Search Here

Sep 15, 2021

Ingrid kowski | ఇంగ్రిడ్ కోచ్ స్కీ

ఇంగ్రిడ్ కోచ్ స్కీ | Ingrid kowski

  • జననం : -
  • మరణం : 15/03/1995
  • స్వదేశం : జర్మనీ
  • దర్శన స్థలం : భారత దేశం

" మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను . క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి . " అని ఫిలిప్పీ 2 : 4,5 లో చెప్పబడిన వాక్యమునకు ఇంగ్రిడ్ కోవ్ స్కీ యొక్క జీవితం ఒక చక్కటి ఉదాహరణ . అనాథలు మరియు నిరాశ్రయులైన పిల్లలను పరిరక్షించుటకు తమిళనాడులో క్రిస్టియన్ మిషన్ సర్వీస్ ( సిఎంఎస్ ) అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన డా | l హోర్బ్స్ కోవ్ స్కీ యొక్క జీవిత భాగస్వామి ఈ ఇంగ్రిడ్ . ఇతరుల అవసరతలను ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకునే వ్యక్తిత్వం కలిగిన ఆమె , ఆ అనాథ పిల్లలకు ఒక తల్లిగా ఉండుటకు తన జీవితాన్ని అంకితం చేశారు . షరతులు లేని ప్రేమతో ఆమె పిల్లలను చూసుకున్నారు మరియు వారికి కావలసినవి అందించారు అనునది ఆమె యొక్క క్రియలలో స్పష్టపరచబడేది . అనేక మంది పిల్లలకు ఆమె ప్రేమాప్యాయతలు చూపిన తల్లి . ఆమె వారినందరినీ తన స్వంత బిడ్డలలానే ప్రేమించేవారు . ఒకసారి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పిల్లవానిని ఆదరించుటకు ఆమె వెళ్లి వాని ప్రక్కన కూర్చున్నారు . ఆ పిల్లవాడు వాంతులు చేసికొనగా ఆమె ఆ వాంతిని తన స్వహస్తాలతో తుడిచి , ఆ పిల్లవానిని శుభ్రపరచునట్లు దేవుని ప్రేమ ఆమెను బలవంతపరచింది . పిల్లల పట్ల మిక్కుటమైన దయను కనుపరిచే అటువంటి అనేకమైన ఆమె చర్యలు క్రీస్తు ప్రేమతో పిల్లలకు పరిచర్య చేయుటకు ఆమె తోటి ఉద్యోగులను కూడా ప్రోత్సహించాయి . తన భర్తతో కలిసి పేద పిల్లల ఆత్మీయ అభివృద్ధి కొరకు పలు సండే స్కూళ్లను ( ఆదివారపు పాఠశాలలను ) ఏర్పాటు చేయడంలో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు . వారు పిల్లలకు ఆహారం మరియు దుస్తులు అందించుటయే కాక , స్థానిక పాఠశాలల ద్వారా వారికి విద్యను కూడా అందించారు . ఉదార స్వభావం కలిగిన ఇంగ్రిడ్ , పిల్లల సంక్షేమం కొరకు తన ఆస్తులను ఇవ్వడమే కాదు , ఆమె యొక్క విలువైన సమయాన్ని మరియు ఎనలేని శక్తిని కూడా వెచ్చించారు . సిఎంఎస్ సంస్థ యొక్క నిర్వహణలో ఆమె పైకి అంత క్రియాశీలకంగా కనబడకపోయినప్పటికీ , తన భర్తకు ఎంతో బలమైన సహకారిగా నిలిచారు . భారతదేశంలోని అనేక అనాథాశ్రమాలకు మార్గదర్శకముగా నిలిచే సంస్థ ఈ నాటికీ తన సేవలందిస్తుంది . ' మథర్ ఆఫ్ సిఎంఎస్ ' అనగా ' సిఎంఎస్ యొక్క తల్లి ' గా గుర్తుండిపోయిన ఇంగ్రిడ్ కోచ్ స్కీ , చివరి వరకూ తన పిలుపులో నమ్మకముగా కొనసాగినవారై 1995 వ సం ll లో ఇదే రోజున , అనగా మార్చి 15 న తన పరలోకపు వాసస్థలమునకు పయనమయ్యారు . ప్రియమైనవారలారా , చిన్న పిల్లలను క్రీస్తు వద్దకు నడిపించుటకు మీరు ఏవిధముగా సేవ చేసెదరు ?
 

" ప్రభువా , నేను ఇతరులకు , మరి ముఖ్యముగా చిన్నపిల్లలకు సేవచేసి , వారిని మీ యొద్దకు నడిపించునట్లు మీ ప్రేమతో నా హృదయమును నింపుము . ఆమేన్ ! " 

  • WhatsApp
  • No comments:

    Post a Comment