Search Here

Aug 20, 2021

Melinda Rankin | మెలిండా రాంకిన్

మెలిండా రాంకిన్ | Melinda Rankin


  • జననం: 21-03-1811
  • మహిమ ప్రవేశం: 1888 
  • స్వస్థలం: న్యూ హాంప్‌షైర్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: మెక్సికో


మెలిండా రాంకిన్ మెక్సికోకు వెళ్ళి సేవ చేసిన మొట్టమొదటి ప్రొటెస్టంట్ మిషనరీ. యుద్ధముతో విచ్చిన్నమైపోయిన ఆ దేశములో శాంతిని తీసుకువచ్చుటకు దేవుడు ఆమెను అక్కడ ఒక ప్రత్యేకమైన రీతిలో వాడుకున్నాడు. ఆమె తన హృదయమును క్రీస్తుకు సమర్పించిన తరువాత నిజమైన దేవుని గురించి తెలియని ప్రతి ఒక్కరితో సువార్తను పంచుకోవాలనే వాంఛతో ఆమె హృదయం నిండిపోయింది. సువార్త పరిచర్య చేయకుండా ఆమె ఊరకనే కూర్చొనలేకపోయారు మరియు సువార్త పరిచర్య చేయకపొతే ఆమెకు ప్రశాంతత ఉండేది కాదు. ఆమెలోని బలమైన వాంఛ ఒకనాడు కార్యరూపందాల్చింది. మిస్సిస్సిప్పీ లోయకు వెళ్ళుటకు మిషనరీ ఉపాధ్యాయుల కొరకై వచ్చిన పిలుపుకు ఆమె స్పందించి మిషనరీ సేవకైన తన తొలి అడుగును వేశారు. 


మెక్సికన్లు ఎంతో అజ్ఞానులు మరియు దుర్మార్గమైన ప్రజలు అని వినిన మెలిండా ఎంతగానో కదిలించబడ్డారు. కాగా ఆమె క్రైస్తవ సంఘములు మరియు మిషనరీ సంస్థలలో ఆసక్తిని రేకెత్తించుటకు ప్రయత్నించారు. అయితే ఎవరూ కూడా నిజమైన ఆత్మీయ అవసరతలో ఉన్న ఆ ప్రాంతానికి వెళ్ళుటకు సుముఖత చూపలేదు. చివరికి మెలిండా "నేనే వెళ్ళెదను, ప్రభువా నాకు సహాయము చేయుము" అని ఎలుగెత్తి చెప్పారు. మెక్సికో ఒక చట్టపరమైన క్రమము లేని స్థితిలో ఉన్నందున అక్కడికి వెళ్ళడం ఆమెకు ప్రమాదకరం. ఏ రూపంలోనైనా క్రైస్తవ మతమును వారి మధ్యకు తీసుకువచ్చుటను అక్కడి ప్రభుత్వం నిషేధించింది. కాగా మెక్సికోలోకి ప్రవేశించలేక పోయినందున ఆమె మెక్సికోలోని మాటమోరస్‌ అనే ప్రాంతమునకు సమీపములో ఉన్న టెక్సాస్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఏ విధమైన ఆశ్రయమైనా పొందుటకు కష్టతరమైనప్పటికీ, విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఆమె ఏనాడూ తలంచలేదు. చివరికి ఆమెకు రెండు గదులు అద్దెకు దొరకగా, అందులో ఒక గదిని పాఠశాల గదిగా ఉపయోగించారు మెలిండా. టెక్సాస్‌ నగరంలో అనేక మంది మెక్సికన్లు ఉన్నారు మరియు చాలా మంది మెక్సికన్ బాలికలు ఆమె పాఠశాలలో చేరారు.


ఒక రోజు మెక్సికోకు చెందిన ఒక స్త్రీ బైబిలు కొరకు మెలిండా వద్దకు వచ్చింది. అది మెక్సికో సరిహద్దు లోపలికి ఆమె పంపగలిగిన మొట్టమొదటి బైబిల్ అయ్యింది. మెక్సికోలో బైబిళ్లను పంచిపెట్టుటకు వ్యతిరేకంగా ఒక చట్టం ఉండేది. అయితే ‘జీవము గల మాటలను’ ప్రజలకు అందకుండా నిలిపివేసే హక్కు ఏ శక్తికీ లేదని మెలిండా విశ్వసించారు. అందువలన ఆమె మిక్కుటమైన ధైర్యముతో వందలాది బైబిళ్లను మరియు కరపత్రములను మెక్సికోకు పంపే మార్గమును కనుగొన్నారు. ఎట్టకేలకు చివరకు మెక్సికోను చేరుకోగలిగిన ఆమె, అక్కడ మొట్టమొదటి ప్రొటెస్టంట్ మిషన్‌ను స్థాపించారు.

“నిరుత్సాహం అనే పదం పరలోక రాజ్యము యొక్క నిఘంటువులో లేదు” అని చెప్పిన మెలిండా రాంకిన్, 76 సంll ల వయస్సులో పరమందు తన ప్రభువును చేరుకున్నారు.


🚸 ప్రియమైనవారలారా, దేవుని కొరకు గొప్ప కార్యములను సాధించ యత్నించుటకు మీరు సిద్ధమా? 🚸

🛐 "ప్రభువా, విశ్వాసధైర్యములతోను మరియు పరిశుద్ధత సమర్పణలతోను మీ కొరకు నేను పనిచేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!" 🛐

🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏

  • WhatsApp
  • No comments:

    Post a Comment