Search Here

Showing posts with label Y. Show all posts
Showing posts with label Y. Show all posts

Nov 16, 2021

Entha deenathi Deenamo | ఎంత దీనాతి దీనమో | Telugu Christmas Song

Entha deenathi Deenamo | ఎంత దీనాతి దీనమో | Telugu Christmas Song


ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా (2) 

నీ జనన మెంత దయనీయమో తలచుకుంటె 

నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది 


 1.నీ సృష్టిలో ఈ లోకమే నీవు 

మాకు ఇచ్చినా సత్రమయ్యా (2) 

ఆ సత్రములో ఓ యేసయ్యా 

నీకు స్థలమే దొరకలేదయ్యా (2) ||ఎంత|| 


 2.నిండు చూలాలు మరియమ్మ తల్లి 

నడువలేక సుడివడి పోయేనయ్యా (2) 

దిక్కుతోచక ఓ యేసయ్యా 

పశువులపాకలో ప్రసవించెనయ్యా (2) ||ఎంత|| 


 3.చల్లగాలిలో చాటు లేక 

నలుమూలలా చలిపుట్టెనయ్యా (2) 

పసికండువై ఓయేసయ్యా తల్లి 

ఒడిలో ఒదిగినావయ్యా (2) ||ఎంత|


  • WhatsApp
  • Nov 14, 2021

    Na Priya Yesu Ra | నా ప్రియ యేసు రా


    Na Priya Yesu Ra song Lyrics

    ఎత్తుకే ఎదిగినా – నామమే పొందినా (2)
    నాకు మాత్రము నీవే చాలయ్యా
    నీ జాడలో నే నడుస్తానయ్యా
    నీ కౌగిలిలో నే ఉంటా
    రా.. నా ప్రియ యేసు రా.. హో… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా – (2)

    ఆశీర్వాదములు కావయ్యా
    అభిషేకము కొరకు కాదయ్యా (2)
    నీవే నా ఆశీర్వదమయ్యా
    నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా (2)
    నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా
    నీ జాడలో నే నడుస్తానయ్యా
    నీ కౌగిలిలో నే ఉంటా… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా… హో… ఓ..
    రా.. నా ప్రియ యేసు రా – (2)

    నీకై నేను – నాకై నీవు
    ఉంటే చాలయ్యా – అదియే నా ఆశ దేవా ..
    నాలో ఉన్నవాడా – నాతో ఉన్నవాడా
    నీవుంటే చాలయ్యా – రావా నాకై
    నా ప్రాణం నీవయ్యా – నా ప్రేమ నీకేయ్యా
    నీవే నా ఊపిరి యేసయ్యా
    నీ పాదాలపై అత్తరునై నేనుంటా
    నా ప్రాణ ప్రియుడా యేసయ్యా

    పరలోకము కొరకు కాదయ్యా
    వరముల కొరకు కాదయ్యా
    ప్రవచనముల కొరకు కాదయ్యా
    నీవుంటే నాకు చాలయ్యా
    నీ శ్వాసే పరలోకం దేవా
    నిను పోలిన వరములు ఏవి లేవయ్యా
    ఎన్నెన్ని వరములు నాకున్నా
    నీవు లేని జీవితమే వ్యర్ధముగా
    నీ కోసమే బ్రతికెదను యేసయ్యా
    నీ కోసమే చావైనా మేలేగా

    నీ..కై ఎవరు రాకున్నా హో…
    నీ సువార్తను ప్రకటిస్తా హో… ఓ..
    నీ హతసాక్షిగ నే చస్తా
    రా.. నా ప్రియా యేసు రా…

    నీ చేయి తాకగానే కన్నీరు పొంగి పొర్లే
    నా కన్నీటిని చూసి నీ కన్నీరే నను చేరే
    కన్నీరు కలిసినట్టు కలవాలనుంది యేసు
    నీకై నే వేచి ఉన్నా రావా నాకై…
    నా గుండె చప్పుడే పిలిచె నిను రమ్మని
    నీవే నా ఊపిరి యేసయ్యా
    నీ గుండె లోతున ఆలోచన నేనేగా
    నా ప్రాణ ప్రియుడా యేసయ్యా.. హో…

