Isobel Miller Kuhn | ఇసాబెల్ మిల్లర్
మూఢనమ్మకాలలో విశ్వాసముంచే వారు మాత్రమే బైబిలును నమ్ముతారని తన ఉపాధ్యాయులచే ప్రభావితం చేయబడిన ఇసాబెల్ మిల్లర్ , తన తల్లిదండ్రుల విశ్వాసాన్ని తృణీకరించి , ప్రాపంచిక వ్యవహారాలలో ఆసక్తి చూపించారు . అయితే ఆమె ప్రధానం చేయబడిన వ్యక్తి ఆమెను విడిచిపెట్టినందుకుగాను కృంగిపోయి , ఒక రాత్రి ఆత్మహత్య చేసుకొనబోవుచున్న సమయంలో దేవుని కృప ఆమెను కనుగొంది . ఆ రాత్రి ఆమె ప్రార్థించి , తన జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకున్నారు .
బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత ఆమె ఉపాధ్యాయురాలిగా పనిచేశారు . ఆ సమయంలోనే మిషనరీగా సేవ చేయుటకై చైనా ఇన్లాండ్ మిషన్లో చేరాలనే కోరిక ఆమెలో కలిగింది . చైనాలోని ' లిసు ' ప్రజలకు సువార్తను అందించుటకు సేవకులు కావలెనని జె . ఓ . ఫ్రేజర్ చేసిన విన్నపమును విన్నప్పుడు ఆ కోరిక మరింతగా బలపడింది . తదనంతరం పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడిన వారై లిసు ప్రజలకు క్రీస్తును ప్రకటించుటకు చైనా వెళ్ళవలెనని ఇసాబెల్ నిర్ణయించుకున్నారు .
1928 వ సం ll లో చైనాకు వచ్చిన ఆమె , ప్రారంభ సంవత్సరాలను చైనా భాష నేర్చుకొనుటకు వెచ్చించారు . జాన్ కుహ్నతో ఆమెకు వివాహం జరిగిన తరువాత , కుటుంబముగా వారు చెంగి యాంగ్ ప్రాంతమునకు వెళ్ళగా , అక్కడ దేవుడు " స్వీయమును సిలువ వేయుట " అనే పాఠములో ఇసాబెల్ కు శిక్షణ ఇచ్చాడు . ఆమె తమ ఇంటిలోనికి స్థానిక చైనా మహిళలను స్వాగతించి , వారికి సువార్తను అందించారు . తొలి మరియు యోంగ్ పింగ్ ప్రాంతములలో కూడా సేవ చేసిన ఈ మిషనరీ దంపతులు , 1934 వ సం ll లో లిసులాండకు వెళ్ళారు . క్రైస్తవ మతం యొక్క ప్రాథమిక విషయాలలో ప్రజలకు శిక్షణనిచ్చుటకు వారు లిసు గ్రామాలలో బైబిలు పాఠశాలలను ప్రారంభించారు . ఎన్నో సవాళ్ళతో కూడిన పరిస్థితులు ఎదురైనప్పటికీ , లిసు ప్రజల మధ్య అద్భుతమైన సేవా ఫలమును ఇసాబెల్ చూడగలిగారు . ఆ ప్రజలలో కొందరు మిషనరీలుగా కూడా మారి ఆత్మీయ జీవితములో మరింత ముందుకు సాగిపోయారు .
" ప్రభువా , స్వలాభము కొరకు కాక మీ కొరకే నేను జీవించునట్లు నాకు సహాయము చేయుము . ఆమేన్ ! "
No comments:
Post a Comment