Search Here

Showing posts with label R. Show all posts
Showing posts with label R. Show all posts

May 14, 2023

Robert Caldwell | రాబర్ట్ కాల్డ్వెల్

రాబర్ట్ కాల్డ్వెల్ గారి జీవిత చరిత్ర

  • జననం : 07-05-1814
  • మరణం : 28-08-1891
  • స్వస్థలం : క్లాడీ
  • దేశం : ఐర్లాండ్
  • దర్శన స్థలము : భారతదేశం

ఒక బీద కుటుంబమైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబములో జన్మించిన రాబర్ట్ కాల్డ్వెల్, తొమ్మిది సంవత్సరాల వయస్సు నుండే పనిచేయడం ప్రారంభించారు. అతను అధికారికముగా కొంత వరకు మాత్రమే చదువుకున్నప్పటికీ, లండన్ మిషనరీ సొసైటీ (ఎల్ఎమ్ఎస్) ద్వారా గ్లాస్గో విశ్వవిద్యాలయంలో శిక్షణ పొందే అవకాశమును పొందగలిగారు. సేవ చేయుట కొరకు నియామక అభిషేకం పొందిన పిమ్మట 1838వ సంll లో ఎల్ఎమ్ఎస్ తరపున మద్రాసుకు చేరుకున్నారు రాబర్ట్. అక్కడి స్థానిక ప్రజలను సంధించవలసిన ఆవశ్యకతను గ్రహించిన అతను, తమిళ భాషలో పట్టు సాధించి స్థానిక ప్రజలకు సువార్త ప్రకటించడం ప్రారంభించారు. దినములు గడువగా, తమిళ పండితునిగా పేరుగాంచిన రాబర్ట్, ‘ఎ కంపారటివ్ గ్రామర్ ఆఫ్ ది ద్రవిడియన్ లాంగ్వేజెస్’ (ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం) అనే పుస్తకమును వ్రాశారు. ఆ ప్రాంతములో పరిచర్య చేయుటకు సిద్ధపడుటలో తరువాత వచ్చిన మిషనరీలకు ఈ పుస్తకం ఎంతో ఉపకరించింది.


జి. యు. పోప్ మరియు బెంజమిన్ షుల్ట్జ్ వంటి మిషనరీలచే ఎంతో ప్రభావితులయ్యారు కాల్డ్వెల్. అతను పేదల అభ్యున్నతి కొరకు అంకితభావంతో కృషి చేశారు. 1877వ సంll లో తిరునెల్వేలి యొక్క బిషప్పుగా నియమించబడిన తరువాత, అతను ప్రజల జీవితాలలో మార్పును చేకూర్చిన అనేక ప్రణాళికలను చేపట్టారు. అతను పట్టణాలు మరియు గ్రామాలలో పాఠశాలలను స్థాపించారు మరియు పేరుగాంచిన అనేక క్రైస్తవ ఆలయములను నిర్మించారు. వీటిలో ఇడైయంగుడిలోని ‘హోలీ ట్రినిటీ చర్చి’ ఒకటి. క్రైస్తవ సంఘములలో క్రైస్తవ మత విలువలను బోధించే స్థానిక కాటేకిస్టుల సహాయంతో పేదప్రజల మధ్య క్రమబద్ధమైన క్రైస్తవ సంఘములను ఏర్పరుచుటకు ప్రణాళికలను తయారుచేశారు. అతని భార్యయైన ఎలిజా అతని మిషనరీ కార్యకలాపాలన్నిటిలో అతని వెన్నంటి నిలిచినవారై రాబర్ట్ యొక్క బలముగా మరియు అతనికి మంచి ఆధారముగా మారారు. రాబర్ట్ చేపట్టిన పాఠశాల నిర్మాణ ప్రాజెక్టులలోను మరియు స్థానిక సముదాయాల ప్రజలకు సహాయక ఆదాయ వనరుగా ఉండునట్లు ఆ జిల్లాలో లేసు తయారీ పరిశ్రమలను స్థాపించుటలోను ఆమె ఎంతో తోడ్పాటునందించారు.


తమిళ ప్రజలతో అతని అనుబంధం రాబర్టుకు విస్తృతముగా ఖ్యాతిని సంపాదించి పెట్టింది. అయినప్పటికీ, తన జీవితాంతం ఒక సాధారణమైన దీనత్వము కలిగిన వ్యక్తిగానే మిగిలిపోయిన రాబర్ట్, తాను దేని నిమిత్తమై పిలువబడ్డారో ఆ గొప్ప ప్రణాళిక నుండి ఏనాడూ తొలగిపోలేదు. అతను తనకు అప్పగింపబడిన గొర్రెల మందకు శ్రద్ధ మరియు సానుభూతి కలిగిన అప్రమత్తమైన గొర్రెల కాపరిగా ఉన్నారు. అపొస్తలుని పోలిన అతని పరిచర్య మరియు మాదిరికరమైన సేవా జీవితం ద్వారా అతను అనేక మంది స్థానిక ప్రజలకు పరిచర్య చేయుటలో శిక్షణనిచ్చారు. క్రైస్తవుల మరియు క్రైస్తవేతరుల గుణగణాలను మరియు స్థాయిని మెరుగుపరిచినదిగా అతని పరిచర్య గుర్తింపునొందింది. అర్ధ శతాబ్దం పాటు పరిచర్య చేసిన పిమ్మట 1891వ సంll లో పరమునందు తన ప్రభువును చేరుకొనుటకు ఈ లోకమును విడిచి వెళ్ళారు రాబర్ట్ కాల్డ్వెల్.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది :

ప్రియమైనవారలారా, క్రీస్తు కొరకు ఆయన సంఘమును కట్టే పనిలో మీరు ఎప్పుడు చేరెదరు?

ప్రార్థన :

"ప్రభువా, నా విజయములో వినయమును, నిరాశలో నిరీక్షణను కలిగియుండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • May 13, 2023

    Richard Allen | రిచర్డ్ అలెన్

    రిచర్డ్ అలెన్ గారి జీవిత చరిత్ర


    • జననం : 14-02-1760
    • మరణం : 26-03-1831
    • స్వదేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు 
    • దర్శన స్థలము : అమెరికా సంయుక్త రాష్ట్రాలు


    ఒక బానిసయై యుండి తన యజమానిని క్రీస్తు వద్దకు నడిపించిన రిచర్డ్ అలెన్, తదుపరి 'ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి' స్థాపకులు అయ్యారు. బానిసత్వములో జన్మించిన అతను, డెలావేర్ తోట యజమానికి సేవకునిగా పనిచేశారు. ఇతర యజమానులు తమ క్రింద ఉన్న బానిసలను క్రైస్తవ ఆలయమునకు వెళ్ళుటకు అనుమతించకపోయినప్పటికీ, అలెన్ యొక్క యజమాని మాత్రం స్థానిక మెథడిస్ట్ సంఘముకు వెళ్ళుటకు అతనిని ప్రోత్సహించారు. కాగా, అతను క్రీస్తు నందు విశ్వాసములో ఎదిగేకొద్దీ, అతని యొక్క భక్తి జీవితం అతని క్రియలలో కార్యరూపం దాల్చింది. అది అతని యజమానిని మాత్రమే కాదు, ఇతర బానిసల యజమానులను కూడా ఆకట్టుకుంది. 


