Search Here

Oct 18, 2021

George Piercy | జార్జ్ పియర్సీ

జార్జ్ పియర్సీ |  George Piercy



  • జననం: 1829
  • మహిమ ప్రవేశం: 1913
  • స్వస్థలం: యార్క్‌షైర్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: కాంటన్ ప్రావిన్స్, చైనా

 బైబిలు గ్రంథములోని ఎలీషా వలెనె జార్జ్ పియర్సీ కూడా యార్క్‌షైర్‌లో ఒక రైతుగా జీవిస్తున్నప్పుడు చైనాలోని దేవుని తోటలో కోత కోయువానిగా పనిచేయుటకు పిలవబడ్డారు. తన జీవితమును క్రీస్తుకు సమర్పించుకొనినప్పటి నుండి అతను వెస్లియన్ సంఘములో చురుకైన సభ్యులుగా ఉన్న అతను, విదేశాలలో దేవుని సేవ చేయుటను గూర్చి తరచుగా ఆలోచించేవారు.

 ఆ సమయంలో చైనాలో మిషనరీ సేవకు నెమ్మదిగా ద్వారాలు తెరువబడుతున్నాయి మరియు వెస్లియన్ సంఘం అక్కడ పరిచర్యకు ఇంకా ఎవరినీ పంపలేదు. చైనాలో సేవ చేయుటకు దేవుని నుండి స్పష్టమైన నడిపింపును కలిగియున్నారు పియర్సీ. అతను ఎరిగియున్నవారందరూ పలువిధములుగా అతనిని నిరుత్సాహపరిచినప్పటికీ, వెనుకంజవేయని పియర్సీ లండన్ చేరుకుని, అక్కడ వెస్లియన్ మిషనరీ సొసైటీ కార్యదర్శిని కలిశారు. యవ్వనస్థుడైన పియర్సీ సేవ పట్ల కలిగియున్న అత్యుత్సాహమును బట్టి సొసైటీ వారు అతని పట్ల సుముఖత చూపించినప్పటికీ, చైనాలో మిషన్ ప్రారంభించుటకు వారి వద్ద డబ్బు లేదు.

 కావున పియర్సీ మనస్సు దానిపై నుండి తొలగిపోయిందా? లేదు! తనను పిలిచినవాడు నమ్మకమైనవాడని ఎరిగియున్న అతను తన స్వంత ధనముతో చైనాకు వెళ్ళుటకు ఓడ ఎక్కారు. చైనాలో అతనికి తెలిసినవారెవరూ లేరు, తాను అక్కడ ఎలా బ్రతుకగలడో కూడా అతనికి తెలియదు. అయినప్పటికీ, కేవలం విశ్వాసము పైనే ఆధారపడి ఏమీ తెలియనటువంటి దిశగానే సాగిపోయిన పియర్సీ, 1851వ సంll లో హాంకాంగ్ చేరుకున్నారు.

 కొంతకాలం పాటు అతను ఆంగ్లేయులైన సైనికులను సందర్శిస్తూ వారి మధ్య పరిచర్య చేస్తూ గడిపారు. అయితే, అతని పిలుపు నశించుచున్న చైనీయుల కొరకే గానీ, క్రైస్తవ సైనికుల కొరకు కాదని అతను బాగుగా ఎరిగియున్నారు. అందు నిమిత్తం అతను కాంటన్ ప్రావిన్స్‌కు వెళ్ళి, అక్కడ అన్యజనుల మధ్య బలమైన పరిచర్యను ప్రారంభించారు. తాను ఇంకా కాంటనీస్ భాషను నేర్చుకుంటుండగానే అతను ఒక అనువాదకుని సహాయంతో సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. స్థానికుల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ మరియు తన సహపరిచారకులు మరణించినప్పటికీ అతను ఆ ప్రజల మధ్య మిగుల శ్రద్ధతో పనిచేశారు. అతని ప్రయత్నాల వలన క్రమక్రమంగా దేవుని రాజ్యం కాంటన్ ప్రావిన్స్ అంతటా విస్తరించింది.

 అతను కనుపరచిన గొప్ప మాదిరి ఐరోపాలోని అనేక మంది మెథడిస్టులకు ప్రేరణగా నిలిచింది. కాగా వారు చైనాకు వచ్చి పరిచర్యను విస్తరింపజేశారు. చైనాలో తన 31 సంవత్సరాల పరిచర్యలో తాను ఎదుర్కొన్న కష్ఠాలను మౌనముగానే భరించిన పియర్సీ తన ప్రియమైన భార్యను మరియు పిల్లలను కూడా ఆ కాలపరిథిలో కోల్పోయారు. అయినప్పటికీ, విగ్రహారాధికులైన చైనీయులను నిజమైన దేవుని యొద్దకు తీసుకురావలెననే తన ఉత్సాహమును అతను ఏనాడూ కోల్పోలేదు.

 81 సంll ల వయస్సులో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళిన జార్జ్ పియర్సీ 1913వ సంll లో తాను మరణించే వరకు కూడా దేవుని పరిచర్యను కొనసాగించారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం: 

🚸 *ప్రియమైనవారలారా, నిరుత్సాహమును ఎదుర్కొనినప్పుడు మీ హృదయము కృంగిపోతున్నదా?* 🚸

ప్రార్థన

🛐*"ప్రభువా, మీ కొరకు ఆత్మలను సంపాదించుటకైన తృష్ణను నాలో పునరుద్ధరించుము. ఆమేన్!"* 🛐

🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

  • WhatsApp
  • No comments:

    Post a Comment