స్కాట్ మరియు జెన్నీఫిలిప్స్ Scott and Jennie Philips
- జననం: -
- మహిమ ప్రవేశం: -
- స్వస్థలం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: ఇండోనేషియా
లూకా 9:60లో ఈలాగు వ్రాయబడి ఉంది – “... నీవు వెళ్లి దేవుని రాజ్య మును ప్రకటించుము”. ఈ ఆజ్ఞకు లోబడి మిషనరీ దంపతులైన స్కాట్ మరియు జెన్నీ ఫిలిప్స్ ఇండోనేషియాలో ఉన్న దావో అడవిలోని గిరిజన ప్రజలకు యేసుక్రీస్తు సువార్తను అందించుటకుగాను 2003వ సంll లో ఇండోనేషియాకు వెళ్ళారు.
దేవుని యందు భయభక్తులు గలిగిన క్రైస్తవ తల్లిదండ్రులకు జన్మించారు స్కాట్. యేసుక్రీస్తు తన పాపాల కొరకు సిలువపై మరణించాడని విశ్వసించిన స్కాట్, ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించారు. అతను బైబిలు కళాశాలలో చదువుకుంటున్న రోజులలో ఒకసారి డన్ గోర్డీ అనే ఒక మిషనరీ వచ్చి “చేరని ప్రాంతాలలో సువార్త ప్రకటన” అనే అంశముపై ఒక వారం పాటు తరగతులను బోధించారు. తద్వారా గిరిజనుల మధ్యలో సేవ చేయుటకు ప్రపంచవ్యాప్తముగా ఉన్న అవసరమును గ్రహించారు స్కాట్. అది ప్రతి విశ్వాసికీ ఇవ్వబడిన దేవుని ఆ గొప్ప ఆజ్ఞను తాను కూడా నెరవేర్చే దిశగా అతను తన జీవితమును నడిపించుటకు దారితీసింది. మిషనరీ పరిచర్య కొరకై అతను కలిగియున్న సమర్పణలో అతని భార్యయైన జెన్నీ తగిన భాగస్వామి అయ్యారు.
జెన్నీ ఫిలిప్స్ 15 సంll ల వయస్సులో ప్రభువును తన రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి కూడా ఆమె తన కొరకు మరణించి తిరిగి లేచిన ప్రభువు కొరకే తన మిగిలిన జీవితమును జీవించాలని నిర్ణయించుకున్నారు. కాగా ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకొనిన తరువాత ఆమె ‘వర్డ్ ఆఫ్ లైఫ్ బైబిల్ ఇన్‌స్టిట్యూట్’ లో చేరారు. వైద్య మిషనరీ కావాలనే తన ఆలోచనలను విరమించుకుని, దావో తెగలవారికి దేవుని ప్రేమ మరియు రక్షణను గురించిన సువార్తను వ్యాప్తి చేయుటకు ఆమె తన జీవితమును సమర్పించుకున్నారు. ఆ దంపతులిరువురు కలిసి బాహ్య ప్రపంచముతో సంబంధములు లేకుండా వేరుచేయబడి, ఇంకా సువార్త చేరుకోని మారుమూల ప్రాంతాలలోని ప్రజల మధ్య ఆత్మీయ అభివృద్ధిని తీసుకువచ్చుటకుగాను ‘డి.ఎ.ఓ. మినిస్ట్రీస్’ (‘డిసైరింగ్ అడ్వాన్స్‌మెంట్ ఓవర్‌సీస్’ - విదేశాలలో అభివృద్ధి కొరకు ఆకాంక్ష) అనే సంస్థను స్థాపించారు.
దేవుని కృప ద్వారా ఆ మిషనరీ దంపతులు దావో ప్రజలలో అనేక మందిని యేసు క్రీస్తు ప్రభువు నొద్దకు నడిపించగలిగారు. లిపిలేని భాష కలిగియున్న ఆ గిరిజన ప్రాంతములో జెన్నీ క్రొత్త నిబంధనను దావో భాషలోకి అనువదించారు మరియు ప్రస్తుతం పాత నిబంధనను కూడా అనువదించుటను పూర్తి చేసే ప్రక్రియలో ఉన్నారు. అంతేకాకుండా ఇండోనేషియా అడవులలో మరింత లోపలికి వెళ్ళి, అక్కడి ప్రజలకు కూడా సువార్తను చేరవేయుటకుగాను వారు దావో ప్రజలకు శిక్షణ ఇస్తున్నారు.
“మిషనరీ సేవ చేయుటకు ప్రజలకు ప్రత్యేకమైన పిలుపు అవసరం లేదు. బైబిలులో ఆ పిలుపు ఇవ్వబడింది. ప్రజలు చేయవలసింది కేవలం దానికి స్పందించుటయే.” అనునవి స్కాట్ ఫిలిప్స్ యొక్క మాటలు.
🚸 *ప్రియమైనవారలారా, "... నీవు వెళ్లి దేవుని రాజ్య మును ప్రకటించుము" అను ఆజ్ఞకు మీరు విధేయత చూపించుచున్నారా?* 🚸
🛐 *"ప్రభువా, మీరు ప్రతి విశ్వాసికీ ఇచ్చిన ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటకు మేము కుటుంబముగా ఒకరికొకరు ప్రోత్సహమును సహాయమును అందిచుకొనునట్లు మాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
******
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
No comments:
Post a Comment