Search Here

Mar 4, 2022

Krupa Krupa Sajeevulatho | కృపా - కృపా సజీవులతో - Hosanna Ministries 32nd Album [Srikaruda Naa Yesayya] Song 5 "శ్రీకరుడా నా యేసయ్యా" Pas.Ramesh anna

Krupa Krupa Sajeevulatho | కృపా - కృపా సజీవులతో - Hosanna Ministries 32nd Album [Srikaruda Naa Yesayya] Song 5 "శ్రీకరుడా నా యేసయ్యా" Pas.Ramesh anna


కృపా - కృపా సజీవులతో
నను నిలిపినది నీ కృపా || 2 ||
నా శ్రమదినమున నాతో నిలిచి
నను ఓదార్చిన నవ్యకృప నీదు కృప || 2 ||
కృపా సాగర మహోనాతమైన - నీ కృపా చాలుయా || కృపా||



1. శాశ్వతమైన నీ ప్రేమతో - నను ప్రేమించిన శ్రీకరుడా
నమ్మకమైన నీ సాక్షినై నే - నీ దివ్య సన్నిధిలో నన్నొదిగిపోని || 2 ||
నీ ఉపదేశమే నాలో ఫలబరితమై - నీ కమనియకాంతులను విరజిమ్మెనే || 2 ||
నీ మహిమను ప్రకటింప - నను నిలిపేనే || కృపా||



2. గాలితుఫానుల అలజడితో - గూడుచెదరిన గువ్వవలే
గమ్యమును చూపే నిను వేడుకొనగా - నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించితివి || 2 ||
నీ వాత్యల్యమే నవ వసంతము - నా జీవిత దినములు ఆద్యంతము ||2||
ఒక్క క్షణమైన విడువని ప్రేమామృతము ||కృపా||


3. అత్యునతమైన కృపలతో -ఆత్మఫలము సంపదలతో
అతిశ్రేష్టమైన స్వాస్త్యమును పొంది - నీ ప్రేమ రాజ్యములో హర్షించువేళ || 2 ||
నా హృదయార్పణ నిను మురిపించని - నీ రుణాతిశయములను కీర్తించని || 2 ||
ఈ నీరీక్షణ నాలో నేరవని || కృపా||






  • WhatsApp
  • No comments:

    Post a Comment