    నాకు మాత్రము నీవే చాలయ్యా – (4)
    వీడని ప్రియుడవు రావా నాకై
    నిన్ను పోలి ఉంటా నే రావా నాకై
    వేచియున్నా నీ కోసం రావా నాకై
    ప్రేమిస్తున్నా నిన్నే నే రావా నాకై
    రావా… దేవా… రావా… దేవా…
    నాకు మాత్రము నీవే చాలయ్యా
    నా కోసము రావా యేసయ్యా… త్వరగా…



  • WhatsApp
  • Oct 5, 2021

    Yevaru Choopinchaleni | ఎవరు చూపించలేనీ

    ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య

    నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
    నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

    1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే

    నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
    ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా 

    ఎడబాటులేని గమనాన
    నిను చేరుకున్న సమయాన
    నను ఆదరించే ఘన ప్రేమ
    అపురూపమైన తొలిప్రేమ

    ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
    ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా


     2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం 

    నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు 
    నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ 

    నీ తోటి సాగు పయనాన 
    నను వీడలేదు క్షణమైన 
    నీ స్వరము చాలు ఉదయాన
    నిను వెంబడించు తరుణాన 

    శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో 
    నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య



  • WhatsApp
  • Yesayya Nee Prema Naa Sonthamu | యేసయ్య నీ ప్రేమ నా సొంతము

    యేసయ్య నీ ప్రేమ నా సొంతము - నాలోన పలికిన స్తుతిగీతము 
    యేసయ్య నీవేగ తొలికిరణము - నాలోన వెలిగిన రవికిరణము 
    ఏనాడు ఆరని నా దీపము - నా జీవితానికి ఆధారము 
    ఇమ్మానుయేలుగా నీ స్నేహము - నాలోన నిత్యము ఒక సంబరం 

    నిన్నే ఆరాధించి - నీ దయలో నే జీవించి 
    నిన్నే నే పూజించి - నీలో నే తరియించీ 


    1. ఏపాటి నన్ను ప్రేమించినావు - నీ ప్రేమలోనే నను దాచినావు 
    నా భారమంతా నువు మోసినావు - నన్నెంతగానో హెచ్చించినావు 
    నీ కృపలోనే నను కాచినావు - నీ కనికరమే చూపించినావు 
    నా హృదిలోనే నీ వాక్యధ్యానం - నా మదిలోనే నీ నామస్మరణం

     2. ఏనాడు నన్ను విడనాడలేదు - నీ నీడలోనే నడిపించినావు 
    లోకాలనేలే రారాజు నీవే - నా జీవనావకు రహదారి 
    నీవే నా గురి నీవే నా యేసుదేవా - చేరితి నిన్నే నా ప్రాణనాథా 
    పర్వత శిఖరం నీ మహిమ ద్వారం -  ఉన్నతమైనది నీ దివ్య చరితం

    సాటే లేరు నీకు - సర్వాధికారివి 
    నీవు మారని దైవం నీవు - మహిమోన్నతుడవు నీవు




  • WhatsApp
  • Sep 28, 2021

    Yehova Nee Kopamu Chetha | యెహోవా నీ కోపము చేత

    "నా దోషములు నా తలమీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువువలె అవి నామీద మోపబడి యున్నవి." 
    కీర్తన Psalm 38:1-10; 18-22



    1. యెహోవా నీ కోపము చేత - గద్దింపకుము - ఆ
    నీదు యుగ్రతచే నన్ను - శిక్షింపకుము

    2. నాలో గట్టిగా నీ బాణములు - నాటి యున్నవి - ఆ
    నా మీద నీ చెయ్యి భార - ముగా నున్నది

    3. నీ కోపముచే నా యారోగ్యము - విడిచిపోయెను - ఆ
    పాపముచే నా యెముకలలో - స్వస్థత లేదు

