Search Here

Jul 30, 2021

James Curtis Hepburn | జేమ్స్ కర్టిస్ హెప్ బర్న్ జీవిత చరిత్ర

జేమ్స్ కర్టిస్ హెప్ బర్న్ | James Curtis Hepburn జీవిత చరిత్ర


జననం: 13-03-1815
మరణం: 21-09-1911
      స్వస్థలం:
పెన్సిల్వేనియా
దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
దర్శన స్థలం: జపాన్ మరియు చైనా

జపాన్ దేశములో సువార్త సేవ చేసి , క్రైస్తవ్యమును అభివృద్ధి చేయుటలో మొదటిగా సేవలను అందించి మార్గదర్శకులుగా నిలిచిన గొప్ప దైవజనులలో జేమ్స్ కర్టిస్ హెట్జర్న్ ఒకరు . " మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి " అన్న దేవుని వాక్యానికి విధేయత చూపించిన హెప్ బర్న్ , వైద్య మిషనరీగా ఆసియా ఖండములోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు మేలు చేయవలెనని సంకల్పించారు . పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం క్రింద ఉన్న వైద్య కళాశాల నుండి పట్టా పొందిన కొద్దికాలానికే తన భార్యయైన క్లారా లీలో కలిసి ఒక వైద్య మిషనరీగా మొదట సింగపూరు , తదుపరి చైనాకు ప్రయాణించారు హెప్ బర్న్ . ఐదేళ్ల పాటు చైనాలో వారి పరిచర్య చురుకుగా కొనసాగింది . అయితే , ఆరోగ్య సమస్యల కారణంగా ఆ దంపతులు చైనాను విడిచి వెళ్ళవలసి రాగా , 1845 వ సం ll లో వారు న్యూయార్క్ చేరుకున్నారు .

హెట్జర్న్ న్యూయార్క్ లో వైద్య సేవలను అందిస్తున్నప్పుడు అతని ముగ్గురు పిల్లలు తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు . ఈ వ్యక్తిగత విషాదం మిషనరీ సేవ కొరకైన వాంఛను అతనిలో తిరిగి ప్రజ్వలింపజేసింది . అదే సమయంలో జపాన్లో సేవ చేయుటకు అవకాశం అతని తలుపు తట్టింది . అప్పటిలో పాశ్చాత్య దేశాల నుండి తనను వేరుపరచుకున్న జపాన్ దేశంలోని ప్రజలు విదేశీయుల పట్ల భయమును మరియు ఏహ్యభావమును కలిగియుండేవారు . అటువంటి పరిస్థితులలో జపాన్లోని కనగావా ( ప్రస్తుత యోకోహామా ) చేరుకున్న హె బర్న్ దంపతులు , ముందుగా జపనీస్ భాషను నేర్చుకోవడం ప్రారంభించారు . ఎంతో వ్యతిరేకత మరియు అననుకూల పరిస్థితుల మధ్యలో , ఎలాగైతేనేమి చివరకు 1861 వ సం ll లో హెట్జర్న్ అక్కడ ఒక వైద్యశాలను ప్రారంభించగలిగారు . దీని ద్వారా అతను ఆధునిక ఔషధాలను జపాన్లో ప్రవేశపెట్టి , వేలాది మంది జపానీయులకు చికిత్స చేశారు . బైబిలు యొక్క అనువాదకునిగా హెట్జర్న్ జపానులో క్రైస్తవ్యముపై మరియు జపనీస్ సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు .


మొట్టమొదటి జపనీస్ - ఆంగ్ల నిఘంటువును సంకలనం చేసిన అతను , జపనీస్ భాషలో వ్రాయబడిన దానిని రోమన్ లేదా లాటిన్ లిపిలో వ్రాయుటకు ( రోమనైజేషన్ ) ' హెప్ బర్న్ పద్ధతిని ' రూపొందించారు . వైద్య సేవలను అందించడముతో పాటు , జపానీయులకు బైబిలును పరిచయం చేయుటకుగాను తన భార్యతో కలిసి యుక్త వయస్సులో ఉన్నవారికి ఆంగ్లమును బోధించే పాఠశాలను ప్రారంభించారు . తరువాతి కాలంలో ' మీజీ గకుయిన్ విశ్వవిద్యాలయంగా ' అభివృద్ధి చెందిన ఈ పాఠశాల , ఒక విశిష్టమైన క్రైస్తవ విద్యా సంస్థగా ఈ నాటికీ నిలిచియుంది . క్రైస్తవ విశ్వాసులను వారి విశ్వాసములో మరింత బలపరచుటకుగాను అతను యోకోహామాలో ఒక క్రైస్తవ సంఘమును కూడా స్థాపించారు .

హెప్ బర్న్ దేవుని సేవపట్ల ఎంతో శ్రద్ధాసక్తులు కలిగి , స్వప్రయోజనమును కోరుకొనని నమ్మకమైన దైవ సేవకులు . “ భళా , నమ్మకమైన మంచి దాసుడా ... నీ యజమానుని సంతోషములో పాలుపొందుము " అని తన ప్రభువు నుండి ప్రశంసలను అందుకొనగలుగునట్లు దేవునికి నమ్మకముగా సేవ చేసిన జేమ్స్ హెప్ బర్న్ , 96 ఏళ్ళ మంచి వృద్ధాప్యమందు ఈ లోకములో తన పరుగును కడముట్టించారు.

ప్రియమైనవారలారా , ఇతరులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుకుంటున్నారో ఆలాగుననే మీరు కూడా వారి పట్ల జరిగించుచున్నారా ?
 
ప్రభువా , ప్రజల యొక్క ఆత్మీయ మరియు భౌతిక అవసరతలను గురించిన భారమును మరియు దయా హృదయమును నాకు దయచేయుము . ఆమేన్ ! 
  • WhatsApp
  • No comments:

    Post a Comment