హ్యారీ షాఫెర్ మరియు ఎమ్మా సోర్గెన్ | Harry Schaeffer and Emma Sorgen
- జననం: -
- మహిమ ప్రవేశం: -
- స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: భారతదేశం
ఎమ్మా సోర్గెన్ స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ నగరమైన బెర్నే నుండి పదిహేడు మైళ్ల దూరంలో జన్మించారు. ఆమెకు రెండు సంll ల వయస్సు ఉన్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు అమెరికాకు వెళ్ళారు. తదుపరి ‘చర్చ్ ఆఫ్ క్రైస్ట్’ సంఘములో సభ్యురాలుగా చేరిన ఎమ్మా, తాను ఒక మిషనరీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆమె హీరామ్ కళాశాలలో చదువుకున్నారు మరియు చికాగోలోని పెస్టలోజీ-ఫ్రోబెల్ కిండర్‌గార్టెన్ కళాశాల నుండి పట్టభద్రురాలయ్యారు. పిమ్మట రెండేళ్ళపాటు అధ్యాపకురాలిగా పనిచేసిన ఆమె, ఆపై మిషనరీగా భారతదేశానికి వెళ్ళేందుకు సిద్ధపడుటకుగాను ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ అనే కళాశాలలో చేరారు.
ఓహియోకు చెందిన హ్యారీ షాఫెర్ తన ఉన్నత విద్యను పూర్తిచేసుకొనిన పిమ్మట ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ కళాశాలలో చేరారు. అక్కడ అతను ఎమ్మా సోర్గెన్‌ను కలవడం జరిగింది. వారిరువురు కూడా భారతదేశానికి వెళ్ళుటకు ఎంతో అత్యాసక్తితో ఉన్నారు. 1913వ సంll జూన్ మాసంలో ఓహియోలోని కెంటన్‌లో వారిరువురికి వివాహం జరిగింది. అదే సంవత్సరం శరదృతువులో వారు భారతదేశానికి పయనమయ్యారు.
భారతదేశంలో వారి మొదటి కొన్ని నెలలు లక్నోలోని యూనియన్ లాంగ్వేజ్ స్కూలులో గడిపారు. తరువాత వారు రథ్ ప్రాంతములోను, పిమ్మట పెండ్రా రోడ్‌లోను సువార్త పరిచర్యను జరిగించారు. వారు గ్రామం నుండి గ్రామానికి వెళ్ళి గుడారాలలో నివసిస్తూ, అనేకమందికి సువార్తను ప్రకటించారు. కొంతకాలం సెలవు తీసుకొనిన పిమ్మట, 1920వ సంll ప్రాంతంలో, ఆ మిషనరీ దంపతులు బిలాస్‌పూర్‌కు తరలి వెళ్ళారు. అక్కడ షాఫెర్ స్థానిక సంఘము యొక్క బాధ్యతలను చేపట్టారు, గ్రామాలలో సువార్త పరిచర్యను మరియు బాలుర పాఠశాలలను పర్యవేక్షించారు మరియు ఆ పెద్ద మిషన్ స్టేషన్ యొక్క నిర్వాహక బాధ్యతలను కూడా చూసుకున్నారు. అంతేకాదు, ‘జాక్మన్ మెమోరియల్ హాస్పిటల్ అండ్ నర్స్ ట్రైనింగ్ స్కూల్’ (జాక్మన్ స్మారక ఆసుపత్రి మరియు నర్సుల శిక్షణ పాఠశాల) మరియు తరువాత బాలికల కొరకు ఏర్పరచబడిన ‘బర్గెస్ మెమోరియల్ హై స్కూల్’ (బర్గెస్ స్మారక ఉన్నత పాఠశాల) యొక్క భవన నిర్మాణాలను కూడా పర్యవేక్షించారు. 1926వ సంll లో వారి సెలవు దినములు ముగిసిన తరువాత, వేరొక సంస్థ తరపున కాక, వారు స్వతంత్ర మిషనరీలుగా భారతదేశానికి తిరిగి వచ్చి, బిలాస్‌పూర్‌లో ఉన్నారు.
1946వ సంll ఏప్రిల్ మాసంలో కలకత్తా నగరంలో షాఫెర్ మరణించే వరకు కూడా వారు స్వతంత్య్రముగానే బిలాస్‌పూర్‌లో మిషనరీ సేవను కొనసాగించారు.
ప్రియమైనవారలారా, మీ హృదయ వాంఛ ఏమిటి? దేవుని రాజ్యము కొరకు పని చేయవలెననా లేదా మీ స్వంత అవసరతల కొరకు పని చేయవలెననా?
"ప్రభువా, నేను ఉంచబడిన స్థలములో మీకు నమ్మకముగా సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment