకొనుటకు అతను ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు, మరియు స్థానిక సంఘమును వారే నడిపించుకొనగలుగునట్లు వారికి తగిన శిక్షణ ఇచ్చేవారు. ఇది ఒక బలమైన జాతీయ పాదిరుల సమూహము యొక్క ఆవిర్భావమునకు దారితీసింది.

      “కేవలం మనుష్యపరమైన ఒక సంస్థ ద్వారా జరిగించవలెనంటే ఈ పని ఎంతో నిరాశాజనకంగా ఉంటుంది. అయితే, దానిని చేపట్టే వారు దేవుని శక్తిపై ఆధారపడాలి, లేకపోతే చివరికి నిరాశే ఫలితంగా పొందాలి.” అనునవి బ్రెజిల్‌లో అడుగుపెట్టినప్పుడు అష్బెల్ చెప్పిన మాటలు. సర్వశక్తిమంతుని యొక్క సార్వభౌమ శక్తిపైనే పూర్తిగా ఆధారపడిన సైమన్‌టన్, బ్రెజిల్‌లో కేవలం ఏడు సంవత్సరాల తన పరిచర్యలో అతను ఎంతో సాధించారు. 1867వ సంll లో ప్రాణాంతకమైన యెల్లో ఫీవర్ అనే జ్వరం బారిన పడి 
    34 సంll ల లేత వయస్సులోనే దేవుని పరమసన్నిధిని చేరుకున్నారు అష్బెల్ గ్రీన్ సైమన్‌టన్.

    ప్రియమైనవారలారా, పరిచర్య చేస్తున్నప్పుడు మీరు దేవుని శక్తిపై ఆధారపడుతున్నారా?

    ప్రభువా, మీ శక్తితో నన్ను నింపుము. ఆలయక పరుగెత్తుటకును సొమ్మసిల్లక ముందుకు సాగిపోవుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Sep 22, 2021

    Ada Lee | అడా లీ

    Ada Lee |  అడా లీ



    • జననం: 23-03-1856
    • మహిమ ప్రవేశం: 11-06-1948
    • స్వస్థలం: వెస్ట్ వర్జీనియా 
    • దేశం: యునైటెడ్ స్టేట్స్ 
    • దర్శన స్థలము: భారతదేశం 

    నా తలంపులు మీ తలంపులవంటిని కావు .... నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును , రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు : ఇదే యెహోవా వాక్కు . " అని యెషయా 55 : 8 మరియు యిర్మీయా 29:11 వచనములలో చెప్పబడిన మాటలు అడా లీ యొక్క జీవితములో అక్షరాలా ఋజువు కావడం మనము చూడవచ్చు . తన బిడ్డలను దైవ భయముతో పెంచి , దేవుని సేవ కొరకై వారిని సమర్పించిన ఆమె , వారు ప్రజలను దేవుని వైపుకు మళ్ళించగా చూడవలెనని ఎల్లప్పుడూ ప్రాంర్థించేవారు . అయితే ఆమె ప్రార్థనలకు జవాబు లభించినదా ?

    ఇరవై సంవత్సరాల యుక్త వయసులో అడా హిల్డెగార్డ్ జోన్స్ లీ భారతదేశములో అడుగుపెట్టారు . ఆమె కలకత్తాలో బెంగాల్ స్త్రీల మధ్య ఐదు సం ll ల పాటు సేవ చేశారు . భారతదేశములో సేవ చేస్తున్న అమెరికా దేశపు మరొక మిషనరీ అయిన డేవిడ్ హిరామ్ లీతో 1881 వ సం ll లో ఆమెకు వివాహం జరిగింది . కాగా , వారిరువురు కలిసి కలకత్తాలో పాఠశాలలను స్థాపించారు . దేవుని సేవ చేయుటకు ప్రజలకు శిక్షణనిచ్చారు మరియు పేద పిల్లలకును , బాల్యవివాహాల వంటి మూఢాచారాలకు మరియు వ్యభిచారము వంటి సామాజిక కీడులకు బలైన పిల్లలకును ఆశ్రయమయ్యారు .

    1899 వ సం ll లో ఆ మిషనరీ కుటుంబములో విషాదం అలుముకుంది . డార్జిలింగ్ లో ప్రకృతి విపత్తు కలిగి కొండచరియలు విరిగిపడటంతో అక్కడ చదువుకుంటున్న వారి ఆరుగురు పిల్లలు మరణ ద్వారంలోకి ప్రవేశించవలసి వచ్చింది . ఆ ఆరుగురిలో ప్రాణాలతో బయటపడిన వారి కుమారుడు విల్బర్ , ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ విపత్తు సమయములో జరిగిన దానిని గురించి వారికి తెలియపరిచాడు . ఆ సమయములో మరణాన్ని ఎదుర్కొనుటకు దేవుడు వారికి అపారమైన ధైర్యమును ఇచ్చాడని , మరణించిన తరువాత పరలోకములోకి ప్రవేశిస్తామన్న నిశ్చయతను కలియుండుట వలన వారు మరణించుటకు భయపడలేదని విల్బర్ ఆ చివరి ఘడియల గురించి వివరించాడు .

    కొన్ని రోజులు ఆసుపత్రిలో తీవ్రమైన శారీరక బాధను అనుభవించిన తరువాత , విల్బర్ కూడా పరమందు తన సోదరీసోదరులను చేరుకున్నాడు . తన పిల్లల అకాలమరణం అడాకు గొప్ప ఆత్మీయ పోరాటంగా మారింది . ఆమె ప్రార్థనలకు దేవుడు జవాబివ్వలేదనే ఆలోచనలతో సాతాను ఆమె విశ్వాసమును కబళించుటకు ఎంతగానో దాడి చేశాడు . శోధిస్తున్న అపవాదిని జయించుటకు తనకు బలమును దయచేయుమని ఆమె దేవుని యొక్క సహాయము కొరకై ఆయన సన్నిధిలో ఎంతగానో మొరపెట్టారు . కాగా , అమెరికా అంతటా వారి పిల్లల యొక్క జీవిత సాక్ష్యములు ఏవిధముగా ప్రచురించబడి , ప్రసంగాలలో చెప్పబడుతున్నాయో మరియు వారి మాదిరికరమైన జీవితాలు ఏవిధముగా ప్రజల హృదయాలను కదిలించి వారిని దేవుని వైపుకు తిప్పుతున్నాయో ఆమెకు చెప్పబడినప్పుడు , ఆమె ఆయన యొక్క అద్భుతమైన ప్రణాళికలను బట్టి దేవునిని స్తుతించి , ఆమె ప్రార్థనలకు ఆయన మార్గము చొప్పున జవాబు దయచేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు !

    లీ మిషనరీ దంపతులు తమ చివరి శ్వాస వరకు భారతదేశంలో తమ సేవను కొనసాగించారు . కలకత్తాలోని " ది లీ మెమోరియల్ మిషన్ " త్యాగసహితమైన వారి సేవ యొక్క ఫలముగా ఈ నాటికీ మన కన్నుల ముందు నిలిచియున్నది .

    ప్రియమైనవారలారా , మీ జీవితములో మీరు కష్టములను ఎదుర్కొంటున్నప్పటికీ , దేవుడు మీ ప్రార్థనలను ఆలకించి జవాబిస్తున్నాడనే నమ్మికను మీరు కలిగియున్నారా ?

    " ప్రభువా , మీ ప్రణాళికలను అర్థం చేసుకొనుటకును , ఎటువంటి నియమనిబంధనలు లేకుండా బేషరతుగా మీయందు నమ్మికయుంచి మిమ్ములను ఆశ్రయించుటకును నాకు సహాయము దయచేయుము . ఆమేన్ !
  • WhatsApp
  • Sep 18, 2021

    Adoniram Judson Gordon | అడోనిరామ్ జడ్సన్ గోర్డాన్

    అడోనిరామ్ జడ్సన్ గోర్డాన్ | Adoniram Judson Gordon
    • జననం: 19-04-1836
    • మహిమ ప్రవేశం: 02-02-1895
    • స్వస్థలం: న్యూ హాంప్‌షైర్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

     అడోనిరామ్ జడ్సన్ గోర్డాన్ అమెరికాకు చెందిన బోధకుడు, రచయిత, స్వరకర్త మరియు ప్రపంచవ్యాప్తంగా పలు మిషనరీ సేవలకు కారణభూతులు. దేవునియందు భయభక్తులు గలిగిన క్రైస్తవ కుటుంబములో జన్మించిన అతనికి బర్మాలో సేవ చేసిన బాప్తిస్టు మిషనరీ అయిన అడోనిరామ్ జడ్సన్ పేరు పెట్టబడింది. పదిహేనేళ్ళ వయస్సులో తిరిగి జన్మించిన అనుభవము పొందిన గోర్డాన్, ఒక ఏడాది తరువాత క్రైస్తవ పరిచర్య కొరకు సిద్ధపడాలనే తన కోరికను ఒక సంఘ కూడికలో బహిరంగంగా తెలియపరిచారు. కాగా, బ్రౌన్ విశ్వవిద్యాలయంలో సాధారణ విద్యాభ్యాసమును పూర్తిచేసుకొనిన పిమ్మట అతను ‘న్యూటన్ థియోలాజికల్ ఇనిస్టిట్యూషన్‌’ లో బైబిలు వేదాంత శాస్త్రమును అభ్యసించారు. పిమ్మట అతను బోస్టన్‌కు సమీపంలోని ‘జమైకా ప్లెయిన్ బాప్టిస్ట్ చర్చి’ యొక్క పాదిరిగా నియమించబడ్డారు.


