Search Here

Oct 29, 2021

Johann Leonhard Dober | జోహన్ లియోనార్డ్ డోబర్

జోహన్ లియోనార్డ్ డోబర్  | Johann Leonhard Dober


  • జననం: 07-03-1706
  • మహిమ ప్రవేశం: 01-04-1766
  • స్వస్థలం: మోంచ్‌స్రోత్
  • దేశం: జర్మనీ
  • దర్శన స్థలము: సెయింట్ థామస్, కరేబియన్ దీవులు

 “మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.” (ఫిలిప్పీయులు 2:7). మిమ్ములను రక్షించుటకు యేసు క్రీస్తు ప్రభువే స్వయంగా దాసుని స్వరూపమును ధరించుకొనగా, ఇతరులను రక్షించుటకు మీరు అదే మాదిరిని అనుసరించుటకు సిద్ధముగా ఉన్నారా? జోహాన్ లియోనార్డ్ డోబర్ అందుకు సిద్ధమయ్యారు!

 శ్రద్ధాసక్తులు కలిగిన ఒక క్రైస్తవుడైన డోబర్, జర్మనీలోని ఒక గ్రామంలో ఒక కుమ్మరిగా ఉన్నారు. అతనికి పద్దెనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు వెస్టిండీస్‌కు చెందిన ఒక బానిస క్రీస్తు గురించి తెలియపరచుటకు తన ద్వీపానికి ఎవరినైనా పంపమని ఇతరులను వేడుకోవడం అతను వినడం జరిగింది. అందునుబట్టి యవ్వనస్థుడైన డోబర్ తన హృదయములో కలత చెందారు మరియు క్రీస్తును గురించి తెలియని ప్రజలను గూర్చిన ఆలోచనల వలన అతనిలో అశాంతి నెలకొంది. అయితే, మిషనరీగా పంపబడుటకు వయస్సులో అతను చాలా చిన్నవాడు మరియు అతనికి మద్దతు నిచ్చి, ఆర్థిక సహాయమందించే ఏ సంస్థ కూడా అక్కడ లేదు. చివరికి, వెళ్ళులాగున తనను అనుమతించుటకు సంఘ అధికారులను అతను ఏదో ఒకవిధంగా ఒప్పించగలిగారు. కాగా, అతను వెళ్ళుటకు అనుమతించిన క్రైస్తవ సంఘ అధికారులు వయస్సులో పెద్దవాడు మరియు ఒక వడ్రంగి అయిన డేవిడ్ నిట్ష్‌మాన్‌ను అతనితో పాటు పంపించారు.

 వెస్టిండీస్‌కు వెళ్ళే ఓడ ఎక్కుటకు వారిరువురు కలిసి కోపెన్‌హాగన్ వెళ్ళారు. అక్కడ ఈ యవ్వనస్థుని ధైర్యానికి డచ్ అధికారులు ఆశ్చర్యపోయారు. ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా వారు వెస్టిండీస్‌లో ఎలా జీవించాలని అనుకుంటున్నారని ఆ అధికారులు వారిని అడిగినప్పుడు, “మేము బానిసల మధ్యలో బానిసలుగా పని చేస్తాము” అని నిట్ష్‌మాన్ సమాధానం ఇచ్చారు. అయితే, ఆ అధికారులు శ్వేతజాతీయులైన ఆ వ్యక్తులు బానిసలుగా ఉండుటకు వారిని అనుమతించడానికి ఇష్టపడలేదు. కానీ, డోబర్ ఏదో ఒకవిధంగా వారిని కూడా ఒప్పించి, 1732వ సంll లో సెయింట్ థామస్ ప్రాంతానికి చేరుకున్నారు.

 బానిసగా మారుటకు డోబర్ సిద్ధమైనప్పటికీ, దేవుని ఏర్పాటును బట్టి అతను కుమ్మరి పనిలోను మరియు వడ్రంగి పనిలోను తన నైపుణ్యాలను ఉపయోగించి అక్కడ జీవించగలిగారు. తమకు సువార్తను బోధించుటకు తమ వలెనే బానిసగా మారడానికి సిద్ధపడిన శ్వేతజాతీయుడైన ఈ యువకుని వైపు అక్కడి బానిసలు ఆకర్షితులయ్యారు. వారు తమ జీవితాల పట్ల దేవుడు కలిగియున్న ఉద్దేశ్యములను మనఃపూర్వకంగా అంగీకరించారు.

  పరిచర్య యొక్క ఇతర ప్రయోజనాల కోసం 1734వ సంll లో డోబర్ జర్మనీకి తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అయితే, అనేకమంది అతని అడుగుజాడలను అనుసరించి సెయింట్ థామస్ ప్రాంతమును చేరుకొని, అక్కడ అతను వేసిన పునాదులపై దేవుని సంఘమును నిర్మించారు. ఐరోపా ఖండములోని అనేక ప్రాంతాలలో 30 సంవత్సరాలకు పైగా ఫలవంతమైన పరిచర్య జరిగించిన జోహాన్ లియోనార్డ్ డోబర్, 1766వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొనుటకు ఇహలోకమును విడిచి వెళ్ళారు.

ప్రియమైనవారలారా, మీ స్వంత సౌలభ్యం కంటే నశించుచున్న ఆత్మల యొక్క అవసరతలకు మొదటిగా ప్రాధాన్యమిచ్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?

"ప్రభువా, నా మహిమ కొరకు కాక, మీ మహిమార్థమై పనిచేయుటకు ఎంచుకొనే ఒక దాసుని హృదయమును నాలో కలిగించుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక !
  • WhatsApp
  • No comments:

    Post a Comment