    అలెన్ యొక్క నిజాయితీ, చేసే పనిలో కనుపరిచే నైతిక విలువలు మరియు సత్ప్రవర్తన క్రీస్తుపై అతనికున్న విశ్వాసమునకు నిదర్శనంగా నిలిచాయి. చివరికి అది అతని యజమాని కూడా మారుమనస్సు పొందుటకు కారణమయ్యింది. 22 సంll ల వయస్సులో బానిసత్వము నుండి విడుదల కొరకై క్రయము చెల్లించి స్వేచ్ఛను పొందిన అలెన్, ప్రారంభములో తన కుటుంబమును పోషించుటకై కొన్ని చిన్నపాటి ఉద్యోగాలు చేశారు. అదేసమయంలో మరొకప్రక్క ఒక సంచార మిషనరీగా దేవుని సేవ చేయడం కూడా ప్రారంభించారు. కాగా అతను దక్షిణ కెరొలినా, న్యూయార్క్, పెన్సిల్వేనియా, డెలావేర్ మరియు మేరీల్యాండ్ ప్రదేశములందంతటా పర్యటించి, శ్వేతజాతీయులుకాని ప్రజలకు సువార్తను ప్రకటించారు. అతి త్వరలోనే అతను 'సెయింట్ జార్జ్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి' లో పరిచర్య చేయడం ప్రారంభించారు. అయితే, నల్లజాతికి చెందిన విశ్వాసులపై క్రైస్తవ సంఘము విధించే ఆంక్షలు మరియు ఆరాధన కూడికలలో కూడా అక్కడ నెలకొన్న జాతి వివక్ష కారణముగా ఒక ఆఫ్రికన్-అమెరికన్ సంఘమును స్థాపించుటకు అలెన్ ప్రేరేపించబడ్డారు. ఈ సంఘము తరువాతి కాలంలో 'ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చి' గా అభివృద్ధి చెందింది. ప్రమాదకరమైన పరిస్థితులను మరియు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ, అలెన్ యొక్క దర్శనాత్మకమైన పరిచర్యను బట్టి ఆ సంఘము బహుగా విస్తరించింది. కాగా ఈ నాడు ఈ సంఘము 6,000 క్రైస్తవ సంఘములను, 20 లక్షలకు పైగా సంఘ సభ్యులను కలిగి ఉంది.


    బానిసత్వ నిర్మూలన కార్యకర్త కూడా అయిన అలెన్, తోటి మానవులను బానిసలుగా చేయడం పాపమని లేఖనభాగములను చూపించి ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. ఇతరులను ఒప్పించగలిగే రీతిలో ఉండే అతని ప్రసంగాలు క్రియాశీలక క్రైస్తవ జీవితాన్ని కలిగియుండుటకు ప్రజలకు సహాయపడేవి. తన భార్యయైన శారా సహకారంతో పారిపోయిన అనేక మంది బానిసలను అలెన్ కాపాడగా, వారు క్రమంగా క్రీస్తులో తమ నిజమైన ఆశ్రయమును కనుగొనగలిగారు. 

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

     ప్రియమైనవారలారా, మీరు పాపపు బానిసత్వం నుండి విముక్తి పొందియుండగా, సువార్తను ప్రకటించడం ద్వారా ఇతరులను కూడా ఆ పాపపు బానిసత్వం నుండి విడిపించవలసిన బాధ్యతను మీరు కలిగియున్నారు కారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, సువార్తను తెలియజేయుట ద్వారా ఇతరులకు విడుదల కలిగించే సాధనముగా ఉండునట్లు నన్ను బలపరచి వాడుకొనుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Apr 7, 2022

    Richard Wurmbrand | రిచర్డ్ వుర్మ్‌బ్రాండ్

    రిచర్డ్ వుర్మ్‌బ్రాండ్  జీవిత చరిత్ర




    • జననం : 24-03-1909
    • మరణం : 17-02-2001
    • స్వస్థలం : బుకారెస్ట్
    • దేశం  : రొమేనియా
    • దర్శన స్థలము : రొమేనియా


    ఒక యూదుల కుటుంబంలో ఆఖరి పిల్లవానిగా జన్మించారు రిచర్డ్ వుర్మ్‌బ్రాండ్. కొంతకాలం ఇస్తాంబుల్‌లో నివసించిన వారి కుటుంబం, అతని తండ్రి మరణం తరువాత రొమేనియా దేశానికి వెళ్ళారు. అమోఘమైన మేధచ్ఛక్తి కలిగియున్న రిచర్డ్, తొమ్మిది భాషలను అనర్గళంగా మాట్లాడగలరు. యవ్వనప్రాయములో అతను వామపక్ష రాజకీయాలపై ఆసక్తి కలిగియుండేవారు. వర్తక మధ్యవర్తియైన స్టాక్ బ్రోకర్‌గా అతను వృత్తిని చేపట్టారు. క్రిస్టియన్ వోల్ఫ్‌కేస్ అనే జర్మనీవాడైన ఒక వడ్రంగి పంచుకున్న బలమైన సాక్ష్యం మూలముగా అతను మరియు అతని భార్యయైన సబీనా ఓస్టర్ ప్రభువును అంగీకరించారు.


    దేవుని మీదనే తమ నమ్మికను ఉంచిన ఈ దంపతులు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో సువార్తను ప్రకటించుట కొరకు అవకాశములకై ఎదురుచూశారు. కాగా వారు బాంబు దాడుల నుండి ప్రజలను రక్షించుటకు ఏర్పరచబడిన స్థావరములలో బోధించారు మరియు యూదుల పిల్లలను రక్షించుటలో తమ సేవలను అందించారు. అందుకు వారు పట్టబడి బంధించబడినప్పటికీ, పలుమార్లు కొట్టబడినప్పటికీ, ఆ శ్రమలన్నిటిలో కూడా వారు విశ్వాసములో మరింతగా బలపరచబడ్డారే గానీ కృంగిపోలేదు. 1945వ సంll లో సోవియట్ రష్యావారు రొమేనియాను స్వాధీనం చేసుకుని, క్రైస్తవ సంఘములను నియంత్రించుటకు ప్రయత్నించారు. అటువంటి సమయములో రిచర్డ్ దంపతులు రహస్య సంఘములను ప్రారంభించి సేవను కొనసాగించారు. కేవలం తన దేశస్థులకే కాదు, రష్యా సైన్యమునకు కూడా సేవలందించిన రిచర్డ్, వారికి పది లక్షలకు పైగా సువార్త కరపత్రికలను పంచిపెట్టారు. ఇవి తరచుగా కమ్యూనిస్టు ప్రచార పుస్తకములనే పేరుతో పంచబడేవి. సువార్త కరపత్రికలను రష్యాలోకి అక్రమంగా రవాణా చేయుటకు ఏర్పాట్లు చేయడంలో కూడా అతను సహాయపడేవారు. అందువలన అతనికి  ‘ది ఐరన్ కర్టెన్ పాల్’ అనే పేరు వచ్చింది.


    ప్రభుత్వమును ధైర్యముగా ఎదిరించి నిలబడి, క్రైస్తవ సంఘములపై ప్రభుత్వ నియంత్రణను ఖండించినందు వలన 1948వ సంll లో అతనిని, 1950వ సంll లో అతని భార్యను పట్టుకొని బంధించారు. ఎనిమిది సంవత్సరాల పాటు వర్ణింపనశక్యముకాని కౄరమైన చిత్రవధలతో కూడిన కఠినమైన జైలు జీవితమును అనుభవించిన పిమ్మట 1956వ సంll లో రిచర్డ్ విడుదలచేయబడ్డారు. అయితే, అది ఎంతో కాలం నిలువలేదు, మూడేళ్ల తరువాత అతనిని తిరిగి బంధించారు. అయితే ఆ శిక్ష మధ్యలోనే అతను 1964వ సంll లో క్షమాభిక్ష పొందినవారై విడుదల చేయబడ్డారు. తదుపరి అతను రొమేనియాను విడిచి వెళ్ళుటకు అయిష్టత కలిగియున్నప్పటికీ, ఇతర దేవుని బిడ్డల సలహా మేరకు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో సేవ చేయుటకు ఆ దేశాన్ని విడిచి వెళ్ళారు. కమ్యూనిస్టు దేశాలలో క్రైస్తవులు అనుభవిస్తున్న శ్రమలను గురించి తెలియపరుస్తూ అతను నార్వే, ఇంగ్లాండు మరియు అమెరికా దేశాలను పర్యటించారు. 1967వ సంll లో "జీసస్ టు ది కమ్యూనిస్ట్ వరల్డ్" (కమ్యూనిస్టు ప్రపంచానికి యేసు) అనే పేరుతో అతను హింసలను, శ్రమలను ఎదుర్కొన్న క్రైస్తవ కుటుంబములకు సేవలను అందించడం మొదలుపెట్టారు. తదుపరి దీని పేరు "ది వాయిస్ ఆఫ్ ది మార్టిర్స్" (హత సాక్షుల స్వరము) అని మార్చబడింది. శ్రమనొందిన క్రైస్తవులను ప్రోత్సహిస్తూ, ధైర్యపరుస్తూ, వారికి సహాయసహకారముల నందించి ఆదుకొంటూ ఈ నాటికీ ఈ సంస్థ 60 కి పైగా దేశాలలో తన సేవలను అందింస్తోంది.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, సువార్త కరపత్రాలను ఇతరులకు అందించుటలో మీరు ఎటువంటి పాత్ర కలిగియున్నారు?


