Search Here

Sep 22, 2021

Ada Lee | అడా లీ

Ada Lee |  అడా లీ



  • జననం: 23-03-1856
  • మహిమ ప్రవేశం: 11-06-1948
  • స్వస్థలం: వెస్ట్ వర్జీనియా 
  • దేశం: యునైటెడ్ స్టేట్స్ 
  • దర్శన స్థలము: భారతదేశం 

నా తలంపులు మీ తలంపులవంటిని కావు .... నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును , రాబోవు కాల మందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు : ఇదే యెహోవా వాక్కు . " అని యెషయా 55 : 8 మరియు యిర్మీయా 29:11 వచనములలో చెప్పబడిన మాటలు అడా లీ యొక్క జీవితములో అక్షరాలా ఋజువు కావడం మనము చూడవచ్చు . తన బిడ్డలను దైవ భయముతో పెంచి , దేవుని సేవ కొరకై వారిని సమర్పించిన ఆమె , వారు ప్రజలను దేవుని వైపుకు మళ్ళించగా చూడవలెనని ఎల్లప్పుడూ ప్రాంర్థించేవారు . అయితే ఆమె ప్రార్థనలకు జవాబు లభించినదా ?

ఇరవై సంవత్సరాల యుక్త వయసులో అడా హిల్డెగార్డ్ జోన్స్ లీ భారతదేశములో అడుగుపెట్టారు . ఆమె కలకత్తాలో బెంగాల్ స్త్రీల మధ్య ఐదు సం ll ల పాటు సేవ చేశారు . భారతదేశములో సేవ చేస్తున్న అమెరికా దేశపు మరొక మిషనరీ అయిన డేవిడ్ హిరామ్ లీతో 1881 వ సం ll లో ఆమెకు వివాహం జరిగింది . కాగా , వారిరువురు కలిసి కలకత్తాలో పాఠశాలలను స్థాపించారు . దేవుని సేవ చేయుటకు ప్రజలకు శిక్షణనిచ్చారు మరియు పేద పిల్లలకును , బాల్యవివాహాల వంటి మూఢాచారాలకు మరియు వ్యభిచారము వంటి సామాజిక కీడులకు బలైన పిల్లలకును ఆశ్రయమయ్యారు .

1899 వ సం ll లో ఆ మిషనరీ కుటుంబములో విషాదం అలుముకుంది . డార్జిలింగ్ లో ప్రకృతి విపత్తు కలిగి కొండచరియలు విరిగిపడటంతో అక్కడ చదువుకుంటున్న వారి ఆరుగురు పిల్లలు మరణ ద్వారంలోకి ప్రవేశించవలసి వచ్చింది . ఆ ఆరుగురిలో ప్రాణాలతో బయటపడిన వారి కుమారుడు విల్బర్ , ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆ విపత్తు సమయములో జరిగిన దానిని గురించి వారికి తెలియపరిచాడు . ఆ సమయములో మరణాన్ని ఎదుర్కొనుటకు దేవుడు వారికి అపారమైన ధైర్యమును ఇచ్చాడని , మరణించిన తరువాత పరలోకములోకి ప్రవేశిస్తామన్న నిశ్చయతను కలియుండుట వలన వారు మరణించుటకు భయపడలేదని విల్బర్ ఆ చివరి ఘడియల గురించి వివరించాడు .

కొన్ని రోజులు ఆసుపత్రిలో తీవ్రమైన శారీరక బాధను అనుభవించిన తరువాత , విల్బర్ కూడా పరమందు తన సోదరీసోదరులను చేరుకున్నాడు . తన పిల్లల అకాలమరణం అడాకు గొప్ప ఆత్మీయ పోరాటంగా మారింది . ఆమె ప్రార్థనలకు దేవుడు జవాబివ్వలేదనే ఆలోచనలతో సాతాను ఆమె విశ్వాసమును కబళించుటకు ఎంతగానో దాడి చేశాడు . శోధిస్తున్న అపవాదిని జయించుటకు తనకు బలమును దయచేయుమని ఆమె దేవుని యొక్క సహాయము కొరకై ఆయన సన్నిధిలో ఎంతగానో మొరపెట్టారు . కాగా , అమెరికా అంతటా వారి పిల్లల యొక్క జీవిత సాక్ష్యములు ఏవిధముగా ప్రచురించబడి , ప్రసంగాలలో చెప్పబడుతున్నాయో మరియు వారి మాదిరికరమైన జీవితాలు ఏవిధముగా ప్రజల హృదయాలను కదిలించి వారిని దేవుని వైపుకు తిప్పుతున్నాయో ఆమెకు చెప్పబడినప్పుడు , ఆమె ఆయన యొక్క అద్భుతమైన ప్రణాళికలను బట్టి దేవునిని స్తుతించి , ఆమె ప్రార్థనలకు ఆయన మార్గము చొప్పున జవాబు దయచేసినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు !

లీ మిషనరీ దంపతులు తమ చివరి శ్వాస వరకు భారతదేశంలో తమ సేవను కొనసాగించారు . కలకత్తాలోని " ది లీ మెమోరియల్ మిషన్ " త్యాగసహితమైన వారి సేవ యొక్క ఫలముగా ఈ నాటికీ మన కన్నుల ముందు నిలిచియున్నది .

ప్రియమైనవారలారా , మీ జీవితములో మీరు కష్టములను ఎదుర్కొంటున్నప్పటికీ , దేవుడు మీ ప్రార్థనలను ఆలకించి జవాబిస్తున్నాడనే నమ్మికను మీరు కలిగియున్నారా ?

" ప్రభువా , మీ ప్రణాళికలను అర్థం చేసుకొనుటకును , ఎటువంటి నియమనిబంధనలు లేకుండా బేషరతుగా మీయందు నమ్మికయుంచి మిమ్ములను ఆశ్రయించుటకును నాకు సహాయము దయచేయుము . ఆమేన్ !
  • WhatsApp
  • No comments:

    Post a Comment