Search Here

Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Apr 7, 2022

Nathan Brown | నాతాన్ బ్రౌన్

నాతాన్ బ్రౌన్ జీవిత చరిత్ర



  • జననం : 22-06-1807
  • మరణం : 01-01-1886
  • స్వస్థలం : న్యూ ఇప్స్‌విచ్, న్యూ హాంప్‌షైర్
  • దేశం  : అమెరికా
  • దర్శన స్థలము : అస్సాం (భారతదేశం), జపాన్


మన చేతులలో మన మాతృభాషలోనే బైబిలును కలిగియుండటం ఎంతటి భాగ్యం! అయితే ఎంతోమందికి అటువంటి భాగ్యం లేదు. కాగా అనేక మంది దైవజనులు వారి అవసరతలను తీర్చుటకు ముందుకు వచ్చారు.


ఒక బాప్తిస్టు మిషనరీయైన నాతాన్ బ్రౌన్, అస్సామీ భాషలో చేసిన రచనలకు పేరుగాంచారు. అమెరికాలోని న్యూ ఇప్స్‌విచ్‌లో జన్మించిన అతను, మసాచుసెట్స్‌లోని విలియమ్స్‌టౌన్‌లో ఉన్న విలియమ్స్ కళాశాల నుండి పట్టభద్రులయ్యారు. పిమ్మట 25 సంll ల వయస్సులో అతను తన భార్యతో కలిసి మిషనరీగా సేవ చేయుటకు బర్మాకు పయనమయ్యారు. అక్కడ కొంతకాలం పాటు మరొక మిషనరీయైన అడోనిరామ్ జడ్సన్‌కు అనువాద సేవలో  సహాయకారిగా ఉన్న నాతాన్ బ్రౌన్, తదుపరి భారతదేశంలోని అస్సాంలో సేవ చేయుటకు నియమించబడ్డారు.


అప్పటిలో అస్సామీ భాషలో లభ్యమయ్యే బైబిలు విలియం కేరీ చేసిన అనువాదం. అందులో అనేక బెంగాలీ మరియు సంస్కృత పదాలు కలిసి ఉండేవి. కాబట్టి స్వచ్ఛమైన అస్సామీ భాషలో బైబిలును అనువదించాలని తీర్మానించుకున్న బ్రౌన్, 1848వ సంll లో క్రొత్త నిబంధనను మరియు అస్సామీ వ్యాకరణంపై ఒక పుస్తకమును కూడా ప్రచురించారు. అంతేకాకుండా, పలు ప్రార్థనా పుస్తకములను అనువదించారు, అస్సామీ-ఆంగ్ల నిఘంటువును సవరించారు మరియు అనేక ఇతర చారిత్రక మరియు విద్యాసంబంధ రచనలను ప్రచురించారు. అస్సామీ భాష యొక్క సాహిత్య రచనలలో అతను చేసిన కృషి, అప్పటికి ఇంకా గుర్తించబడని ఆ భాష గుర్తింపు పొందుటలో గొప్ప పాత్ర పోషించింది.


తరువాత అమెరికాకు తిరిగి వచ్చిన అతను, అక్కడ బానిసత్వ నిర్మూలన ఉద్యమంలో చేరి దేశంలో బానిసత్వాన్ని రూపుమాపుటకు పోరాడారు. 65 సంll ల వయస్సులో మరోసారి మిషనరీ సేవకై దూరదేశ ప్రయాణమును తలపెట్టారు. ఫలితంగా జపాన్ నగరమైన యోకోహామాకు చేరుకున్న బ్రౌన్, ఆ దేశానికి మొట్టమొదటి బాప్తిస్టు మిషనరీగా వెళ్ళిన జోనాతాన్ స్కోబీ లేదా జోనాతాన్ గోబుల్ అని పేర్కొనబడే మరొక మిషనరీతో కలిసి సేవ చేశారు. వారిరువురూ కలిసి 1873వ సంll లో యోకోహామాలో మొట్టమొదటి జపానీయుల బాప్తిస్టు చర్చిని స్థాపించారు. తక్కువ విద్యాభ్యాసం కలిగియున్నవారు కూడా బైబిలును చదువగలిగేలా సులభముగా చదువగలిగే సరళమైన లిపిలో జపాన్ బైబిలును ముద్రించుటకు బ్రౌన్ ఎంతో శ్రమించారు. తన మిగిలిన జీవితమంతా జపాన్ దేశములోనే సేవ చేసిన నాతాన్ బ్రౌన్, అదే దేశంలో 1886వ సంll లో తన స్వదేశానికి దూరంగా తుది శ్వాస విడిచారు.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ తెలివితేటలను దేవుని వాక్యాన్ని ప్రజలకు సమీపముగా తీసుకువచ్చుటకు ఉపయోగించెదరా? 


