Search Here

Sep 8, 2021

Hunter Corbett | హంటర్ కార్బెట్

హంటర్ కార్బెట్ | Hunter Corbett

  • జననం: 08-12-1835
  • మహిమ ప్రవేశం: 07-01-1920
  • స్వస్థలం: పెన్సిల్వేనియా
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: చైనా


  అమెరికాకు చెందిన హంటర్ కార్బెట్ చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌లో సేవ చేసిన ప్రారంభక మిషనరీలలో ఒకరిగాను, మార్గదర్శకులుగాను నిలిచారు. ‘ప్రిన్స్‌టన్ థియోలాజికల్ సెమినరీ’ లో బైబిలు వేదాంతశాస్త్రమును అభ్యసించిన అతను, పట్టభద్రులైన తరువాత దేవుని సేవ చేయుటకు తన భార్యతో కలిసి చైనాకు వెళ్ళారు. ప్రమాదకరమైనదిగా ఉన్న ఆ ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న ఓడ పగిలిపోయింది కూడా. ఏమైతేనేమి, చివరకు వారు 1865వ సంll లో చెఫూకు చేరుకొనగలిగారు.


 అతను సువార్త సేవను ప్రారంభించగా, అతని జీవితం సానుకూలంగా సాగిపోలేదు కానీ, శ్రమలను అనుభవించుటకు తగినట్లుగా ఉంది. అతను నగరాలలో ఒకే ప్రాంతములో కేంద్రీకృతమై ఉండే పరిచర్య కంటే ఉత్తర చైనాలోని గ్రామాలకు ప్రయాణిస్తూ సమగ్ర సంచార సేవను చేయటం మరింత ప్రయోజనకరమని విశ్వసించారు. అతను తన మొట్టమొదటి సువార్త పర్యటనలో వాంగ్ జీ అనే ఒక చైనా పండితుడిని కలుసుకున్నారు. వాంగ్ జీ కఠినమైన మరియు అహంకారము కలిగిన ప్రవర్తనను కలిగియున్నవారు. కానీ, కార్బెట్ యొక్క బోధన అతనిలో సత్యం కొరకైన గొప్ప ఆకాంక్షను రేకెత్తించింది. కాగా అతను కార్బెట్‌తో కలిసి తీవ్రముగా బైబిలును అధ్యయనం చేయుటకు ఎంతో సమయమును గడిపారు. త్వరలోనే అతను బాప్తిస్మం కూడా తీసుకున్నారు. వాంగ్ జీ యొక్క జీవితం మరియు అతని వైఖరిలో కలిగిన మార్పును చూసి ఆశ్చర్యపోయిన అతని భార్య కూడా తరువాత క్రీస్తును అంగీకరించారు. ఆ విధంగా దేవునిలోకి నడిపించబడిన వాంగ్ జీ దంపతులు క్రమేణా చైనాలో తదుపరి పరిచర్యకు పునాదులుగా మారారు.

 

  కార్బెట్ యొక్క విజయవంతమైన పరిచర్యతో పాటు శ్రమలు శోధనలు కూడా ఎదురయ్యాయి. ఊహించని పరిణామంలో, అతను పిల్లలను అపహరించారని మరియు తిరుగుబాటును లేవనెత్తుటకు పథకం వేశారని వదంతులు వ్యాపించాయి. తద్వారా ప్రజలు అకస్మాత్తుగా అతనికి శతృవులుగా మారారు మరియు అతను ఎక్కడికి వెళ్ళినా అతనిని రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు. అయితే, అద్భుతరీతిలో అతను అనేకసార్లు మరణం నుండి తప్పించుకున్నారు. ఒకసారి అతను సువార్త యాత్ర నుండి తిరిగి వచ్చేటప్పటికి అతని ఇల్లు ధ్వంసం చేయబడివుంది. ఏదేమైనప్పటికీ, శ్రమలన్నింటిలోనూ దేవుడు కార్బెట్ యొక్క బలము మరియు కేడెమునై ఉన్నాడు.


 సువార్తను ప్రకటించుటకు తాను అనుసరించే అసాధారణ పద్ధతులకు పేరుగాంచారు కార్బెట్. సువార్త వినుటకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని గ్రహించిన అతను, ఒక నాటకశాలను (థియేటర్‌ను) అద్దెకు తీసుకొని, దానిలో కొంత భాగాన్ని సంగ్రహాలయముగా (మ్యూజియంగా) మార్చారు. కాగా, సంగ్రహాలయమును చూచుటకు వచ్చిన ప్రతి ఒక్కరికీ మొదటి గదిలో సువార్త అందించబడిన తరువాతనే వారు ప్రదర్శించబడినవాటిని వీక్షించుటకు అనుమతించబడ్డారు. ఇటువంటి పద్ధతులు మంచి లాభకారముగా ఉన్నాయి. అతను షాండాంగ్ మిషన్‌ను కూడా స్థాపించగా, 1895వ సంll నాటికి ఆ మిషన్ క్రింద దాదాపు 63 మిషనరీలు మరియు 36 సంఘములు ఉన్నాయి. 1920వ సంll లో అతను మరణించే నాటికి, కార్బెట్ చేతుల మీదుగా బాప్తిస్మము పొందిన చైనా విశ్వాసులు 3,000 మందికి పైగా ఉన్నారు మరియు షాండాంగ్ ప్రావిన్స్ అంతటా దాదాపు 343 క్రైస్తవ సంఘములు స్థాపించబడి ఉన్నాయి!


🚸 *ప్రియమైనవారలారా, క్రైస్తవ నీతినిజాయితీలను ఏమాత్రం విడువక, శ్రమలను భరించుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


🛐 *"ప్రభువా, నా శ్రమలన్నింటిలో మీరు నా బలము మరియు కేడెమునై యున్నందుకు మీకుకృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆమేన్!"* 🛐

*******


🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • 2 comments:

    1. Praise the Lord
      It's a great work and good one. Request to please publish Indian missionary people and Telugu missionary people. Thank you

      ReplyDelete
      Replies
      1. Praise the LORD 🙏 Sure will do , Thank you,GBU 🙃

        Delete