    4. నా దోషములు నా తలమీద - పొర్లిపోయినవి - ఆ
    నాపై మోయలేని బరువు - వలె నున్నవి

    5. మనోవేదన బట్టి కేకలు - వేయుచున్నాను - ఆ
    కనబడుచున్నది నీకు నా యభి - లాషయంతయు

    6. నా నిట్టూర్పులు నీకు దాచ - బడియుండలేదు - ఆ
    నా గుండె కొట్టుకొని బలము - విడచిపోయెను

    7. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను - ఆ
    నా పాపమును గూర్చి విచారపడుచున్నాను

    శత్రువులు చురుకై బలము - కలిగిన వారు - ఆ
    నన్నుచితముగా ద్వేషించు వారు అనేకులు

    9. మేలుకు ప్రతిగా వారు - కీడు - చేయుచున్నారు - ఆ
    మేలు చేసినందుకు వారు - విరోధులైరి

    10. దేవా నాకు దూరముగా - నుండకుము ప్రభో - ఆ
    రక్షకా నా సహాయమునకు - వేగమే రమ్ము
  • WhatsApp
  • Yevani Athikramamulu | ఎవ్వని అతిక్రమములు

    "తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు." 
    కీర్తన Psalm 32


    పల్లవి : ఎవ్వని అతిక్రమములు మన్నింపబడెనో
    పాప పరిహార మెవడోందెనో వాడే ధన్యుడు

    1. యెహోవాచే నిర్దోషిగా తీర్చబడియు
    ఆత్మలో కపటము లేనివాడే ధన్యుడు || ఎవ్వని ||

    2. మౌనినై యుండిన దినమెల్ల నే జేసినట్టి
    ఆర్తధ్వనిచే నా యెముకలు క్షీణించెను || ఎవ్వని ||

    3. దివారాత్రుల్ నీ చేయి నా పై బరువై యుండ
    నా సారము వేసవిలో ఎండినట్లాయె || ఎవ్వని ||

    4. నేను నా దోషమును కప్పుకొనక
    నీ యెదుట నా పాపమును ఒప్పుకొంటిని || ఎవ్వని ||

    5. నీ సన్నిధి నా పాపముల నొప్పుకొనగా
    నీవు నా దోషమును మన్నించితివిగా || ఎవ్వని ||

    6. కావున నీ దర్శన కాలమందు
    భక్తిగలవారు నిన్ను ప్రార్థించెదరు || ఎవ్వని ||

    7. విస్తార జలప్రవాహములు పొర్లినను
    నిశ్చయముగా నవి వారి మీదికి రావు || ఎవ్వని ||

    8. నాకు దాగుచోటు నీవే శ్రమలో నుండి
    నీవు నన్ను రక్షించెదవు నాదు దుర్గమా || ఎవ్వని ||

    9. విమోచన గానములతో నీవు నన్ను
    ఆవరించి నాకుపదేశము చేసెదవు || ఎవ్వని ||

  • WhatsApp
  • Yehova Naa Deva | యెహోవా నా దేవా

    జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి." కీర్తన Psalm 30

    పల్లవి : యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతియించెద
    హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ

    1. యెహోవా నా శత్రువులను
    నా పై సంతోషింప నీయక
    నీవు నన్నుద్ధరించినందుకై నేను
    నిన్ను కొనియాడుచున్నాను || యెహోవా ||

    2. నేను నీకు మొరపెట్టగా
    నీవు నన్ స్వస్థపరచితివి
    పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి
    భక్తులారా ప్రభున్ కీర్తించుడు || యెహోవా ||

    3. యెహోవా పాతాళములో నుండి
    నా ప్రాణము లేవదీసితివి
    నేను సమాధిలోకి దిగకుండగ
    నీవు నన్ను బ్రతికించితివి || యెహోవా ||

    4. ఆయన కోపము నిమిషమే
    దయ ఆయుష్కాలముండును
    ఏడ్పు వచ్చి రాత్రియుండిన ఉదయ
    మున సంతోషము కలుగును || యెహోవా ||

    5. నే నెన్నడు కదలనని నా
    క్షేమ కాలమున తలచితి
    యెహోవా దయ కలిగి నీవే నా
    పర్వతము స్థిరపరచితివి || యెహోవా ||

    6. నీ ముఖము నీవు దాచిన
    యపుడు నేను క్షోభిల్లితి
    యెహోవా నీకే మొర పెట్టితిని
    నా ప్రభువును బ్రతిమాలు కొంటిని || యెహోవా ||

    7. నేను సమాధిలోకి దిగిన
    నా ప్రాణము వలన లాభమా
    మన్ను నిన్ను స్తుతించునా?
    నీ సత్యమును గూర్చి అది వివరించునా? || యెహోవా ||

    8. నా అంగలార్పును నీవేగా
    నాట్యముగా మార్చియుంటివి
    నా గోనెపట్ట విడిపించి సంతోష
    వస్త్రము ధరింప జేసితివి || యెహోవా ||
  • WhatsApp
  • Sep 26, 2021

    Yesu Prabhu Kaapari | యేసు ప్రభూ కాపరి

    "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు." కీర్తన Psalm 23


    పల్లవి : యేసు ప్రభూ కాపరి నాకు - వాసిగా స్తుతించెదన్
    యేసు గొఱ్ఱెపిల్లను - పోయెదను తన వెంట


    1. పచ్చిక పట్లకు - మచ్చికతో నడుపున్
    స్వచ్ఛ జలముచెంత - నిచ్చును విశ్రాంతి
    ముందు ముందు వెళ్లుచు - పొందుగా రక్షించునన్ను
    తన మాధుర్య స్వరంబున - తనివి దీర్చును
    || యేసు ప్రభూ ||


    2. మరణపులోయ ద్వారా - సరిగా నడిపించును
    అడవి భయములెల్ల - ఎడబాపి రక్షించున్
    హత్తి ఒత్తి కట్టి గాయా - లెంతో ఆదరించును
    వింతగు ఆయన ప్రేమ సేవలో - సంతోషింతును
    || యేసు ప్రభూ ||


    3. శత్రుల ముందాహారం - సంసిద్ధము జేయును
    నా గిన్నె నిండించి - పొర్లి పారజేసి
    కడిగి కడిగి శుద్ధిచేసి - ఆత్మదానమిచ్చెను
    వడిగా ఆయన సాయమున - జయమున వెళ్ళెదను.   || యేసు ప్రభూ ||

  • WhatsApp
  • Sep 22, 2021

    Yehova Naa Kaapari | యెహోవా నా కాపరి

    "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు." కీర్తన Psalm 23


    పల్లవి : యెహోవా నా కాపరి నాకు లేమి లేదు
    పచ్చికగల చోట్ల మచ్చికతో నడుపున్


    1. మరణపు చీకటిలో తిరుగుచుండినను
    ప్రభుయేసు నన్ను కరుణతో ఆదరించున్ || యెహోవా ||


    2. పగవారి యెదుట ప్రేమతో నొక విందు
    ప్రభు సిద్ధము చేయున్ పరవశ మొందెదము ||యెహోవా ||

    3. నూనెతో నా తలను అభిషేకము చేయున్
    నా హృదయము నిండి పొర్లుచున్నది || యెహోవా ||

    4. చిరకాలము నేను ప్రభు మందిరములో
    వసియించెద నిరతం సంతసముగా నుందున్ ||  యెహోవా ||




  • WhatsApp
  • Neeve Yehova Na Kaaparivi | నీవే యెహోవా నా కాపరివి

    "నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించుచున్నాడు." కీర్తన Psalm 23

    పల్లవి : నీవే యెహోవా నా కాపరివి
    నాకేమి కొదువ లేదిలలోన

    1. పచ్చికగలచోట్ల నన్ను జేర్చి
    స్వచ్ఛమగు జలము త్రాగనిచ్చి
    నా ప్రాణమునకు సేదను దీర్చి
    నన్ను నడుపుము నీతిమార్గమున 
    || నీవే యెహోవా ||

