విశ్వాసము లేకుండా దేవునికి - ఇష్టులైయుండుట అసాధ్యము
విశ్వాసము ద్వారా మన పితరులెందరో రాజ్యాల్ని జయించినారు ..........
హానోకు తన మరణము చూడకుండ
పరమునకు ఎత్తబడి పోయెనుగా
ఎత్తబడక మునుపే దేవునికి
ఇష్టుడైయుండినట్లు సాక్ష్యమొందెను || విశ్వా ||
నోవహు దైవభయము గలవాడై
దేవునిచే హెచ్చరించబడిన వాడై
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి
నీతికే వారసుడని సాక్ష్యమొందెను || విశ్వా ||
మోషే దేవుని బహుమానము కొరకై
ఐగుప్తు సుఖభోగాలను ద్వేషించి
శ్రమలనుభవించుటయే భాగ్యమని
స్థిరబుద్ధి గలవాడై సాక్ష్యమొందెను || విశ్వా ||
వీరందరు సాక్ష్యము పొందియున్నను
మనము లేకుండా సంపూర్ణులు కారు
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో
మరి శ్రేష్టమైన సీయోనుకే సిద్ధపడెదము || విశ్వా ||
Aug 1, 2021
VISWASAMU LEKUNDA DEVINIKI | విశ్వాసము లేకుండా దేవునికి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment