Search Here

Oct 5, 2021

Yevaru Choopinchaleni | ఎవరు చూపించలేనీ

ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ మరువనూ యేసయ్య

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే

నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా 

ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ

ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా


 2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం 

నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు 
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ 

నీ తోటి సాగు పయనాన 
నను వీడలేదు క్షణమైన 
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన 

శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో 
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య



  • WhatsApp
  • No comments:

    Post a Comment