ప్రార్థన :

"ప్రభువా, చదువులేని వారు కూడా గ్రహించగలిగేలా మీ వాక్యమును వివరించగలుగునట్లు నాకు కృప దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Feb 12, 2022

    Neesima Shimeta Life History

    నీసిమా షిమెటా జీవిత చరిత్ర


    • జననం: 12-02-1843
    • మహిమ ప్రవేశం: 23-01-1890
    • స్వస్థలం: ఎడో
    • దేశం: జపాన్
    • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు జపాన్

    జపాన్‌లో ఒక శక్తివంతమైన సైనిక కులమైన సమురాయ్ కులానికి చెందిన నీసిమా షిమెటా తన ఖడ్గాన్ని విడిచిపెట్టి, సత్య దేవుని సేవించవలెనని బైబిలును చేత పట్టుకున్నారు. ధైర్యవంతులైన ఇటాకురా వంశంలో జన్మించిన నీసిమా మతపరంగా తన దేవుళ్లను పూజించేవారు. అయితే వారికి తాను అర్పించే అర్పణలను వారు ఏనాడూ ముట్టుకొనలేదని గమనించిన అతను, ఆ దేవుళ్ళు నిర్జీవముగా ఉన్నారని ఒక రోజున గ్రహించారు. పదిహేనేళ్ళ వయసు ఉన్నప్పుడు సంక్షిప్తముగా వ్రాయబడిన ఒక బైబిలు గ్రంథం అతనికి దొరికింది. “ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.” అని వ్రాసియున్న ప్రారంభ వాక్యం అతనిని బలంగా తాకింది. తన మతానికి సంబంధించిన పుస్తకాలు ఏవీ కూడా సృష్టి గురించి మాట్లాడకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. కాగా బైబిలు చెబుతున్న ఆ దేవుడెవరో అతనికి తెలియకపోయినప్పటికీ ఆయనకు ప్రార్థించడం ప్రారంభించారు నీసిమా.



    వేరొక దేశమునకు చెందిన ఈ దేవుని గురించి తనకు విదేశీయుల ద్వారానే ఎక్కువగా తెలుస్తుందని వారిని కలుసుకొనుటకు అతను నిర్ణయించుకున్నారు. అందుకొరకు అతను వాణిజ్యవర్తకముల కొరకు విదేశీయులకు అనుమతించబడిన ఏకైక ఓడరేవు అయిన హకోడేట్‌ను రహస్యముగా చేరుకున్నారు. అక్కడ రష్యాకు చెందిన ఒక చాప్లిన్‌తో (ప్రార్థనాలయ అధికారి) అతను జరిపిన చర్చలు అతని మనోనేత్రములకు మరికొంత వెలుగునిచ్చాయి. జపాన్‌లో క్రైస్తవ మతం అనుమతించబడదు కాబట్టి, అక్కడి నుండి తప్పించుకోవాలని అతను నిర్ణయించుకొని, అమెరికా వెళ్ళే ఓడ ఎక్కారు. ఆ నౌకాధికారి దయగలవాడు. అతను నీసిమాకు బైబిలు సత్యాలను బోధించారు. ప్రయాణం మధ్యలో ఒక క్రొత్త నిబంధన గ్రంథమును కొనుటకై నీసిమా తన ఖడ్గమును విక్రయించారు.



    1865వ సంll లో బోస్టన్ నగరమును చేరుకున్నారు నీసిమా. అక్కడ అతను విద్యాభ్యాసమును పొందుటకు నౌకాధికారి సహాయం చేశారు. తద్వారా అండోవర్ థియోలాజికల్ సెమినరీ నుండి వేదాంత విద్యను పూర్తి చేసుకొనిన అతను, పిమ్మట ‘అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్’ (ఎ.బి.సి.ఎఫ్.ఎమ్.) సంస్థలో చేరారు. కాగా ఇప్పుడు ఒక మిషనరీగా జపాన్‌కు తిరిగి వెళ్లాలని అతను అనుకున్నారు కానీ అందుకు అతనికి నిధులు ఇచ్చుటకు ఎ.బి.సి.ఎఫ్.ఎమ్. సంస్థవారు సిద్ధంగా లేరు. అయితే ఒక సమావేశంలో కన్నీటి పర్యంతమై అతను చేసిన విజ్ఞప్తి అమెరికా క్రైస్తవుల హృదయాలను ద్రవింపజేసింది. చివరికి, 1875వ సంll లో చేతిలో 5000 డాలర్లతో జపాన్ చేరుకున్నారు నీసిమా.



    వెంటనే అతను క్యోటోలో దోషిషా పాఠశాలను స్థాపించడం ద్వారా విద్యా సంబంధముగా పరిచర్యను ప్రారంభించారు. పాఠశాలలో బోధించబడే నైతిక విద్య యొక్క మూలాంశాలలో అతను క్రైస్తవ్యాన్ని పొందుపరిచారు. ఆ పాఠశాల ఈనాడు ప్రతిష్ఠాత్మకమైన దోషిషా విశ్వవిద్యాలయంగా జపాన్ దేశంలో నిలిచియుంది. ఇది అనేక మంది దేశ నిర్మాతలను తయారుచేయడమే కాదు, వందలాది మంది క్రైస్తవ సంఘ నాయకులను కూడా తయారుచేసింది.



    అలుపెరుగని విద్యా సంబంధ పరిచర్య మరియు సువార్త ప్రచారాల కారణంగా అతని ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది. కాగా 46 సంవత్సరాల తక్కువ వయస్సులోనే ఈ లోక యాత్ర ముగించి ప్రభు సన్నిధానమును చేరుకొన్నారు నీసిమా షిమెటా.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ స్వజనుల రక్షణ కొరకు మీరు కన్నీరు కారుస్తున్నారా? 

    ప్రార్థన :

    ప్రభువా, రక్షించబడని నా కుటుంబ సభ్యుల మనోనేత్రములు తెరిచి, చీకటి నుండి వెలుగులోనికి వారిని నడిపించుటకు నన్ను వాడుకొనుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Dec 4, 2021

    Najaretu Patnana | నజరేతు పట్నాన

    నజరేతు పట్నాన నాగుమల్లె ధరణిలొ - యోసేపు మరియమ్మ నాగుమల్లె ధరణిలొ..(2)
    హల్లెలుయ హల్లెలుయ హల్లెలుయ హల్లెలుయ..

    మేము వెళ్లి చూచినాము స్వామి యేసునాదుని (2)
    ప్రేమ మ్రొక్కి వచ్చినాము మా మనంబు లల్లరగ (2)

    బెతలెము పురములొన బీద కన్య మరియకు (2)
    పేదగ సురూపు దాల్చి వెలసె పశుల పాకలొ (2)

    పేద వడ్ల వారి కన్య మరియమ్మ - ప్రేమ గల యేసు తల్లి మరియమ్మ - ప్రేమ గల్ల యెసు తల్లి

    పెరెల్లిన దేవ దేవుడె యేసయ్య - ప్రేమ గల అవతారం (2)

    స్వర్గ ద్వారాలు తెరిచిరి యేసయ్య - స్వర్గ రాజు పుట్టగానె యేసయ్య - స్వర్గ రాజు పుట్టగానె

    సరుగున దూతల్ వచ్చిరి యేసయ్య - చక్కని పాటల్ పాడిరి (2)

    నువు బొయె దారిలొ యెరూషలేము గుడి కాడ (2) 
    అచ్చం మల్లె పూల తొట యేసయ్య (2)

    దొడ్డు దొడ్డు బైబిలు దొసిట్లొ పెట్టుకొని (2)
    దొరొల్లె బయిలెల్లి నారే యేసయ్య (2)

    రాజులకు రాజు పుట్టన్నయ్య (2) 
    రారె చూడ మనం ఎల్లుదం అన్నయ్య (2)
    తారన్జూచి తూర్పు జ్ఞానుల్ అన్నయ్య (2)
    తరలినారె బెత్లహెమ్ అన్నయ్య (2)

    పదర పొదామురన్న - శ్రీ యేసుని చూడ - పదర పొదమురన్న (2)

    శ్రీ యేసన్న నట - లొక రక్షకుడట (2)
    లొకుల్ అందరికయ్యొ ఎక రక్షకుడట (2)

    పదర.. హెయ్ పదర.. హెయ్

    పదర పొదమురన్న - శ్రీ యేసుని చూడ - పదర పొదాము రన్న (4)

    Lyrics In English: 

    nazarethu patnana nagumalle dharani lo
    yosepu mariyamma nagumalle dharani lo
    hallelujah (x4)

    memu velli chuchinamu swami yesu naaduni
    prema mrokki vachinamu maamanambu lallaraga
    bethalemu puramulona beedha kanya mariyaku
    pedhaga suroopu dhaalchi velase pashula paakalo

    pedha vadla vari kanya mariyamma
    prema gala yesu thalli mariyamma
    prema galla yesu thalli
    perellina deva devude yesayya
    prema gala avataram
    swarga dhvaralu therichiri yesayya
    swarga raju putta gane yesayya
    swarga raju putta gane
    saruguna dhoothal vachiri yesayya
    chakkani paatal paadiri

    nuvu boye daari lo yerushalemu
    gudi kada acham malle poola thota yesayya
    doddu doddu baibilu dositlo petukoni
    dhorolle bayilelli naade yesayya

    raajulaku raaju puttannaya
    ra re chuda manam elludham annaya
    thaaran joochi thoorpu gyanul annaya
    tharali naare bethlahem annaya

    padha ra podhamu ranna
    shri yesuni chuda
    padha ra podhamu ranna
    shri yesanna nata loka rakshakudata
    shri yesanna nata loka rakshakudata
    lokul andarikayyo eka rakshakudata
    lokul andarikayyo eka rakshakudata
    padha ra hey padha ra hey
    padha ra podhamu ranna
    shri yesuni chuda
    padha ra podhamu ranna


  • WhatsApp
  • Nov 16, 2021

    Ningilo Devudu | నింగిలో దేవుడు | Telugu Christmas Song

    Ningilo Devudu  | నింగిలో దేవుడు | Telugu Christmas Song

    నింగిలో దేవుడు నిను చూడ వచ్చాడు

    ఆ నీతి సూర్యుడు శ్రీ యేసు నాధుడు (2)
    చెంత చేరి సంతసించుమా (2)
    స్వంతమైన క్రీస్తు సంఘమా ||నింగిలో||

    పాపాల పంకిలమై శోకాలకంకితమై
    మరణించి మన కోసం కరుణించి ఆ దైవం (2)
    దీన జన రక్షకుడై దేవ దేవుని సుతుడై (2)
    జన్మించె నీ కోసం ధన్యము చేయగా (2) ||నింగిలో||

    సాతాను శోధనలే శాపాల వేదనలై
    విలపించే దీనులకై అలరించు దీవెనలై (2)
    శరణమై ఉదయించే తరుణమౌ ఈ వేళ (2)
    గుండె గుడి పానుపులో చేర్చుకొన రావేల (2) ||నింగిలో||


  • WhatsApp
  • Nov 14, 2021

    Na Priya Yesu Ra | నా ప్రియ యేసు రా


    Na Priya Yesu Ra song Lyrics

    ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా (2)
    నాకు మాత్రము నీవే చాలయ్యా
    నీ జాడలో నే నడుస్తానయ్యా
    నీ కౌగిలిలో నే ఉంటా
    రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా – (2)

