Search Here

Showing posts with label I. Show all posts
Showing posts with label I. Show all posts

May 14, 2023

Isabella Thoburn | ఇసాబెల్లా థోబర్న్

ఇసాబెల్లా థోబర్న్ గారి జీవిత చరిత్ర



  • జననం : 29-03-1840
  • మరణం : 01-09-1901
  • స్వస్థలం : ఓహియో
  • దేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము : లక్నో (భారతదేశం)


అమెరికాకు చెందిన ఇసాబెల్లా థోబర్న్, ఒంటరిగా మిషనరీ సేవలోకి అడుగుపెట్టిన స్త్రీలకు ఒక ఉదాహరణగా నిలుస్తారు. క్రైస్తవ కుటుంబములో పుట్టిన ఆమె, మంచి విశ్వాసులైన తల్లిదండ్రులను కలిగియుండి, దేవుని యందలి భయభక్తులతో పెంచబడ్డారు. 'మనము ఈ భూమిపై ఉన్నది సేవ చేయుటకే గానీ సేవ చేయించుకొనుటకు కాదు' అనే ఆమె తల్లి యొక్క బోధన ఆమె జీవితముపై ఎంతో ప్రభావాన్ని చూపించింది. వర్జీనియాలోని 'వీలింగ్ ఫిమేల్ సెమినరీ' అనే వేదాంత కళాశాల నుండి పట్టభద్రురాలైన ఆమె, తదుపరి చాలా సంవత్సరాల పాటు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. అయితే, ఆమె సోదరుడైన జేమ్స్ థోబర్న్ వ్రాసిన లేఖ ఇసాబెల్లా జీవితంలో ఒక గొప్ప మలుపును తీసుకువచ్చింది.


మెథడిస్ట్ ఎపిస్కోపల్ సంఘమునకు చెందిన మిషనరీగా భారతదేశంలో సేవ చేస్తున్న జేమ్స్ థోబర్న్, తన సువార్త పనిలో స్త్రీపురుషులనే లింగ సంబంధిత అడ్డంకులను ఎదుర్కొన్నారు. కాబట్టి, తనతో చేతులు కలిపి ఆ సేవలో తనకు సహకారమందించమని  జేమ్స్ తన సోదరి యొక్క సహాయమును కోరగా, ఇసాబెల్లా వెంటనే అందుకు అంగీకరించారు. నిరుత్సాహకరమైన పరిస్థితులు, నిధుల కొరతను వంటి అడ్డంకులను ఎదుర్కొన్నప్పటికీ, చివరికి మెథడిస్టు సంఘము యొక్క ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ (డబ్ల్యుఎఫ్ఎంఎస్) ద్వారా 1870వ సంll జనవరి 20వ తారీఖున మరొక ఒంటరి మహిళా మిషనరీ అయిన క్లారా స్వైన్‌తో కలిసి భారతదేశానికి చేరుకున్నారు ఇసాబెల్లా.


భారతదేశంలో ఆమె తన సోదరుడైన జేమ్స్‌తో పాటు నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ భారతీయ మహిళలకు విద్యను అందించడం ద్వారా తన మిషనరీ పనిని ప్రారంభించారు ఇసాబెల్లా. ఆడపిల్ల పుట్టనే వద్దని తమ పుట్టుకనుండే తృణీకారముతో నిండుకొనిన పరిస్థితులను ఎదుర్కొంటున్న భారతీయ మహిళల దుస్థితిని చూసిన ఇసాబెల్లా, అటువంటి సమాజములో మార్పు తీసుకొని రావలెనంటే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని గ్రహించారు. ఆమె భారతీయ మహిళలను వారి గృహముల యొద్ద దర్శించి, వారికి విద్యను మరియు సువార్తను అందించారు. స్థానిక హిందుమత పూజారుల నుండి విమర్శలను, వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, ఆమె సమాజంలోని నిర్లక్ష్యం చేయబడిన మరియు తిరస్కరించబడిన మహిళలను చేరుకొని, తమ జీవితములకు ఒక ఉద్దేశ్యమును కలిగియుండి అర్ధవంతముగా జీవించుటకు వారికి సహాయపడ్డారు.


డబ్ల్యుఎఫ్‌ఎంఎస్ అందించిన ఆర్థిక సహాయంతో ఆమె ఒక బాలికల పాఠశాలను మరియు లక్నోలో ఒక మహిళా కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాల ఆసియా ఖండములోనే మహిళల కొరకు ఏర్పరచబడిన క్రైస్తవ కళాశాలలలో మొదటిది. కేవలం జ్ఞానమును సంపాదించుటకు మాత్రమే కాకుండా, వారి ప్రభువుకు మరియు సమాజమునకు వారు సేవ చేయవలెననే దృక్పథంతో బాలికలకు విద్య అందించబడింది. వారు ఆత్మీయముగా ఎదుగుట కొరకు ఆదివారం సాయంత్రం ప్రార్థన కూడికలు జరిగేవి. ప్రజల ఆత్మీయ కన్నులు తెరుచుటయే  కాక, నైతిక విలువలను కూడా వారిలో పెంపొందిస్తూ 31 సంll ల పాటు లక్నోలో నిర్విరామంగా సేవ చేసిన పిమ్మట, ఆరు పదుల వయసులో తన ప్రభువు నందు విశ్రమించారు ఇసాబెల్లా థోబర్న్.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, 'మనము ఈ భూమిపై ఉన్నది సేవ చేయుటకే గానీ సేవ చేయించుకొనుటకు కాదు' అని మీరు గ్రహించారా? 

