Mattilona Muthyamalle | మట్టిలోన ముత్యమల్లే
మట్టిలోన ముత్యమల్లే పుట్టాడురో
సందెపొద్దు సూరీడల్లే వచ్చాడురో
నింగినేలంతా ఆడి పాడంగా
సంబరాలతో సందడాయెగా
1. బెత్లహేము ఊరిలో పశువుల పాకలో దీనుడై పుట్టినాడురా - సుఖమే కోరలేదురా
ఆ చలిరాత్రిలో చీకటంటి బ్రతుకులో దీపమై వచ్చినాడురా - భేదమే చూపలేదురా
ఎంతో వింత కాదా దారి చూపే దివ్య తార
పాడే దూతలంతా కదిలొచ్చే గొల్లలంతా అంబరాన్నంటే సంబరాలతో సందడే ఇల
2. వెన్నెలంటి వీధిలో చల్లనైన చూపుతో స్నేహమై చేరినాడురా - ప్రేమనే పంచినాడురా
అంధకార లోయలో అంతు లేని బాటలో మనకై వెదకినాడురా - రక్షణే తెచ్చినాడురా
ఎంతో వింత కాదా మరి నిన్నే కోరలేదా
రావా యేసు చెంత మనసారా వేడుకోగా
అంబరాన్నంటే సంబరాలతో సందడాయెగా
No comments:
Post a Comment