పల్లవి : యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్
1. మరణపు చీకటిలో తిరుగుచుండినను
ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా ||
2. పగవారి యెదుట ప్రేమతో నొక విందు
ప్రభు సిద్ధము చేయున్ పరవశ మొందెదము ||యెహోవా ||
3. నూనెతో నా తలను అభిషేకము చేయున్
నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా ||
4. చిరకాలము నేను ప్రభు మందిరములో
వసియించెద నిరతం సంతసముగా నుందున్ || యెహోవా ||
No comments:
Post a Comment