    ఆశీర్వాదములు కావయ్యా
    అభిషేకము కొరకు కాదయ్యా (2)
    నీవే నా ఆశీర్వదమయ్యా
    నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)
    నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా
    నీ జాడలో నే నడుస్తానయ్యా
    నీ కౌగిలిలో నే ఉంటా… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా – (2)

    నీకై నేను – నాకై నీవు
    ఉంటే చాలయ్యా – అదియే నా ఆశ దేవా ..
    నాలో ఉన్నవాడా – నాతో ఉన్నవాడా
    నీవుంటే చాలయ్యా – రావా నాకై
    నా ప్రాణం నీవయ్యా – నా ప్రేమ నీకేయ్యా
    నీవే నా ఊపిరి యేసయ్యా
    నీ పాదాలపై అత్తరునై నేనుంటా
    నా ప్రాణ ప్రియుడా యేసయ్యా

    పరలోకము కొరకు కాదయ్యా
    వరముల కొరకు కాదయ్యా
    ప్రవచనముల కొరకు కాదయ్యా
    నీవుంటే నాకు చాలయ్యా
    నీ శ్వాసే పరలోకం దేవా
    నిను పోలిన వరములు ఏవి లేవయ్యా
    ఎన్నెన్ని వరములు నాకున్నా
    నీవు లేని జీవితమే వ్యర్ధముగా
    నీ కోసమే బ్రతికెదను యేసయ్యా
    నీ కోసమే చావైనా మేలేగా

    నీ..కై ఎవరు రాకున్నా హో…
    నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ..
    నీ హతసాక్షిగ నే చస్తా
    రా.. నా ప్రియా యేసు రా…

    నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
    నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే
    కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు
    నీకై నే వేచి ఉన్నా రావా నాకై…
    నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని
    నీవే నా ఊపిరి యేసయ్యా
    నీ గుండె లోతున ఆలోచన నేనేగా
    నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో…

    నాకు మాత్రము నీవే చాలయ్యా – (4)
    వీడని ప్రియుడవు రావా నాకై
    నిన్ను పోలి ఉంటా నే రావా నాకై
    వేచియున్నా నీ కోసం రావా నాకై
    ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై
    రావా… దేవా… రావా… దేవా…
    నాకు మాత్రము నీవే చాలయ్యా
    నా కోసము రావా యేసయ్యా… త్వరగా…



  • WhatsApp
  • Oct 22, 2021

    Nee Prema Nanu Viduvaledayya | నీ ప్రేమ నన్ను విడువ లేదయ్యా

    నీ ప్రేమ నన్ను విడువ లేదయ్యా 
    నీ కృపా నన్ను కాపాడెనయ్యా || 2 || 

    అగాపే ప్రేమే నీది యేసయ్యా 
    క్యారీస్ కృపయే నీది యేసయ్యా || 2 || 

    జలములలో నే పడి వెల్లిన 
    అలలు నాపై యెగిసే సమయాన || 2 || 
    నా చెయ్యి విడువని నా ప్రియుడా 
    అలలు అణచిన ఆశ్చర్యకరుడా || 2 
    యేసయ్యా నా యేసయ్యా ......

    అగాధములో నే నడచిన వేళ 
    నా పాదములే తొట్రిల్లు వేళ || 2 || 
    నన్ను లేవనెత్తిన నా ప్రియుడా 
    నీవు నాతో నడిచిన ఆశ్చర్యకరుడా || 2 || 
    నా యేసయ్యా నా యేసయ్యా ....