ప్రార్థన :

"ప్రభువా, ఇతరుల భౌతిక, నైతిక మరియు ఆత్మీయ అవసరతలను సంధించునట్లు నన్ను బలపరచుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jul 26, 2022

    Iris Paul | ఐరిస్ పాల్

    ఐరిస్ పాల్   గారి జీవిత చరిత్ర



    • జననం: 1945
    • స్వస్థలం: తమిళనాడు
    • దేశం: భారతదేశం
    • దర్శన స్థలము: ఒరిస్సా, భారతదేశం


    ఐరిస్ గ్రేస్ రాజకుమారి పాల్ ఒక భారతీయ మిషనరీ. ఆమె ‘రీచింగ్ హ్యాండ్ సొసైటీ’ క్రింద ఒరిస్సాలోని బోండో తెగల మధ్య పరిచర్య చేయుటకు సమర్పణ కలిగియున్నవారు. ఒక సంపన్న క్రైస్తవ కుటుంబములో జన్మించిన ఐరిస్, తిరుగుబాటు ధోరణి మరియు తల బిరుసుతనం కలిగిన బాలికగా ఉండేవారు. అయితే, తన తల్లిదండ్రుల యొక్క భక్తి  శ్రద్ధలు కలిగిన జీవితము ద్వారా ఎంతగానో ప్రభావితులైన ఆమె, చివరికి తన హృదయమును యేసు క్రీస్తు ప్రభునకు సమర్పించారు. కళాశాలలో చదువుకుంటున్న రోజులలో ఆమె ‘యూనియన్ ఆఫ్ ఇవాంజెలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా’ (యు.ఇ.ఎస్.ఐ.) యొక్క పరిచర్యలో చురుకుగా పాల్గొన్నారు. పిమ్మట ఆమె తమిళనాడులో తన వైద్యశాస్త్ర విద్యాభ్యాసమును బంగారు పతకంతో ముగించారు.


    ఆల్బర్ట్ ష్వీట్జెర్ అనే మిషనరీ ఆఫ్రికాలో జరిగించిన మిషనరీ పరిచర్య ద్వారా ప్రేరణ పొందిన ఐరిస్, తాను కూడా దేవుని సేవ చేయుటకు అక్కడికి వెళ్ళాలని కోరుకున్నారు. అయితే, తన స్వదేశంలోనే ఆమెను వాడుకొనుటకు దేవుడు ఆమె పట్ల భిన్నమైన ప్రణాళికలను కలిగియున్నాడు. 1972వ సంll లో ఒరిస్సాలోని బోండో తెగల మధ్య పనిచేస్తున్న డాll ఆర్.ఎ.సి. పాల్ అనే యువ మిషనరీతో ఐరిస్ యొక్క వివాహం జరిగింది. అప్పటిలో బోండో తెగలవారితో బయటివారు అంతగా సంబంధాలు ఏర్పరచుకోలేదు. ఒక విధంగా వారు బయటి ప్రపంచమునకు మరుగైనవారుగా ఉన్నారని చెప్పవచ్చు. దారిద్య్రముతో నిండియున్న నిరక్షరాస్యులైన ఆ ప్రజలలో మరణాల రేటు అధికముగా ఉండేది. అటువంటి పరిస్థితులలో తన భర్తతో కలిసి ఒరిస్సాలోని మల్కన్‌గిరికి వెళ్ళిన ఐరిస్, వెనువెంటనే గిరిజన ప్రజలకు చికిత్స చేయుట కొరకు ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించారు. అంతేకాకుండా ఆమె తన భర్తతో కలిసి వైద్య శిబిరాలను కూడా నిర్వహించారు. అదే సమయంలో ఆమె గిరిజనులకు సువార్తను కూడా తెలియపరిచేవారు. క్రమక్రమంగా యేసుక్రీస్తులో సత్యమును కనుగొన్న వేలాది మంది బోండో ప్రజలు, ఆయనను తమ రక్షకునిగా అంగీకరించారు.


    ప్రారంభ సంవత్సరాలలో అనారోగ్యం, ప్రమాదాలు, నిరాశాజనకమైన పరిస్థితులు, తీవ్రముగా కృంగిపోయిన సందర్భములు మరియు ఎంతో బాధను అనుభవించినప్పటికీ, ప్రభువు మీదనే వారి దృష్టిని నిలిపిన ఆ మిషనరీ దంపతులు, నాగటి మీద నుండి వారి చేతులను ఎన్నడూ వెనుకకు తీయలేదు. 1986వ సంll లో ఆమె భర్త చిన్న వయస్సులోనే మరణించినప్పటికీ, ఆమె ఒరిస్సాలోని మారుమూల గ్రామాలలో తన సేవను కొనసాగించారు. ఆమె అనేక మంది అనాథ పిల్లలకు తల్లిగాను మరియు అక్రమమునకు గురికాకుండా అనేక మంది యువతులను కాపాడినవారిగాను ఉన్నారు. అంతేకాకుండా, ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించుటకును మరియు గిరిజన ప్రజలకు సమగ్ర అభివృద్ధిని చేకూర్చుటకును పనిచేసే ‘రీచింగ్ హ్యాండ్ సొసైటీ’ అనే సంస్థను కూడా ఆమె స్థాపించారు. గిరిజనుల జీవితములలో భౌతికపరమైన మరియు ఆత్మీయపరమైన మార్పును తెచ్చుటకు తన కుమారుడైన రెమో పాల్ మరియు అతని భార్య డాll సూసన్ రెమో పాల్‌లతో కలిసి ఎంతగానో కృషి చేస్తున్న ఐరిస్ పాల్, ఈ నాటికీ దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నారు. 


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ సమస్యలు మరియు కష్టతరమైన పరిస్థితుల కంటే గొప్పవాడైన ప్రభువుపై మీ కనుదృష్టిని నిలుపుతున్నారా? 


    ప్రార్థన :

    "దేవా నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి. నేను నీ శరణుజొచ్చియున్నాను. ఆమేన్!"  

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Nov 16, 2021

    Idi Shubhodayam | ఇది శుభోదయం | Telugu Christmas song

    Idi Shubhodayam | ఇది శుభోదయం | Telugu Christmas song

    ఇది శుభోదయం – క్రీస్తు జన్మదినం
    ఇది లోక కళ్యాణం మేరి పుణ్యదినం – (2) 

    రాజులనేలే రారాజు వెలసె పశువుల పాకలో 
    పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో 
    భయము లేదు మనకిలలో 
    జయము జయము జయమహో ||ఇది|| 

    గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయ భక్తితో 
    పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో 
    జయనాదమే ఈ భువిలో 
    ప్రతిధ్వనించెను ఆ దివిలో         ||ఇది||

    Idi Shubhodayam – Kreesthu Janmadinam
    Idi Loka Kalyaanam
    Mary Punyadinam – (2)

    Raajulanele Raaraaju Velase Pashuvula Paakalo
    Paapula Paalita Rakshakudu Navvenu Thalli Kougililo
    Bhayamu Ledu Manakilalo
    Jayamu Jayamu Jayamaho          ||Idi||

    Gollalu Gnaanulu Aanaadu Pranamilliri Bhaya Bhakthitho
    Pillalu Peddalu Eenaadu Poojinchiri Prema Geethitho
    Jayanaadame Ee Bhuvilo
    Prathidhwaninchenu Aa Divilo     ||Idi||


  • WhatsApp
  • Oct 4, 2021

    Ion Keith-Falconer | ఐయాన్ కీత్-ఫాల్కనర్

    ఐయాన్ కీత్-ఫాల్కనర్ | Ion Keith-Falconer




    • జననం: 05-07-1856
    • మహిమ ప్రవేశం: 07-06-1887
    • స్వదేశం: స్కాట్లాండు
    • దర్శనము: ఇంగ్లాండు; యెమెన్

     “యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.” (విలాపవాక్యములు 3:27) అనేది ఐయాన్ కీత్-ఫాల్కనర్‌ని ప్రభావితం చేసిన ఒక వచనం మరియు అది అతని జీవితములో కూడా స్పష్టముగా ప్రతిబింబిస్తుంది. సంపన్నమైన ఒక గొప్ప కుటుంబములో జన్మించిన ఐయాన్ ఆదేశిస్తే చాలు, కావలసినవన్నీ అతనికి సమకూర్చబడేవి. అయినప్పటికీ, తన యవ్వనంలో క్రీస్తు కాడిని మోయుటకు అతను ఎంచుకున్నారు.

     ఐయాన్ మంచి ఆటగాడు మరియు సైకిల్ పోటీలలో గొప్ప విజేతగా నిలిచినవారు. అంతేకాదు, చదువులో కూడా అత్యుత్తమ విద్యార్థిగా ఉన్న అతను గ్రీకు, హెబ్రీ వంటి ఐదు భాషలలో నిష్ణాతులు. కళాశాల చదువు పూర్తయిన వెంటనే అతను 1873వ సంll లో క్లేర్ కాలేజీలో పురాతన భాషలైన సెమిటిక్ భాషలను బోధించేవానిగా నియమించబడ్డారు. కానీ, అతని జ్ఞానం, కీర్తి మరియు సంపద ఏదీకూడా దేవునికి సేవ చేయాలని అతని హృదయాంతరంగాలలో ఉన్న కోరికను అణచివేయలేకపోయాయి.

     కళాశాలలో పని చేస్తున్న సమయంలోనే అతను కేంబ్రిడ్జ్ మురికివాడలలో సువార్త సేవ చేయడం ప్రారంభించారు. అతను మురికివాడలలో నివసించే వారి కొరకు బైబిలు తరగతులను మరియు ఆదివారపు బైబిలు పాఠశాలను (సండే స్కూల్) నిర్వహించారు. తీవ్రతతో కూడుకొనియుండే అతని ప్రసంగాలు దొంగలు మరియు హంతకుల వంటి అనేకమంది దుర్మార్గుల హృదయాలను కూడా మార్చివేశాయి. అంతేకాకుండా, తన స్వంత ధనముతో మురికివాడలలోని పిల్లల కొరకు ఒక ‘ర్యాగ్డ్ స్కూల్’ ను (పేద పిల్లల కొరకు ఏర్పాటుచేసే ప్రాథమిక పాఠశాల) కూడా స్థాపించారు ఐయాన్. అదే సమయంలో, సైక్లింగ్‌పై కూడా తన ఆసక్తిని కోల్పోని అతను, 1878వ సంll లో ప్రపంచ సైకిల్ పోటీలలో విజేతగా నిలిచారు.

     ఉపాధ్యాయుడిగా వృత్తిని కొనసాగిస్తున్నప్పుడు, తాను ముస్లింలకు సువార్త చెప్పలేకపోవడం అతనికి అరబిక్ భాషపై ఆసక్తిని రేకెత్తించింది. సహజముగానే భాషావేత్త అయిన ఐయాన్, 1881వ సంll లో అరబిక్ భాషను నేర్చుకొనుటకుగాను ఈజిప్టుకు వెళ్ళారు. అక్కడ అతను ముస్లింల మధ్యలో సేవ చేస్తున్న స్కాట్లాండుకు చెందిన మిషనరీయైన జాన్ హాగ్‌ను కలవడం జరిగింది. యెమెన్‌లో క్రైస్తవ మతమునకు మారిన యవ్వనస్థులు ఇస్లాం మతానికి తిరిగి వెళుతున్నారని అక్కడ అతను విన్నారు. కాగా, జాన్ హాగ్ ప్రోత్సాహంతో ఐయాన్ యెమెన్‌లోని ముస్లింల మధ్య పరిచర్య చేసి, క్రీస్తులో వారిని స్థిరపరచుటకు తనను తాను సమర్పించుకున్నారు.

     తన భార్యతో కలిసి 1885వ సంll లో యెమెన్‌లోని ఏడెన్‌లో ఆరు నెలలు పర్యటించి, వ్యక్తిగతముగా ప్రజలను సంధించి సువార్తను ప్రకటించారు ఐయాన్. అతను 1886వ సంll లో తిరిగి వచ్చి, యెమెన్ అంతటా సువార్త ప్రచారాల కొరకు ఒక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. శ్రద్ధాసక్తులు కలిగిన ఈ బోధకుడు సువార్త ప్రకటనలోను, ఏడెన్‌లో మిషన్ కేంద్రమును నిర్మించుటలోను పూర్తిగా నిమగ్నమవ్వగా, పలుమార్లు మలేరియా బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. జ్వరాలతో బాధింపబడి చివరికి 1887వ సంll జూన్ మాసం 7వ తారీఖున నిద్రించుచున్న సమయంలో పరమ విశ్రాంతిలోకి ప్రవేశించారు ఐయాన్ కీత్-ఫాల్కనర్.

    ప్రియమైనవారలారా, మీ జ్ఞానము మరియు కీర్తిసంపదలు క్రీస్తు పట్ల మీ తీర్మానమును అణచివేయునట్లు మీరు అనుమతిస్తున్నారా?

    "ప్రభువా, మీ కాడిని మోసి, మీ యొద్ద నేర్చుకొనుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 1, 2021

    Isaac Mason | ఐజాక్ మాసన్

      ఐజాక్ మాసన్ | Isaac Mason 


    © quakerstrongrooms


    • జననం: 1870
    • మహిమ ప్రవేశం: 1939
    • స్వస్థలం: లీడ్స్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: చైనా


    జార్జ్ ఫాక్స్ ప్రారంభించిన ‘రిలిజియస్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్’ అనే సంస్థ యొక్క సభ్యుడు ఐజాక్ మాసన్. యవ్వనదశలో ఉన్నప్పుడు ఒక తలబిరుసు వ్యక్తిగా ఉండే ఐజాక్‌తో సంయమనం కలిగియుండటం కష్టమైన విషయముగా ఉండేది. అయితే కరోలిన్ సౌతాల్ వంటి  ‘రిలిజియస్ సొసైటీ ఆఫ్ ఫ్రెండ్స్’ లోని తన తోటి సభ్యుల ప్రభావంతో అతను దీనత్వము కలిగిన నమ్మకమైన వ్యక్తిగా మారారు. అతను ఇంగ్లాండులోని లీడ్స్‌లో ఇనుప లోహమును అచ్చుపోయుటకు అచ్చులు తయారుచేసేవానిగా (ఐరన్ మోల్డర్‌) పనిచేస్తూ, సమయము దొరికినప్పుడు తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకునేవారు. కరోలిన్ సౌతాల్ మరియు మరికొంతమంది స్ఫూర్తితో ఐజాక్ మాసన్ ‘ఫ్రెండ్స్ ఫారిన్ మిషనరీ అసోసియేషన్’ (ఎఫ్.ఎఫ్.ఎమ్.ఎ.) తో కలిసి చైనాలో పరిచర్య జరిగించుటకు తనను సమర్పించుకున్నారు.


    ఎస్తేర్ బెక్‌విత్‌తో అతనికి వివాహం జరిగిన తరువాత, ఆ దంపతులిరువురూ 1894వ సంll లో చైనాకు వెళ్ళారు. అక్కడ వారు చెక్వాన్ ప్రావిన్స్‌లో స్థిరపడి, షె హాంగ్ మరియు సుయినింగ్‌ ప్రాంతాలలో మిషనరీ సేవకు తొలి పునాదులను వేశారు. పరిచర్యలోకి వచ్చిన కొద్ది సంవత్సరాలలోనే విదేశీయులకు వ్యతిరేకముగా చెలరేగిన బాక్సర్ తిరుగుబాటు యొక్క అల్లర్లను మాసన్ ఎదుర్కొనవలసి వచ్చింది. ఆ సమయంలో చాలా మంది మిషనరీలు తమ మిషన్ స్థావరాల నుండి పారిపోయి, తాత్కాలికంగా ఇతర దేశాలలో ఆశ్రయం పొందారు. అయితే మాసన్ మరియు అతని భార్య ఎస్తేర్ మాత్రం భయంకరమైన బాక్సర్ తిరుగుబాటును మాత్రమే కాదు, జిన్హాయ్ విప్లవాన్ని కూడా సహనంతో ఎదుర్కొన్నారు.


    చైనా భాషను శీఘ్రముగా నేర్చుకొనిన మాసన్, సువార్తను ప్రకటించుటకై ఎంతగానో ప్రయాణించారు. చైనా ముస్లింల జీవితాలపై ప్రత్యేకమైన ఆసక్తిని కలిగియున్న అతను, అతని ప్రయాణాలలో వారి జీవితములను గురించిన సమాచారమును వివరముగా సమకూర్చి భద్రపరిచారు. అది పరిచర్యకు సంసిద్ధమగుటకు తదుపరి మిషనరీలకు ముఖ్యమైన ఉపకరణముగా మారింది. అతను అనేక క్రైస్తవ రచనలను చైనా భాషలోకి కన్ఫ్యూషియన్ నైతిక శైలిని అనుసరించి అనువదించారు. క్రైస్తవ విలువలు గుప్తమైయున్న  షేక్స్పియర్ కథలను తీసుకొని, వాటిలో కరుణ, క్షమాపణ మరియు న్యాయం వంటి క్రైస్తవ నైతిక విలువలకు సంబంధించిన మూలాంశములను నొక్కి చూపుతూ ఆ కథలను తిరిగి వ్రాశారు ఐజాక్. ఆ విధముగా పరోక్షముగా క్రైస్తవ ఆలోచనలను ప్రచారం చేసే విధానం చైనా ప్రజల జీవితాలలోకి ఫలప్రదమైన బాటను వేసింది.


