Search Here

Dec 8, 2021

Alfred Saker Life History

ఆల్ఫ్రెడ్ సేకర్ గారి జీవిత చరిత్ర






  • జననం: 21-07-1814
  • మహిమ ప్రవేశం: 12-03-1880
  • స్వస్థలం: బోరో గ్రీన్, కెంట్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: కామెరూన్స్, ఆఫ్రికా

ఆల్ఫ్రెడ్ సేకర్ మిల్లు యంత్రాల నిర్వాహకుని కుమారుడు. పుస్తకముల యెడల మరియు జ్ఞానమును సంపాదించుకొనుట పట్ల ఎంతో వాంఛ కలిగియున్నప్పటికీ, కొద్దిపాటి చదువును మాత్రమే పొందగలిగిన అతను, తన తండ్రి యొక్క కార్ఖానాలో పని చేయడం ప్రారంభించారు. ఒకసారి అతను ఒక ప్రార్థనా మందిరాన్ని దాటుతున్నప్పుడు పాడుచుండుటను విని లోపలికి ప్రవేశించారు. అతను అక్కడ గాయక బృందానికి సహాయం చేయడం ప్రారంభించారు. 

తదుపరి కూడా చర్చి కార్యకలాపాలలో పాల్గొనుచూ వచ్చారు. చివరికి దేవుని వైపుకు ఆకర్షించబడిన అతను, బాప్తిస్మం పొందారు. తదుపరి అతను సంఘ సభ్యుల గృహములను సందర్శించడం ప్రారంభించారు మరియు చుట్టుప్రక్కల గ్రామాలన్నింటినీ దర్శించారు. కాగా, త్వరలోనే సంఘము సువార్త పరిచర్య చేయుటకు అతను కలిగియున్న తలాంతును గుర్తించి, దానిని సేవలో ఉపయోగపరచి అభివృద్ధి చేసుకొనుటకు అతనికి పిలుపునిచ్చింది.

క్రైస్తవునిగా మారిన ప్రారంభ దినముల నుండి సేకర్‌కు ఆఫ్రికాలో దేవుని సేవ చేయాలనే కోరిక ఉండేది. అందుకు అతని భార్య హెలెన్ జెస్సప్ నుండి మంచి ప్రోత్సాహం మరియు మద్దతు లభించింది. బాప్తిస్టు మిషనరీ సొసైటీవారు అతనిని అంగీకరించగా, 1843వ సంll లో అతని మిషనరీ సేవ ప్రారంభమయ్యింది.

బాప్తిస్టు మిషనరీల ప్రధాన కార్యాలయమైన ఫెర్నాండో పో (ఇప్పుడు బయోకో)కి చేరుకున్నారు సేకర్. కామెరూన్స్ తీరం వెంబడి ఉన్న తెగలను దర్శించిన అతను, మిషన్ పని కొరకు అక్కడ ఒక గృహమును నిర్మించారు. రెండు సంవత్సరాలలో అతను స్థానిక భాషయైన డౌలాలో ప్రావీణ్యం సంపాదించి, దానికి లిపిని రూపొందించారు. అతని పరిచర్య మూలముగా 1849 నాటికి కామెరూన్స్‌లో ఒక క్రెస్తవ సంఘము ఏర్పడింది.

 ప్రజల జీవితాలపై అతను చూపిన ప్రభావం గొప్పది. వారికి అతను పారిశ్రామిక వృత్తి నైపుణ్యాలను మరియు వ్యవసాయమును నేర్పించి, వారిని నాగరికులుగా తీర్చిదిద్దారు. అతను తన జీవితకాలమంతా చేసి సాధించిన ఒక పని ఏమంటే బైబిలును డౌలా భాషలోకి అనువదించి ముద్రించడం అని చెప్పవచ్చు.

1851వ సంll నాటికి అతనితో పాటు అక్కడికి వచ్చిన తోటి పరిచారకులందరూ ఆఫ్రికాను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. తరువాతి సంవత్సరాలలో స్పానిష్ ప్రభుత్వం ఫెర్నాండో పో నుండి ప్రొటెస్టెంట్ మిషనరీలందరినీ తరిమికొట్టింది. కష్టతరమైన పరిస్థితులలో కూడా వెనుదిరిగి చూడని సేకర్, కామెరూన్స్‌లో విస్తారమైన భూమిని కొనుగోలు చేసి, విక్టోరియా నగరాన్ని (ఇప్పుడు లింబే) నిర్మించారు మరియు అక్కడ క్రొత్త మిషన్ కేంద్రమును స్థాపించారు. ఆఫ్రికాలోని ప్రాణాంతకమైనటువంటి వాతావరణంలో ముప్పై రెండు సంవత్సరాల పాటు నిర్విరామంగా శ్రమించిన ఆల్ఫ్రెడ్ సేకర్, చివరికి 1876వ సంll లో తన స్వదేశానికి తిరిగి వెళ్ళారు.

అతను కామెరూన్స్ ప్రాంతములో మొదటిగా సేవ చేసిన మార్గదర్శక మిషనరీలలో ఒకరు. అక్కడ మొట్టమొదటి బ్రిటిషు మిషన్‌ను స్థాపించినవారు. అంతేకాదు, అతను విక్టోరియా నగరమును నిర్మించారు. బైబిలును డౌలా భాషలోకి అనువదించారు. అయినప్పటికీ, మరే ఇతర హోదాలో పిలువబడక “ఆఫ్రికాకు మిషనరీ” అని మాత్రమే ఇతరులకు తెలియబడవలెనని కోరుకున్నారు ఆల్ఫ్రెడ్ సేకర్.


ప్రియమైనవారలారా, మీరు మీ బిరుదులను, పేరును మరియు కీర్తిని త్యజించి, కేవలం దేవుని మహిమ కొరకే పనిచేయగలరా?

"ప్రభువా, మీ సేవకుడు/సేవకురాలు అని మాత్రమే పిలువబడవలెననునదే నా హృదయ వాంఛ అగునట్లు కృపననుగ్రహించుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment