Search Here

Oct 1, 2021

James Duthie | జేమ్స్ ధూథీ

జేమ్స్ ధూథీ  |  James Duthie





  • జననం: 02-11-1833
  • మరణం: 03-07-1908
  • స్వస్థలం: యూరాస్
  • దేశం: స్కాట్లాండ్
  • దర్శన స్థలం: భారతదేశం

భారతదేశంలో కుల వ్యవస్థ అనేక సమాజిక కీడులకు కారణమయ్యింది. అటువంటి వాటిలో ఒకటి



అంటరానితనం. ఇది అగ్రవర్జ ప్రజలు తక్కువ కులాల వారిని బహిష్కరించి, వారితో అమానుషంగా

వ్యవహరించే ఒక పద్ధతి. ఎంతో మంది క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో నెలకొనియున్న అటువంటి కుల

అసమానతలను సవాలు చేసి, సమాజములో సానుకూల మార్పు తీసుకువచ్చుటలో కీలక పాత్ర పోషించారు.

అటువంటి వారిలో ఒకరు జేమ్స్‌ దూథి.




బెడ్‌ఫోర్డ్‌లో తన విద్యాభ్యాసమును పూర్తి చేసుకొని, మిషనరీగా చెన్నె ప్రాంతమునకు

నియమితులైన జేమ్స్‌ దూథీ, ప్రధానంగా విద్యా సంబంధిత సేవలందించుటకు నియమించబడ్డారు. పిమ్మట

1859వ సం] లో పూర్తి స్థాయిలో మిషనరీ సేవ జరిగించుటకు అతను నాగర్‌కోయిల్‌కు పంపబడ్డారు.

అక్కడ దళితుల దయనీయ పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయిన అతను, అటువంటి సమాజమును మార్చుటకు

తన సమస్తమునూ ధారపోయవలెనని ప్రార్ధనాపూర్వకముగా నిర్ణయించుకున్నారు.




స్థానిక ప్రజల అవసరతలను పరిశీలించి తెలుసుకొనిన జేమ్స్‌, మంచి విద్య అనేది అక్కడి ప్రస్తుత

అవసరమని గ్రహించారు. సామెతలు 24:5లో చెప్పబడినట్లుగా “జ్ఞానముగలవాడు బలవంతుడుగా

నుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును.” అని అతను పూర్ణ హృదయముతో విశ్వసించారు.

తత్భలితముగా అతను పాఠశాలలను స్థాపించారు మరియు కుల వ్యవస్థ యొక్క సంకెళ్ళను విచ్చిన్నం

చేయుటకు జ్ఞానమును సంపాదించవలెనని స్థానికులను ప్రోత్సహించారు. ప్రారంభములో బ్రాహ్మణుల నుండి

తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొనవలసి వచ్చింది. అయితే జేమ్స్‌ ఎంతో జాగ్రత్తగా ముందుకు అడుగులు వేస్తూ,

వారి పిల్లలు పాఠశాలకు వెళ్ళుటకు అనుమతించవలెనని సమాజములో అన్ని వర్గాలను ఒప్పించారు. క్రమేణా

బైబిలులోని సమానత్వ భావనలను నేర్చుకొనిన పిల్లలు సమాజ మార్పుకు సాధనములుగా మారారు.



మరొక వైపు జేమ్స్‌ యొక్క భార్య మహిళలను వ్యక్తిగతముగా సంధించి వారికి సువార్తను

అందించుటకు ఎంతో తీవ్రముగా శ్రమించారు. ఆమె తన కుమార్తెతో కలిసి ధనము సంపాదించుటకు

ఉపయోగపడే కొన్ని నైపుణ్యములను భారతీయ మహిళలకు నేర్పించారు. విద్య సమాజంలో ఉన్న అనేక

మూఢవిశ్వాసాలను కూడా పారద్రోలింది మరియు అనేకమంది క్రీస్తును అంగీకరించారు. పిమ్మట జేమ్స్‌ ఒక

బైబిలు వేదాంత కళాశాలను కూడా ప్రారంభించి, సువార్త ప్రకటించి సంఘములను స్థాపించగలుగుటకు

నూతన విశ్వాసులకు శిక్షణనిచ్చారు. అంతేకాదు, ఆ ప్రాంతాలలో ఉన్నత విద్యకు మార్గదర్శక సంస్థగా నిలిచి,

ఇప్పుడు బహుగా ప్రసిద్ధి చెందిన “స్కాట్‌ క్రిస్టియన్‌ కాలేజీ” ని కూడా అభివృద్ధి చేసిన మిషనరీ జేమ్స్‌.



ప్రజల సామాజిక మరియు ఆత్మీయ స్థితిగతులను ఎంతగానో మెరుగుపరిచిన సమర్పణతో కూడిన

50 సం ల నిరంతర సేవ జరిగించిన పిమ్మట 1908వ సం1॥ లో పరమందు తన ప్రభువును చేరుకొన

ఇహలోకమును విడిచివెళ్ళారు జేమ్స్‌ దూధీ.



ప్రియమైనవారలారా, క్రైస్తవ సంఘములోను మరియు సమాజములోను సమానత్వము కొరకు మీరు కృషి

చేయుచున్నారా?
  • WhatsApp
  • No comments:

    Post a Comment