    పశ్చిమ చైనాలో 22 సంవత్సరాల పాటు ఉన్న మాసన్, తరువాత షాంఘై వెళ్ళి తన అనువాద రచనలను ప్రచురించడంపై దృష్టి పెట్టారు. అతను డజన్ల కొద్దీ క్రైస్తవ పుస్తకాలను మరియు కరపత్రాలను ప్రచురించారు. అంతేకాకుండా, చైనా భాషలో బైబిలు యొక్క నిఘంటువును సంకలనం చేయడంలో కూడా సహకారమందించారు.


    మిషనరీగాను మరియు అనువాదకుడిగాను ఈ లోకములో ఒక మనోహరమైన ప్రయాణమును సాగించిన ఐజాక్ మాసన్, 1939వ సంll లో మహిమనందు ప్రవేశించారు. 


    ప్రియమైనవారలారా, మీరు చేసే సేవలో ఈ లోకం క్రీస్తు ప్రేమను చూడగలుగుతుందా?


    "ప్రభువా, దయ, క్షమాపణ మరియు న్యాయం వంటి క్రైస్తవ విలువలను సరైన విధముగా సమాజమునకు బోధించుటకు నాకు జ్ఞానమును దయచేయుము. ఆమేన్!"

     దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Sep 30, 2021

    Irene Eleanor Verita Petrie | ఐరీన్ ఎలియనోర్ వెరిటా పెట్రీ

    ఐరీన్ ఎలియనోర్ వెరిటా పెట్రీ  | Irene Eleanor Verita Petrie




    • జననం: అక్టోబరు 1864
    • మహిమ ప్రవేశం: 06-08-1897
    • స్వస్థలం: కెన్సింగ్టన్ పార్క్
    • దేశం: యునైటెడ్ కింగ్‌డమ్
    • దర్శన స్థలము: పూర్వపు పంజాబ్ మరియు కాశ్మీర్

    ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన కాశ్మీర్ ఎల్లప్పుడూ వేసవిలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. కానీ శీతాకాలంలో మాత్రం అది నివసించుటకు ఈ భూమిపైని అత్యంత కఠినమైన ప్రదేశాలలో ఒకటి అన్నట్లు ఉంటుంది. ఆ సమయంలో సంపన్నులైనవారు మనుగడ కొరకు తాత్కాలికంగా మైదాన ప్రాంతములకు వలస వెళుతారు. అక్కడే మిగిలిపోయినవారు చివరికి అనారోగ్యంతో మరణించేవారు. ఆ విధంగానే 1894వ సంll శీతాకాలంలో కూడా అనేకమంది ప్రజలు మైదానాల వైపు వెళుతుండగా ఒక యువతి మాత్రం అక్కడే ఉండిపోయిన వారికి సహాయం చేయుటకు కాశ్మీర్ దిశగా పయనిస్తోంది. ఆమె పేరు ఐరీన్ ఎలియనోర్ వెరిటా పెట్రీ.

    ఐరీన్ కేవలం 2 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఆమె తల్లి ఆమెను దేవుని సేవకు సమర్పించారు. ఎంతో చురుకుగా మరియు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె సహజముగానే మంచి ప్రతిభావంతురాలు. ఆమె వారి నగరంలో ఒక నిష్ణాతురాలైన గాయని కూడా. లోకానుసారముగా తన జీవితమును ఆస్వాదించుటకు ఆమెకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆమె వాటి వైపు మొగ్గు చూపక ఒకరోజున తాను మిషనరీ అవ్వాలనే ఆలోచనను తనలో అభివృద్ధిపరచుకున్నారు. కాగా ఆమె ‘చర్చి మిషనరీ సొసైటీ’ లో చేరగా, ఆ సంస్థ ఆమెను భారతదేశంలో సేవ చేయుటకు నియమించింది.

    1893వ సంll లో లాహోర్‌కు చేరుకున్న ఐరీన్, అక్కడి ప్రజల హృదయ విదారక స్థితిని చూచి విలపించారు. మహిళా వైద్య సిబ్బంది లేకపోవడంతో అనేక మంది యువతులు మరణిస్తున్నారు. ఈ లోకంలో కాకపోయినా, కనీసం నిత్యరాజ్యంలో వారు కలిగియుండే జీవితమును గురించి అయినా ఆ ప్రజలకు ఒక నిరీక్షణను ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నారు. కొంతకాలం పాటు లాహోర్‌లోని ఒక స్వచ్ఛంద గృహంలో సేవలందించిన తరువాత, 1894వ సంll లో ఆమె శ్రీనగర్‌కు వెళ్ళారు. ఒక శిక్షణ పొందిన నర్సు కావడంతో ఆమె తానే స్వచ్చందంగా మరికొంతమందితో కలిసి ఇంటింటికీ వెళ్ళి మహిళలకు వైద్య సేవలను అందించి, అనేక మంది ప్రాణాలను కాపాడారు. వారిని ఉత్సాహపరిచేందుకు ఆమె పాటలు పాడి, బైబిలు కథలను చెప్పేవారు. ఆమె రోగులు ఆమెకు స్నేహితులు అయ్యారు మరియు క్రమక్రమంగా దేవుని బిడ్డలు కూడా అయ్యారు.

    శ్రీనగర్‌లోని బాలుర పాఠశాలలో కూడా చురుకుగా సేవలందించారు ఐరీన్. పాఠశాలలో నిధుల కొరత ఏర్పడినప్పుడు, పాఠశాలను నడిపించుటకు కావలసిన ధన సహాయము కొరకు ఆమె చిత్రాలను గీసి విక్రయించారు. అక్కడి వాతావరణ పరిస్థితులు కఠినమైనవి అయినప్పటికీ, ఆమె తన ఆరోగ్యమును ఏనాడూ లెక్కచేయకుండా, కాశ్మీరీలు మరియు ఆఫ్ఘన్‌ల శ్రేయస్సు కొరకు అంకితభావంతో పనిచేశారు. లేహ్‌ ప్రాంతమునకు తాను చేసిన ఒక ప్రయాణంలో టైఫాయిడ్‌ బారిన పడి అనారోగ్యానికి గురైన ఐరీన్ పెట్రీ, 33 సంll ల లేత ప్రాయములోనే ఈ లోకము విడిచి తన ప్రభువును చేరుకున్నారు.

    ప్రియమైనవారలారా, ఈ లోకములో నిరాశానిస్పృహలతో ఉన్న ప్రజలకు పరమ నిరీక్షణను అందించే సాధనముగా మీరు ఉన్నారా?

    "ప్రభువా, ద్వేషమున్న చోట ప్రేమను, నిరాశ ఉన్న చోట నిరీక్షణను మరియు దుఃఖమున్న చోట సంతోషమును నేను విత్తుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Sep 22, 2021

    Isobel Miller Kuhn | ఇసాబెల్ మిల్లర్

    Isobel Miller Kuhn | ఇసాబెల్ మిల్లర్



    • జననం: 17/12/1901
    • మహిమ ప్రవేశం: 20/03/1957
    • స్వస్థలం: ఒంటారియో
    • దేశం: కెనడా
    • దర్శన స్థలము: చైనా
    మూఢనమ్మకాలలో విశ్వాసముంచే వారు మాత్రమే బైబిలును నమ్ముతారని తన ఉపాధ్యాయులచే ప్రభావితం చేయబడిన ఇసాబెల్ మిల్లర్ , తన తల్లిదండ్రుల విశ్వాసాన్ని తృణీకరించి , ప్రాపంచిక వ్యవహారాలలో ఆసక్తి చూపించారు . అయితే ఆమె ప్రధానం చేయబడిన వ్యక్తి ఆమెను విడిచిపెట్టినందుకుగాను కృంగిపోయి , ఒక రాత్రి ఆత్మహత్య చేసుకొనబోవుచున్న సమయంలో దేవుని కృప ఆమెను కనుగొంది . ఆ రాత్రి ఆమె ప్రార్థించి , తన జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకున్నారు .

    బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు . ఆ సమయంలోనే మిషనరీగా సేవ చేయుటకై చైనా ఇన్లాండ్ మిషన్లో చేరాలనే కోరిక ఆమెలో కలిగింది . చైనాలోని ' లిసు ' ప్రజలకు సువార్తను అందించుటకు సేవకులు కావలెనని జె . ఓ . ఫ్రేజర్ చేసిన విన్నపమును విన్నప్పుడు ఆ కోరిక మరింతగా బలపడింది . తదనంతరం పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడిన వారై లిసు ప్రజలకు క్రీస్తును ప్రకటించుటకు చైనా వెళ్ళవలెనని ఇసాబెల్ నిర్ణయించుకున్నారు .

    1928 వ సం ll లో చైనాకు వచ్చిన ఆమె , ప్రారంభ సంవత్సరాలను చైనా భాష నేర్చుకొనుటకు వెచ్చించారు . జాన్ కుహ్నతో ఆమెకు వివాహం జరిగిన తరువాత , కుటుంబముగా వారు చెంగి యాంగ్ ప్రాంతమునకు వెళ్ళగా , అక్కడ దేవుడు " స్వీయమును సిలువ వేయుట " అనే పాఠములో ఇసాబెల్ కు శిక్షణ ఇచ్చాడు . ఆమె తమ ఇంటిలోనికి స్థానిక చైనా మహిళలను స్వాగతించి , వారికి సువార్తను అందించారు . తొలి మరియు యోంగ్ పింగ్ ప్రాంతములలో కూడా సేవ చేసిన ఈ మిషనరీ దంపతులు , 1934 వ సం ll లో లిసులాండకు వెళ్ళారు . క్రైస్తవ మతం యొక్క ప్రాథమిక విషయాలలో ప్రజలకు శిక్షణనిచ్చుటకు వారు లిసు గ్రామాలలో బైబిలు పాఠశాలలను ప్రారంభించారు . ఎన్నో సవాళ్ళతో కూడిన పరిస్థితులు ఎదురైనప్పటికీ , లిసు ప్రజల మధ్య అద్భుతమైన సేవా ఫలమును ఇసాబెల్ చూడగలిగారు . ఆ ప్రజలలో కొందరు మిషనరీలుగా కూడా మారి ఆత్మీయ జీవితములో మరింత ముందుకు సాగిపోయారు .