  • WhatsApp
  • Oct 13, 2021

    Nelson Bell | నెల్సన్ బెల్

    నెల్సన్ బెల్ |  Nelson Bell


    • జననం: 30-07-1894
    • మహిమ ప్రవేశం: 02-08-1973
    • స్వస్థలం: వర్జీనియా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: చైనా

     లెమూయేల్ నెల్సన్ బెల్ భక్తిగల ఒక క్రైస్తవ కుటుంబములో జన్మించారు. పదకొండేళ్ళ వయసులో అతను తన జీవితమును క్రీస్తుకు సమర్పించారు. అతను న్యాయశాస్త్రమును అభ్యసించవలెనని కోరుకున్నారు. కానీ, ఒక వైద్య మిషనరీ కావాలని అతను ఎప్పుడైనా ఆలోచించాడా అని ఒక స్నేహితుడు అతనిని అడిగినప్పుడు, దేవుని స్వరమును వినిన నెల్సన్, తాను ఏమి చేయవలెనని దేవుడు కోరుకుంటున్నాడో గ్రహించారు. కాగా, అతను న్యాయ శాస్త్రమును విడిచిపెట్టి వైద్య శాస్త్రమును అభ్యసించారు.

     1916వ సంll లో తన భార్య వర్జీనియాతో కలిసి చైనాకు పయనమయ్యారు నెల్సన్. అక్కడ అతను “లవ్ అండ్ మెర్సీ హాస్పిటల్” లో పని చేయడం ప్రారంభించారు. అతను గ్రామీణ ప్రాంతాలలో కూడా చిన్న వైద్య కేంద్రాలను (క్లినిక్‌) ప్రారంభించారు మరియు స్థానిక జైలును కూడా సందర్శించి ఖైదీలకు వైద్యం అందించేవారు. యుద్ధ సమయంలో ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య కూడా అతను వెనుకంజ వేయక చైనా ప్రజలకు సేవలందించుటకు అక్కడే ఉండిపోయారు. దయా హృదయముతో అతను అందించే సేవలను బట్టి ప్రజలు అతనికి “ఐహువా” అనే పేరు పెట్టారు. దాని అర్థం "చైనా ప్రజలను ప్రేమించేవాడు".

     అతను సమర్థవంతమైన వైద్యుడు, కష్టపడి పనిచేసేవాడు మరియు శస్త్ర చికిత్సలో విజయవంతమైన వైద్యునిగా పేరుగాంచినవారు. అతను తన వైద్య నైపుణ్యాలను మెరుగుపరచుకొనుటకు ఎల్లప్పుడూ కృషి చేసేవారు. అయినప్పటికీ, మిషనరీగా అతని విజయానికి కారణం ఆత్మల కొరకైన ప్రేమ మరియు అతను తన పనిలో కనుపరచిన దయాకనికరములు. అతను “ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము” అని ఆత్మ ఫలమును ఒక కాగితముపై వ్రాసి, దానిని తన బల్ల మీద ఉన్న గాజు తలము క్రింద పెట్టుకున్నారు. ఏ ఇతర ప్రతిభ లేదా తలాంతుల కంటే కూడా ఇది చాలా ముఖ్యమైనదని విశ్వసించిన అతను, తాను సేవలందిస్తున్న ప్రజలకు తనలో ఆ లక్షణములను కనుపరచుటకు అనుదినమూ ప్రయత్నించారు. ఎల్లప్పుడూ అతని ప్రధాన లక్ష్యమేమనగా సువార్తను విస్తరింపచేయడం మరియు క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడం. ఆసుపత్రి నుండి కోలుకొని వెళ్లిపోయే రోగుల జాబితాను అతను తయారుచేసి, చైనా సువార్తికులు వారిని సంధిస్తూ ఆత్మీయముగా వారిని నడిపించేలా చూసుకునేవారు నెల్సన్.

