విల్లం థామస్ మోరిస్ క్లూవ్స్ | Willam Thomas Morris Clewes
- జననం: 17-10-1891
- మహిమ ప్రవేశం: 30-05-1984
- స్వస్థలం: లై
- దేశం: ఇంగ్లాండు
- దర్శన స్థలము: భారతదేశం
ఏకీకృతం చేసి దృఢపరచడం అనే పరిచర్య క్రైస్తవ మతం యొక్క అభివృద్ధికి కీలకమైనది. ఇది నూతన విశ్వాసులు పరిపక్వత నొందుటకు ముందుకు సాగిపోతూ తిరిగి వారి పాత పాపపు బ్రతుకులలోనికి జారిపోకుండా ఉండునట్లు వారి మధ్యలో జరిగే పరిచర్య లోతుగా వేరుపారినదై దృఢపరచబడగలుగునట్లు చేసే ప్రక్రియ. కొంతమంది మిషనరీలు మిషనరీ పనిని ప్రారంభించిన మార్గదర్శకులుగా నిలిస్తే, మరికొందరు ఆ పనికి నీరు పోసి, అది జీవముతో ఉండి ఎదుగునట్లు చూసుకున్నారు. రెవ. విల్లం థామస్ మోరిస్ క్లూవ్స్ రెండవ కోవకు చెందిన మిషనరీలలో ఒకరు.
‘క్లూవ్స్ దొరై’ అని అభిమానంతో పిలువబడే రెవ. విల్లం థామస్ మోరిస్ క్లూవ్స్, లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) ద్వారా భారతదేశానికి వచ్చి సేవ చేసిన ఒక మిషనరీ. తమిళనాడులోని ఈరోడ్ అనే ప్రాంతమునకు వచ్చిన అతను, అక్కడ రెవ. ఎ. డబ్ల్యూ. బ్రోవ్ మరియు రెవ. హెచ్. ఎ. పోప్లే అను వారిచే స్థాపించబడిన మిషన్ స్థావరంలో పనిచేశారు. తన భార్యయైన ఎడ్నా జేన్ బేకర్‌తో కలిసి ఆ మిషన్ అభివృద్ధి చెందుటకును మరియు ఈరోడ్ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో సువార్త విస్తరించుటకును అతను ఎంతో శ్రమించారు.
1923వ సంll లో లండన్ మిషనరీ సొసైటీ ద్వారా స్థాపించబడిన పాఠశాలలు ఇంచుమించు 94 వరకూ ఉన్నాయి. ఇంకా క్రొత్త పాఠశాలలను స్థాపించుటకు బదులుగా, అప్పటికే స్థాపించబడియున్న పాఠశాలలను దృఢపరచి, ఏకీకృతం చేశారు క్లూవ్స్. పాఠశాలలు కేవలం నామకరణ భవనాలు మాత్రమే కాకుండా స్థానికులకు ఉపయోగకరంగా ఉండేలా అతను చూసుకున్నారు. ఈరోడ్ డైయోసిస్‌లోను (ఈరోడ్ సంఘ పరిథి ప్రాంతములోను) మరియు చుట్టుప్రక్కల ప్రాంతములలోను విద్యాభ్యాసం పురోగతి సాధించుటలో కీలక పాత్ర పోషించారు. విద్యాభ్యాసం అంధత్వముతో కూడిన ప్రజల మూఢ నమ్మకాలను తొలగించడమే కాకుండా ఆత్మీయ అంధత్వము నుండి కూడా అనేక మంది విడుదలనొందుటకు తోడ్పడింది.
తన భార్య ఎడ్నాతో కలిసి ఈరోడ్ సి.ఎస్.ఐ. ఆసుపత్రిని స్థాపించడంలో క్లూవ్స్ కీలక పాత్ర పోషించారు. ఈ ఆసుపత్రి ఈరోడ్ మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఉన్న అనేక మంది ప్రజలకు ఈ నాటికీ వైద్య సేవలను అందిస్తుంది. అతను పుంగంబడి గ్రామంలో ప్రజలు కూడుకొని ఆరాధించుటకుగాను 'సి.ఎస్.ఐ. గుడ్ సమరిటన్ చర్చి' అనే చర్చిని కూడా స్థాపించారు.
ఈరోడ్‌లో 1923-49 వరకు దాదాపు 26 సంవత్సరాల పాటు దేవుని సేవలో ముందుకు సాగిపోయిన క్లూవ్స్, ప్రజలకు సేవలందించి వారికి మేలు చేయడంలో ఏనాడూ అలసిపోలేదు. అపొస్తలుడైన పౌలు చేసిన పరిచర్యకు నీరు పోసిన అపోల్లో వలె క్లూవ్స్ కూడా తమిళనాడులో తనకు ముందున్న మిషనరీలు చేసిన పనులకు నీరు పోసి వాటిని దృఢపరిచారు.
🚸 ప్రియమైనవారలారా, మునుపు స్థాపించబడిన పరిచర్యకు తదుపరి పరిచర్యను కొనసాగించుటలో మీరు నమ్మకంగా ఉన్నారా? 🚸
🛐 "ప్రభువా, పరిచర్య ప్రారంభకులుగా మార్గదర్శకులుగా నిలిచినవారు చేసిన సేవను వారు కలిగియున్న దర్శనమునే కలిగియుండి దృఢపరచగలుగునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 🛐
🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏
No comments:
Post a Comment