    1950 వ సం || లో కమ్యూనిస్టులు చైనాను స్వాధీనం చేసుకున్నప్పుడు , ఇసాబెల్ తన కుటుంబముతో కలిసి చైనాను విడిచి థాయిలాండ్ వెళ్ళవలసి వచ్చింది . ఉత్తర థాయ్ లాండ్ లో స్థిరపడిన లిసు ప్రజల మధ్య సేవ చేయవలెనన్న దేవుని పిలుపుకు 50 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె చురుకుగా స్పందించారు . అందుకొరకు ఆ వయస్సులో ఒక క్రొత్త భాషను మరియు క్రొత్త సంస్కృతిని నేర్చుకొనవలెనని ఆమెకు బాగుగా తెలుసు . అయినప్పటికీ ఆమె వెనుకంజ వేయలేదు . ఎల్లప్పుడూ దేవునిని ప్రథమ స్థానములో ఉంచే ఆమె , సులభమైన పనితో సరిపెట్టుకొని విశ్రాంతి తీసుకొనుట కంటే క్రీస్తు కొరకు కష్టములను భరించుటకే ఎంచుకునేవారు . దేవునికి విధేయత చూపించుటలో ఎన్నడూ విఫలమవ్వని తన జీవితమును విధేయతకు మాదిరిగా కనుపరచిన ఇసాబెల్ , 1957 వ సం ll మార్చి 20 వ తారీఖున తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకమును విడిచి వెళ్ళారు . ప్రియమైనవారలారా , మీరు మీ స్వీయమునకును , దాని ఇచ్ఛలకును సిలువ వేయబడితిరా ?
     

    " ప్రభువా , స్వలాభము కొరకు కాక మీ కొరకే నేను జీవించునట్లు నాకు సహాయము చేయుము . ఆమేన్ ! " 

  • WhatsApp
  • Sep 15, 2021

    Ingrid kowski | ఇంగ్రిడ్ కోచ్ స్కీ

    ఇంగ్రిడ్ కోచ్ స్కీ | Ingrid kowski

    • జననం : -
    • మరణం : 15/03/1995
    • స్వదేశం : జర్మనీ
    • దర్శన స్థలం : భారత దేశం

    " మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను . క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి . " అని ఫిలిప్పీ 2 : 4,5 లో చెప్పబడిన వాక్యమునకు ఇంగ్రిడ్ కోవ్ స్కీ యొక్క జీవితం ఒక చక్కటి ఉదాహరణ . అనాథలు మరియు నిరాశ్రయులైన పిల్లలను పరిరక్షించుటకు తమిళనాడులో క్రిస్టియన్ మిషన్ సర్వీస్ ( సిఎంఎస్ ) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన డా | l హోర్బ్స్ కోవ్ స్కీ యొక్క జీవిత భాగస్వామి ఈ ఇంగ్రిడ్ . ఇతరుల అవసరతలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకునే వ్యక్తిత్వం కలిగిన ఆమె , ఆ అనాథ పిల్లలకు ఒక తల్లిగా ఉండుటకు తన జీవితాన్ని అంకితం చేశారు . షరతులు లేని ప్రేమతో ఆమె పిల్లలను చూసుకున్నారు మరియు వారికి కావలసినవి అందించారు అనునది ఆమె యొక్క క్రియలలో స్పష్టపరచబడేది . అనేక మంది పిల్లలకు ఆమె ప్రేమాప్యాయతలు చూపిన తల్లి . ఆమె వారినందరినీ తన స్వంత బిడ్డలలానే ప్రేమించేవారు . ఒకసారి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పిల్లవానిని ఆదరించుటకు ఆమె వెళ్లి వాని ప్రక్కన కూర్చున్నారు . ఆ పిల్లవాడు వాంతులు చేసికొనగా ఆమె ఆ వాంతిని తన స్వహస్తాలతో తుడిచి , ఆ పిల్లవానిని శుభ్రపరచునట్లు దేవుని ప్రేమ ఆమెను బలవంతపరచింది . పిల్లల పట్ల మిక్కుటమైన దయను కనుపరిచే అటువంటి అనేకమైన ఆమె చర్యలు క్రీస్తు ప్రేమతో పిల్లలకు పరిచర్య చేయుటకు ఆమె తోటి ఉద్యోగులను కూడా ప్రోత్సహించాయి . తన భర్తతో కలిసి పేద పిల్లల ఆత్మీయ అభివృద్ధి కొరకు పలు సండే స్కూళ్లను ( ఆదివారపు పాఠశాలలను ) ఏర్పాటు చేయడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు . వారు పిల్లలకు ఆహారం మరియు దుస్తులు అందించుటయే కాక , స్థానిక పాఠశాలల ద్వారా వారికి విద్యను కూడా అందించారు . ఉదార స్వభావం కలిగిన ఇంగ్రిడ్ , పిల్లల సంక్షేమం కొరకు తన ఆస్తులను ఇవ్వడమే కాదు , ఆమె యొక్క విలువైన సమయాన్ని మరియు ఎనలేని శక్తిని కూడా వెచ్చించారు . సిఎంఎస్ సంస్థ యొక్క నిర్వహణలో ఆమె పైకి అంత క్రియాశీలకంగా కనబడకపోయినప్పటికీ , తన భర్తకు ఎంతో బలమైన సహకారిగా నిలిచారు . భారతదేశంలోని అనేక అనాథాశ్రమాలకు మార్గదర్శకముగా నిలిచే సంస్థ ఈ నాటికీ తన సేవలందిస్తుంది . ' మథర్ ఆఫ్ సిఎంఎస్ ' అనగా ' సిఎంఎస్ యొక్క తల్లి ' గా గుర్తుండిపోయిన ఇంగ్రిడ్ కోచ్ స్కీ , చివరి వరకూ తన పిలుపులో నమ్మకముగా కొనసాగినవారై 1995 వ సం ll లో ఇదే రోజున , అనగా మార్చి 15 న తన పరలోకపు వాసస్థలమునకు పయనమయ్యారు . ప్రియమైనవారలారా , చిన్న పిల్లలను క్రీస్తు వద్దకు నడిపించుటకు మీరు ఏవిధముగా సేవ చేసెదరు ?
     