     తదుపరి అతను బోస్టన్‌లోని ‘క్లారెండన్ స్ట్రీట్ బాప్టిస్ట్ చర్చి’ లో సేవ చేయుటకు వెళ్ళారు. క్లారెండన్ చర్చి సువార్త సేవ పట్ల ఏమాత్రం ఆసక్తి చూపనిదై, అద్భుతమైన గాయక బృందాలు మరియు వైభవవంతమైన విస్తృత భవన నిర్మాణాలను కలిగియుండుట పైనే దృష్టి కేంద్రీకరించేదిగా ఉంది. కావున, ప్రారంభంలో ఆ సంఘమును సరైన దిశలో నడిపించుటకు గోర్డాన్‌కు బహు కష్టతరమైంది మరియు అతను అనేక సార్లు నిరాశ చెందారు కూడా. కాగా, అతను ప్రార్థించి, బోస్టన్‌లో కూడికలను నిర్వహించుటకు డి. ఎల్. మూడీని ఆహ్వానించారు. అది క్లారెండన్ సంఘములోనే కాదు, బోస్టన్‌ అంతటా ఉజ్జీవపు జ్వాలలు ప్రారంభమగుటకు కారణమయ్యింది. తత్ఫలితముగా, క్లారెండన్ సంఘములో గొప్ప మార్పు కలిగి, దాని ఆసక్తి ప్రాపంచిక విషయాల పై నుండి క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుట పైకి మరల్చబడింది. ప్రపంచవ్యాప్తంగా మిషనరీ సేవను గురించిన దర్శనము కలిగియుండి, ప్రార్థనల ద్వారాను మరియు ఆర్ధికంగాను మిషనరీ సేవను ఆదరించవలెనని గోర్డాన్ సంఘమును ప్రేరేపించారు. 


     డి. ఎల్. మూడీ యొక్క కూడికలలో తరచుగా ప్రసంగించేవారు గోర్డాన్. సువార్తను విస్తరింప చేయాలనే వాంఛతో అతను ప్రపంచవ్యాప్తంగా పర్యటించారు. విస్తారమైన పంటను కోయుటకు పనివారు కావలననే అంశముపైనే అతని ప్రసంగాలు ప్రధానంగా కేంద్రీకరించబడి యుండేవి. తన ప్రసంగం చివరిలో అతను ఇచ్చే పిలుపుకు వందలాది మంది యవ్వనస్థులు స్పందించేవారు. కావున, ఈ భవిష్యత్ మిషనరీలకు శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో 1889వ సంll లో అతను “బోస్టన్ మిషనరీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్” ను (బోస్టన్ మిషనరీ శిక్షణా సంస్థ) స్థాపించారు. తరువాత అది ‘గోర్డాన్ కళాశాల’ గా మారింది. ఈ కళాశాల అనేక దేశాలలో పరిచర్య చేసిన మరియు చేస్తున్న వేలాదిమంది దైవసేవకులను ముందుకు తీసుకువచ్చింది. 


     గోర్డాన్ కేవలం బోధకులు మాత్రమే కాదు, అద్భుతమైన రచయిత మరియు స్వరకర్త కూడా. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఎంతో తీవ్రముగా పరిచర్య చేస్తున్నప్పటికీ, 1895వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా ఎంతో సహనముతో క్లారెండన్ సంఘములోని తన మందను కాచారు అడోనిరామ్ జడ్సన్ గోర్డాన్.


    🚸 *ప్రియమైనవారలారా, మీ ఆసక్తి దేనియందు ఉన్నది? అద్భుతమైన గాయక బృందాలు మరియు వైభవవంతమైన విస్తృత భవన నిర్మాణాల యందునా లేదా ఆత్మలను సంపాదించుటలోనా?* 🚸


    🛐 *"ప్రభువా, భౌతిక విషయాల పై కాక, ఆత్మీయ విషయాలపై నేను దృష్టి నిలుపుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

    *******

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • Aug 23, 2021

    Anya Janulela Lechi | అన్యజనులేల లేచి

    "నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను." కీర్తన Psalm 2:1-10"

