Search Here

Showing posts with label K. Show all posts
Showing posts with label K. Show all posts

Dec 27, 2021

Karen Watson Life History

కరెన్ వాట్సన్ గారి జీవిత చరిత్ర


  • జననం: 1965
  • మహిమ ప్రవేశం: 15-03-2004
  • స్వస్థలం: బేకర్స్‌ఫీల్డ్
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: ఇరాక్

  “నేను సరైన నిర్ణయం తీసుకొనలేదేమో అని వెనక్కి తిరిగి చూచి విచారించే అవసరం దేవుడు పిలిచినప్పుడు ఉండదు. దేశములన్నింటి కొరకు నేను కలిగియున్న హృదయమును వీలైనంత వరకు మీతో పంచుకొనుటకు నేను ప్రయత్నించాను. ఒక ప్రదేశము యొద్దకు నేను పిలువబడలేదు; ఆయన యొద్దకు పిలువబడ్డాను. అందుకు విధేయత చూపడమే నా గురి, శ్రమననుభవించవలెననునది ఊహించగలిలినదే, ఆయన యొక్క మహిమ నాకు లభించే బహుమతి...
మిషనరీ హృదయం అనునది
కొందరు యుక్తమని ఎంచిన దానికంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది
కొందరు సురక్షితమని తలంచిన దానికంటే ఎక్కువగా తెగింపును కలిగియుంటుంది
ఆచరణబద్ధమని కొందరు భావించిన దానికంటే మించిన లక్ష్యములను కలిగియుంటుంది
సాధ్యమని కొందరు భావించిన దానికంటే మించిన వాటిని ఆశిస్తుంది
 నా సౌఖ్యము కొరకో లేదా విజయము కొరకో కాదు, విధేయత చూపించుట కొరకు నేను పిలువబడ్డాను... యేసును ఎరుగుట మరియు ఆయనను సేవించుట కంటే వెలుపల మరే సంతోషం లేదు...”
 ఇవి ఇరాక్‌కు తన మిషనరీ యాత్రను ప్రారంభించే ముందు కరెన్ వాట్సన్ తమ పాదిరిగారికి వ్రాసిన లేఖలోని కొన్ని మాటలు.

 క్రైస్తవ కుటుంబంలో జన్మించిన కరెన్, తన వ్యక్తిగత జీవితములో తీవ్రమైన సంక్షోభకరమైన పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించారు. చర్చిలో ఆమె యవ్వనస్థులకు మరియు పిల్లలకు బైబిలు అధ్యయన తరగతులను నిర్వహించేవారు. అవకాశం వచ్చినప్పుడు ఆమె ఎల్ సాల్వడార్, మెక్సికో, మాసిదోనియా మరియు కొసావోలలో చిన్న చిన్న సువార్త ప్రచార కూడికలలో పాల్గొనడం ప్రారంభించారు. అటుపిమ్మట ఆమె హృదయం దేవుని పరిచర్య చేయుటకు మరి ఎక్కువగా వాంఛించడం ప్రారంభించింది. తత్ఫలితముగా ఆమె జైలు అధికారిగా మంచి జీతం వచ్చే తన ఉద్యోగమును విడిచిపెట్టి ‘ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు’ లో (IMB - ఐ.ఎమ్.బి. - అంతర్జాతీయ మిషన్ బోర్డు) చేరారు.

 ఇరాక్‌ యొక్క ఉగ్రవాదులతో అమెరికా యుద్ధం చేస్తున్న సమయంలో 2003వ సంll లో కరెన్ తన ఇంటిని మరియు ప్రాపంచిక ఆస్థిపాస్తులన్నింటినీ విక్రయించి ఇరాక్‌లోని మోసుల్‌కు చేరుకున్నారు. అక్కడి యుద్ధ ప్రాంతాలలో మానవతా సహాయం అందించడం ప్రారంభించిన ఆమె, క్రీస్తు ప్రేమను బోధించుటకు ఆ అవకాశాలను ఉపయోగించుకున్నారు. యుద్ధం కారణంగా మూసివేయబడిన పాఠశాలలను ఆమె పునరుద్ధరించడం ప్రారంభించి, అనధికారికంగానే పిల్లలకు బోధించడం ప్రారంభించారు. నిరంతరం తీవ్రవాదుల నుండి ప్రాణాపాయం పొంచి ఉన్నప్పటికీ ఆమె ఎల్లప్పుడూ ఉల్లాసంగాను, మంచి హాస్యభావముతోను మరియు కనికరము నిండుకొనినవారై యుండెడివారు. ఇరాక్‌లోని క్రైస్తవులు ఆమెను బైబిలు గ్రంథములో పేర్కొనబడిన ‘తబితా’ తో పోల్చేవారు.

 2002వ సంll మార్చి 15వ తారీఖున, కరెన్ మానవతా సహాయం అందించుటకై మరో ముగ్గురు మిషనరీలతో కలిసి వెళుతున్నారు. మార్గం మధ్యలో తుపాకీలను ధరించుకొనిన కొంతమంది ఆమె ప్రయాణిస్తున్న వాహనముపై మెరుపుదాడి చేసి కాల్పులు జరుపగా, కరెన్ మరియు ఆమెతో పాటు ఉన్న మిషనరీలందరూ తమ ప్రాణాలు కోల్పోయారు.

ప్రియమైనవారలారా, మీరు యేసును ఎరుగుట మరియు ఆయనను సేవించుట అనువాటికి వెలుపల ఉన్న తాత్కాలిక ఆనందమును పొంద ప్రయాసపడుతున్నారా?


ప్రభువా, నాలో మిషనరీ హృదయమును పుట్టించుము .ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Dec 22, 2021

    Clyde Dotson Life History

    క్లైడ్ డాట్సన్ గారి జీవిత చరిత్ర







    • జననం: 29-07-1905
    • మహిమ ప్రవేశం: 30-09-1982
    • స్వస్థలం: అలబామా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: రోడేషియా (జింబాబ్వే)

     1954వ సంవత్సరం, జనవరి మాసం. ఒకరోజు రాత్రి ఎక్కడో గోక్వే లోయలో (ప్రస్తుత జింబాబ్వే) విశ్రాంతి తీసుకొనుటకు గ్రామంలో స్థలం దొరకని ఒక మిషనరీ మోపనే చెట్టుకి (సీతాకోకచిలుక చెట్టు) ఊయలవేసి, దోమతెరను కట్టుకొంటున్నారు. అతను సువార్త బోధిస్తూ సైకిల్‌పై ప్రయాణించినందున అతను ఆ రోజు చాలా అలసిపోయి ఉన్నారు. అంతలో కొంతమంది గ్రామస్థులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఏనుగులు దాడి చేస్తాయని అతనిని హెచ్చరించారు. అప్పుడు ఆ మిషనరీ, “నా దేవుడు ఏనుగుల కంటే పెద్దవాడు. ఆయన నన్ను కాపాడుతాడు” అని సమాధానం ఇచ్చారు. అది రోడేషియా తెగల మధ్య క్లైడ్ డాట్సన్ యొక్క మిషనరీ ప్రయాణ ప్రారంభం.

     అలబామాలో పాదిరిగా పనిచేస్తున్న సమయంలో క్లైడ్‌కు ఆఫ్రికాలో మిషనరీగా సేవ చేసే అవకాశం లభించింది. కాగా 21 సంll ల వయస్సులో అతను తన ఇంటిని విడిచిపెట్టి, చిమనీమణి జిల్లాలోని రుసితు మిషన్‌లో పనిచేయుటకు దక్షిణాఫ్రికా మిషన్ బోర్డ్‌లో చేరారు. అక్కడి సమాజంలో పాతుకుపోయి ఉన్న మూఢ నమ్మకాలు మరియు క్రైస్తవ సంఘములలో ప్రబలంగా ఉన్న జాతి వివక్షను చూసినప్పుడు అతని గుండె పగిలిపోయింది. అతనికి దేవుడు తప్ప మరే మద్దతు లేకపోయినప్పటికీ, రోడేషియాలోని అన్యజనులలో ఆత్మీయ మార్పు తీసుకురావాలని అతను ధృఢనిశ్చయముతో ముందుకుసాగారు.

     పోర్చుగీసు తూర్పు ఆఫ్రికా (ప్రస్తుతం మొజాంబిక్)లోని మారుమూల గ్రామాలలో సువార్తను ప్రకటించుటకును మరియు ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించుటకును కొండ ప్రాంతాల గుండా క్లైడ్ చాలా దూరం కాలినడకన ప్రయాణించారు. గ్రామాలలో రాత్రి పూట విడిది చేసి, వస్తుమార్పిడి ద్వారా గ్రామస్థుల నుండి ఆహారమును పొందారు. ఒకసారి అతను సన్యాతి తెగవారికి ఇవ్వబడిన ప్రాంతములో మూడు నెలలు విడిది చేయగా, అది చివరికి సన్యాతి మిషన్ ప్రారంభానికి దారితీసింది.

     అతని మిషనరీ జీవితంలో ఎక్కువ భాగం విద్యుత్తు సదుపాయంలేకుండా గడ్డితో కప్పబడి, మట్టితో నిర్మించబడినటువంటి పూరిళ్ళలోనే అతని నివాసం సాగింది. స్నానం కొరకు 18 మైళ్ళు, త్రాగునీరు తెచ్చుకొనుటకు 100 మైళ్ళు అతను నడిచేవారు. అటువంటి కష్టతరమైన పరిస్థితులలో కూడా అతను దేవుని ప్రేమను ప్రకటిస్తూ 40 సంవత్సరాల పాటు ఆఫ్రికాలోనే ఉన్నారు. ఆ కాలపరిథిలో అతను 26 క్రైస్తవాలయములను నిర్మించారు మరియు 126 మందికి పైగా ప్రజలకు బాప్తిస్మము ఇచ్చారు.

     ఆరోగ్యం బాగా క్షీణిస్తుండటంతో 1972వ సంll లో అతను అలబామాకు తిరిగి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ 1982వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా అలబామాలో దేవుని పరిచర్యను కొనసాగించారు క్లైడ్ డాట్సన్.
    ప్రియమైనవారలారా, మన దేవుని యొక్క శక్తిపై మీకున్న విశ్వాసం ఆయన కొరకు శక్తివంతమైన కార్యములను చేయుటకు మిమ్ములను పురికొల్పెడిదిగా ఉన్నదా?

    ప్రభువా, నీవు అన్నింటికన్నా శక్తిమంతుడవు అన్న విశ్వాసముతో ఈ లోకంలో భయాలను అధిగమించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Dec 6, 2021

    Kreesthu Puttenu Pasula Paakalo | క్రీస్తు పుట్టెను పశుల పాకలో

    క్రీస్తు పుట్టెను పశుల పాకలో

    పాపమంతయు రూపు మాపను

    సర్వలోకమున్ విమోచింపను

    రారాజు పుడమిపై జన్మించెను


    సంతోషమే సమాధానమే - ఆనందమే పరమానందమే (2)

    అరె గొల్లలొచ్చి జ్ఞానులొచ్చి - యేసుని చూచి కానుకలిచ్చి

    పాటలుపాడి నాట్యములాడి పరవశించిరే


    1. పరలోక దూతాలి పాట పాడగా - పామరుల హృదయాలు పరవశించగా (2)

    అజ్ఞానము అదృష్యమాయెను - అంధకార బంధకములు తొలగిపోయెను (2)


    2. కరుణగల రక్షకుడు ధర కేగెను - పరమును వీడి కడు దీనుడాయెను (2)

    వరముల నొసగ పరమ తండ్రి - తనయుని

    మనకొసగెను రక్షకుని ఈ శుభవేళ (2)

  • WhatsApp
  • Dec 4, 2021

    Loka Rakshakudu | లోక రక్షకుడు | కీర్తించెదము కొనియాడెదము | Manoj David

    కీర్తించెదము .. కొనియాడెదము .. ప్రకటించెదము .. వివరించెదము .. 

    లోక రక్షకుడే పుట్టెను 

    పాపుల రక్షకుడే వచ్చెను ( 2 )

    1. ఎవరీ పాపుల రక్షకుడు ? 

    దేవుడే పంపిన రక్షణే యేసయ్య 

    దైవమై దిగినా తరునమే ఇదిగా 

    దైవకుమారుడే వచ్చెను పశువుల పాకలో పుట్టెను ( 2 ) 

    2. ఈ రక్షకుడు ఏమి చేశాడు ? 

    రక్షకుడే ఏతెంచెగా పాపమే పోయేగా 

    రక్షణే కలిగెగా లోకమే మురిసేగా పాపము జయింపా వచ్చెను లోక పాపమునే మోసెను ( 2 ) 

    3. పాపం పోయిందా .. అయితే ఇప్పుడేంటి ? మరణమే జయించి సాతాన్నే త్రొక్కిన 

    జీవమే ఇచ్చెగా నరకమే మోసెగా 

    పరక్రముడై వచ్చెను పరలోక భాగ్యం ఇచ్చెను ( 2 ) 

    కీర్తించెదము .. కొనియాడెదము .. ప్రకటించెదము .. వివరించెదము .. లోక రక్షకుడే పుట్టెను పాపుల రక్షకుడే వచ్చెను ( 2 )



  • WhatsApp
  • Nov 21, 2021

    Katie Davis Majors Biography

    కేటీ డేవిస్ మేజర్స్ గారి జీవిత చరిత్ర






    • జననం: 01-11-1989
    • స్వస్థలం: నాష్విల్లే
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శనము: ఉగాండా

     ఉగాండాలో పేదరికంలో ఉన్న ప్రజలకు క్రీస్తు ప్రేమను చూపించుటకు తన మంచి జీవితమును విడిచిపెట్టిన ఒక యువ అమెరికా మిషనరీ కేటీ డేవిస్ మేజర్స్. చిన్నప్పటి నుండి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రబలముగా ఉన్న పేదరికం గురించి అవగాహన కలిగియున్న ఆమె తన ఆశీర్వాదకరమైన జీవితమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు. సంవత్సరాలు గడిచేకొద్దీ పేదరికంలో ఉన్న ప్రజలను గురించిన భారం కూడా ఆమె హృదయంలో పెరిగింది. కాగా ఆమె తన కలలను విడిచిపెట్టి, అట్టి స్థితిలొ క్రీస్తు ఏమి చేయునో ఆలాగున చేయుటకు యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఆమెను బలవంతపరిచింది.

     18 సంll ల వయస్సులో ఉన్నప్పుడు ఉగాండాలో కిండర్ గార్టెన్ ఉపాధ్యాయినిగా పనిచేసే అవకాశాన్ని పొందారు కేటీ. తన వయస్సులో ఉన్న అమ్మాయిలు ప్రాపంచిక ఆనందాలను కోరుతూ, విజయవంతమైన భవిష్యత్తునిచ్చే మార్గాలను ఎన్నుకొనుచుండగా, కేటీ మాత్రం ఉగాండాకు వెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు. కాగా తన తల్లితో కలిసి 2006వ సంll లో ఉగాండాలో అడుగుపెట్టిన ఆమె, అక్కడ పేదరికానికి కారణమవుతున్న నిరక్షరాస్యత, తత్ఫలితముగా బాల్య నేరస్థులను తయారుచేస్తూ భయంకరమైన పర్యవసానాలకు దారితీస్తున్న దుస్థితిని చూశారు. ఎవరి దగ్గర నుండైనా ఆర్థిక సహాయం దొరుకుతుందేమోయని వెతుకుటకు బదులుగా ఆమె తాను దాచుకొనిన ధనమును వెచ్చించి పది మంది నిరుపేద పిల్లలకు విద్యను అందించుట ద్వారా మొదట తాను ఇతరులకు ఒక మాదిరిగా నిలిచారు. అది ఆమె స్నేహితులు మరియు బంధువులలో చాలా మందికి ప్రేరణ కలిగించగా, అది 150 మంది పిల్లలకు తగినంత నిధుల సేకరణకు దారితీసింది. 

     ఒక సంవత్సరం పాటు మిషన్ పని చేసిన తరువాత తన పట్టా చదువు పూర్తిచేసుకొనుటకుగాను ఆమె అమెరికాకు తిరిగి వచ్చారు. అటు పిమ్మట ఉగాండాకు తిరిగి వెళ్ళాలనే ఆమె నిర్ణయానికి ఆమె కుటుంబం నుండి వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ తన భూసంబంధమైన తండ్రి కంటే తన పరలోకపు తండ్రినే సంతోషపెట్టుటకు ఎంచుకున్న కేటీ, 2007వ సంll లో జింజాకు తిరిగి వచ్చారు. ఉగాండా ప్రజలకు క్రీస్తును తెలియపరచుట ద్వారా వారి జీవితాలను మార్చవలెననే లక్ష్యంతో అక్కడ ఆమె ‘అమాజిమా మినిస్ట్రీస్‌’ ను ప్రారంభించారు. నేడు అక్కడ ఒక క్రీస్తు కేంద్రీకృత పాఠశాలను నడుపుతున్న ఆమె, దాని ద్వారా జింజాలోని అనేక కుటుంబాలలో ఆత్మీయ మరియు భౌతికపరమైన మార్పును తీసుకువచ్చారు.

     తన భర్త బెంజి మేజర్స్ నుండి తన పరిచర్యకు మంచి మద్దతు పొందిన కేటీ, ఎయిడ్స్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 13 మంది పిల్లలను దత్తత తీసుకున్నారు. పరిచర్యలో అనేక సవాళ్ళను ఎదుర్కొన్నప్పటికీ, “మీరు చిన్న చిన్న పనులన్నీ దేవుని యొక్క గొప్ప ప్రేమతో చేస్తున్నప్పుడు మీరు మీ జీవితముతో ఏదో ఒక గొప్ప పనిని చేస్తున్నారని అర్థం. మీరు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత ప్రపంచాన్ని మారుస్తున్నప్పుడు మీరు ఈ ప్రపంచాన్నే మారుస్తున్నారని అర్థం. క్రీస్తు వలె ప్రేమను చూపించుటకు కలిగే అవకాశాలను మీరు కోల్పోనప్పుడు మీరు మీ ఉత్తమ జీవితాన్ని కోల్పోరు.” అని ఆమె చిరునవ్వుతో చెబుతారు. 

    ప్రియమైనవారలారా, మీ యవ్వన జీవితం ఈ ప్రపంచానికి క్రీస్తు ప్రేమ యొక్క మాధ్యమముగా ఉన్నదా?

    "ప్రభువా, చిన్న పనులు అయినా మీ యొక్క గొప్ప ప్రేమతో చేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Nov 16, 2021

    Christmas Panduga vachenule | క్రీస్మస్ పండుగ వచ్చేనులే | Telugu Christmas song

    Christmas Panduga vachenule | క్రీస్మస్ పండుగ వచ్చేనులే | Telugu Christmas song

    క్రీస్మస్ పండుగ వచ్చేనులే నేడు యేసయ్య జన్మ దినం వచ్చేనులే
    ఆనందించెదం నూతన కీర్తన పాడేదం

    యేసయ్య ప్రేమను లోకానంత చాటెదం
    యేసయ్య మార్గములో ఆనందంగా సాగేదం

    కన్యక గర్భములో యేసయ్య జన్మించెను
    పశువుల పాకలోనే పరిశుద్దుడు జన్మించెను
    దివి నుండి దూతలోచ్చి కొత్త పాటలు పాడెను

    గొల్లలు వచ్చిరి యేసయ్యను చూచిరి
    రక్షకుడు పుట్టాడని లోకామంత చాటెను

    దేవుని బహుమానముగా శ్రేష్టుడు భువికోచ్చెను
    తన ప్రేమను వెల్లడి చేయ తన ప్రాణము అర్పించేను
    సాతాను కట్లన్ని యేసయ్యే తెంచెను

    జ్ఞానులు వచ్చిరి యేసయ్యను చూచిరి

    బహుమానము ఇచ్చిరి సాగిలపడి మొక్కిరి

     

  • WhatsApp
  • Aug 1, 2021

    KANNA TALLI CHERCHUNATLU || కన్న తల్లి చేర్చునట్లు

     

    KANNA TALLI CHERCHUNATLU || కన్న తల్లి చేర్చునట్లు


    కన్న తల్లి చేర్చునట్లు నను చేర్చు నా ప్రియుడు (2) 
    హల్లేలుయా హల్లేలుయా (2)

    కౌగిటిలో హత్తుకొనున్‌ నా చింతలన్‌ బాపును (2)        ||కన్న||

    చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును (2)         ||కన్న||

    నా కొరకై మరణించే నా పాపముల్‌ భరియించే (2)       ||కన్న||

    చేయి విడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు (2)       ||కన్న||
  • WhatsApp