    2. గాఢాంధకార లోయలయందు
    పడియుండి నేను సంచరించినను
    తోడైయుందువు నీ దుడ్డుకర్ర
    దండముతో నీ వాదరించెదవు || నీవే యెహోవా ||

    3. శత్రువుల యెదుట నీవు నాకు
    నిత్యమగు విందు సిద్ధపరచి
    నాతల నూనెతో నంటియున్నావు
    నా గిన్నె నిండి పొర్లుచున్నది || నీవే యెహోవా ||

    4. నిశ్చయముగా కృపాక్షేమములే
    వచ్చు నా వెంట నే బ్రతుకు దినముల్
    చిరకాలము యెహోవా మందిరమున
    స్థిరముగా నే నివసించెదను || నీవే యెహోవా ||
  • WhatsApp
  • Yehova Naa Kapari | యెహోవా నా కాపరి

    "యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు." కీర్తన Psalm 23

    పల్లవి : యెహోవా నా కాపరి - లేమి కలుగదు
    పచ్చికలపై పరుండజేయుచున్నాడు

    1. శాంతికరంబగు శ్రేష్ఠ జలముల
    చెంత నన్నడిపించుచున్నాడు  || యెహోవా ||

    2. సర్వదా నాదు ప్రాణంబునకు
    సేద దీర్చుచున్నాడు యెహోవా || యెహోవా ||

    3. తన నామమును బట్టి నీతి మార్గములో
    నన్ను చక్కగా నడుపుచున్నాడు || యెహోవా ||

    4. చీకటి లోయలో నే తిరిగినను
    ఎట్టి అపాయమునకు భయపడను || యెహోవా ||

    5. నీ దుడ్డుకర్ర నీ దండముతో న
    న్నాదరించి తోడై యుందువు || యెహోవా ||

    6.నా శత్రువుల యెదుట నీవు నాకు
    భోజనము సిద్ధపరచుదువు || యెహోవా ||

    7. నూనెతో నా తల నంటియున్నావు
    నా గిన్నె నిండి పొర్లుచున్నది || యెహోవా ||

    8. నన్ను వెంటాడు సదా కృప క్షేమము
    నిత్యమెహోవా మందిరములో నుండెద || యెహోవా ||
  • WhatsApp
  • Aug 23, 2021

    Yaakobu dhaevudaapadha | యాకోబు దేవుడాపద

    "ఆపత్కాలమందు యెహోవా నీకుత్తరమిచ్చును గాక!" కీర్తన Psalm 20

    పల్లవి : యాకోబు దేవుడాపద కాలంబుల యందు
    నిన్నుద్ధరించి నీ కుత్తరము నిచ్చును గాక!
    1. పరిశుద్ధ స్థలమునుండి నీకు సాయమిచ్చును
    సీయోనులోనుండి యెహోవా నిన్నాదరించును || యాకోబు ||

    2. నీ నైవేద్యములన్ని జ్ఞప్తి నుంచుకొనుచు
    నీ దహన బలులను అంగీకరించును గాక || యాకోబు ||

    3. నీ కోరిక సిద్ధింపజేసి నీ యాలోచన
    యంతటిని సఫలము చేసి నిన్ను గాచును || యాకోబు ||


    4. నీ రక్షణను బట్టి మేము యుత్సహింతుము
    మా దేవుని నామమున ధ్యజము నెత్తెదము || యాకోబు ||


    5. నీ ప్రార్థనలన్ని యెహోవా సఫలపరచును
    యెహోవా తన అబిషిక్తుని రక్షించును గాక || యాకోబు ||


    6. రక్షించి దక్షిణ హస్తబలమును చూపును
    యుత్తరమిచ్చును పరిశుద్ధ స్థలము నుండి ||యాకోబు ||


    7. అతిశయ పడుదురు రథ గుఱ్ఱములతో
    యెహోవా నామములో మనము అతిశయింతుము || యాకోబు ||


    8. వారు కృంగి నేలమీదపడి లేవకున్నారు
    మనము లేచి చక్కగా నిలుచుచున్నాము || యాకోబు ||

  • WhatsApp
  • Yehova Naa Balama | యెహోవా నా బలమా

    నన్ను రక్షించువాడు. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. నేను ఆశ్రయించియున్న నా దుర్గము." కీర్తన Psalm 18

    పల్లవి : 
    యెహోవా నా బలమా
    యధార్థమైనది నీ మార్గం
    పరిపూర్ణమైనది నీ మార్గం

    1. నా శత్రువులు నను చుట్టినను
    నరకపు పాశములరికట్టినను
    వరదవలె భక్తిహీనులు పొర్లిన
    విడువక నను యెడబాయని దేవా 
    || యెహావా ||

    2. శమరణపుటురులలో మరువక మొరలిడ
    ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై
    తన ఆలయములో నా మొర వినెను
    అదిరెను ధరణి భయకంపముచే 
    || యెహావా ||

    3. పౌరుషముగల ప్రభు కోపింపగా
    పర్వతముల పునాదులు వణికెను
    తననోటనుండి వచ్చిన యగ్ని
    దహించి వేసెను వైరులనెల్ల 
    || యెహావా ||

    4. మేఘములపై ఆయన వచ్చును
    మేఘములను తన మాటుగ జేయును
    ఉరుముల మెరుపుల మెండుగ జేసి
    అపజయ మిచ్చును అపవాదికిని 
    || యెహావా ||

    5. దయగల వారిపై దయ చూపించును
    కఠినుల యెడల వికటము జూపును
    గర్విష్టుల యొక్క గర్వము నణచును
    సర్వము నెరిగిన సర్వాధికారి 
    || యెహావా ||

    6. నా దీపమును వెలిగించు వాడు
    నా చీకటిని వెలుగుగా జేయును
    జలరాసుల నుండి బలమైన చేతితో
    వెలుపల జేర్చిన బలమైన దేవుడు 
    || యెహావా ||

    7. నా కాళ్ళను లేడి కాళ్ళగా జేసి
    ఎత్తయిన స్థలముల శక్తితో నిలిపి
    రక్షణ కేడెము నా కందించి
    అక్షయముగ తన పక్షము జేర్చిన || యెహావా ||

    8. యెహోవా జీవముగల దేవా
    బహుగా స్తుతులకు అర్హుడ వీవు
    అన్యజనులలో ధన్యత జూపుచు
    హల్లెలూయ స్తుతిగానము జేసెద || యెహావా ||
  • WhatsApp
  • Aug 4, 2021

    Yehova maa prabhuvaa | యెహోవా మా ప్రభువా

    "యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమియందంతట నీ నామము ఎంత ప్రభావముగలది." కీర్తన Psalm 8

    పల్లవి : యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో
    మహిమగల నీ నామము గొప్పది

    1. పగతీర్చుకొను శత్రువును మాన్పివేయ
    బాలుర స్తుతి స్తోత్రములతో
    స్థాపించితివి నీవొక దుర్గము
    నేదాగునట్లు ఆశ్రయ దుర్గము || యెహోవా ||

    2. నీ చేతి పనియైన ఆకాశమును
    చంద్ర నక్షత్రములనే చూడగా
    వాని దర్శించి జ్ఞాపకము చేయ
    మానవుండు ఏపాటివాడు || యెహోవా ||

    3. నీకంటె మానవుని కొంచెముగా
    తక్కువ వానిగా చేసితివి
    మహిమ ప్రభావ కిరీటమును
    వానికి ధరింపజేసితివి || యెహోవా ||

    4. అడవి మృగములు ఆకాశపక్షులు
    సముద్ర మత్స్యములు పశువులు
    వాని పాదముల క్రిందనుంచి
    అధికారము వానికిచ్చితివి || యెహోవా ||

    5. నీ నామము మా ప్రభువా యెహోవా
    ఎంతో ఘనత ప్రభావము గలది
    ఆ నామమును బట్టి మా కిచ్చితివి
    నీ రూపమును మాకు హల్లెలూయ || యెహోవా||
  • WhatsApp