లెనో ఎల్. రస్సెల్ | Leno L. Russell జీవిత చరిత్ర
- జననం: -
- మహిమ ప్రవేశం: -
- స్వస్థలం: ఓహియో
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: భారతదేశం
పరిశుద్ధ గ్రంథమైన బైబిలులోని క్రొత్త నిబంధనలో అపొస్తలుడైన పౌలు వ్రాసిన పత్రికలు ఒక ముఖ్యమైన భాగముగా ఉన్నాయని చెప్పవచ్చు. పరిశుద్ధ జీవితమును జీవించుటకు అవి ఈ నాటికీ క్రైస్తవులను ప్రోత్సహించేవిగా ఉన్నాయి. అదే విధంగా మిషనరీల సాక్ష్యాలు మరియు వారి రచనలు, ముఖ్యంగా వారు వ్రాసిన లేఖలు మిషనరీ భారమును కలిగియుండుటకు ఇతర విశ్వాసులను బహుగా ప్రభావితం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా జరుగుచున్న మిషనరీ కార్యకలాపాల గురించి క్రైస్తవులకు తెలియపరిచే ‘మిషనరీ టైడింగ్స్’ అనే పత్రిక కూడా మిషనరీ మార్గమును ఎంచుకొనుటకు అనేక మంది విశ్వాసులకు ప్రేరణ కలిగించినదిగా ఉంది. ఆ మిషనరీలలో లెనో రస్సెల్ కూడా ఒకరు.
ఓహియోలోని కార్బన్ హిల్ అనే ప్రాంతమునకు సమీపంలో ఒక వ్యవసాయ క్షేత్రంలో జన్మించిన లెనో రస్సెల్ యొక్క ఆరంభ జీవితం ఎంతో దీనస్థితిని కలిగినదైయుంది. చాలా చిన్న పాఠశాలలో చదువుకున్న ఆమె, చదువు పూర్తయిన తరువాత బోధించుటకు తిరిగి అదే పాఠశాలకు వచ్చారు. హిరామ్ కళాశాలలో చదువును కొనసాగించుటకు అవసరమైన ధనమును తానే సంపాదించి సమకూర్చుకొని, 1914వ సంll లో ఆ కళాశాల నుండి పట్టభద్రురాలయ్యారు లెనో. తన చిన్నతనంలోనే ఆమె క్రీస్తు సందేశమును తీసుకొని భారతదేశానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఆ వయసులోనే మిషనరీ సేవ పట్ల ఆమెకు ఏవిధంగా ఆసక్తి కలిగినదంటే ‘మిషనరీ టైడింగ్స్’ పత్రికను చదువుట ద్వారా. దానిని కార్యరూపము దాల్చుటకై సేవ కొరకైన శిక్షణ కొరకు ఆమె ‘కాలేజ్ ఆఫ్ మిషన్స్’ అనే కళాశాలలో చేరారు.
1915వ సంll లో భారతదేశానికి చేరుకున్న లెనో రస్సెల్, స్థానిక భాషను నేర్చుకొనుటలో కొంత సమయమును గడిపారు. 1916వ సంll లో ఆమె కుల్పహార్‌కు పంపించబడగా, అక్కడ స్త్రీల మధ్య ఆమె ఎంతో చురుకుగా పరిచర్యను జరిగించారు. ఆమె మరియు మరికొందరు స్త్రీలు కలిసి ప్రతిరోజూ స్థానిక మహిళలను వారి గృహములలో దర్శించి వారికి సువార్తను ప్రకటించారు. తదుపరి బినా అనే ప్రాంతములో అనేక సంవత్సరములు సేవ చేసిన లెనో, అక్కడ కూడా మహిళల మధ్య సువార్త సేవ చేయుటలో నిమగ్నులయ్యారు. అంతేకాకుండా అక్కడి బాలర మరియు బాలికల పాఠశాలలకు నిర్వహణా విధులను కూడా నెరవేర్చారు. తన చివరి నాలుగు సంవత్సరాల పరిచర్యను దామో ప్రాంతంలో జరిగించిన లెనో, అక్కడ విస్తృతమైన సువార్త సేవ మరియు విద్యా సంబంధ సేవలను అందించారు.
1928వ సంll లో అమెరికాకు తిరిగి వెళ్ళిన ఆమె, అక్కడ వేదాంతశాస్త్రములో వివిధ పట్టాలను సాధించుటలో కొన్ని సంవత్సరాలు గడిపారు. మిషనరీ పరిచర్యకు తిరిగి వెళ్ళవలెనని ఆమె హృదయం ఎంతగానో ఆకాంక్షించిప్పటికీ ఆమె ఆరోగ్యం అందుకు సహకరించలేదు. కాబట్టి అమెరికాలోనే ఉండిపోయిన ఆమె, అక్కడ విద్యార్థులకు మరియు మహిళలకు బోధిస్తూ మరియు ప్రసంగిస్తూ నిర్విరామంగా పనిచేశారు. నేరస్థులైన బాలికల యెడల ఆమె ప్రత్యేకమైన భారమును కలిగియున్నారు. కాగా సువార్తను ప్రకటించి, బైబిలును బోధించుట ద్వారా వారిని నీతివంతమైన మార్గములో నిలబెట్టుటకు ఆమె ప్రయత్నించారు. అక్కడ నిత్య జీవమును కనుగొనుటకు ఆ బాలికలకు సహాయపడుటలో ఆమె సంతోషమును కనుగొన్నారు.
ఈ జీవిత చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం:
ప్రియమైనవారలారా, మీరు మీ సంతోషమును ఎక్కడ కనుగొంటున్నారు?
ప్రార్థన :
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment