4వ ఫ్రెడరిక్ రాజు | King Frederick IV జీవిత చరిత్ర
జననం : 11-10-1671 మరణం : 12-10-1730 స్వస్థలం : కోపెన్‌హాగన్ దేశం : డెన్మార్క్ దర్శన స్థలము : - క్రైస్తవ మతం యొక్క వ్యాప్తిపై వివిధ దేశాల పాలకులు మరియు చక్రవర్తులు చూపిన ప్రభావం గణనీయమైనది. కొంతమంది పాలకులు ఆదికాల క్రైస్తవులు తమ విశ్వాసాన్ని ప్రకటించకుండా నియమనిబంధనలు కల్పించి వారిని శ్రమపెడితే, మరికొందరు సువార్త బహుగా ప్రకటించబడునట్లు అవకాశాలు కల్పించారు. పాత నిబంధన కాలం నుండి కూడా దేవుని వైపుకు గానీ లేదా ఆయనకు దూరముగా గానీ ఇశ్రాయేలీయులను నడిపించడంలో రాజులు కీలక పాత్ర పోషించినట్లు చూడవచ్చు. అందువలననే అపొస్తలుడైన పౌలు 1 తిమోతి 2:1-3 లో ఇలా వ్రాస్తున్నారు, “మనము సంపూర్ణభక్తియు మాన్యతయు కలిగి, నెమ్మది గాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము, అన్నిటికంటె ముఖ్యముగా మనుష్యులందరికొరకును రాజులకొరకును అధికారులందరికొరకును విజ్ఞాపనములును ప్రార్థనలును యాచనలును కృతజ్ఞతాస్తుతులును చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై యున్నది.”
తన ప్రజలకు క్రీస్తు ప్రేమ ప్రకటింపబడవలెనని ఎంతో శ్రద్ధాసక్తులతో ప్రయత్నాలు చేసిన రాజులలో డెన్మార్క్ రాజైన నాలుగవ ఫ్రెడరిక్ ఒకరు. 1620వ సంll లో భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో ఉన్న ట్రాన్క్యూబార్ ప్రాంతం డెన్మార్క్ రాజ్యాధికారం క్రిందకు రాగా, భారతదేశంలోని అన్యజనులకు క్రీస్తును తెలియపరచుటకు ఫ్రెడరిక్ రాజు శ్రద్ధాసక్తులు కనుపరిచారు. డెన్మార్క్‌లోని లూథరన్ సంఘమునకు నాయకులైన అతను, దక్షిణ భారతదేశంలో మిషనరీ సేవ ప్రారంభించుటకు ప్రయత్నించారు. అయితే ట్రాన్క్యూబార్ మిషన్‌ను స్థాపించుటకు అతను చేసిన ప్రయత్నాలు దాదాపు విఫలమయ్యే పరిస్థితి వచ్చింది. ఏలయనగా, దూర దేశమైన భారతదేశముకు మిషనరీగా వెళ్ళుటకు డెన్మార్క్ ప్రజలలో ఆసక్తి చూపినవారెవరూ లేరు. అయిప్పటికీ రాజు పట్టువిడువక తన దేశంలో కాకుండా వేరే దేశంలోనైనా భారతదేశమునకు వెళ్ళుటకు సుముఖత చూపెడివారు దొరుకుతారేమోనని వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలోనే జర్మనీ దేశపువారైన బర్తొలోమియస్ జీగెన్‌బాగ్ మరియు హెన్రిచ్ ప్లాట్చౌలు డెన్మార్క్ రాజు దృష్టికి రావడం జరిగింది. కాగా భారతదేశమునకు వారి ప్రయాణమునకును, ట్రాన్క్యూబార్‌లోని మిషన్ పనుల కొరకును ఫ్రెడరిక్ రాజు స్వయంగా ఏర్పాటులు జరిగించి, ఆర్థిక సహాయమును అందించారు.
బర్తొలోమియస్ జీగెన్‌బాగ్ మరియు హెన్రిచ్ ప్లాట్చౌ అనెడివారు భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ప్రొటెస్టెంట్ మిషనరీలు మరియు వారి యొక్క పరిచర్య భారతదేశంలోని మిషనరీ సేవను ఎంతగానో మార్చింది. అక్కడ జీగెన్‌బాగ్ పాఠశాలలు, కళాశాలలు మరియు క్రైస్తవ సంఘములను స్థాపించుటకు ఫ్రెడరిక్ రాజు యొక్క ప్రోత్సాహం తోడ్పడింది. తత్ఫలితముగా భారతీయ సమాజంలో గొప్ప మార్పు కలిగింది.
🚸 *ప్రియమైనవారలారా, వారు తమ దేశములను దేవుని మార్గములో నడిపించునట్లు రాజులకొరకును మరియు అధికారులందరికొరకును మీరు ప్రార్థించుచున్నారా?* 🚸
🛐 *"ప్రభువా, నశించుచున్నవారికి మీ సువార్త ప్రకటింపబడుటలో అవరోధాలు కలుగకుండునట్లు మీ హృదయానుసారులైన రాజులను, అధికారులను లేవనెత్తుము. ఆమేన్!"* 🛐
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
No comments:
Post a Comment