    పల్లవి : అన్యజనులేల లేచి - గల్లత్తు చేయుచున్నారు అన్యజనులేల

    అనుపల్లవి : జనములేల వ్యర్థమైన దాని తలంచుచున్నవి
    1. భూలోక రాజులు లేచి - వారేకముగా ఆలోచించి
     వారి పాశములను తెంపి - పారవేయుద మనుచున్నారు
    ||అన్యజనులేల||

    2. ఆకాశ వాసుండు - వారిని - అపహసించుచున్నాడు - నవ్వి
    వారలతో పల్కి కోపముతో - వారిని తల్లడిల్ల చేయును
    ||అన్యజనులేల||

    3. పరిశుద్ధమైన - నాదు - పర్వతమగు సీయోను మీద
    నారాజునాసీనునిగా జేసి - యున్నానని సెలవిచ్చెను
    ||అన్యజనులేల||

    4. కట్టడ వివరింతు - నాకు - యిట్లు చెప్పెను యెహోవాయందు
    నీవు నా కుమారుండవు - నిన్ను నేను కనియున్నాను
    ||అన్యజనులేల||

    5. నన్ను అడుగుము - నీకు - జనముల భూమిని స్వాస్థ్యముగా
    దిగంతముల వరకు స్వాస్థ్యముగా నొసంగెదను నీకు
    ||అన్యజనులేల||

    6. ఇనుప దండముతో - నీవు - వారిని నలుగగొట్టెదవు
    కుండను పగులగొట్టునట్లు - వారిని పగులగొట్టెదవు
    ||అన్యజనులేల||

    7. ఓ రాజులారా - మీరు - జ్ఞానవంతులై యుండుడి
    ఓ భూపతులారా - మీరు - నాభోద నొందుడి నేడే
    ||అన్యజనులేల||
  • WhatsApp
  • Aug 7, 2021

    Anni velala Vinuvadu | అన్ని వేళల వినువాడు

    అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
    ఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)
    ప్రార్ధించుము అలయకనే
    కనిపెట్టుము విశ్వాసముతో (2)
    నీ ప్రార్ధనే మార్చును నీ స్థితి
    నీ ఎదలో కన్నీరు తుడచును       ||అన్ని||

    కుమిలిపోతూ నలిగిపోతూ
    ఏమౌతుందో అర్ధం కాక (2)
    వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)
    ఒకసారి యోచించుమా
    నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

    ఎవరికీ చెప్పుకోలేక
    అంతగా బాధ ఎందుకు (2)
    మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)
    ఒకసారి యోచించుమా
    నీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2)     ||అన్ని||

    Anni Velala Vinuvaadu Nee Praardhanalanniyu
    Ae Bedhamu Lekane Aalakimpanaiyunnaadu (2)
    Praardhinchumu Alayakane
    Kanipettumu Vishwaasamutho (2)
    Nee Praardhane Maarchunu Nee Sthithi
    Nee Edalo Kanneeru Thudachunu ||Anni||

    Kumilipothu Naligipothu
    Emauthundo Ardham Kaaka (2)
    Vedana Chenduthu Niraashalo Munigaavaa (2)
    Okasaari Yochinchumaa
    Nee Morranu Vinuvaadu Yesayye (2) ||Anni||

    Evariki Cheppukoleka
    Anthagaa Baadha Enduku (2)
    Morrapettina Vaariki Sameepamugaa Yesu Undunu (2)
    Okasaari Yochinchumaa
    Nee Morranu Vinuvaadu Yesayye (2) ||Anni||
  • WhatsApp
  • Aug 1, 2021

    ADAVI CHETLA NADUMA | అడవి చెట్ల నడుమ

    ADAVI CHETLA NADUMA | అడవి చెట్ల నడుమ


    అడవి చెట్ల నడుమ
    ఒక జల్దరు వృక్షం వలె
    పరిశుద్ధుల సమాజములో
    యేసు ప్రజ్వలించుచున్నాడు (2)
    కీర్తింతున్ నా ప్రభుని
    జీవ కాలమెల్ల ప్రభు యేసుని
    కృతజ్ఞతతో స్తుతించెదను (2)

    షారోను రోజాయనే
    లోయ పద్మమును ఆయనే
    అతిపరిశుద్ధుడు ఆయనే
    పదివేలలో అతిశ్రేష్టుడు (2)     ||కీర్తింతున్||

    మనోవేదన సహించలేక
    సిలువ వైపు నే చూడగా
    లేవనెత్తి నన్నెత్తుకొని
    భయపడకుమని అంటివి (2)   ||కీర్తింతున్||

    ఘనమైన నా ప్రభువా
    నీ రక్త ప్రభావమున
    నా హృదయము కడిగితివి
    నీకే నా స్తుతి ఘనత(2)       ||కీర్తింతున్||

  • WhatsApp