"నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు." కీర్తన Psalm 22:1-10
పల్లవి : నాదు దేవా నాదు దేవా - నన్నేల విడనాడితివయ్యా
అనుపల్లవి : నన్ను రక్షింపక ఆర్తధ్వని - వినక నీవేల దూరమున్నావు?1. రాత్రింబగళ్ళు మొఱ్ఱబెట్టగా - ఏల నుత్తరమీయకున్నావు
ఇశ్రాయేలు స్తోత్రముపై కూర్చున్న - పరిశుద్ధ దేవుడవై యున్నావు || నాదు దేవా ||
2. మా పితరులు నీయందు - విశ్వసించగా రక్షించితివి
మొఱలిడి నిన్ను నమ్మిరి - విడుదలొంది సిగ్గునొందలేదు || నాదు దేవా ||
3. నరుడను కాను పురుగును - నరులచే నిందింపబడితి
నరులచే తృణీకారము - పొందియున్న వాడనైతిని || నాదు దేవా ||
4. నన్ను జూచు వారెల్లరు - తమ పెదవులను విరిచి
తలల నాడించుచున్నారు - నన్నపహసించుచున్నారు || నాదు దేవా ||
5. యెహోవాపై భారముంచుము - తాను నిన్ను విడిపించునేమో
వాడాయన కిష్టుడు కాడా - వాని తప్పించునేమో యందురు || నాదు దేవా ||
6.గర్భమునుండి నన్ దీసిన వాడా - నా తల్లి యొద్ద స్తన్యపానము
చేయుచుండగా నీవే కాదా - నాకు నమ్మిక పుట్టించితివి || నాదు దేవా ||
7. గర్భవాసినైనది మొదలు - నుండి నా కాధారము నీవే
నన్ను దల్లి కనిన నాటి - నుండి నా దేవుడవు నీవే || నాదు దేవా ||
No comments:
Post a Comment