కరెన్ వాట్సన్ గారి జీవిత చరిత్ర
- జననం: 1965
- మహిమ ప్రవేశం: 15-03-2004
- స్వస్థలం: బేకర్స్‌ఫీల్డ్
- దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
- దర్శన స్థలము: ఇరాక్
“నేను సరైన నిర్ణయం తీసుకొనలేదేమో అని వెనక్కి తిరిగి చూచి విచారించే అవసరం దేవుడు పిలిచినప్పుడు ఉండదు. దేశములన్నింటి కొరకు నేను కలిగియున్న హృదయమును వీలైనంత వరకు మీతో పంచుకొనుటకు నేను ప్రయత్నించాను. ఒక ప్రదేశము యొద్దకు నేను పిలువబడలేదు; ఆయన యొద్దకు పిలువబడ్డాను. అందుకు విధేయత చూపడమే నా గురి, శ్రమననుభవించవలెననునది ఊహించగలిలినదే, ఆయన యొక్క మహిమ నాకు లభించే బహుమతి...
మిషనరీ హృదయం అనునది
కొందరు యుక్తమని ఎంచిన దానికంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది
కొందరు సురక్షితమని తలంచిన దానికంటే ఎక్కువగా తెగింపును కలిగియుంటుంది
ఆచరణబద్ధమని కొందరు భావించిన దానికంటే మించిన లక్ష్యములను కలిగియుంటుంది
సాధ్యమని కొందరు భావించిన దానికంటే మించిన వాటిని ఆశిస్తుంది
నా సౌఖ్యము కొరకో లేదా విజయము కొరకో కాదు, విధేయత చూపించుట కొరకు నేను పిలువబడ్డాను... యేసును ఎరుగుట మరియు ఆయనను సేవించుట కంటే వెలుపల మరే సంతోషం లేదు...”
ఇవి ఇరాక్‌కు తన మిషనరీ యాత్రను ప్రారంభించే ముందు కరెన్ వాట్సన్ తమ పాదిరిగారికి వ్రాసిన లేఖలోని కొన్ని మాటలు.
క్రైస్తవ కుటుంబంలో జన్మించిన కరెన్, తన వ్యక్తిగత జీవితములో తీవ్రమైన సంక్షోభకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించారు. చర్చిలో ఆమె యవ్వనస్థులకు మరియు పిల్లలకు బైబిలు అధ్యయన తరగతులను నిర్వహించేవారు. అవకాశం వచ్చినప్పుడు ఆమె ఎల్ సాల్వడార్, మెక్సికో, మాసిదోనియా మరియు కొసావోలలో చిన్న చిన్న సువార్త ప్రచార కూడికలలో పాల్గొనడం ప్రారంభించారు. అటుపిమ్మట ఆమె హృదయం దేవుని పరిచర్య చేయుటకు మరి ఎక్కువగా వాంఛించడం ప్రారంభించింది. తత్ఫలితముగా ఆమె జైలు అధికారిగా మంచి జీతం వచ్చే తన ఉద్యోగమును విడిచిపెట్టి ‘ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు’ లో (IMB - ఐ.ఎమ్.బి. - అంతర్జాతీయ మిషన్ బోర్డు) చేరారు.
ఇరాక్ యొక్క ఉగ్రవాదులతో అమెరికా యుద్ధం చేస్తున్న సమయంలో 2003వ సంll లో కరెన్ తన ఇంటిని మరియు ప్రాపంచిక ఆస్థిపాస్తులన్నింటినీ విక్రయించి ఇరాక్‌లోని మోసుల్‌కు చేరుకున్నారు. అక్కడి యుద్ధ ప్రాంతాలలో మానవతా సహాయం అందించడం ప్రారంభించిన ఆమె, క్రీస్తు ప్రేమను బోధించుటకు ఆ అవకాశాలను ఉపయోగించుకున్నారు. యుద్ధం కారణంగా మూసివేయబడిన పాఠశాలలను ఆమె పునరుద్ధరించడం ప్రారంభించి, అనధికారికంగానే పిల్లలకు బోధించడం ప్రారంభించారు. నిరంతరం తీవ్రవాదుల నుండి ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ ఆమె ఎల్లప్పుడూ ఉల్లాసంగాను, మంచి హాస్యభావముతోను మరియు కనికరము నిండుకొనినవారై యుండెడివారు. ఇరాక్‌లోని క్రైస్తవులు ఆమెను బైబిలు గ్రంథములో పేర్కొనబడిన ‘తబితా’ తో పోల్చేవారు.
2002వ సంll మార్చి 15వ తారీఖున, కరెన్ మానవతా సహాయం అందించుటకై మరో ముగ్గురు మిషనరీలతో కలిసి వెళుతున్నారు. మార్గం మధ్యలో తుపాకీలను ధరించుకొనిన కొంతమంది ఆమె ప్రయాణిస్తున్న వాహనముపై మెరుపుదాడి చేసి కాల్పులు జరుపగా, కరెన్ మరియు ఆమెతో పాటు ఉన్న మిషనరీలందరూ తమ ప్రాణాలు కోల్పోయారు.
ప్రియమైనవారలారా, మీరు యేసును ఎరుగుట మరియు ఆయనను సేవించుట అనువాటికి వెలుపల ఉన్న తాత్కాలిక ఆనందమును పొంద ప్రయాసపడుతున్నారా?
ప్రభువా, నాలో మిషనరీ హృదయమును పుట్టించుము .ఆమేన్!"
దేవునికే మహిమ కలుగునుగాక!
No comments:
Post a Comment