     1941వ సంll లో అమెరికాకు తిరిగి వచ్చిన నెల్సన్ అక్కడ కూడా వైద్య సేవలను అందించడం కొనసాగించారు. దక్షిణ ప్రెస్బిటేరియన్ సంఘము యొక్క వరల్డ్ మిషన్స్ బోర్డ్ యొక్క సభ్యునిగా ఎన్నికయ్యి పదిహేడేళ్ళ పాటు సేవలందించిన అతను, ఆ కాల పరిధిలో ప్రపంచవ్యాప్తంగా మిషనరీలను సందర్శించి, వారి సమస్యలను మరియు ఆలోచనలను బోర్డుకు తెలియజేశారు. ‘ది సదరన్ ప్రెస్బిటేరియన్ జర్నల్’ మరియు ‘క్రిస్టియానిటీ టుడే’ అనే తన పత్రికల ద్వారా అతను క్రైస్తవ్యంలో ఉదాసీనతను ప్రోత్సహిస్తున్న వేదాంతశాస్త్ర బోధనలను వ్యతిరేకిస్తూ, బైబిలు కేంద్రీకృత వేదాంత బోధనలకు తిరిగి రావాలని క్రైస్తవ లోకానికి అతను పిలుపునిచ్చారు. నాలుగు సార్లు గుండెపోటు కలిగి బాధపడినప్పటికీ ఏ మాత్రం విశ్రమించక తన చివరి శ్వాస వరకు కూడా దేవుని సేవలో ముందుకు సాగిపోయారు నెల్సన్ బెల్.

    ప్రియమైనవారలారా, మీ అనుదిన జీవితములలో ఆత్మ ఫలమును కనుపరచుటకు మీరు ప్రయత్నిస్తున్నారా?

    ప్రభువా, నాలో ఆత్మ ఫలమును కలిగియుండుటకును మరియు మీ కొరకు నేను బహుగా ఫలించుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Aug 9, 2021

    నబీల్ ఆసిఫ్ ఖురేషి | Nabeel Asif Qureshi

    నబీల్ ఆసిఫ్ ఖురేషి | Nabeel Asif Qureshi

    • జననం: 13-04-1983
    • మహిమ ప్రవేశం: 16-09-2017
    • స్వస్థలం: కాలిఫోర్నియా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు


    “యేసు ప్రభువు నా తల్లిదండ్రులకు నన్ను వ్యతిరేకునిగా మారుస్తున్నాడని కాదు. నా కుటుంబం దేవునికి వ్యతిరేకంగా నిలబడితే నేను వారిరువురిలో ఒకరిని ఎంచుకోవాలి. వారిలో దేవుడే ఉత్తముడనేది నిశ్చయం. ఆ నిర్ణయం నా కుటుంబమునకు నన్ను వ్యతిరేకునిగా చేసినప్పటికీ అదే నిజం. కానీ ఎలా? ఎలా అంతటి బాధను నేను భరించగలను?” అనునవి ఒకప్పుడు ఉద్వేగభరితమైన ఇస్లాం పండితునిగా ఉండి తదుపరి క్రైస్తవ్యానికి బలమైన ప్రతిపాదకునిగా మారిన నబీల్ ఆసిఫ్ ఖురేషీ పలికిన మాటలు.


    ఖురాన్‌ను అనువదించేవారైన ఒక పాకిస్తానీ అహ్మదీ కుటుంబములో జన్మించారు నబీల్. అతని తాతలు కూడా ఇండోనేషియాకు ముస్లిం మిషనరీలుగా వెళ్ళినవారై ఉన్నారు. అటువంటి దృఢమైన ఇస్లాం మత నేపథ్యం ఉన్న నబీల్, ఒకవైపు వైద్యశాస్త్రమును అభ్యసిస్తూనే ఇస్లాం మతాన్ని కూడా అభ్యసించారు. అతను క్రైస్తవులతో మతపరమైన చర్చలను కలిగియుండేవారు. ఆ విధంగా ఒకసారి అతని స్నేహితుడైన డేవిడ్ వుడ్‌తో ఒక సంవత్సరం పాటు కొనసాగిన సంభాషణలో యేసు క్రీస్తు యొక్క పునరుత్థానమును నిర్ధారించే విషయములను మరియు ఆయన దేవుడని పిలువబడుటకు కారణములను కనుగొన్నారు నబీల్. ఒకవైపు అద్వితీయ సత్య దేవుడు, మరొకవైపు తన కుటుంబం. వారిరువురిలో ఎవరిని ఎంచుకోవాలి అని ఎంతో సతమతమైపోయిన నబీల్, చివరికి ప్రభువైన యేసుక్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించారు. అతను చెప్పినది ఏమంటే “యేసును వెంబడించుటకు సమస్తమైన శ్రమలను అనుభవించడం తగినదే. ఎందుకంటే ఆయన అంతటి అద్భుతమైనవాడు.”


