Search Here

Sep 28, 2021

Udhaya saaymthramula nellavaelala | ఉదయ సాయంత్రముల నెల్లవేళల

"యెహోవా నాకు వెలుగును రక్షణయునై యున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును?" కీర్తన Psalm 27


పల్లవి : ఉదయ సాయంత్రముల నెల్లవేళల ప్రభువా నే ధ్యానించి పాడెదన్
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుండని దూతలు పాడుట వినబడుచుండున్

1. యెహోవాయే నాకు వెలుగు రక్షణయు
నేనెవరికి వెరతును?
యెహోవాయే నా ప్రాణ దుర్గంబాయె
శత్రువులు తొట్రిల్లిరి విడువకుము || ఉదయ ||

2. యుద్ధము చేయుటకు దండు దిగినను
నా హృదయము భయపడదు
యుద్ధము రేగినను దీనియందు నే
ధైర్యము విడువకుందున్ || ఉదయ ||

3.యెహోవా యొద్ద వర మొక్కటడిగితిని
దానిని వెదకు చున్నాను
యెహోవా ప్రసన్నత జూచి ఆలయమున
ధ్యానించుటయే నా ఆశ || ఉదయ ||

4. తన పర్ణశాలలో నను జేర్చి కాచును
నా ఆపత్కాలమునందు
తన గుడారములోన నను దాచియుంచును
దుర్గముపై నెక్కించున్ || ఉదయ ||

5. నా సన్నిధి వెదకి నా స్వరము వినుమని
నీవు పల్కితివి గాన
నీ సన్నిధిని వెదకి నీ స్వరమే వినెదను
నీ సముఖమును దాచకు || ఉదయ ||

6. నా తల్లిదండ్రులు నన్ను విడచినను
యెహోవాయే చేరదీయున్
నే ధైర్యము కలిగి నిబ్బరముగ నుండెద
నీ కొరకు కనిపెట్టెదన్ || ఉదయ ||

7. యెహోవా నాకై యుద్దేశించినది
ఆయనయే నెరవేర్చును
మహోన్నతుని మాటకు భయపడెడి పరిశుద్ధుల
కోరికలు నెరవేర్చును || ఉదయ ||
  • WhatsApp
  • No comments:

    Post a Comment