ఇవాలిన్ గోర్డాన్ | Evalyn Gordon
- జననం: - ----
- మహిమ ప్రవేశం: 1935
- స్వస్థలం: కలకత్తా
- దేశం: భారతదేశం
- దర్శన స్థలము: భారతదేశం
మిషనరీ పరిచర్య జరింగించిన అనుభవం ఉన్న కుటుంబములో జన్మించారు ఇవాలిన్ ఎమ్. గోర్డాన్. అతని తల్లి యొక్క తండ్రిగారు సెరాంపూర్‌లో విలియం కేరితో కలిసి సేవ చేశారు. సెరాంపూర్ కళాశాలలో తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకొనిన గోర్డాన్, పిమ్మట ‘బాంబే గార్డియన్’ అనే వార్తాపత్రికలో పనిచేయడం ప్రారంభించారు. అక్కడ మోర్టన్ ఆడమ్స్ అనే అమెరికాకు చెందిన ఒక మిషనరీని గోర్డాన్ కలవడం జరుగగా, అతను ఇచ్చిన ప్రేరణ మూలముగా 1892వ సంll లో ‘డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్’ (క్రీస్తుని శిష్యులు) అనే సంస్థలో చేరారు గోర్డాన్.
వెంటనే అతను ముంగేలిలో నివాసం ఏర్పరచుకొని, అక్కడ నుండి అనేక ఇతర గ్రామాలకు వెళుతూ సువానుర్త ప్రకటించారు. అతను చత్తీస్‌గఢ్ యొక్క మాండలికంలో క్రీస్తు జీవితమును క్లుప్తంగా వ్రాశారు. అది దానిని చదివిన వ్యక్తులను ఎంతగానో ప్రభావితం చేసింది. ఎంతగానో ప్రయత్నించిన తరువాత చివరకు హీరా లాల్ అనే అన్యుడిని క్రీస్తు కొరకు సంపాదించగలిగారు గోర్డాన్. హీరా లాల్ తన కుటుంబము నుండి కలిగిన అడ్డంకులను ఎలా అధిగమించి క్రీస్తుపై తన విశ్వాసమును చాటిచెప్పాడో చూసిన చాలా మంది తమ విశ్వాసమును బహిరంగముగా అంగీకరించడం ప్రారంభించారు.
ఆ విధంగా అప్పుడే విచ్చుకుంటున్న మొగ్గ వలె ఉన్న పరిచర్యను చేస్తున్నటువంటి సమయములో తనకు తగిన సహాయమును అన్నా డన్ ద్వారా పొందగలిగారు గోర్డాన్. 1896వ సంll లో వారిరువురికి వివాహం జరిగింది. ఔషధ శాస్త్రములో శిక్షణ పొందిన అన్నా డన్, ముంగేలిలో జరుగుచున్న పరిచర్యలో ప్రధానంగా ప్రజలకు వైద్య సహాయం అందించడం ద్వారా గోర్డాన్‌కు తోడ్పడ్డారు. ఆమె ప్రేమ, సహనం మరియు వైద్య సేవలను అందించడంలో నైపుణ్యం అనేక మందిని క్రీస్తు వైపుకు ఆకర్షించాయి. ఒకసారి ప్రాణాంతక కణితి ఉన్న ఒక యువతి అన్నా యొక్క ఆసుపత్రిలో చేరగా, అన్నా యొక్క సేవలో క్రీస్తు ప్రేమను చూసిన ఆ యువతి తల్లిని సేవలో ఆమె చూపిన శ్రద్ధ ఎంతగానో ఆకట్టుకుంది. తద్వారా ఆమె ఒక క్రైస్తవురాలిగా మారింది. హీరా లాల్‌తో పాటు అనేక మంది యువతులకు నర్సుగా సేవలందించుటకు అన్నా శిక్షణనిచ్చారు. ప్రతిదినము ఉదయమున వైద్య సేవలను ప్రారంభించే ముందు సువార్త ప్రకటించబడేలా ఆమె చూసుకునేవారు.
భయంకరమైన కరువు సంభవించిన సమయంలో గోర్డాన్ దంపతులు వందలాది మంది పిల్లల ప్రాణాలను కాపాడారు. పరిచర్య చేసిన కాలంలో వారు అనాథాశ్రమాలను, కుష్ఠురోగులకు గృహాలను, శిక్షణ కేంద్రాలను మరియు ఆదివారపు బైబిలు పాఠశాలలను (సండే స్కూల్స్) స్థాపించారు. పరిచర్య అభివృద్ధి చెందగా మిషన్ యొక్క సరిహద్దులు విస్తరించాయి. భారతదేశంలో మంచి పరిచర్య జరిగించిన తరువాత ఈ మిషనరీ దంపతులు 1908వ సంll లో అమెరికాకు వెళ్ళిపోయారు. తమ మిగిలిన జీవితమును క్రైస్తవ సంఘము యొక్క పరిచర్యలో చురుకుగా పాలుపంచుకుంటూ గడిపిన గోర్డాన్ దంపతులు, చివరి వరకూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.
🚸 *ప్రియమైనవారలారా, మీరు చేసే సేవలో ఈ లోకం క్రీస్తు ప్రేమను చూడగలుగుతుందా?* 🚸
🛐 *"ప్రభువా, ప్రతి పరిస్థితిలోను మరియు జీవితము యొక్క ప్రతి భాగములోను నేను క్రీస్తు ప్రేమను ప్రతిబింబించేలా నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
*******
No comments:
Post a Comment