    వైద్యునిగా పట్టభద్రులైన నబీల్ వేదాంతశాస్త్రం మరియు తత్వశాస్త్రములను కూడా అభ్యసించారు. రవి జకరియాస్‌తో కలిసి పనిచేసిన అతను, క్రైస్తవ్యానికి సంబంధించిన క్లిష్టమైన మరియు నిర్దిష్టమైన ప్రశ్నలకు సున్నితంగాను మరియు గౌరవంగాను సమాధానమిచ్చేవారు. అతను అరబ్బుల పండుగ వేడుకలకు వెళ్ళి, యేసుక్రీస్తు యొక్క దైవత్వంలోని సత్యమును గురించి ముస్లింలతో అద్భుతమైన రీతిలో సంభాషించేవారు. అతను శక్తివంతమైన వక్త మరియు బలముగా చర్చించగలరు. అతని మాటలు ఎంతో మంది హృదయములను తాకాయి. అయితే, ఈ కారణంగానే అతను పలుమార్లు అరెస్టు చేయబడ్డారు. అయితే విడుదలైన ప్రతిసారీ అతను క్రీస్తును గురించి బోధించుటకు నేరుగా ముస్లింల యొద్దకే వెళ్ళేవారు. ఏలయనగా, ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని అతను బాగుగా ఎరిగియున్నారు. అంతేకాకుండా ఎంతో మంది ముస్లింలు క్రీస్తు వైపు తిరగుటకు సహాయపడిన పలు పుస్తకములను కూడా అతను రచించారు.

    అయితే ఊహించని విధంగా నబీల్‌కు కడుపు క్యాన్సర్ నాలుగవ స్థాయిలో ఉన్నట్లు నిర్ధారించబడింది. చివరికి అతని పొట్ట భాగమును కూడా తీసివేసినంతటి ఎంతో తీవ్రమైన చికిత్సను పొందిన తరువాత, కేవలం 34 సంll ల మిగుల లేత ప్రాయంలోనే ప్రభువునందు నిద్రించారు నబీల్ ఆసిఫ్ ఖురేషి.


    🚸 *ప్రియమైనవారలారా, మీరు ఏమి ఎంచుకుంటున్నారు? మీ స్నేహితులను మరియు కుటుంబమునా? లేక దేవునినా?* 🚸


    🛐 *"ప్రభువా, ప్రతి పరిస్థితిలోనూ అందరికంటే పైగా నేను మిమ్ములను ఎన్నుకొనుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"* 🛐

    *******

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • Aug 1, 2021

    NAA GEETHARADHANALO YEASAYYA | నా గీతారాధనలో యేసయ్యా

    NAA GEETHARADHANALO YEASAYYA | నా గీతారాధనలో యేసయ్యా

    నా గీతారాధనలో యేసయ్యా - నీ కృప ఆధారమే 

    నా ఆవేదనలలో - జనించెనే నీ కృపాదరణ 


    నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే 

    చెదైన వేరు ఏదైనా నాలో మొలవనివ్వలేదులే 

    నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటుకట్టెనే || నా గీతా || 


    చేనిలోని పైరు చేతికిరాకున్నా - ఫలములన్ని రాలిపోయినా 

    సిరిసంపదలన్నీ దూరమైపోయినా - నేను చలించనులే 

    నిశ్చలమైన రాజ్యముకొరకే - ఎల్లవేళల నిన్నె ఆరాధింతునే || నా గీతా || 


    ఆత్మాభిషేకం - నీ ప్రేమ నాలో నిండుగా కుమ్మరించెనే 

    ఆత్మఫలములెన్నో మెండుగా నాలో ఫలింపజేసెనే 

    ఆత్మతో సత్యముతో ఆరాధించుచు - నే వేచియుందునే నీ రాకదకై || నా గీతా ||

  • WhatsApp