దైవస్తుతి(1-57) 2:1,2,3,4,5,6,7
Gaanamu cheyudu Sukeerthananu | గానముఁ జేయుఁడు సుకీర్తనను
1.గానముఁ జేయుఁడు సుకీర్తనను యెహోవాను గూరిచి క్రొత్తఁ గాను రక్తిగను ||గానము||
2.తన్నామము నుతించి యతని రక్షఁ జెన్నుఁగ సారెఁ బ్రసిద్ధముఁ జేసి పన్నుగ నన్యులలో దన్మహిమ యం దున్నత చిత్రములను జాటండి ||గానము||
3.ఘనతయు మహత్మ్యమును దద్ఘనని యెదుటనుండు ఘనబలమును వినతమౌ సౌందర్యమును నతనివి నిర్మల స్థలమున విలసిల్లు ||గానము||
4.పరిశుద్ధాలంకారముతో నా పరమాత్మారాధన పరులై యుండండి ధరణి సకల జనులారా లోక గురుని యెదుట భీతిఁ గొనుచు నుండండి ||గానము||
5.పరిపాలించుచున్నాఁడనుచు తోడి నరులతోఁజెప్పుఁడిద్ధరఁ గదకుండ స్థిరముగఁ జేయు సత్యముగా జనుల కరిమురిగాను న్యాయము విమర్శించు ||గానము||
6.ఏమనిన నా మహాత్ముండు వచ్చు నీ మహికి న్యాయము నేర్పరచుటకు భూమిజనులకు నీతి సత్యములథో మించు న్యాయము విమర్శించు ||గానము||
7.జనులారా యా యెహోవాకు మహిమను బలమును సమర్పణము జేయండి వినయముతోఁ గానుకలను తీసి కొని తత్ప్ర్రాకారమందున వసియింపండి ||గానము||
No comments:
Post a Comment