    ప్రార్థన :

    "ప్రభువా, నేను కలుసుకున్న ప్రతి ఒక్కరికీ సువార్త కరపత్రాలను ఇవ్వగలుగునట్లు నన్ను ధైర్యముతో నింపుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Rees Howells | రీస్ హావెల్స్

    రీస్ హావెల్స్  జీవిత చరిత్ర




    • జననం : 10-10-1879
    • మరణం : 13-02-1950
    • స్వస్థలం : వేల్స్, యునైటెడ్ కింగ్‌డమ్
    • దర్శన స్థలము : ఇంగ్లాండు, దక్షిణాఫ్రికా


    రీస్ హావెల్స్ వేల్స్‌లోని బ్రైనమ్మాన్ గ్రామంలో ఒక దైవభక్తి గల కుటుంబంలో జన్మించారు. మంచి భవిష్యత్తుకు సోపానం వేయాలనే నిరీక్షణతో యవ్వన దశలో ఉన్న రీస్ తన పది మంది తోబుట్టువులతో పాటు అమెరికాకు వలస వెళ్ళారు. ఒకసారి మోరిస్ రూబెన్ అనే మారుమనస్సు పొందిన ఒక యూదుని యొక్క సాక్ష్యాన్ని రీస్ వినడం జరిగింది. తద్వారా అతను కూడా తన జీవితమును రక్షకుడైన యేసుక్రీస్తుకు అర్పించి ఆయనలో నూతన సృష్టిగా మార్చబడ్డారు. మొదటిలో గనులలో పనిచేసిన అతను, తదుపరి దేవుని సేవకు తనను సమర్పించుకున్నారు. కాగా ఇతరుల కొరకు ప్రార్థన చేసే విజ్ఞాపనా పరిచర్యలోనికి దేవుని ఆత్మ అతనిని లోతుగా నడిపించింది. తత్ఫలితముగా అతని సేవా జీవితం జవాబు పొందిన ప్రార్థనల యొక్క బలమైన సాక్ష్యముల సమ్మేళనమయ్యింది.


    1910వ సంll లో అతను ఎలిజబెత్ హన్నా జోన్స్‌ను వివాహం చేసుకున్నారు. 1915వ సంll లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు దక్షిణాఫ్రికాలో మిషనరీగా సేవ చేయుటకు వారికి పిలుపు వచ్చింది. ఓడలో ప్రయాణించవలసి వస్తుందనే భయాందోళనలు ఉన్నప్పటికీ, దేవునికి లోబడి ఆయన చిత్తం చేయాలనే ఆ దంపతుల యొక్క వాంఛను అవేవీ అడ్డుకోలేకపోయాయి. దక్షిణాఫ్రికాలో హావెల్స్ అనేక ఉజ్జీవ సభలను నిర్వహించగా, పరిశుద్ధాత్మ దేవుడు స్థానిక ప్రజల మధ్య ఎంతో శక్తివంతంగా పనిచేశాడు. తత్ఫలితముగా ఎంతో మంది ప్రజలు క్రీస్తును అంగీకరించగా, అతని పరిచర్య ద్వారా సంఘము ఒక నూతన ఉజ్జీవాన్ని పొందింది. ఉజ్జీవ అభిషేకంతో హావెల్స్ దక్షిణాఫ్రికాలోని పలు మిషన్ స్థావరాలకు ప్రయాణించారు. ఒక ప్రక్క సేవ అభివృద్ధి చెందుతుండగా, మరొక ప్రక్క దేవుని సేవ చేసే పరిచారకుల యొక్క అవసరం కూడా పెరుగుతూ వచ్చింది. కాగా సేవకులకు శిక్షణనిచ్చుటకు ఒక సంస్థ ఆవశ్యకమని హావెల్స్ గుర్తించారు. 1920వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వచ్చిన అతను, 1924వ సంll లో 'బైబిల్ కాలేజ్ ఆఫ్ వేల్స్' అనే కళాశాలను స్థాపించారు. ఆనాటి నుండి కళాశాలలో శిక్షణ పొందిన వేలాది మంది విద్యార్థులు ఈనాటికీ ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారు.


    హావెల్స్ ఇతరుల కొరకు దేవుని సన్నిధిలో భారముతో విజ్ఞాపనలు చేసే ఒక గొప్ప ప్రార్థనా వీరుడు. దేవుని పట్ల తాను కలిగియున్న విధేయతకు కలిగిన ప్రతి పరీక్షలో కూడా దేవుని చిత్తము చేయుటకు సిద్ధమనస్సు మరియు తన జీవితములోని ప్రతి భాగములో సంపూర్ణ సమర్పణ కలిగియుండుట వలన విజయం సాధించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండు దేశం శారీరకంగా పోరాడుతుండగా, హావెల్స్ మరియు అతని విద్యార్థులు ప్రార్థనలో మోకాళ్లపై పోరాడారు. తమ సహోదరులను రక్షించాలన్న వారి రోజువారీ ప్రార్థనలకు అద్భుతమైన రీతిలో సమాధానం లభించింది. ఉజ్జీవాన్ని తీసుకువచ్చుటకు ఒక గొప్ప బాధ్యతను తన భుజముల మీద వేసుకొని, దానిని మహిమకరముగా నెరవేర్చిన రీస్ హావెల్స్, 1950వ సంll లో తన పరలోకపు వాసస్థలమునకు పయనమయ్యారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, ఈ భూమిపై దేవుని చిత్తము నెరవేర్చబడగలుగునట్లు ఇతరుల కొరకు విజ్ఞాపనలు చేసే ప్రార్థనా జీవితాన్ని మీరు కలిగియున్నారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, మీ మహిమార్థమై ఇతరుల కొరకు ప్రార్థించుటకు నేను మోకరిల్లునట్లు నన్ను విశ్వాసములో స్థిరపరచుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Jan 17, 2022

    Robert Moffat Life History

    రాబర్ట్ మోఫాట్ గారి జీవిత చరిత్ర







     
    • జననం: 21-12-1795
    • మహిమ ప్రవేశం: 09-08-1883
    • స్వస్థలం: ఓర్మిస్టన్
    • దేశం: స్కాట్లాండు
    • దర్శన స్థలము: దక్షిణాఫ్రికా

    స్కాట్లాండుకు చెందిన రాబర్ట్ మోఫాట్ లండన్ మిషనరీ సొసైటీ ద్వారా ఆఫ్రికాలో సేవ చేసిన ఒక మిషనరీ. అతను ప్రసిద్ధిచెందిన మిషనరీ మరియు అన్వేషకుడు అయిన డేవిడ్ లివింగ్‌స్టన్ యొక్క మామగారు. బాల్యం నుండీ అతను క్రైస్తవత్వం ద్వారా బలముగా ప్రభావితం చేయబడ్డారు. తరువాత ఉపాధి కోసం ఇంగ్లాండుకు వెళ్ళిన రాబర్ట్ అక్కడ ఒక తోటమాలిగా పనిచేశారు. అక్కడ తన యొక్క మెథడిస్టు స్నేహితుల ద్వారా రక్షణానుభవములోనికి అతను నడిపింపబడ్డారు. మిషనరీ పని పట్ల ఆసక్తి కలిగియున్న రాబర్ట్ ఒకసారి ‘‘ది లండన్ మిషనరీ సొసైటీ’’ అని రాయబడియున్న బోర్డు ఒకటి చూడటం జరిగింది. అది దేవుని సేవ చేయాలనే ఆసక్తిని అతనిలో రేకెత్తించింది. ఆ సొసైటీలో ఉన్న రెవ. డబ్ల్యు. రాబీ అతనిని చేరదీసి, భవిష్యత్తు సేవ కొరకు రాబర్టును సిద్ధపరిచారు.

    1817వ సంll లో లండన్ మిషనరీ సొసైటీ  రాబర్ట్‌ను దక్షిణాఫ్రికాకు పంపింది. అతనికి అప్పగింపబడిన మొట్టమొదటి బాధ్యత ఏమనగా నమక్వాలాండ్‌లో సేవ చేయడం. అప్పటిలో ఆ ప్రాంతం ఆఫ్రికానెర్ అనే ఒక చట్టవిరుద్ధమైన వ్యక్తి యొక్క నియంత్రణలో ఉంది. గతములో మిషనరీలను భయాందోళనలకు గురిచేసి, మిషన్ శిబిరాలను నాశనం చేసినవానిగా పేరొందిన బందిపోటు అతను. అయినప్పటికీ ఆ కష్టమైన ప్రయాణానికి ధైర్యముగా ముందుకు వచ్చిన రాబర్ట్‌కు ఆ గ్రామములో కేవలం వ్యతిరేకత మాత్రమే ఎదురయ్యింది. అయితే ఆ శ్రమలన్నింటినీ అతను సహనముతో భరించి అక్కడి ప్రజలకు సువార్తను ప్రకటించారు. తద్ఫలితముగా ఆఫ్రికానెర్ యొక్క మనోనేత్రాలు తెరువబడి ఒక మంచి క్రైస్థవునిగా మారారు. తరువాతి కాలములో అతను మిషనరీ పరిచర్యలో రాబర్ట్‌కు మంచి సహాయకారిగా కూడా ఉన్నారు. ఈ ఫలితం రాబర్ట్‌కు మిగుల సంతోషాన్ని కలిగించింది.

    తన పరిచర్యలో భాగస్వామి అయిన మేరీ స్మిత్‌ను 1819వ సంll లో రాబర్ట్ వివాహం చేసుకున్నారు. తదుపరి కురుమన్‌ ప్రాంతములో స్థిరపడిన ఈ మిషనరీ దంపతులు అక్కడి బాట్స్వానా ప్రజల మధ్య సేవ చేశారు. అక్కడ వారు ఎదుర్కొన్న కష్టాలను, శ్రమలను, అవమానాలను, బెదిరింపులను, అన్నింటినీ భరించి, దేవుని పరిచర్య చేయుటకు మిగుల వాంఛ కలిగినవారై తమ సేవను కొనసాగించారు. వారు రోజుల తరబడి ఆకలితోనే నిద్రించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కొన్నిసార్లు ఆకలి బాధను తట్టుకోవడానికి వారి కడుపులను గట్టిగా కట్టి ఉంచుకునేవారు కూడా. ఈ శ్రమలన్నింటి మధ్య రాబర్ట్ త్స్వానా భాషకు ఒక శైలిని అభివృద్ధి చేసి, 1840వ సంll లో ఆ భాషలో క్రొత్త నిబంధనను మరియు 1857వ సంll లో పూర్తి బైబిలు గ్రంథాన్ని ప్రచురించారు. అంతేకాకుండా అక్కడి ప్రమాదకరమైన బెచువానా మరియు మాంటటీ తెగలకు కూడా ధైర్యంగా సువార్తను ప్రకటించారు రాబర్ట్. తదుపరి 1870వ సంll లో అనారోగ్యం కారణంగా రాబర్ట్ మరియు మేరీలు తమకు ప్రియమైన కురుమన్‌కు వీడ్కోలు పలికి, ఇంగ్లాండు దేశానికి తిరిగి వచ్చారు. అక్కడ దేవుని సేవను కొనసాగించిన రాబర్ట్ మోఫాట్ బోధిస్తూ, ప్రజలను మిషనరీ సేవ కొరకై ప్రోత్సహిస్తూ తన మిగిలిన జీవితాన్ని గడిపారు.

    ప్రియమైనవారలారా, చట్టవిరుద్ధముగా జీవించేవారి యెడలను మరియు నేరస్థుల యెడలను క్రీస్తు కలిగియున్నటువంటి భారమును మీరు కలిగియున్నారా?

    ప్రభువా, ఖైదీలకును, నేరస్థులకును మీ ప్రేమను ప్రకటించుటకు నాకు ధైర్యము దయచేయుము. ఆమేన్!


    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Nov 23, 2021

    Robert Cotton Mather | రాబర్ట్ కాటన్ మాథర్

    రాబర్ట్ కాటన్ మాథర్ గారి జీవిత చరిత్ర





    • జననం: 08-11-1808
    • మహిమ ప్రవేశం: 21-04-1877
    • జన్మస్థలం: న్యూ విండ్సర్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


     ఐరోపావాడైన రాబర్ట్ కాటన్ మాథర్ ఉత్తర భారతదేశంలో తాను చేసిన పరిచర్యకును మరియు ఉర్దూ బైబిలు అనువాదమును సవరించినందుకును ప్రసిద్ధి చెందిన ఒక మిషనరీ. గ్లాస్గో విశ్వవిద్యాలయంలో తన విద్యాభ్యాసమును పూర్తిచేసుకొనిన అతను, యార్క్‌లోని కాంగ్రిగేషనల్ చర్చిలో సేవ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో అతను లండన్ మిషనరీ సొసైటీ (ఎల్.ఎమ్.ఎస్.) అనే సంస్థ ద్వారా భారతదేశంలోని వారణాసిలో (బనారస్‌) సేవ చేయుటకు అవకాశాన్ని పొందారు. ఎలిజబెత్ సెవెల్‌తో తనకు వివాహం జరిగిన ఒక వారంలోపే 1833వ సంll జూన్ మాసంలో భారతదేశానికి బయలుదేరారు మాథర్.

     కలకత్తాలోని యూనియన్ చాపల్‌లో కొన్ని నెలలు పరిచర్య చేసిన పిమ్మట మాథర్ 1834వ సంll లో వారణాసికి వెళ్ళారు. అక్కడ నాలుగు సంవత్సరాలు పరిచర్య చేసిన అతను, హిందుస్థానీ మరియు ఉర్దూ భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 1838వ సంll లో అతను మీర్జాపూర్‌లో క్రొత్త మిషన్ కేంద్రమును స్థాపించారు. అతని శరీరం వేడిగా ఉండే భారతదేశము యొక్క వాతావరణానికి అలవాటు పడలేక పోయినప్పటికీ, అతను ఉత్తరప్రదేశ్‌లోని అనేక జిల్లాలలో తీవ్రముగా సంచరించి పరిచర్య చేశారు. అతను క్రీస్తు కొరకు మీర్జా జాన్ మరియు జాన్ హుస్సేన్ అనే ఇద్దరు ఇస్లామీయుల ఆత్మలను సంపాదించగా, వారు అతనితో పాటు అద్భుతమైన సువార్త పరిచర్యను చేశారు.

     హిందుస్థానీ మరియు ఉర్దూ భాషలలో ప్రావీణ్యం సంపాదించిన అతని భార్య ఎలిజబెత్ కూడా మంచి సహకారం అందించడంతో రచనల ద్వారా పరిచర్య చేయవలెనని తలపెట్టారు మాథర్. కాగా ఒక ప్రాంతీయ వార్తాపత్రికను ప్రచురించడం ప్రారంభించిన అతను, సువార్తను గూర్చిన చర్చల కొరకు ఒక మాధ్యమంగా దానిని సమర్థవంతంగా ఉపయోగించారు. ఆ వార్తాపత్రిక ద్వారా జరిగిన పరిచర్య ఎంతగానో విజయవంతమవ్వడంతో, అది ఉర్దూ బైబిలు అనువాదమును సవరించుటకు అతనిని ప్రేరేపించింది. అందుకుగాను లేఖనములను గ్రీకు నుండి నేరుగా ఉర్దూకు అనువదించవలెనని అతను గ్రీకు భాషను కూడా నేర్చుకున్నారు. 1860వ సంll నాటికి అతను ఉర్దూ మరియు హిందుస్థానీ బైబిలు అనువాదాలను పూర్తిగా సవరించారు. హిందీ భాషలో క్రొత్త నిబంధనపై అతను వ్రాసిన వ్యాఖ్యానం ఈ నాటికీ ఉపయోగించబడుతుంది.

      మీర్జాపూర్‌లో పాఠశాలలు, క్రైస్తవాలయాలు, అనాథాశ్రమాలు మరియు ముద్రణాలయమును కూడా నిర్మించారు మాథర్. ఎంతో చురుకుగా అతని భార్య ఎలిజబెత్ బయటికి వచ్చుటకు అనుమతించబక ఇళ్ళల్లో ఒంటరిగా ఉంటున్న మహిళలను వారి గృహములలో దర్శించి వారికి విద్యను అందించారు. 1870వ దశకం ప్రారంభంలో మాథర్ ఎంతో బలహీనపడినప్పటికీ, పరిచర్య కొనసాగింపబడునట్లు యువకులైన సహపరిచారకులకు శిక్షణనివ్వవలెనని భారతదేశంలోనే ఉన్నారు. తదుపరి 1873వ సంll లో ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళిన అతను, 1877వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా రచనల ద్వారా పరిచర్యను కొనసాగించారు. అయితే, 1878వ సంll లో మాథర్ యొక్క భార్య ఎలిజబెత్ తనకు ప్రియమైన మీర్జాపూర్‌కు తిరిగి వచ్చి, 1879వ సంll లో తాను పరమవాసమును చేరుకొనే వరకు కూడా తన పరిచర్యను కొనసాగించారు.


    ప్రియమైనవారలారా, దేవుని పని చేయ సమర్థులగునట్లు మీరు దేవుని ప్రజలను సిద్ధపరచుచున్నారా?

    "ప్రభువా, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను నీవే నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై యున్నావు. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Nov 13, 2021

    Rare Chuthamu Raja Suthuni | రారె చూతుము రాజసుతుడీ

    రారాజు జన్మదినము 116:1,2,3,4,5

    1.రారె చూతుము రాజసుతుడీ రేయి జనన మాయెను 
    రాజులకు రా రాజు మెస్సియ - రాజితంబగు తేజమదిగో ||రారె||

    2.దూత గణములన్ దేరి చూడరే దైవ వాక్కులన్ దెల్పగా 
    దేవుడే మన దీనరూపున - ధరణి కరిగెనీ దినమున ||రారె||

    3.కల్లగాదిది కలయు గాదిది గొల్ల బోయల దర్శనం
    తెల్లగానదె తేజరిల్లెడి - తారగాంచరె త్వరగ రారే ||రారె||

    4.బాలు డడుగో వేల సూర్యుల బోలు సద్గుణ శీలుడు 
    బాల బాలికా బాలవృద్ధుల -  నేల గల్గిన నాధుడు ||రారె||

    5.యూదవంశము నుద్ధరింప దావీదుపురమున నుద్భవించె
    సదమలంబగు మదిని గొల్చిన - సర్వ జనులకు సార్వభౌముడు ||రారె||
  • WhatsApp
  • Oct 31, 2021

    Reinhard Bonnke | రీన్‌హార్డ్ బోంకే

    రీన్‌హార్డ్ బోంకే  | Reinhard Bonnke


    • జననం: 19-04-1940
    • మహిమ ప్రవేశం: 07-12-2019
    • స్వస్థలం: కోనిగ్స్‌బర్గ్
    • దేశం: జర్మనీ
    • దర్శన స్థలము: ఆఫ్రికా

     ఒక తొమ్మిదేళ్ళ బాలుడి తల్లి అతను చేసిన పాపం గురించి అతనితో మాట్లాడుతుంది. ఆ బాలుడు వెంటనే తన పాపాలను ఒప్పుకొని, క్షమాపణ కొరకు వేడుకొని, ప్రభువైన యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించాడు. 10 సంll ల వయస్సు ఉన్నప్పుడు అతను ఆఫ్రికాలో మిషనరీ సేవ కొరకైన దేవుని పిలుపును గ్రహించాడు. తన జీవితపు తదుపరి భాగంలో ఆ పిలుపుకు ప్రతిస్పందించిన ఆ బాలుడు “ఆఫ్రికా యొక్క బిల్లీ గ్రాహం” అని పేరుగాంచాడు. ఆ బాలుడు రీన్‌హార్డ్ బోంకే.

     పట్టభద్రులైన తరువాత, ఆఫ్రికా వెళ్ళుటకు ముందుగా జర్మనీలో పరిచర్య చేశారు బోంకే. 1967వ సంll లో ఆఫ్రికాలోని లెసోతో అనే ఒక చిన్న గ్రామానికి చేరుకున్న అతను, అక్కడ స్థానిక సంఘమునకు పాదిరిగా సేవలందించారు. “పరలోకమును ప్రజలతో నింపుటకు నరకమును కొల్లగొట్టండి” అనే నినాదంతో అతను తన పరిచర్యను ప్రారంభించారు. అప్పటిలో లెసోతోలో నిరుద్యోగం ప్రబలంగా ఉండటంతో అది చివరికి అక్కడ నేరాల రేటు అధికమగుటకు దారితీసింది. అందువలన అతను యువకులకు సలహాలను ఆలోచనలను ఇచ్చి, సువార్తను వ్యాప్తి చేయుటకు వారిని నియమించుకున్నారు. లెసోతో నలుమూలలకు మరియు ఆ గ్రామ వెలుపల ప్రాంతములకు కూడా బైబిళ్ళను మరియు సువార్త కరపత్రాలను తీసుకువెళ్ళుటకు సైకిల్ బృందాలను అతను ఏర్పరిచారు.

     ఇతరుల వలె ‘స్మారక కట్టడాలు’ కాకుండా అతను ‘దేవుని రాజ్యమును’ నిర్మించాలనుకున్నారు. అందుకే విశ్వాసంతో అతను పెద్ద ఆడిటోరియంలను అద్దెకు తీసుకొని కూడికలు నిర్వహించడం ప్రారంభించారు. ప్రారంభములో పరిచర్య నిరాశపరిచినప్పటికీ, త్వరలోనే దక్షిణాఫ్రికాలోని అనేక ప్రాంతాలలో ఉజ్జీవం అగ్ని జ్వాలల్లా వ్యాపించింది. దేవుడు తనను నడిపించువాడనియు మరియు పరిశుద్ధాత్మ తనకు ఆదరణ, నడిపింపు మరియు శక్తిని ఇచ్చేవాడనియు అతను విశ్వసించేవారు.

     “సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించవలెననే క్రీస్తు యొక్క గొప్ప ఆజ్ఞను నెరవేర్చవలెననే వాంఛ దివారాత్రములు మిమ్ములను నడిపిస్తున్నదా? లేనట్లయితే నా జీవిత గాథ మీలో ఆ అగ్ని జ్వాలలను కలిగించాలని నేను ప్రార్థిస్తున్నాను. సమస్తమునూ మార్చగలిగిన ఒక అగ్ని. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని మిమ్ములను ఒప్పించగలిగే ఒక పరిశుద్ధ అగ్ని.” అనునవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు సవాలును ఇచ్చే బోంకే మాటలు. తనలోని మండుతున్న అగ్ని మరియు అణచివేయలేని ఆసక్తి ఉత్సాహాలతో అతను ‘క్రైస్ట్ ఫర్ ఆల్ నేషన్స్’ అనే సంస్థను ప్రారంభించారు. ఇది ప్రస్తుతం 9 దేశాలలో పరిచర్యను జరిగిస్తున్నది.

     వేలాది మంది ప్రజలను రక్షణ వెలుగులోనికి నడిపించిన ఈ శక్తివంతుడైన దైవజనుడు 
    79 సంll ల వృద్ధాప్యములో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచి వెళ్ళారు.

    ప్రియమైనవారలారా, సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడనే క్రీస్తు యొక్క ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటకు మీలో పరిశుద్ధాత్మ దేవుని అగ్ని ప్రజ్వలిస్తున్నదా?

    "ప్రభువా, పరిశుద్ధాత్ముని అగ్నితో నన్ను నింపి, మీ కొరకు నేను అసాధ్యమైనటువంటి పనులను తలపెట్టుటకు నన్ను వాడుకొనుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 28, 2021

    Rebecca Protten | రెబెకా ప్రోటెన్

    రెబెకా ప్రోటెన్ | Rebecca Protten 




    • జననం: 1718
    • మహిమ ప్రవేశం: 1780
    • స్వదేశం: ఆంటిగ్వా
    • దర్శన స్థలము: కరేబియన్ దీవులు; జర్మనీ; ఘనా

     'మదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్' (ఆధునిక మిషన్లకు తల్లి) అని పిలువబడుతారు రెబెకా ప్రోటెన్. ఒకప్పుడు ఒక బానిసగా ఉన్న ఆమెను దేవుడు తన మహిమ కొరకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో బలముగా వాడుకున్నాడు. తనకు కేవలం ఆరు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె ఆంటిగ్వా నుండి అపహరించబడి, సెయింట్ థామస్ దీవులలోని ఒక తోట యజమానికి బానిసగా విక్రయించబడ్డారు. తన యజమాని గృహములో ఆమె క్రైస్తవ నీతినియమాలను గురించి నేర్చుకున్నారు. ఆమెకు పన్నెండేళ్ళ వయసు ఉన్నప్పుడు ఆమె యొక్క యజమాని మరణించగా ఆమె బానిస బ్రతుకు నుండి విముక్తిని పొందారు.

    ఆమె ఒక క్రైస్తవురాలిగా బాప్తిస్మము పొందినప్పటికీ, సెయింట్ థామస్‌కు మొరావియన్ మిషనరీలు వచ్చే సమయం వరకు కూడా ఆమె తన యవ్వనంలో క్రైస్తవ సంఘ కార్యకలాపాలపై ఎటువంటి ఆసక్తి చూపలేదు. ఈ మిషనరీలు ఇతర శ్వేతజాతీయుల వలె కౄరమైనవారు కారు. వారి పరిచర్యలో చేరిన రెబెకా, తదుపరి తాను కూడా ఒక మిషనరీ కావాలని కోరుకున్నారు.

    సెయింట్ థామస్‌లోని మిషనరీ పరిచర్యలో రెబెకా ఒక ముఖ్యమైన భాగమయ్యారు. బానిసల సమాజాలను చేరుకొనుటకు ఆమె ప్రతి దినమూ పర్వత మార్గాలలో అనేక మైళ్ళు నడిచి వెళ్ళి, వారికి, మరి ముఖ్యముగా స్త్రీలకు సువార్తను బోధించేవారు. ఆమె వారి శారీరక గాయాలను కట్టుటయే కాకుండా వారి హృదయాలను కూడా ఆదరించారు. డచ్, జర్మన్ మరియు క్రియోల్ భాషలను బాగుగా ఎరిగియున్న ఆమె, స్థానికుల కొరకు బైబిలు పఠనాలను నిర్వహించేవారు. ఆమె పరిచర్య ద్వారా అనేక మంది క్రీస్తు పాదాల చెంతకు నడిపించబడ్డారు మరియు ఆ ద్వీపంలోని మహిళలకు రెబెకా ఒక మాదిరిగా మారారు. బానిసలపై ఆమె చూపుతున్న ప్రభావమును గ్రహించి అప్రమత్తమైన బానిసల యజమానులు బానిసలు తిరుగుబాటు చేస్తారేమోయని భయపడినవారై, దొంగతనం మరియు దేవదూషణ వంటి తప్పుడు ఆరోపణలతో ఆమెను అరెస్టు చేయించారు. ఆమె ఏడుమార్లు న్యాయస్థానమునకు తీసుకురాబడగా, వచ్చిన ప్రతిసారీ ఆమె దానిని క్రీస్తును గురించి సాక్ష్యమిచ్చుటకు ఒక అవకాశముగా ఉపయోగించుకున్నారు. 

    జైలు నుండి విడుదలైన తరువాత, ఆమె సెయింట్ థామస్ వదిలి వెళ్ళులాగున అధికారులు ఆమెను బలవంతం చేశారు. కావున, ఆమె అప్పటిలో మొరావియన్ సంఘము యొక్క ప్రధాన కార్యాలయముగా ఉన్న జర్మనీలోని హెర్న్‌హట్‌ ప్రాంతమునకు వెళ్ళారు. అక్కడ ఆమె స్త్రీల పరిచర్యకు నాయకత్వం వహించారు. తరువాత 1765వ సంll లో ఆమె తన భర్తతో కలిసి ఘనాలోని అక్రా అనే ప్రదేశానికి వెళ్ళారు. అక్కడ ఈ దంపతులు డచ్ మిషనరీ పాఠశాలలో బోధించారు మరియు గోల్డ్ కోస్ట్ అంతటా అనేక మిషన్ కేంద్రాలను స్థాపించారు. తన దేహం ఆఫ్రికా యొక్క వాతావరణానికి అలవాటు పడలేక పోయినప్పటికీ, 1780వ సంll లో తాను మరణించే వరకు కూడా అనారోగ్యం మరియు శారీరక బాధను అనుభవిస్తూనే దేవుని సేవలో ముందుకు సాగిపోయారు రెబెకా ప్రోటెన్.

    ప్రియమైనవారలారా, ఇప్పుడు మీరు ఏమాత్రం పాపమునకు బానిసలు కారు, ఇతరుల ఆత్మీయ స్వాతంత్ర్యం కొరకు మీరు పని చేస్తున్నారా?

    "ప్రభువా, ఇతరుల ఆత్మీయపరమైన స్వేచ్ఛకు నేను బాధ్యత వహించునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Sep 29, 2021

    Robert Clark | రాబర్ట్ క్లార్క్

    రాబర్ట్ క్లార్క్  | Robert Clark



    • జననం: 04-07-1825
    • మహిమ ప్రవేశం: 16-05-1900
    • స్వస్థలం: లింకన్‌షైర్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: పూర్వపు పంజాబ్ మరియు కాశ్మీర్


    రాబర్ట్ క్లార్క్ పూర్వపు పంజాబ్ మరియు కాశ్మీర్‌లో మొదటిగా పరిచర్య చేసి మార్గదర్శకులుగా నిలిచినవారిలో ఒకరు. అతను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన పిమ్మట, తాను చదువుకున్న విశ్వవిద్యాలయంలోనే బోధించుటకు మంచి భవిష్యత్తునిచ్చే ఉద్యోగం అతని కొరకు వేచియుంది. అయితే, దానికంటే అన్యజనుల దేశాలలో క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించుటకు దేవుని పరిచారకుల కొరకు ఉన్న అవసరతను గురించిన చింతయే క్లార్క్‌లో ఎక్కువగా ఉంది. కాగా, అతను ‘చర్చి మిషనరీ సొసైటీ’ లో చేరగా, ఆ సంస్థ అతనిని భారతదేశంలోని పంజాబ్ మిషన్‌లో పరిచర్య చేయుటకు నియమించింది.


     1852వ సంll లో పంజాబులోని అమృత్‌సర్‌లో ఒక మిషన్ స్థావరమును స్థాపించారు క్లార్క్. భారతదేశంలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొనిన తరువాత, భారతదేశమును పరిపాలిస్తున్న ఆంగ్లేయులు కనుబరచుచున్న క్రైస్తవమతం నిజమైన క్రైస్తవ్యం కాదనే విషయముపై స్థానికులకు అవగాహన కల్పించవలెనని క్లార్క్ నిర్ణయించుకున్నారు. అందుకొరకు అతను బహిరంగ ప్రచారానికి బదులుగా మొదట వ్యక్తిగతముగా సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. స్థానికుల యొక్క సాక్ష్యాలు అత్యుత్తమ సువార్త సాధనాలు అని విశ్వసించిన అతను, మొదటిలో మారుమనస్సు పొందినవారు తమ కుటుంబీకులతో ఆరంభించి ఇతరులకు సాక్ష్యమివ్వడం ప్రారంభించవలెనని వారిని ప్రోత్సహించారు. ఎంతో వ్యతిరేకత మరియు అనేక విధములైన బెదిరింపులు కలిగినప్పటికీ రెండేళ్ళలో 20 మందికి పైగా విశ్వాసులను అతను సంపాదించగలిగారు.


     ఆ విధంగా స్థానికులకు పరిచర్య కొరకు శిక్షణ ఇచ్చి, వారికి సువార్త పరిచర్య బాధ్యతలను అప్పగించిన తరువాత, క్లార్క్ 1854వ సంll లో పెషావర్‌లో ఒక మిషన్ స్థావరమును స్థాపించారు. తరువాతి పది సంవత్సరాలు అతను లాహోర్ మరియు టిబెట్ వరకు ఉన్న కొండలు మరియు లోయలలోని ప్రజలను చేరుకొనుటకు అతను ప్రమాదకరమైన భూభాగాలను దాటుకుంటూ ప్రయాణించారు. ఆ సమయంలోనే అతను తన పరిచర్యలో ఉత్తమ భాగస్వామి అయిన ఎలిజబెత్ మేరీ బ్రౌన్‌ను వివాహం చేసుకున్నారు.


     1864వ సంll లో ఈ మిషనరీ దంపతులు మిషన్ స్థావరమును స్థాపించుటకు కాశ్మీర్‌కు వెళ్ళారు. ఆ కాలంలో డోగ్రావారి పాలనలో ఉన్న కాశ్మీర్ ప్రాంతం పేదరికం, తెగుళ్ళు మరియు దుర్మార్గంతో కొట్టుమిట్టాడుతోంది. అక్కడి రాజు కాశ్మీర్‌లో పని చేయుటకు క్లార్క్‌ను అనుమతించినప్పటికీ, క్లార్క్‌పై కుట్ర పన్ని అతను వచ్చినప్పుడు అతనిపై దాడి చేయమని తన సహచరులకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుని హస్తం వారికి తోడైయుండక పోయినట్లయితే, ఆ దంపతులు అక్కడికి వచ్చిన రోజుననే చంపబడియుండేవారు. అయితే, ఎలిజబెత్ యొక్క వైద్య మిషనరీ సేవలతో శతృవులు మితృలయ్యారు. త్వరలోనే కాశ్మీర్‌లో అనేక వైద్య మిషన్ స్థావరములు ఏర్పడ్డాయి మరియు దానితో పాటు క్రైస్తవ సమాజం కూడా అభివృద్ధి చెందింది.


      అలుపెరుగని ఉత్సాహంతో, తన చివరి శ్వాస వరకు కూడా వైద్య మరియు విద్యా సంబంధ సేవలను అందించుట ద్వారా ఉత్తర భారతదేశంలో ఆత్మీయ మరియు సామాజిక మార్పుకు కారకునిగా నిలిచారు రాబర్ట్ క్లార్క్.


    ప్రియమైనవారలారా, లాభదాయకమైన ఈ ప్రాపంచిక ఉద్యోగాల కంటే క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడం మరి ప్రశస్తమైనదని మీరు ఎరిగియున్నారా?


    ప్రభువా, విలువలేని వ్యర్థమైన విషయముల పైనుండి నా కనుదృష్టిని మరల్చుకొని మీకు సేవ చేయుటలో ఉన్న మహిమను నేను చూడగలుగుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Sep 12, 2021

    Robert Terrill Rundle | రాబర్ట్ టెర్రిల్ రండెల్


    రాబర్ట్ టెర్రిల్ రండెల్  | Robert Terrill Rundle


    • జననం: 11-06-1811
    • మహిమ ప్రవేశం: 04-02-1896
    • స్వస్థలం: మైలర్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: కెనడా

      పశ్చిమ కెనడాలోని ‘క్రీ’ మరియు ‘నకోడా’ అనే తెగల మధ్య పరిచర్య చేయుటలో తొలి అడుగులు వేసిన ఒక మార్గదర్శక మిషనరీగా పేరు గాంచారు రాబర్ట్ టెర్రిల్ రండెల్. క్రైస్తవ బోధకుల వంశంలో జన్మించిన రండెల్‌ సహజముగానే పరిచర్య వైపు మొగ్గు చూపారు. బోస్కాజిల్‌లో చదువుకుంటున్న సమయములో అతను స్థానిక వెస్లియన్ మెథడిస్ట్ చర్చి వ్యవహారాలలో ఎంతో చురుకుగా పాల్గొనేవారు. చివరికి 1839వ సంll లో అతను పూర్తి సమయము పరిచర్య చేయవలెనని తన జీవితమును సమర్పించుకున్నారు. త్వరలోనే హడ్సన్ బే కంపెనీ (హెచ్.బి.సి.) తరపున కెనడాలో సేవ చేసే అవకాశమును అతను అందిపుచ్చుకున్నారు.

      1840వ సంll లో కెనడాలోని ఎడ్‌మంటన్‌కు చేరుకున్నారు రండెల్. అక్కడి పరిస్థితులు అతను ఊహించిన దానికంటే ఎంతో కఠినంగా ఉన్నాయి. స్థానికులలో అనేక మంది కాథలిక్కులు అయినందున అతను నిర్వహించే కూడికలకు ప్రజలను సమకూర్చడం అతనికి క్లిష్టమైంది. అంతేకాకుండా వారిలో చాలామంది ఆదివారం నాడు కూడా పని చేయడం చూసి అతను ఆశ్చర్యపోయారు. దేవుని ఆజ్ఞను క్రైస్తవులే గౌరవించకపోతే, అన్యజనులు వాటిని అనుసరించుటను తాను ఎలా ఆశించగలనని అతను తలంచారు. ప్రభువు దినమైన ఆదివారమును దేవుని మహిమార్థమై గడపవలెనని స్థానిక క్రైస్తవులను కోరినప్పుడు అతను వారిచే అపహసించబడ్డారు. అయితే అతను ఏమాత్రం కలవరపడక, నిరాశచెందక, ప్రజలను మందలించి, ప్రోత్సహించి, ఒప్పింపజేయుటకు ఎంతో సహనముతో తన ప్రయత్నములను కొనసాగించారు.

      త్వరలోనే ఎడ్‌మంటన్‌ సరిహద్దులను దాటి తన పరిచర్యను విస్తరింపజేసి, ఇతర ఆదివాసీ తెగలను కూడా సంధించారు రండెల్. అతను తెగల యొక్క ఒక స్థావరం నుండి మరొకదానికి సువార్తను ప్రకటించుచూ కఠినంగా ప్రయాణించారు. తన సహపరిచారకుడైన జేమ్స్ ఇవాన్స్ ‘క్రీ’ భాషకు రూపొందించిన అక్షరాలను అతను వారికి నేర్పించారు. ఆంగ్లమునకు బదులుగా వారి స్వభాషలోనే కూడికలను నిర్వహించడం ప్రారంభించారు రండెల్. అంతేకాకుండా, అతను ప్రార్థన పుస్తకాన్ని క్రీ భాషలోకి అనువదించారు. ఆ ఆదివాసులు అతనిపై ఎంతటి అభిమానమును పెంచుకున్నారంటే, అతను తన మిషనరీ ప్రయాణంలో వారిని విడిచి ముందుకు సాగిపోవుటకు వారు అతనిని అనుమతించేవారు కాదు.

      రండెల్ తన మిషనరీ ప్రయాణాలలో తరచుగా గుర్రంపై ప్రయాణించేవారు. 1847వ సంll లో అటువంటి ఒక ప్రయాణంలో అతను గుర్రంపై నుండి క్రిందపడడంతో అతని చేతికి తీవ్ర గాయమైంది. ఆ చేయి సరిగా నయం కాకపోవడంతో 1848వ సంll లో అతను చికిత్స పొందుట కొరకు ఇంగ్లాండుకు వెళ్ళారు. తదుపరి అతను కెనడాలోని తన ప్రియమైన ప్రజల వద్దకు తిరిగి రావాలని కోరుకున్నారు గానీ, వెళ్ళలేకపోయారు. కాగా, 1896వ సంll లో తాను మహిమలోకి పిలువబడే వరకు కూడా ఇంగ్లాండులో పరిచర్య చేస్తూ ప్రభువుకు సేవలో ముందుకు సాగిపోయారు రాబర్ట్ టెర్రిల్ రండెల్.

    🚸 *ప్రియమైనవారలారా, ఆదివారమున మీ సమయమును దేవుని మహిమ కొరకే మీరు వెచ్చించున్నారా?* 🚸

    🛐 *"ప్రభువా, అన్యజనులు మిమ్మును వెంబడించుటకు నేను ఒక ఆటంకముగా ఉండకుండునట్లు మీ ఆజ్ఞలను నేను గౌరవించి అనుసరించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

  • WhatsApp
  • Aug 17, 2021

    Ruatoka | రుయాతోకా

    Ruatoka | రుయాతోకా


    • జననం: 12 September 1846
    • మహిమ ప్రవేశం: 1903
    • స్వస్థలం: మంగైయా ద్వీపం
    • దర్శన స్థలము: పాపువా న్యూ గినియా


     రుయాతోకా దక్షిణ కుక్ దీవులలోని మంగైయా ద్వీపానికి చెందినవారు. కౄరమైన నరమాంస భక్షకులైన అతని పూర్వీకులు సస్సెక్స్‌కు చెందిన విల్‌ఫ్రెడ్ ద్వారా క్రీస్తు నొద్దకు నడిపించబడ్డారు. కాగా రుయాతోకా యేసు క్రీస్తు ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించిన పిమ్మట క్రీస్తును గురించి ప్రకటించుటకు కౄర స్వభావులును నరమాంస భక్షకులునైయున్న న్యూ గినియా ప్రజల వద్దకు వెళ్ళారు.


     రుయాతోకా మరికొంత మందితో కలిసి పోర్ట్ మోర్స్‌బీకి వచ్చినప్పుడు అక్కడి స్థానికులు వారిని చూసి ఆశ్చర్యపోయారు. వారు దేవుళ్లు లేదా దుష్టశక్తులై యుంటారని ఆ ప్రజలు భావించారు. రుయాతోకాకు అక్కడ నివసించడం మనుగడ కొరకు పోరాటంగా మారింది. అతని సహచరులు ఒకరి తరువాత ఒకరు మలేరియాతో మరణిస్తున్నారు మరియు ఆహారం మరియు ఔషధాలు కొరతగా ఉన్నాయి. భాష ఒక అవరోధంగా మారడం వలన క్రీస్తు గురించి ప్రజలకు బోధించడం కష్టతరమైంది. అయినప్పటికీ అక్కడి స్థానికుల మధ్య పరిచర్యను కొనసాగించారు రుయాతోకా.


     అక్కడి ద్వీపవాసుల మధ్య రుయాతోకా యొక్క సాక్ష్యం ఎటువంటిదంటే వారు అతనిని ‘యేసుని మనుష్యుడు’ అని పిలిచేవారు. అతను వారి మధ్య నడిచేటప్పుడు వారు ఈటెలు మరియు కర్రలతో అతనిని బెదిరించినప్పటికీ అతను భయపడక సాగిపోయేవారు. కొన్నిసార్లు స్థానికులు ఈటెలు పట్టుకొని అతనిని చంపుటకు పరిగెత్తినప్పుడు కూడా అతను తన బైబిలును పైకెత్తి పట్టుకుని, “నేను జీవ పుస్తకమును కలిగియున్నాను. నా జీవితం క్రీస్తులో భద్రపరచబడియుంది” అని పలికేవారు. అతని మాటలకు ఆశ్చర్యపడిపోయే స్థానికులు అతని మీద దాడిచేయక అతను చెప్పే ప్రసంగమును ఆలకించేవారు. అధికారికంగా ఉండే అతని మాటలు వారు వారి పాపాల కొరకు పశ్చాత్తాపపడేలా చేసేవి.


      ఒక రోజు రుయాతోకా తన ఇంటి తలుపు తట్టిన చప్పుడుకి మేల్కొన్నారు. తలుపు తెరచి చూడగా అక్కడ భయముతో నిండుకొనిన కొందరు పాపువాన్లు ఉన్నారు. వారు దారి ప్రక్కన ఒక శ్వేతజాతీయుడు గాయములతో పడియున్నాడని, అయితే అతను దురాత్మను కలిగియున్నాడేమోయని భయపడి తాము అతని దగ్గరికి వెళ్ళలేదని అతనికి తెలియజేశారు. భయపడుటకు అక్కడ ఎటువంటి ఆత్మలూ లేవని పాపువాన్లకు చూపించుటకుగాను రుయాతోకా ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. కాగా అతను ఆ శ్వేతజాతీయుని కనుగొని, అతనికి కొన్ని నీళ్ళిచ్చి, అతనిని తన ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంటి వద్ద రుయాతోకా యొక్క భార్య పరిచర్య చేసి అతనికి తిరిగి జీవం పోసింది. ఆ విధముగా విశ్వాసమును ఆచరణాత్మకముగా చూపించే అతని క్రియల ద్వారా అతను క్రీస్తు కొరకు అనేక ఆత్మలను సంపాదించగలిగారు.


      మంచి కాపరి వంటి హృదయముతోను, మంచి సమరయుని వంటి మనస్సుతోను పాపువా తెగల మధ్య చివరి వరకూ తన సేవను కొనసాగించారు రుయాతోకా.


     *ప్రియమైనవారలారా, క్రీస్తు యేసు కలిగియున్న అదే మనస్సును మీరును కలిగియున్నారా?* 


     *"ప్రభువా, నా విశ్వాసమును క్రియారూపకముగా కనుపరచుట ద్వారా మీ కొరకు ఆత్మలను సంపాదించగలుగునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 

    *******

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏

  • WhatsApp