Search Here

Apr 18, 2022

Ninnu chere prathi kshanam | నిన్ను చేరే ప్రతి క్షణం

Ninnu chere prathi kshanam | నిన్ను చేరే ప్రతి క్షణం


నిను చేరే ప్రతీ క్షణం ప్రభాతమే నాలో 

స్మరింతునూ నీ నామం నిరంతరం యేసు 


1. నీ పిలుపే నా కోసం - నీ పలుకే ఆధారం నీకే ఆరాధనా

కన్నుల్లో నీ రూపం - కనిపించే నా దైవం నిన్ను నే చేరగా 


నీ ప్రేమే మాధుర్యం - నడిపించే నా దీపం నీవు నా తోడుగా

నీ వరమే ఈ స్నేహం - నాతోనే కలకాలం యేసయ్య నా రక్షకా 

వేవేల స్తోత్రాలతో నిన్ను కీర్తింతును 

ఆనంద గానాలతో నిన్ను స్తుతియింతును 


 2. నీ తలపే నా ధ్యానం - నా మనసే నీ సొంతం నిన్ను ప్రేమింతును 

నీతోనే సహవాసం - నను కోరే అనురాగం యేసయ్య నా ప్రాణమా 


నీతోనే చిరకాలం - సాగాలి నా పయనం గమ్యమే నీవుగా

నీ ప్రేమే అపురూపం - మన్నించే మమకారం నీవే నా ప్రేరణ 


ఏ రీతి నే పాడనూ నీదు ఘన ప్రేమను 

యేసయ్య నీ సేవలో నేను తరియింతును

  • WhatsApp
  • No comments:

    Post a Comment