షోమోలేకే | Shomolekae
- జననం: -
- మహిమ ప్రవేశం: -
- స్వస్థలం: ఆఫ్రికా
- దర్శన స్థలము: ఆఫ్రికా
కురుమన్‌లోని జాన్ మెకెంజీ అనే మిషనరీకి చెందిన పండ్ల తోటకు షోమోలేకే అనే బాలుడు సంరక్షకునిగా ఉండేవాడు. అతనికి ఆ మిషనరీ అంటే మక్కువ. అతని బోధనలు కూడా ఆ బాలుడు ఇష్టపడేవాడు. ఒకసారి ఆ తోటలోని తోటమాలి కొన్ని దొంగిలించబడిన పండ్లను షోమోలేకేకి తినమని ఇచ్చాడు. అయితే, దొంగతనం చేయడం తప్పు అని ఎరిగియున్న ఆ బాలుడు వెంటనే వాటిని తిరస్కరించాడు. ఆ సంఘటన వలన అతను ఆ మిషనరీ యొక్క నమ్మకాన్ని గెలుచుకోగలిగాడు. తదుపరి ఆ మిషనరీ అతనిని తన సంరక్షణలోకి తీసుకున్నారు.
మిషనరీ సేవలో తనకు సహాయపడుటకు షోమోలేకేని ఉత్తర ఆఫ్రికాలోని షోషాంగ్‌కు తీసుకొనివెళ్ళారు మెకెంజీ. ధైర్యవంతుడైన యువకుడైన షోమోలేకే మెకెంజీ యొక్క మిషనరీ ప్రయాణాలలో అతని ఎద్దుల బండిని నడిపించేవారు. అది అంత సులభమైన పని కాదు. అతను ఒకేసారి పదహారు ఎద్దులను నిర్వహించవలసి ఉండేది మరియు అతను వాటిని తిన్నగా వంకర లేకుండా వెళ్ళేలా నడిపించాలి. షోషాంగ్‌లో విశ్వాసులు కూడుకొని దేవునిని ఆరాధించుటకుగాను ఒక క్రైస్తవాలయమును నిర్మించుటలో మెకెంజీకి సహకారమందించారు షోమోలేకే.
కొంతకాలం తరువాత కురుమన్‌లో ఒక పాఠశాలను నిర్మించుటలో మెకెంజీకి తోడ్పడిన షోమోలేకే తాను కూడా ఆ పాఠశాలలో విద్యార్ధిగా చేరారు. అక్కడ అతను తన స్వజనులకు బోధకునిగా మరియు ఉపాధ్యాయునిగా ఉండునట్లు శిక్షణ పొందారు. శిక్షణ పూర్తయిన తరువాత అతను పిత్సాని అనే ప్రదేశంలో పరిచర్య చేశారు. అక్కడి ప్రజలకు అతను యేసు క్రీస్తును గురించి బోధించి లేఖనములను చదవడమును నేర్పించారు. అడవి మృగాల నుండి కలిగే ప్రమాదాలను లెక్కచేయకుండా ప్రమాదకరమైన నదులు మరియు సరస్సుల వెంట ప్రయాణిస్తూ, సువార్త ప్రకటించుటకు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళేవారు షోమోలేకే. అలుపెరుగక ఎడతెగక చేసిన అతని పరిచర్య ద్వారా ఎంతోమంది స్త్రీ పురుషులు క్రీస్తు వైపుకు నడిపించబడ్డారు.
షోమోలేకే తన ప్రజల ఆత్మీయ అభివృద్ధి కొరకు మాత్రమే కాదు, వారి సామాజిక అభ్యున్నతి గురించి కూడా భారమును కలిగియుండేవారు. అతను గిరిజనులకు మంచి సంస్కృతిని నేర్పించారు మరియు నీతినిజాయితీలతో డబ్బు సంపాదించుకొనవలెనని వారిని ప్రోత్సహించేవారు. స్థానిక భాషలో అతను ఒక కీర్తనల పుస్తకమును కూడా వ్రాశారు మరియు దేవునికి స్తుతిగీతములను పాడటను వారికి నేర్పించారు. ఆ పాటలను అక్కడి ప్రజలు బాగుగా నేర్చుకున్నారు. మహిళలు పొలాలలో పని చేస్తున్నప్పుడు కావచ్చు లేదా చిన్నపిల్లలు తమ పడవలలో వెళ్తూ తెడ్డు వేస్తున్నప్పుడు కావచ్చు లేదా పురుషులు చిత్తడి నీటిలో చేపలు పడుతున్నప్పుడు కావచ్చు, ఏ పని చేస్తున్నా వారు సంతోషంగా ఆ పాటలు పాడటం వినబడుతుంది. ఆ గ్రామం మొత్తం క్రీస్తులో నిజమైన సంతోషాన్ని కనుగొంది! ఎంత అద్భుతమది!
🚸 *ప్రియమైనవారలారా, ఒక క్రైస్తవునిగా మీరు చేస్తున్న పనిని మీరు నిజాయితీగా చేస్తున్నారా?* 🚸
🛐 *"ప్రభువా, నేను వెళ్ళే స్థలములన్నింటిలో నిజాయితీగల క్రైస్తవ జీవితమును కలిగియుండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐
🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏
No comments:
Post a Comment