    " ప్రభువా , నేను ఇతరులకు , మరి ముఖ్యముగా చిన్నపిల్లలకు సేవచేసి , వారిని మీ యొద్దకు నడిపించునట్లు మీ ప్రేమతో నా హృదయమును నింపుము . ఆమేన్ ! " 

  • WhatsApp
  • Sep 6, 2021

    William Buck Bagby | విలియం బక్ బాగ్బీ

    విలియం బక్ బాగ్బీ | William Buck Bagby

    • జననం: 05-011-1855
    • మహిమ ప్రవేశం: 05-08-1939
    • స్వస్థలం: కొరియెల్ కౌంటీ
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: బ్రెజిల్


     1884వ సంll లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో ఒక మిషనరీ దంపతులు కాథలిక్కుల నుండి తీవ్రమైన వ్యతిరేకత నెలకొనియున్న పరిస్థితుల మధ్య దేవుని పరిచర్యను ప్రారంభించారు. ఆ మిషనరీలకు అది ఎంతో నిరాశాజనకమైన ఆరంభముగా ఉంది. ఏలయనగా వారు నిర్వహించే ఆరాధనా కూడికలకు ఎవరూ వచ్చేవారుకాదు. కావున వారు ఆలయమునకు వెలుపల వాయిద్యములను వాయించుచూ పాడటం ప్రారంభించారు. అది చూచిన కొంతమంది ఆసక్తిగలవారు అక్కడ గుమిగూడడం ప్రారంభించినప్పుడు కొంతమంది గుంపుగా వచ్చి దాడిచేసి, అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. వారిలో ఒకరు బోధకునిపై రాయి విసరగా అతని తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయారు. కానీ కొన్ని నిమిషముల తరువాత అతనికి స్పృహ వచ్చినప్పుడు అతను తిరిగి లేచి నిలబడి బోధించడం కొనసాగించారు. ఆ బోధకుడు మరెవరో కాదు, బ్రెజిల్‌లో ప్రారంభక బాప్తిస్టు మిషనరీలలో ఒకరిగాను మార్గదర్శకులుగాను నిలిచిన విలియం బక్ బాగ్బీ.


     వాకో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విలియం, పిమ్మట ఒక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. యవ్వనదశలో ఉన్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీల కొరకు ఉన్న అవసరతను గురించి వినిన అతనిలో అందుకొరకైన భారం కలిగింది. అతను అన్నే లూథర్‌ను వివాహం చేసుకున్నప్పుడు దక్షిణ అమెరికాలో మిషనరీ సేవ పట్ల అతను కలిగియున్న ఆసక్తి కార్యరూపం దాల్చుటకు పునాదులు పడ్డాయి. అన్నే కూడా మిషనరీ పరిచర్య పట్ల సమర్పణను కలిగియున్నవారు. మరి ముఖ్యముగా దక్షిణ అమెరికాలో సేవ పట్ల అతని వలెనే ఆసక్తిని కలిగియున్నారు. కాగా, మరికొంత మంది ప్రోత్సాహంతో 1880వ సంll లో రియో డి జనీరోలో అడుగుపెట్టారు బాగ్బీ దంపతులు. తరువాత అక్కడ ప్రభుత్వాన్ని నడపడంలో కాథలిక్ సంఘం పాలుపంచుకుంది. అక్కడి కాథలిక్కులు ప్రొటెస్టెంట్ క్రైస్తవుల పట్ల అసహనమును కలిగియుండేవారు. కాగా, పరిచర్య యొక్క ప్రారంభ దశలలో బాగ్బీ అక్కడ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అతను అనేకమార్లు శారీరకముగా దాడి చేయబడ్డారు కూడా. అయినప్పటికీ, ధైర్యవంతుడైన ఈ మిషనరీ కష్టాలు శ్రమల మధ్యలో మరింతగా బలమొందారు. త్వరలోనే, రెండు సంవత్సరాల కాలంలో రియోలో రెండు బాప్తిస్టు సంఘములు ఏర్పరచబడ్డాయి.


     బాగ్బీ తన పరిచర్యను రియో సరిహద్దులను దాటి విస్తరింపచేశారు. అతను బ్రెజిల్ దేశమంతటా పర్యటించి, అన్ని ప్రధాన నగరాలలో క్రైస్తవ సంఘములను స్థాపించారు. బ్రెజిల్‌లో ప్రతిచోటా అతను స్థాపించిన సంఘములు, నిర్మించిన పాఠశాలలు, క్రీస్తు కొరకు అతను సంపాదించిన గొప్ప క్రైస్తవ నాయకులు మరియు వేలాది మంది విశ్వాసుల రూపంలో బాగ్బీ యొక్క పరిచర్య ప్రభావం కనిపిస్తుంది. అతని జీవిత భాగస్వామియైన అన్నే లూథర్ పరిచర్యలో కూడా అతనికి సరిసమానమైన భాగస్వామిగా ఉన్నారు. దేవుని ఆశీర్వాదముతో వారికి తొమ్మిది మంది సంతానము కలుగగా, వారిలో ఐదుగురు దక్షిణ అమెరికాకు మిషనరీలుగా తమ జీవితములను సమర్పించుకున్నారు.


     58 సంవత్సరాల పాటు ఎంతో తీవ్రముగా పరిచర్య జరిగించిన పిమ్మట, తన సేవా ఫలమైన 694 సంఘములను మరియు 53,000 మంది విశ్వాసులను విడిచిపెట్టి 1934వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు విలియం బక్ బాగ్బీ. 


    🚸 *ప్రియమైనవారలారా, కష్టాలు, శ్రమల మధ్యలో మరింతగా దేవునికి సేవ చేయుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, అననుకూల పరిస్థితుల దాడులకు నేను గురై పడిపోయిన ప్రతిసారీ తిరిగి మీ కొరకు నిలబడగలుగునట్లు నన్ను లేవనెత్తుము. ఆమేన్!"* 🛐


    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp