Search Here

Showing posts with label V. Show all posts
Showing posts with label V. Show all posts

Jan 11, 2022

Vincent Ferrer Life History

విన్సెంట్ ఫెర్రర్ గారి జీవిత చరిత్ర









  • జననం: 23-01-1350
  • మహిమ ప్రవేశం: 05-04-1419
  • స్వస్థలం: వాలెన్సియా
  • దేశం: స్పెయిన్
  • దర్శన స్థలము: ఐరోపా

ఒకానొకసారి ఒక మూరుల రాజు ఒక దైవజనుని యొక్క అద్భుతములను గురించి విన్నాడు. కాగా, ఆ దైవజనుడు అనుసరిస్తున్న మతం సరియయినది కాదని నిరూపించాలని తలంచిన ఆ రాజు అతనిని తన నగరానికి ఆహ్వానించి ప్రసంగించమని కోరాడు. అప్పుడు ఆ దైవజనుడు తన భాష అయిన స్పానిష్ భాషలో మాట్లాడినప్పటికీ, ఎంతో ఆశ్చర్యకరమైన రీతిలో అక్కడ రాజు యొక్క ఆస్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతను పలికిన ప్రతియొక్క పదాన్నీ తమ స్వంత భాషలో మాట్లాడినట్లు అర్థంచేసుకొనగలిగారు! ఆ నగరంలో అతను మూడు ఉపన్యాసాలు ప్రసంగించిన తరువాత దాదాపు ఎనిమిది వేల మంది ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మము పొందారు. ఆ దైవజనుడు మరెవరో కాదు, అనేక ఆత్మీయ వరములను కలిగియున్న విన్సెంట్ ఫెర్రర్.

స్పెయిన్ దేశంలోని ఒక ఉన్నతమైన కుటుంబములో జన్మించిన విన్సెంట్ తన బాల్యము నుండే ఆధ్యాత్మికత కలిగిన జీవితాన్ని గడిపారు. చాలా చిన్న వయస్సులోనే "ఆర్డర్ ఆఫ్ ప్రీచర్స్" (బోధకుల క్రమము)లో చేరిన అతను లేఖనములన్నింటినీ కంఠస్థం చేశారు. సంఘ నాయకుల మధ్య నెలకొన్న వివాదాలు మరియు విబేధాల కారణంగా క్రైస్తవ సంఘము క్లిష్ట పరిస్థితులగుండా వెళుతున్న సమయమది. ఆ విబేధాలను సరిచేయుటకు విన్సెంట్ తన వంతు ప్రయత్నం చేశారు.

తీవ్రమైన అస్వస్థత వలన ప్రాణాన్నే కోల్పోయేంత పరిస్థితులను ఎదుర్కొనిన తరువాత విన్సెంట్  దేవుని యొక్క నిజమైన పిలుపును కనుగొని, ఒక మిషనరీగా మారారు. 20 సంవత్సరాల పాటు అతను ఐరోపా ఖండమంతటా స్పెయిన్, ఫ్రాన్స్, ఐర్లాండ్, బెల్జియం, జర్మనీ, స్కాట్లాండ్, ఇటలీ మొదలగు దేశాలలో ప్రసంగిస్తూ ప్రయాణించారు. ఒక అద్భుతమైన బోధకుడైన అతని యొక్క ప్రసంగాలన్నీ అధికశాతం బహిరంగ కూడికలలోనే ఇవ్వబడేవి. ఎందుకనగా అతను బోధించే దేవుని యొక్క ప్రేమాక్షమాపణలు, పాపం మరియు తీర్పులను గురించి వినడానికి తరలి వచ్చే ఆ గొప్ప జనసమూహాలను కూర్చుండబెట్టుటకు ఏ క్రైస్తవ ఆలయము కూడా సరిపోదు. ఆ బోధలు విన్నవారు తమ పాపముల నిమిత్తమై విచారిస్తూ, పశ్చాత్తాపపడి, క్రీస్తు కొరకు జీవించుటకు తమ జీవితాలను సమర్పించుకొనేవారు. అతను యూదా ప్రజల మధ్యను మరియు మూరుల మధ్యను కూడా సేవ చేసి, వారిలో వేలాదిమందిని క్రీస్తు వైపుకు నడిపించారు.

ఒక సామాన్యమైన వ్యక్తిగా జీవించిన విన్సెంట్ తన కొరకని దేనినీ తీసుకొనలేదు. అతనిపై ఉన్న గౌరవం కొలదీ అనేకమంది తమ ఆస్తులను అతనికి ఇచ్చారు. అయితే, అవియన్నియూ సువార్త సేవ విస్తరణ కొరకే వినియోగించబడ్డాయి. దేవుని శక్తితో నింపబడిన విన్సెంట్ అసంఖ్యాక రోగులను స్వస్థపరచడమే కాక చనిపోయినవారిని కూడా తిరిగిలేపారు. అతను చేసిన పరిచర్య యేసు క్రీస్తు ప్రభువును ప్రతిబింబిస్తుంది.

ప్రియమైనవారలారా, మీరు దేవుని శక్తి యొక్క సంపూర్ణతతో ఆయనను సేవిస్తున్నారా?

"ప్రభువా, నా శక్తిని మరుగుపరచి మీ యొక్క శక్తితో నన్ను నింపుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Dec 4, 2021

    Vachindi Vachindi Vachindi Christmas Panduga | వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా

    వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగా 

    మార్పులేకుండచేస్తే శుద్దదండగా 

    వచ్చింది వచ్చింది వచ్చింది క్రిస్మస్ పండుగ

    ఏసయ్య కోరింది మనలో మార్పునేకథా


    ఇంటికి రంగులుకాదు

    వంటికి హంగులు కాదు

    అల్లరిఆటలు కాదు

    త్రాగుబోతువిందులు కాదు


    మారు మనస్సు కలిగుండుటయే క్రిస్మస్

    అపవిత్రతను విసర్జించుటే క్రిస్మస్

    దైవప్రేమ కలిగుండుటయే క్రిస్మస్

    ప్రభువు కొరకు జీవించుటయే నిజ క్రిస్మస్

                                                  ||వచ్చింది||

    (చరణం-1)

    రంగురంగు వస్త్రాలు-మురుకుగుడ్డలా మనస్సులు

    మెరిసిపోతున్న ఇళ్ళూ-మాసిపోయాయి హృదయాలు

    ఇంటిపైన నక్షత్రాలు - ఇంటిలో మద్యపానులు

    పేరుకేమో క్రైస్తవులు- తిరుమారని జనులు ||2||

                                       || ఇంటికి||                           

                          

    (చరణం - 2)

    విద్యలేని పామరులు విధేయులై బ్రతికారు

    విద్యవున్న సోమరులు మందిరాలకే రారు

    తూర్పుదేశపు జ్ఞానులే మోకాళ్ళువంచినారు

    చదువు,పదవుంటే చాలు మోకరించరూ వీరు||2||

    || ఇంటికి||

                       

    (చరణం - 3)


    దినములు చెడ్డవిగనుక సమయమును పోనియ్యకా

    అజ్ఞానులవలేకాకా జ్ఞానులవలే నడవాలి

    పాపముతీయుట కొరకే ప్రభుపుట్టాడని తెలిసి

    పాపము వీడక నీవు ఉత్సవ ఉల్లాసాలా||2||

                                             || ఇంటికి||


    Lyrics in English:

    Vachhindi vachhindi vachhindi Christmas panduga

    Maarpulekunda cheste shuddha dandaga

    Vachhindi vachhindi vachhindi Christmas panduga

    Yesayya korindi manual maarpunekada

    Intiki rangulu kaadu, vantiki hangulu kaadu

    Allari aatalu kaadu, traagubotu vindulu kaadu ||2||

    Maarumanasu kaligundutaye Christmas

    Apavitratanu visarjinchutaye Christmas

    Daivaprema kaligundutaye Christmas

    Prabhuva koraku jeevinchutaye nija Christmas ||Vachhind||

    1.Rangu rangu vastralu – murikiguddala manasulu

    Merisipotunna illu – Maasipoyaayi hrudayaalu

    Intipaina nakshatraalu – intilo madyapaanulu

    Perukemo kraistavulu – teerumaarani janulu ||Intiki||

    2.Vidyaleni paamarulu – vidheyulai bratikaaru

    Vidyavunna somarulu – mandiraalake raaru

    Toorpu deshapu jnaanulemo mokaallu vanchinaaru

    Chaduvu padavunte chaalu mokarincharu veeru ||Intiki||

    3.Dinamulu cheddavi ganuka samayamunu poniyyaka

    Ajnaanula vale kaaka – jnaanulavale nadavaali

    Paapamu teeyuta karaoke prabhuvu puttadani telisi

    Paapamu veedaka neevu – vutsava vullasaala ? ||Intiki||




  • WhatsApp
  • Sep 28, 2021

    Vyasanapadakumu Neevu | వ్యసనపడకుము నీవు

    యెహోవాయందు నమ్మికయుంచి మేలుచేయుము. దేశమందు నివసించి సత్యము ననుసరించుము."
     కీర్తన Psalm 37:1-25

    పల్లవి : వ్యసనపడకుము నీవు - చెడ్డవారలను జూచినయపుడు
    మత్సరపడకుము నీవు - దుష్కార్యములు చేయువారిని జూచి

    1. వారు గడ్డివలె త్వరగా - ఎండిపోదురు
    పచ్చని కూరవలె వారు - వాడిపోవుదురు - ఆ ... నీవు || వ్యసనపడకుము ||

    2. యెహోవా యందు నమ్మికయుంచి - మేలు చేయుము
    దేశమందు నివసించి సత్యము - ననుసరించుము - ఆ ... నీవు || వ్యసనపడకుము ||

    3. నీదు మార్గము యెహోవాకు అప్పగింపుము
    ఆయనను నమ్ముకొనుము నీదు - కార్యము నెరవేర్చును ... నీవు ||వ్యసనపడకుము ||

    4. కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము
    వ్యసనపడకుము నీ కది - కీడు కే కారణము ... నీవు || వ్యసనపడకుము ||

    5. ఒకని నడత యెహోవాయే - స్థిరము చేయును
    ఆయన వాని ప్రవర్తనను జూచి - ఆనందించును - ఆ ... నీవు ||వ్యసనపడకుము||

    6. యెహోవా అతని చేతిని - పట్టి యుండెను
    అతడు నేలను పడినను లేవ - లేక యుండడు - ఆ ... నీవు || వ్యసనపడకుము ||

    7. నీతిమంతులు విడువబడుటగాని - వారి సంతానము
    భిక్షమెత్తుటగాని - నేను చూచి యుండలేదు - ఆ ... నీవు || వ్యసనపడకుము ||
  • WhatsApp
  • Sep 27, 2021

    Vivienne Stacey | వివియెన్ స్టేసీ

    వివియెన్ స్టేసీ | Vivienne Stacey



    • జననం: 12-07-1928
    • మహిమ ప్రవేశం: సెప్టెంబర్ 2010
    • స్వస్థలం: రూయిస్లిప్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శనము: ముస్లిం ప్రపంచం

     “ఎవనికి ఎక్కువగా ఇయ్య బడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని యొద్ద ఎక్కువగా అడుగుదురు.” (లూకా 12:48). “దేవుడు నాకు ఎంతో దయచేశాడు–కొత్త జీవితమును మరియు మంచి విద్యను ఇచ్చాడు. కాబట్టి, నేను ఆయనకు ఎంతో తిరిగి ఇవ్వవలెను.” అని అనుకున్నారు వివియెన్.

     వివియెన్ స్టేసీ ఒక నామమాత్రపు క్రైస్తవ కుటుంబములో జన్మించారు. లండన్‌లోని ‘యూనివర్శిటీ కాలేజ్’ లో చదువుతున్నప్పుడు, వివియెన్ తన క్రైస్తవ స్నేహితురాలు బార్బరా కలిగియున్న హృదయ శాంతి తనకు లేదని గ్రహించారు. ఒకసారి, బార్బరా ఆమెను ఒక యవ్వనస్థుల కూడికకు తీసుకువెళ్ళటం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు వివియెన్ మోకరిల్లి ప్రార్థించగా, ఆమెకు యేసుక్రీస్తు ప్రభువు యొక్క దర్శనం కలిగింది. చివరికి హృదయ మార్పు నొంది మారుమనస్సును పొందారు వివియెన్. అటు తరువాత ఆమె మరొక కూడికకు వెళ్ళినప్పుడు, అక్కడ ఒక మిషనరీ భారతదేశంలోని కుష్టు రోగుల మధ్య పనిచేయుటకు దేవుడు తనను ఎలా పిలిచాడో అన్న దాని గురించి క్లుప్తముగా వివరించడం జరిగింది. ఆ కూడిక ముగిసే సమయానికి, విదేశాలలో సేవ చేయుటకు తనను కూడా దేవుడు పిలుస్తున్నాడని వివియెన్ గ్రహించారు. అది లూకా 12:48 ద్వారా ఆమెకు మరింతగా దృఢపరచబడింది.

     ముస్లింలకు సువార్త చెప్పడం ఎంతో క్లిష్టమని తెలుసుకున్న వివియెన్, తన పిలుపు ముస్లింల కొరకు పని చేయడమే అని గ్రహించారు. తరువాత ‘జెనానా బైబిల్ మరియు మెడికల్ మిషన్‌’ లో (ఈ సంస్థ తరువాత ‘ఇంటర్‌సర్వ్’ గా మార్చబడింది.) చేరిన ఆమె, ముస్లింల మధ్య సాక్షులుగా ఎలా ఉండాలో పాకిస్తానీ క్రైస్తవ మహిళలకు బోధించి, శిక్షణనిచ్చుటకు తనను పాకిస్తాన్‌కు పంపమని అభ్యర్థించారు. కాగా 1955వ సంll లో ఆమె పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో ఉన్న ‘యునైటెడ్ బైబిల్ ట్రైనింగ్ సెంటర్’ (యు.బి.టి.సి.) లో పనిచేయుటకు నియమితులయ్యారు.

     యు.బి.టి.సి. లో ఉన్నప్పుడు ఆమె బోధనలోను మరియు ఇతర కార్యక్రమాలలోను ఎంతో విస్తృతంగా తన సేవలనందించారు. ఆమె పాకిస్థాన్‌లో ‘థియోలాజికల్ ఎడ్యుకేషన్ బై ఎక్స్‌టెన్షన్’ పరిచర్య యొక్క వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. తరువాత, ఆమె గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న పాకిస్తానీ క్రైస్తవుల పరిస్థితిని అర్థం చేసుకొనుటకుగాను ప్రతి సంవత్సరం సెలవు దినములలో ఆ దేశాలను సందర్శించడం ప్రారంభించారు. వాటిని గురించిన ఆమె నివేదికలు మరియు ఆమె ఇచ్చిన శిక్షణ అక్కడ సేవ చేయుటకు ఇతరులకు సహాయపడ్డాయి. 1975వ సంll లో ‘ఇంటర్‌సర్వ్’ ఆమెను పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో ఉన్న బన్ను అనే ప్రాంతములో సేవ చేయుటకు నియమించింది. అదే సమయంలో ఆమె మధ్యప్రాచ్యం (మిడిల్ ఈస్ట్) మరియు ఉత్తర ఆఫ్రికాల కొరకు సేవ చేయుటకు ‘ఇంటర్నేషనల్ ఫెలోషిప్ ఆఫ్ ఇవాంజెలికల్ స్టూడెంట్స్’ (IFES) తో కూడా కలిసి పనిచేశారు. ఆమె ఇస్లాం దేశాలకు, మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) దేశాలకు, ఆఫ్రికా దేశాలకు మరియు భారతదేశంతో సహా అనేక ఇతర దేశాలకు విస్తృతంగా ప్రయాణించి, ముస్లిం ప్రజల మధ్య పరిచర్య చేయుటకు క్రైస్తవ నాయకులకు బోధించి, శిక్షణనిచ్చారు. అంతేకాకుండా ఆమె ఆంగ్లం మరియు ఉర్దూ భాషలలో అనేక పుస్తకాలను మరియు వ్యాసాలను కూడా వ్రాశారు. 1993వ సంll లో ‘ఇంటర్‌సర్వ్’ నుండి పదవీ విరమణ పొందినప్పటికీ, తన రచనలను మరియు సంచార పరిచర్యను కొనసాగిస్తూ దేవుని సేవలో చివరి వరకూ ముందుకు సాగిపోయారు వివియెన్ స్టేసీ.

    *ప్రియమైనవారలారా, మీ యొక్క పిలుపు ఏమిటో మీరు గ్రహించారా?*

    "ప్రభువా, నీవు నాకు ఎంతో ఇచ్చావు. దానికి తగినట్లుగా నేను నీకు తిరిగి ఇచ్చుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    *******
    దేవునికే మహిమ కలుగునుగాక!
    *******

  • WhatsApp
  • Aug 1, 2021

    VISWASAMU LEKUNDA DEVINIKI | విశ్వాసము లేకుండా దేవునికి

     
    విశ్వాసము లేకుండా దేవునికి  - ఇష్టులైయుండుట అసాధ్యము 
    విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు .......... 
    
    హానోకు తన మరణము చూడకుండ 
    పరమునకు ఎత్తబడి పోయెనుగా 
    ఎత్తబడక మునుపే దేవునికి 
    ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా || 
    
    నోవహు దైవభయము గలవాడై 
    దేవునిచే హెచ్చరించబడిన వాడై 
    ఇంటివారి రక్షణకై ఓడను కట్టి 
    నీతికే వారసుడని సాక్ష్యమొందెను    || విశ్వా || 
    
    మోషే దేవుని బహుమానము కొరకై 
    ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి 
    శ్రమలనుభవించుటయే భాగ్యమని 
    స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను   || విశ్వా || 
    
    వీరందరు సాక్ష్యము పొందియున్నను 
    మనము లేకుండా సంపూర్ణులు కారు 
    అతి పరిశుద్ధమైన విశ్వాసముతో 
    మరి శ్రేష్టమైన సీయోనుకే సిద్ధపడెదము || విశ్వా ||
  • WhatsApp