Search Here

Oct 13, 2021

Nelson Bell | నెల్సన్ బెల్

నెల్సన్ బెల్ |  Nelson Bell


  • జననం: 30-07-1894
  • మహిమ ప్రవేశం: 02-08-1973
  • స్వస్థలం: వర్జీనియా
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: చైనా

 లెమూయేల్ నెల్సన్ బెల్ భక్తిగల ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించారు. పదకొండేళ్ళ వయసులో అతను తన జీవితమును క్రీస్తుకు సమర్పించారు. అతను న్యాయశాస్త్రమును అభ్యసించవలెనని కోరుకున్నారు. కానీ, ఒక వైద్య మిషనరీ కావాలని అతను ఎప్పుడైనా ఆలోచించాడా అని ఒక స్నేహితుడు అతనిని అడిగినప్పుడు, దేవుని స్వరమును వినిన నెల్సన్, తాను ఏమి చేయవలెనని దేవుడు కోరుకుంటున్నాడో గ్రహించారు. కాగా, అతను న్యాయ శాస్త్రమును విడిచిపెట్టి వైద్య శాస్త్రమును అభ్యసించారు.

 1916వ సంll లో తన భార్య వర్జీనియాతో కలిసి చైనాకు పయనమయ్యారు నెల్సన్. అక్కడ అతను “లవ్ అండ్ మెర్సీ హాస్పిటల్” లో పని చేయడం ప్రారంభించారు. అతను గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న వైద్య కేంద్రాలను (క్లినిక్‌) ప్రారంభించారు మరియు స్థానిక జైలును కూడా సందర్శించి ఖైదీలకు వైద్యం అందించేవారు. యుద్ధ సమయంలో ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య కూడా అతను వెనుకంజ వేయక చైనా ప్రజలకు సేవలందించుటకు అక్కడే ఉండిపోయారు. దయా హృదయముతో అతను అందించే సేవలను బట్టి ప్రజలు అతనికి “ఐహువా” అనే పేరు పెట్టారు. దాని అర్థం "చైనా ప్రజలను ప్రేమించేవాడు".

 అతను సమర్థవంతమైన వైద్యుడు, కష్టపడి పనిచేసేవాడు మరియు శస్త్ర చికిత్సలో విజయవంతమైన వైద్యునిగా పేరుగాంచినవారు. అతను తన వైద్య నైపుణ్యాలను మెరుగుపరచుకొనుటకు ఎల్లప్పుడూ కృషి చేసేవారు. అయినప్పటికీ, మిషనరీగా అతని విజయానికి కారణం ఆత్మల కొరకైన ప్రేమ మరియు అతను తన పనిలో కనుపరచిన దయాకనికరములు. అతను “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము” అని ఆత్మ ఫలమును ఒక కాగితముపై వ్రాసి, దానిని తన బల్ల మీద ఉన్న గాజు తలము క్రింద పెట్టుకున్నారు. ఏ ఇతర ప్రతిభ లేదా తలాంతుల కంటే కూడా ఇది చాలా ముఖ్యమైనదని విశ్వసించిన అతను, తాను సేవలందిస్తున్న ప్రజలకు తనలో ఆ లక్షణములను కనుపరచుటకు అనుదినమూ ప్రయత్నించారు. ఎల్లప్పుడూ అతని ప్రధాన లక్ష్యమేమనగా సువార్తను విస్తరింపచేయడం మరియు క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడం. ఆసుపత్రి నుండి కోలుకొని వెళ్లిపోయే రోగుల జాబితాను అతను తయారుచేసి, చైనా సువార్తికులు వారిని సంధిస్తూ ఆత్మీయముగా వారిని నడిపించేలా చూసుకునేవారు నెల్సన్.

 1941వ సంll లో అమెరికాకు తిరిగి వచ్చిన నెల్సన్ అక్కడ కూడా వైద్య సేవలను అందించడం కొనసాగించారు. దక్షిణ ప్రెస్బిటేరియన్ సంఘము యొక్క వరల్డ్ మిషన్స్ బోర్డ్ యొక్క సభ్యునిగా ఎన్నికయ్యి పదిహేడేళ్ళ పాటు సేవలందించిన అతను, ఆ కాల పరిధిలో ప్రపంచవ్యాప్తంగా మిషనరీలను సందర్శించి, వారి సమస్యలను మరియు ఆలోచనలను బోర్డుకు తెలియజేశారు. ‘ది సదరన్ ప్రెస్బిటేరియన్ జర్నల్’ మరియు ‘క్రిస్టియానిటీ టుడే’ అనే తన పత్రికల ద్వారా అతను క్రైస్తవ్యంలో ఉదాసీనతను ప్రోత్సహిస్తున్న వేదాంతశాస్త్ర బోధనలను వ్యతిరేకిస్తూ, బైబిలు కేంద్రీకృత వేదాంత బోధనలకు తిరిగి రావాలని క్రైస్తవ లోకానికి అతను పిలుపునిచ్చారు. నాలుగు సార్లు గుండెపోటు కలిగి బాధపడినప్పటికీ ఏ మాత్రం విశ్రమించక తన చివరి శ్వాస వరకు కూడా దేవుని సేవలో ముందుకు సాగిపోయారు నెల్సన్ బెల్.

ప్రియమైనవారలారా, మీ అనుదిన జీవితములలో ఆత్మ ఫలమును కనుపరచుటకు మీరు ప్రయత్నిస్తున్నారా?

ప్రభువా, నాలో ఆత్మ ఫలమును కలిగియుండుటకును మరియు మీ కొరకు నేను బహుగా ఫలించుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment