Search Here

Showing posts with label D. Show all posts
Showing posts with label D. Show all posts

May 14, 2023

David Livingstone | డేవిడ్ లివింగ్‌స్టన్

డేవిడ్ లివింగ్‌స్టన్ గారి జీవిత చరిత్ర

  • జననం : 19-03-1813
  • మరణం : 01-05-1873
  • స్వదేశం : స్కాట్లాండ్
  • దర్శన స్థలము : ఆఫ్రికా

స్కాట్లాండుకు చెందిన డేవిడ్ లివింగ్‌స్టన్ ఒక వైద్యుడు, ఆఫ్రికా అన్వేషకుడు మరియు మిషనరీ. అతను బాల్యంలో ప్రత్తి మిల్లులలో కష్టపడి పనిచేస్తూ, సాయంకాలపు పాఠశాలలకు హాజరయ్యేవారు. అతను చదివిన మిషనరీ కథలు మరియు అతని సండే స్కూల్ (ఆదివారపు బైబిలు పాఠశాల) ఉపాధ్యాయుని బోధనలు యవ్వనస్థుడైన లివింగ్‌స్టన్‌పై తీవ్ర ఆధ్యాత్మిక ప్రభావాన్ని చూపాయి. చైనాకు వైద్య మిషనరీలు అవసరమని చేసిన విజ్ఞాపనతో ఆకర్షింపబడిన అతను, గ్లాస్గోలో వైద్య మరియు వేదాంతశాస్త్రములను అభ్యసించారు. అయితే, ఆఫ్రికాలోని మరొక మార్గదర్శక మిషనరీ అయిన రాబర్ట్ మోఫాట్‌ను ఒకసారి అతను సంధించడం జరుగగా, అది ఆఫ్రికాలోని పరిచర్యకు అతను సమర్పించుకొనుటకు కారణమయ్యింది. కాగా లండన్ నగరంలో సేవ చేయుటకు అర్హులుగా నియమింపబడిన పిమ్మట 1841వ సంll లో అతను  ఆఫ్రికాలోని కేప్ టౌన్ నగరమునకు పయనమయ్యారు.


మొదటిలో రాబర్ట్ మోఫాట్ ఆధ్వర్యంలో ష్వానా ప్రాంతంలో కొంతకాలం సేవ చేసిన లివింగ్‌స్టన్, తరువాత జాంబియా మరియు మొజాంబిక్ వంటి ప్రదేశాలకు సువార్తను తీసుకువెళ్ళవలెనని ఉత్తర దిశగా ప్రయాణించారు. పిమ్మట బ్రిటన్ లో కొంతకాలం గడిపిన తరువాత, తిరిగి అతను సువార్తను జాంబేజీ నది మరియు మాలావి సరస్సు భూములకు తీసుకువెళ్ళుటకు తన మిషనరీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సమయంలోనే అతను తన ప్రియమైన జీవిత భాగస్వామియైన మేరీ మోఫాట్‌ను కోల్పోవడం జరిగింది. అయినప్పటికీ, అతను తన పరిచర్యను కొనసాగించారు. అతని జీవిత ప్రాధాన్యత ఏమిటంటే బయటి ప్రపంచమునకు మరుగైయున్న చీకటి ఖండమైన ఆఫ్రికాలోని అంతర్గత ప్రదేశాలకు సువార్త వెలుగును కనుపరచి "క్రైస్తవ్యము మరియు నాగరికత" లను అందుబాటులోనికి తీసుకురాగలుగునట్లు అతను "దేవుని రహదారి" అని పిలిచే ఒక  "మిషనరీ రోడ్డు" తెరువబడవలెననునదే.


లివింగ్‌స్టన్ వివిధ ప్రాంతాలను అన్వేషిస్తూ, తీరాలను చేరుకుంటూ, ఉపన్యాసాలు, ప్రసంగాలు, బోధలు మరియు వైద్యం చేస్తూ సంచరించేవారు. దర్శించిన ప్రతి స్థలము యొక్క భౌగోళిక లక్షణములను జాగ్రత్తగా పరిశీలించేవారు. నేటి మిషనరీ అన్వేషకులకు సూచనగా ఉండుటకై అతను అనేక దేశముల పటములను మళ్ళీ మళ్ళీ చిత్రీకరించారు. ఆ ఖండములోని బహు అంతర్గత ప్రాంతములలో నివసిస్తున్న ప్రజలకు క్రైస్తవ్యమును పరిచయం చేయుటకు అతను నరమాంసభక్షకులను, కౄరులను మరియు అక్కడ నెలకొనియున్న బానిసత్వం వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ, అతను సహనముతో అన్నింటినీ భరించారు మరియు అనేక కలవరపరిచే పరిస్థితులలో 'విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన' క్రీస్తు నుండి తన దృష్టిని ఎన్నడూ మళ్ళించలేదు. స్థానిక తెగల వారికి సువార్తను ప్రకటించుటకును మరియు ఆఫ్రికాలో బానిస వ్యాపారాన్ని నిర్మూలము చేయుటకును తన జీవితంలో ముప్పై సంవత్సరాల పాటు నిర్విరామంగా శ్రమించిన తరువాత 1873వ సంll లో దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించారు డేవిడ్ లివింగ్‌స్టన్.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, తెలియని ప్రదేశములకు వెళ్ళమని దేవుడు మిమ్ములను అడిగితే సాహసోపేతముగా ముందుకు వెళ్ళుటకు మీరు అంగీకరించెదరా? 

ప్రార్థన : "ప్రభువా, మీరు నన్ను ఎక్కడ నిలువబెట్టెదరో అక్కడ మీ పని చేయునట్లు నన్ను బలపరచుము. ఆమేన్!" 


దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • David Hill | డేవిడ్ హిల్

    డేవిడ్ హిల్ గారి జీవిత చరిత్ర

    • జననం : 1840
    • మహిమ ప్రవేశం : 18-04-1896
    • స్వస్థలం : యార్క్
    • దేశం        :      ఇంగ్లాండు
    • దర్శన స్థలము : చైనా

    ఆంగ్లేయుడైన డేవిడ్ హిల్ చైనా దేశములో సేవ చేసిన ఒక మెథడిస్టు మిషనరీ. ఇంగ్లాండు దేశంలోని యార్క్‌లో జన్మించిన అతను దేవుని యందలి భయభక్తులు కలిగిన యువకునిగా ఎదిగారు. యవ్వన దశలో ఉన్నప్పుడు ఆత్మీయ విషయముల పట్ల అతను ఎంత ఉత్సాహమును మరియు ఆసక్తిని కలిగియుండేవారంటే మిషనరీ సేవకు సహాయమందించవలెనని అధిక సమయం పని చేసేవారు. అతను యార్క్ మరియు చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఎంతో దీనత్వము కలిగి బోధించడం ప్రారంభించినప్పుడు అతనికి కేవలం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే. వెస్లియన్ మెథడిస్టు చర్చి వేదాంతశాస్త్రమును అభ్యసించుటకు అతనిని రిచ్మండ్ నగరమునకు పంపింది. అక్కడ అతని వ్యక్తిత్వం మరియు దైవభక్తి ద్వారా తోటి విద్యార్థులలో కొంతమంది మరింత చిత్తశుద్ధితో నమ్మకముగా తమ ప్రభువును సేవించుటకు ఒప్పించబడ్డారు. 1864వ సంll లో పట్టాపొంది, సేవచేయుటకు నియామక అభిషేకం పొందిన తరువాత అతను "సెంట్రల్ చైనా మిషన్" కొరకు పనిచేయుటకు నియమించబడ్డారు.


    హుబీ పరిధి ప్రాంతములో అతను నియమితులవ్వగా, అక్కడ అతను సంచార సేవకునిగా పనిచేశారు. అక్కడి వాతావరణ పరిస్థితులు అతనికి అనుకూలంగా లేనప్పటికీ, అతి త్వరలోనే తనను తాను అక్కడి పరిస్థితులకు అలవరచుకున్నారు. మొదటి రెండు సంవత్సరాలు అతను చైనా భాష మాట్లాడలేకపోయినప్పటికీ, అది అతని పరిచర్యకు అవరోధమవ్వలేదు. ఏలయనగా ప్రజలు సువార్తను అర్థం చేసుకొనులాగున అతను తనతో నిఘంటువులను తీసుకువెళ్ళేవారు. అధిక సమయం అతను సువార్త రచనలను చైనా భాషలోనికి అనువదించుటలోను మరియు స్థానిక ప్రజలకు గంటల తరబడి లేఖనములను బోధించుటలోను గడిపారు. స్థానిక ప్రజలకు క్రీస్తు ప్రేమను కనుపరచుటకు అతను చేసిన ప్రయత్నాలు పలు మార్లు ఆ ప్రజల ఆగ్రహానికి గురయ్యాయి. అయితే హిల్ యొక్క స్వభావం ఎటువంటిదంటే ఏ ప్రజల గురించి గానీ లేక ప్రదేశం గురించి గానీ ఎటువంటి పరిస్థితులలోను నిరీక్షణ కోల్పోక ఇతరులు నిరుత్సాహపడినప్పటికీ తాను మాత్రం సేవలో ముందుకు సాగిపోయేవారు.


    హిల్ యొక్క సేవ సామాజిక సేవా దృష్టిని కూడా కలిగి ఉంది. 1878వ సంll లో షాంకి పరిధి ప్రాంతములో కరువు కలిగినప్పుడు అతను మరికొందరు మిషనరీలతో కలిసి అక్కడి ప్రజలను చేరుకొని రెండేళ్లపాటు సహాయక చర్యలను చేపట్టారు. తరువాతి సంవత్సరాలలో అతను  ఒక ఆసుపత్రిని మరియు వృద్ధులు, అంధులు మరియు అనాధల కొరకు గృహములను స్థాపించారు. “సెంట్రల్ చైనా రిలిజియస్ ట్రాక్ట్ సొసైటీ” స్థాపించబడడంలోను మరియు షాంఘై మిషనరీ కాన్ఫరెన్స్ ను నడిపించడంలోను అతను అందించిన సహకారం చైనాలో సువార్త ప్రకటనను వేగవంతం చేసింది. ఎల్లప్పుడూ చిరునవ్వుతోను మరియు ప్రతి ఒక్కరిని కూడా దయగల మాటలతో పలుకరించే డేవిడ్ హిల్, తన తుది శ్వాస వరకు యేసు క్రీస్తు యొక్క నిజమైన శిష్యునిగా జీవించారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, సర్వశక్తిమంతుడైన దేవునికి సేవ చేస్తున్నప్పుడు దీన స్వభావమును మీరు కలిగియుంటున్నారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, దీనత్వముతో మీ పరిచర్యను కొనసాగించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Jul 26, 2022

    David Wilkerson | డేవిడ్ విల్కర్సన్

    డేవిడ్ విల్కర్సన్   గారి జీవిత చరిత్ర



    • జననం: 19-05-1931
    • మహిమ ప్రవేశం: 27-04-2011
    • స్వస్థలం: పెన్సిల్వేనియా
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: అమెరికా సంయుక్త రాష్ట్రాలు


    పెన్సిల్వేనియాలోని పెంతెకొస్తు బోధకుల కుటుంబములో జన్మించారు డేవిడ్ రే విల్కర్సన్. చాలా చిన్న వయస్సులోనే బాప్తిస్మము తీసుకున్న విల్కర్సన్, పదునాలుగేళ్ళ వయసులోనే దేవుని వాక్యమును ప్రకటించడం ప్రారంభించారు. 1952వ సంll లో సేవ చేయుటకు నియామక అభిషేకం పొందిన పిమ్మట అతను పెన్సిల్వేనియాలోని స్కాట్స్ డేల్ మరియు ఫిలిప్స్‌బర్గ్ అనే ప్రాంతములలో పాదిరిగా పరిచర్య చేశారు. 


    1958వ సంll లో, న్యూయార్క్‌లో యవ్వనస్థులతో కూడిన ఒక ముఠా పాల్పడిన హత్య కేసు గురించి చదివిన విల్కర్సన్, ఆ నగరంలో అటువంటి ముఠాలలో ఉన్నవారికి మరియు మాదకద్రవ్యాలకు బానిసలైనవారికి సహాయం చేయవలెనని దేవుడు తనకు పిలుపునిస్తున్నట్లు భావించారు. కాగా 28 సంll ల వయస్సులో అతను క్రైస్తవ సంఘములో సేవలందిస్తూ ఎంతో సౌకర్యవంతముగా సాగిపోతున్న జీవితమును విడిచిపెట్టి న్యూయార్క్ నగరమునకు వెళ్ళారు. అక్కడ అతను వీధులలో ప్రసంగించారు, కూడికలను, సభలను నిర్వహించారు మరియు మాదకద్రవ్యాల నుండి బయటపడుటకు యవ్వనస్థులు ఆశ్రయించులాగున ఒక గృహమును ఏర్పాటుచేశారు. అతని పరిచర్య మూలముగా ఎంతో మంది ముఠా సభ్యులు బైబిలు కొరకు తమ ఆయుధములను ఇచ్చివేశారు మరియు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించుటకు ముందుకు వచ్చారు. అటువంటి వారిలో ఒకరు ‘మౌ మౌ’ ముఠా నాయకుడైన నిక్కీ క్రూజ్.


    ఒక రోజున విల్కర్సన్ నిక్కీని కలుసుకొని అతనితో సువార్తను పంచుకొనగా, నిక్కీ అతని ముఖముపై ఉమ్మివేసి, మరెప్పుడైనా తన దగ్గరికి వస్తే చంపుతానని బెదిరించారు. అందుకు విల్కర్సన్ “మీరు నన్ను వెయ్యి ముక్కలుగా చేసి వీధిలో పారవేసినా, ప్రతియొక్క ముక్క కూడా మిమ్ములను ప్రేమిస్తుంది” అని అతనికి బదులిచ్చారు. ఆ మాటలు నిక్కీని ఎంతోకాలం వెంటాడాయి. చివరికి విల్కర్సన్ యొక్క ఒక కూడికలో నిక్కీ తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించారు. అటు పిమ్మట తన ముఠా సభ్యులలో అనేకమందిని క్రీస్తు వద్దకు నడిపించారు నిక్కీ.


    యవ్వనస్థుల మరియు పెద్దవారి యొక్క భౌతిక మరియు ఆత్మీయ శ్రేయస్సు కొరకు అమెరికా, ఐరోపా మరియు ఆసియాలలో అనేక మిషన్లను స్థాపించి తన పరిచర్యను విస్తరింపజేశారు విల్కర్సన్. 1967వ సంll లో “యూత్ క్రూసేడ్స్‌” అను పరిచర్యను కూడా స్థాపించారు. ఇది ప్రధానంగా మాదకద్రవ్యాలు, మద్యం మరియు హింసాత్మక కార్యకలాపాల వైపుకు జారిపోకుండా యవ్వనస్థులను నిరోధించుటకు పనిచేసింది.


    అంతేకాదు, విల్కర్సన్ ‘టైమ్స్ స్క్వేర్ చర్చి’ యొక్క స్థాపకులు కూడా. ఆ సంఘములో అతను నీతిగలిగి జీవించుటకును మరియు దేవునిపై పూర్తిగా ఆధారపడుటకును ప్రోత్సహించేటటువంటి కొన్ని శక్తివంతమైన దైవ వాక్య సందేశములను ఇచ్చారు. నిర్భయుడైన సువార్తికునిగాను, దయాకనికరములు గల పాదిరిగాను మరియు జ్వలించుచున్న నిప్పువంటి బోధకునిగాను కనిపించే డేవిడ్ విల్కర్సన్, 2011వ సంll లో పరమందు తన ప్రభువును చేరుకొన ఇహలోకమును విడిచివెళ్ళారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, ఇతరుల ఆత్మీయ అవసరతలను సంధించుటకు మీరు ఎంతటి దయాకనికరములు కలిగిన హృదయమును కలిగియున్నారు? 


    ప్రార్థన :

    "ప్రభువా, ప్రపంచ నలుమూలలకూ సువార్తను విస్తరింపజేయుటకు విశ్వాసముతో నేను ముందుకు అడుగువేయగలుగునట్లు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Apr 9, 2022

    Dietrich Bonhoeffer | డీట్రిక్ బాన్‌హోఫర్

    డీట్రిక్ బాన్‌హోఫర్ జీవిత చరిత్ర



    • జననం      :    04-02-1906
    • మరణం     :    09-04-1945
    • స్వస్థలం      :    వ్రోట్స్వావ్ 
    • దేశం         :    పోలాండ్
    • దర్శన స్థలము    : జర్మనీ


        డీట్రిక్ బాన్‌హోఫర్ ఒక వేదాంతవేత్త, లూథరన్ సంఘ పాదిరి, రచయిత మరియు జర్మనీలోని "కన్ఫెసింగ్ చర్చి" వ్యవస్థాపకులలో ఒకరు. అతను నామకార్థ క్రైస్తవ్యపు పరిస్థితులలో పెరిగారు. ఏదేమయినప్పటికీ, దేవుని సేవ చేయుటకు ఆకర్షితులై, పద్నాలుగు సంవత్సరాల వయస్సులో తాను దైవ సేవకుడు అవ్వాలని  నిశ్చయించుకున్నారు. 1927వ సంll లో బెర్లిన్ విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత న్యూయార్క్ నగరంలోని ‘యూనియన్ థియోలాజికల్ సెమినరీ’ అనే వేదాంత కళాశాలలో శిక్షణ పొందుటకు అతను అమెరికా వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడు అణగారిన సమాజములో మార్పు తీసుకొని వచ్చుటలో క్రైస్తవ సంఘము ఎంత శక్తివంతమైనదో అతను గ్రహించారు. ఇది దేవునికి సేవ చేయడంలో ఒక నూతన దృక్పథమును అతనిలో కలిగించింది.


        ఆ సమయంలోనే హిట్లర్ అధికారంలోకి రాగా, అది యూదుల శ్రమలకు నాంది పలికింది మరియు క్రైస్తవ సంఘములో తప్పుడు సిద్ధాంతాలకు ఆజ్యం పోసింది. జర్మనీ ప్రజలు క్రీస్తు యొక్క సంఘములో ప్రవేశించుటకు హిట్లర్ పరిశుద్దాత్ముని మార్గమని విశ్వసించిన చాలా మంది క్రైస్తవ సంఘ నాయకులు ఆ విధంగా బోధించడం ప్రారంభించారు. డీట్రిక్ అటువంటి తప్పుడు బోధలను తిరస్కరించి, సంఘములోనికి చొరబడుతున్న 'నాజీయిజం' గురించి విశ్వాసులను హెచ్చరించారు. యూదులకు కలుగుతున్న హింసను వ్యతిరేకించవలెనని క్రైస్తవ సంఘముకు అతను తిరిగి తిరిగి చేసిన విజ్ఞప్తులు నాజీయిజముకు మద్దతునిచ్చే సంఘ నాయకుల మందగిలిన చెవులకు వినబడనట్లుగానే ఉన్నాయి. అటువంటి సంఘటనల వలన వేదన చెందిన డీట్రిక్, మరికొందరితో కలిసి "కన్ఫెసింగ్ చర్చ్" ను స్థాపించారు. ఈ సంఘం హిట్లర్ యొక్క దురాగతాలకు వ్యతిరేకంగా నిలబడినది.


        తన పరిచర్యపై వ్యతిరేకత పెరుగుతున్న సమయములో అతను జర్మన్ భాషను మాట్లాడే ప్రొటెస్టంట్ సంఘములో పరిచర్య చేయుటకు రెండు సంవత్సరాల పాటు లండన్ వెళ్ళారు. తరువాత జర్మనీకి తిరిగి వచ్చిన అతను, అబద్ధ బోధనలకు వ్యతిరేకంగా కన్ఫెస్సింగ్ చర్చి చేసిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. అయితే, అతని వేదాంత కళాశాల మూసివేయబడింది, బోధించుటకు అతనికివ్వబడిన అధికారపూరిత అనుమతి (లైసెన్స్) రద్దు చేయబడింది మరియు అతను ప్రసంగించడం లేదా ప్రచురించడం నిషేధించబడింది. కాగా రహస్యముగా పరిచర్య జరిగిస్తున్నందుకుగాను మరియు యూదులను తప్పించుటలో పాలుపంపులు కలిగియున్నందుకుగాను చివరికి అతను బంధించబడ్డారు. రెండు సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని అనుభవించిన అతను, చెరసాలలో ఉన్న సమయములో ఖైదీల మధ్య సంతోషముగా పరిచర్య చేశారు మరియు ఎంతో ముఖ్యమైన వేదాంతపరమైన వాదనలను లిఖించారు. తదుపరి ఆ రచనలు జర్మన్ చర్చి యొక్క పురోగతికి ఆకృతినిచ్చాయి. హిట్లర్‌కు విధేయునిగా కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేయుటకు డీట్రిక్ నిరాకరించడంతో అతనికి ఉరిశిక్ష విధించబడింది. అతని యొక్క ఆఖరి మాటలు ఏవనగా, "ఇది ముగింపు — నాకు మాత్రం జీవిత ఆరంభం".

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు నామకార్థపు క్రైస్తవ జీవితమును విడిచిపెట్టి, ఆత్మీయపరముగా ఆసక్తి గలవారై దేవుని కొరకు జీవిస్తున్నారా?

    ప్రార్థన :

    "ప్రభువా, ఆరోగ్యకరమైన సిద్ధాంతములో ఎదుగుటకు నాకు సహాయము చేసి, అబద్దపు బోధనల నుండి నన్ను కాపాడుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Mar 21, 2022

    Darlene Rose | డార్లీన్ రోజ్

    డార్లీన్ రోజ్ జీవిత చరిత్ర





    జననం: 17-05-1917

    మహిమ ప్రవేశం: 24-02-2004

    స్వస్థలం: అయోవా

    దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు

    దర్శన స్థలము: పాపువా న్యూ గినియా


    దేవుని వాగ్దానాలపై స్థిరమైన విశ్వాసమును కలిగి పాపువా న్యూ గినియాలో తాను చేసిన పరిచర్యకు పేరుగాంచిన ఒక అమెరికా మిషనరీ డార్లీన్ డీబ్లెర్ రోజ్. క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఆమె చిన్నతనం నుండే లేఖనములను కంఠస్థం చేసేవారు. 13 ఏళ్ళ వయసులో ఒక ఉజ్జీవ కూడికలో తన జీవిత లక్ష్యములను ఆయన కొరకు అంకితం చేయమని దేవుడు తనను కోరుతున్నట్లు ఆమె గ్రహించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆమె శిక్షణ కొరకు 'క్రిస్టియన్ అండ్ మిషనరీ అలయన్స్‌' లో చేరారు. తదుపరి పాపువా న్యూ గినియాలోని వివిధ ప్రాంతాలలో మిషనరీ సేవ యొక్క ఆరంభకులలో ఒకరైన రస్సెల్ డీబ్లర్‌తో 1937వ సంll లో ఆమెకు వివాహం జరిగింది. కాగా తన భర్తతో కలిసి పాపువా న్యూ గినియాలో మిషనరీగా పనిచేయుటకు బయలుదేరినప్పుడు ఆమెకు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. మంచి భాషా నైపుణ్యంతో అశీర్వదించబడిన డార్లీన్ అక్కడి స్థానికులను క్రీస్తు వైపుకు నడిపించుటకు మిగుల ఆసక్తితో పనిచేశారు.


    ఆ ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు కూడా ఆ మిషనరీ దంపతులు అక్కడే ఉండి సేవను కొనసాగించుటకు నిశ్చయించుకున్నారు. తద్ఫలితముగా వారు జపాన్ సైన్యానికి బందీలుగా మారారు. స్త్రీపురుషులను వేరు వేరుగా ఖైదీల శిబిరాలకు తీసుకొని వెళ్ళడముతో డార్లీన్ తన భర్త నుండి వేరుచేయబడ్డారు. ఆ ఎడబాటును భరించవలసి రావడమే కాకుండా, జపాన్ వారి నిర్బంధ శిబిరంలో ఆకలి, బలవంతముగా చాకిరీ చేయడం, ఏకాంత నిర్బంధము, హింస మరియు అమానుషమైన చర్యలను కూడా భరించవలసి వచ్చింది. అయితే అన్ని పరిస్థితులలో కూడా దేవుని కృప వలన నిలబడగలిగిన ఆమె యొక్క విశ్వాసం స్థిరమైనదిగా ఉంది.


    తన భర్త మరణం గురించి విన్నప్పుడు డార్లీన్ రెండు పదుల వయస్సు యొక్క ప్రారంభదశలో ఉన్నారు. వెనువెంటనే ఆమె ఒక గూఢచారి అన్న ఆరోపణలతో ఏకాంత నిర్బంధంలో ఉంచబడ్డారు. కౄరంగా హింసించబడినప్పటికీ, అనారోగ్యంతో మరియు పోషకాహార లోపంతో ఉన్నప్పటికీ అన్ని శ్రమలలోనూ క్రీస్తు నిమిత్తం ఒంటరిగా పోరాడారు డార్లీన్. బందీగృహంలోని ఆ గదిలో ఒంటరితనంతో గడపవలసిన ఆ సమయంలో ఆమె పూర్వము కంఠస్థం చేసిన లేఖనముల యొక్క విలువను గ్రహించారు. అవి ఆమెకు కావలసిన ఆదరణనిచ్చాయి. ఒకసారి గూఢాచారిగా ఉన్నందుకుగాను కొన్ని క్షణాలలో శిరచ్ఛేదం చేయబడతారన్న పరిస్థితులలో అద్భుతకరమైన రీతిలో ఆమె ఆ ఏకాంత నిర్బంధంలో నుండి మునుపు ఉన్న అసలు జైలు శిబిరానికి తీసుకువెళ్ళబడ్డారు. అన్ని పరిస్థితులలోనూ ఆయన చాలినవాడని దేవుడు ఆమెకు నిరూపించాడు. అమెరికాకు తిరిగి వచ్చిన తరువాత కూడా మిషనరీ సేవ కొరకైన జ్వాలలు ఆమెలో రగులుతూనే ఉన్నాయి. కాగా 1949వ సంll లో ఆమె పాపువా న్యూ గినియాకు తిరిగి వచ్చారు. అక్కడ నలభై సంవత్సరాలకు పైగా ప్రభువుకు నమ్మకముగా సేవ చేసిన డార్లీన్ రోజ్ 2004వ సంll లో మహిమలో ప్రవేశించారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, ఎటువంటి శ్రమలు బాధలలోనైనా మీ విశ్వాసం కదలనిదై స్థిరమైనదిగా ఉన్నదా?


    ప్రార్థన

    ప్రభువా, మీకు నమ్మకముగా సేవ చేయుటకును, అన్ని పరిస్థితులలోనూ మీరు నాకు చాలినవారని అనుభవించి ఎరుగుటకును నాకు సహాయము చేయుము. ఆమేన్!


    దేవునికే మహిమ కలుగునుగాక!



  • WhatsApp
  • Dec 4, 2021

    Divine Vidachi Bhuvike Vachhina | దివినే విడచి భువికే వచ్చిన

    దివినే విడచి భువికే వచ్చిన నా యేసయ్య



  • WhatsApp
  • Nov 16, 2021

    Dhootha Ganamu | దూత గణము పాడేను | Telugu Christmas song


    Dhootha Ganamu | దూత గణము పాడేను | Telugu Christmas song


    దూత గణము పాడేను మధుర గీతము
    నా నోట నిండేను స్తోత్ర గీతము
    అ.ప.: సర్వోన్నత స్థలములలో-దేవునికి మహిమ
               ఇష్టులైనవారికి -ఇల సమాధానము

    ఘనుడు - ఆశ్చర్యకరుడు
    ప్రియుడు - అతి సుందరుడు
    దేవాదిదేవుడే దీనుడై
    ఉదయించె పాకలో బాలుడై

    నవ్వులు - సొగసైన పువ్వులు
    చూపులు - మణిదీప కాంతులు
    ఆ యేసు జననమే రమ్యము
    నమ్మిన ప్రతి హృదయము ధన్యము



  • WhatsApp
  • Nov 14, 2021

    Bishop Daniel Corrie | బిషప్ డానియేల్ కొరీ

    బిషప్ డానియేల్ కొరీ గారి జీవిత చరిత్ర





    • జననం: 10-04-1777
    • మహిమ ప్రవేశం: 05-02-1837
    • స్వదేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: భారతదేశం


     ఇంగ్లాండు దేశానికి చెందిన డానియేల్ కొరీ ఒక ఆంగ్లికన్ పాదిరి మరియు బిషప్పు. 1802వ సంll లో డైయోసెస్ ఆఫ్ లింకన్‌కు డీకనుగాను మరియు 1804వ సంll లో పాదిరిగాను నియమించబడిన అతను, 1806వ సంll లో భారతదేశంలోని బెంగాల్‌ ప్రాంతానికి ప్రార్థనామందిర అధికారిగా నియమితులయ్యారు. 1823వ సంllలో కలకత్తా యొక్క ఆర్చిడీకనుగా నియమించబడి, తరువాత 1835వ సంll లో మద్రాసుకు బిషప్పు అయ్యారు.
     అతను హిందూస్థానీ భాషను నేర్చుకొని, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని చునార్ ప్రాంత ప్రజల మధ్య సేవ చేశారు. ఆ ప్రాంతంలోనూ, వారణాసి వరకూ ఉన్న చుట్టుప్రక్కల ప్రాంతాలలోనూ అతను సువార్తను ప్రకటించినవారై క్రైస్తవ సంఘాలను, పాఠశాలలను స్థాపించారు. తరువాత 1810వ సంllలో కాన్పూరుకు వెళ్లి, అక్కడ తనకు సన్నిహిత స్నేహితులైన హెన్రీ మార్టిన్‌తో కలిసి కొంతకాలం పరిచర్య చేశారు. అక్కడ సేవ చేస్తున్న సమయంలో అతను తీవ్ర అస్వస్థతకు గురవడంతో, అనారోగ్యం నుండి కోలుకొనుటకుగాను కాన్పూరును విడిచి కలకత్తాకు వెళ్ళారు. అయినప్పటికీ, దేవుని పరిచర్యలో అతను వెనుదిరిగి చూడలేదు. కొరీ స్థానిక ముస్లిం ప్రజల మధ్య కూడా పరిచర్య జరిగించి, వారిని క్రీస్తు నొద్దకు నడిపించారు.

     1812వ సంllలో అతను ఎలిజబెత్‌ను వివాహం చేసుకొనగా, ఆమెకున్న ఆత్మీయ సంకల్పం మరియు స్వచ్ఛమైన ప్రేమాప్యాయతలు ఒడిదుడుకులలోనూ దేవుని పరిచర్యలో ముందుకు సాగిపోవుటకు అతనికి ఎంతో తోడ్పాటునందించాయి. వారిరువురూ కలిసి ఆగ్రాకు వెళ్ళి, రెండు సంవత్సరాలపాటు సేవ చేయగా, అక్కడ దేవుని వాక్యం ఎంతో ఫలభరితమైనదై స్థానిక ప్రజలతో కూడిన క్రైస్తవ సంఘాలు ఏర్పడ్డాయి. కొరీ కలిగియున్న కాలేయానికి సంబంధించిన వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో వైద్య చికిత్స నిమిత్తమై అతను తన స్వదేశానికి వెళ్ళవలసి వచ్చింది. అయితే, హిందూస్థానీ సోదరుల పట్ల అతనికున్న గొప్ప ఆసక్తి వలన అతను తిరిగి భారతదేశానికి వచ్చి, కలకత్తా, బనారస్ (వారణాసి), బక్సార్, మరియు చునార్ ప్రాంతాలలో దేవుని సేవను కొనసాగించారు.
     తరువాతి కాలంలో 1835వ సంll తమిళనాడులోని మద్రాసుకు బిషప్పుగా నియమించబడిన డానియేల్ కొరీ, తన చివరి శ్వాస వరకూ అక్కడే సేవలందించారు. ఆ సమయంలోనే తంజావూరు మరియు తిరునెల్వేలి ప్రాంతాలలోని క్రైస్తవ సంఘాలలో ఉన్న సమస్యలను పరిష్కరించి, శాంతి సమాధానాలను నెలకొల్పుటకు అతను ఎంతో కృషి చేశారు. అంతేకాకుండా, ఎన్నో పాఠశాలలను మరియు క్రైస్తవ సంఘాలను స్థాపించిన కొరీ దేవుని పరిచర్య చేయుటకై ఎంతోమంది యువకులకు శిక్షణనిచ్చారు. దయగల హృదయం మరియు సాత్వికమైన స్వభావము కలిగి, దీనత్వముతో 24సంll లకు పైగా భారతదేశంలో దేవుని సేవ చేసిన బిషప్ డానియేల్ కొరీ, 1837వ సంll లో ఈ లోకములో తన యాత్రను ముగించారు.

    ప్రియమైనవారలారా, అనేక మంది మిషనరీలు తమ దేశాలను విడిచిపెట్టి వచ్చి మీ దేశమును రక్షించుటకు వచ్చి శ్రమించగా, మీ స్వంత దేశము కొరకు మరియు మీ స్వంత ప్రజల కొరకు మీరు భారం కలిగియున్నారా?

    "ప్రభువా, మా దేశములో రక్షణ వెలుగును వ్యాపింపజేయుటలో నన్ను ఒక సాధనముగా వాడుకొనుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Oct 11, 2021

    Don Richardson | డాన్ రిచర్డ్‌సన్

    డాన్ రిచర్డ్‌సన్ | Don Richardson



    • జననం: 23-06-1935
    • మహిమ ప్రవేశం: 23-12-2018
    • స్వస్థలం: షార్లెట్‌టౌన్
    • దేశం: కెనడా
    • దర్శన స్థలము: న్యూ గినియా దీవులు, ఇండోనేషియా

     ఇండోనేషియాలోని సావి తెగ తమ నమ్మకద్రోహానికి మరియు మోసపూరితతనమునకు పేరుగాంచింది. వారు శతృ తెగలతో స్నేహం నటిస్తారు, వారిని విందుకు ఆహ్వానిస్తారు, వారి యొక్క నమ్మకమును గెలుచుకున్న తరువాత వారు అక్కడికి వచ్చిన అతిథులను చంపి వారి మాంసాన్ని తింటారు. డాన్ రిచర్డ్‌సన్ సేవ చేయుటకు ఎంచుకున్న తెగ ఇది.

     పదిహేడేళ్ళ వయసులో తన జీవితమును యేసు క్రీస్తు ప్రభువుకు సమర్పించిన డాన్, అప్పటి నుండి తాను ఒక మిషనరీ కావాలని పూర్ణహృదయముతో నిశ్చయించుకున్నారు. కాగా అల్బెర్టాలోని ప్రైరీ బైబిల్ ఇనిస్టిట్యూట్ నుండి పట్టా పొందిన తరువాత అతను సావి తెగవారి మధ్య సేవ చేయుటకు ఇండోనేషియాలోని కాముర్ గ్రామానికి వెళ్ళారు.

     అతను సువార్తను ప్రకటించుటకు ప్రయత్నించినప్పుడు ఇస్కరియోతు యూదా యొక్క నమ్మకద్రోహ స్వభావం కారణంగా వారు యేసు క్రీస్తు కంటే ఎక్కువగా యూదాను ఇష్టపడ్డారు. వారు సరియైన భావమును గ్రహించగలిగేలా వారికి సువార్తను చెప్పడం డాన్‌కు కష్టతరమైంది. అనేక సంవత్సరాల పాటు పరిచర్య చేసినప్పటికీ క్రైస్తవులుగా మారిన వారెవరూ లేకపోవడంతో, క్రీస్తు కొరకు ఆ ఆటవికులను గెలుచుకొనగలననే నిరీక్షణను డాన్ దాదాపు కోల్పోయారు. ఆ బాధకు తోడు అన్నట్లు అక్కడ తెగల మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది.

     ఆ యుద్ధ సమయంలో ఒక బాణం డాన్ కుమారుడు స్టీఫెన్‌ని దాదాపు చంపి ఉండేది. అక్కడి పరిస్థితులకు విసిగిపోయిన డాన్ మేలు కొరకు ఆ స్థలాన్ని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నారు. సావీలు సువార్తను అర్థం చేసుకొనలేకపోయినప్పటికీ వారు అందించిన వైద్య సేవలను బట్టి డాన్ కుటుంబము పట్ల అభిమానం కలిగియున్నారు. కావున డాన్ కుటుంబము అక్కడి నుండి వెళ్లిపోవుటకు ఆ తెగ ప్రజలు ఇష్టపడలేదు. తదుపరి వారు ఏమి చేశారో చూసి డాన్ ఆశ్చర్యపోయారు. ఆ తెగ నాయకుడు తన కుమారుడిని శతృ తెగకు ఇచ్చాడు. సంధి చేసుకొని శాంతిని నెలకొల్పుటకు అది వారు అనుసరించే పద్ధతి. దాని అర్థమేమంటే, తెగ నాయకుని కుమారుడు శతృ భూభాగంలో సురక్షితంగా ఉన్నంత వరకు వారి మధ్య యుద్ధం ఉండదు. వెంటనే డాన్ ఆ పరిస్థితిని తనకు అనుగుణంగా మలచుకొని, నరులకు దేవునికి మధ్య సమాధానమును తీసుకువచ్చుటకు పరలోకపు తండ్రి తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి ఎలా పంపించాడో వారికి సందర్భోచితంగా వివరించారు.

     ఆ రోజు అతను ఇచ్చిన సందేశం అక్కడి పరిస్థితిలో గొప్ప మార్పును తీసుకువచ్చింది. అప్పటి నుండి వందలాది మంది సావీలు యేసు క్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించారు. డాన్ క్రొత్త నిబంధనను అక్కడి స్థానిక భాషలోకి అనువదించారు. అతని కృషి వలన కేవలం సావీలు మాత్రమే కాదు, ప్రస్తుతం ఆ తెగకు పొరుగున ఉన్న మరో ఐదు తెగలవారు కూడా అధికశాతం క్రైస్తవులే!

     1977వ సంll లో తన కుటుంబముతో కెనడాకు తిరిగి వచ్చిన డాన్ రిచర్డ్‌సన్, 2018వ సంll లో తాను మరణించే వరకు కూడా బోధించుచూ మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో మిషనరీ కార్యకలాపాలను నడిపించుచూ దేవుని సేవలో ముందుకు సాగిపోయారు.

    ప్రియమైనవారలారా, సువార్తను ప్రకటించుటకు మీరు పరిస్థితులను అనుకూలముగా మలుచుకుంటున్నారా?

    "ప్రభువా, వివిధ వర్గాల ప్రజలకు సరియైన భావమును విశదపరుచునట్లు సందర్భోచితంగా సువార్తను చెప్పగలుగుటకు నాకు జ్ఞానము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Oct 9, 2021

    David Eubank | డేవిడ్ యూబ్యాంక్

    డేవిడ్ యూబ్యాంక్ | David Eubank





    • జననం: 29-09-1960
    • మహిమ ప్రవేశం: -
    • స్వస్థలం: ఫోర్ట్ వర్త్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: బర్మా; యుద్ధ ప్రాంతాలు

     శత్రువులతో పోరాడాలా లేదా అనే విషయంలో క్రైస్తవులైన సైనికులకు ఎల్లప్పుడూ ఒక విధమైన సందిగ్ధం ఉంటుంది. జాతీయ కర్తవ్యం యుద్ధానికి పిలుపునిస్తే క్రైస్తవ కర్తవ్యం శాంతి కొరకు పిలుపునిస్తుంది. సైనికుడిగా ఉండటం, అదే సమయంలో క్రీస్తు ఆజ్ఞను నెరవేర్చడం అనే రెండు విషయాల మధ్య తమ జీవితమును సమతుల్యం చేసుకున్న కొంతమంది క్రైస్తవులలో డేవిడ్ యూబ్యాంక్ ఒకరు.

     డేవిడ్‌కు తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు మిషనరీ పరిచర్య నిమిత్తం థాయ్‌లాండ్‌కు వెళ్ళారు. అయితే చదువు కొరకు అమెరికాకు తిరిగి వచ్చారు డేవిడ్‌. తన విద్యాభ్యాసం కొరకు ఆర్మీ ఉపకార వేతనమును అందుకున్న అతను, పిమ్మట అమెరికా సైన్యంలో కాల్బలము యొక్క అధికారిగా నియమించబడ్డారు. త్వరలోనే అతను మేజర్ స్థాయికి ఎదిగారు. శత్రు సైన్యాలను ఎదుర్కొనే ప్రతిసారీ వారితో పోరాడాలా లేదా అనే సందిగ్ధం ఎల్లప్పుడూ అతనిలో ఉండేది. తాను ఆత్మలను కాపాడాలే గానీ, ప్రాణాలను తీయకూడదని గ్రహించిన అతను, చివరికి సైన్యానికి రాజీనామా చేసి, 1992వ సంll లో ఫుల్లర్ థియోలాజికల్ సెమినరీలో చేరారు.

     అతను సెమినరీలో చదువుతున్నప్పుడు, బర్మాలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాలలో సహాయం అందించవలెనని అతనికి ఆహ్వానం అందింది. కాగా, ప్రార్థనాపూర్వకంగా అతను బర్మా చేరుకున్నారు. అక్కడ అంతర్యుద్ధంలో చిక్కుకున్న గిరిజనుల మధ్య అతను పనిచేయడం ప్రారంభించారు. అక్కడ అతను దాడిని ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయము, నిరీక్షణ మరియు ప్రేమను అందించుటకై “ఫ్రీ బర్మా రేంజర్స్” (ఎఫ్.బి.ఆర్.) అనే మిషన్‌ను స్థాపించారు. అనేక ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య అతను తన సహాయక చర్యలను శాంతి సువార్త సందేశమును అందిచుటతో మిళితం చేసి, అనేకమందిని దేవుని యొద్దకు నడిపించారు.

      ప్రస్తుతం ఎఫ్.బి.ఆర్. మిషన్‌ను బర్మా సరిహద్దులు దాటి విస్తరింపజేసిన డేవిడ్, ఇరాక్ మరియు సూడాన్‌ వంటి ఇతర యుద్ధ ప్రాంతాలలో కూడా సేవలందించారు. ఇరాక్‌లో అమెరికా సైన్యం మరియు ఇస్లాం జాతీయ తీవ్రవాదుల మధ్య వివాదంలో చిక్కుకున్న అమాయక కుటుంబాలకు డేవిడ్ మరియు అతని కుటుంబం సేవ చేశారు. యుద్ధ ప్రాంతంలో మరణం సంభవించే అవకాశాలు అధికముగా ఉన్నప్పటికీ, తుపాకీ కాల్పుల మధ్య కూడా ప్రాణాలను కాపాడుతూ, సహాయాన్ని అందిస్తూ, సువార్తతో ప్రజలకు ఆదరణను అందించారు డేవిడ్.

      క్రైస్తవునికి ఉండే ప్రేమ మరియు సైనికునికి ఉండే ధైర్యం ఇతరులు చేయుటకు లెక్కచేయని వాటిని చేయుటకు అతనిని ముందుకు నడిపిస్తున్నాయి. ప్రాణాంతకమైన గాయాలు మరియు అతని కుటుంబం ఎదుర్కొనే అపాయల మధ్య ఈ క్రైస్తవ సైనికుడు యుద్ధ ప్రాంతాలలో స్వచ్చందంగా పనిచేస్తున్నారు. మిమ్మల్ని ఎవరు పంపించారని ఎవరైనా అతనిని అడిగినప్పుడు, డేవిడ్ ఇచ్చే సమాధానం “దేవుడు”!

    ప్రియమైనవారలారా, మీరు చేస్తున్న పనిలో మీరు నిజమైన క్రైస్తవునిగా ఉన్నారా?

    "ప్రభువా, నాకు క్రీస్తు యొక్క ఆత్మను దయచేసి, శాంతిని నెలకొల్పేవానిగా నేను ఉండుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Sep 26, 2021

    Deva nee Mukhamunu | దేవా నీ ముఖమును

    "సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు నన్న నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును?" కీర్తన Psalm 27:9-14

    దేవా నీ ముఖమును నాకు - దాచకుము నా ప్రభువా
    నీ సేవకుని కోపముచే - త్రోసివేయకు యెహోవా

    1. దేవా నా రక్షణకర్త - నీవే నాసహాయుడవు
    నన్ను దగనాడవలదు - నన్ను విడువకుము
    || దేవా నీ ||

    2. నాదు తలిదండ్రులు - నన్ను విడచినను
    నా దేవుండగు యెహోవా - నన్ను చేరదీయును
    || దేవా నీ||

    3.నాకై పొంచియున్నట్టి - వారిని చూచి నన్ను
    సరళ దారిని నడుపు - మంచి మార్గము భోధించు
    || దేవా నీ ||

    4. నాపై లేచియున్నారు - అబద్ధ సాక్షులు క్రూరుల్
    నన్నప్పగించకు దేవా - నాదు విరోధులకు
    || దేవా నీ ||

    5. యెహోవా దయ పొందెదను - సజీవుల దేశమున
    ఇట్టి నమ్మకము లేని - యెడల నే నేమగుదును
    || దేవా నీ ||

    6. ధైర్యము తెచ్చుకొని - నిబ్బర హృదయము గల్గి
    యెహోవా దేవుని కొరకు - కనిపెట్టుకొని యుండుము
    || దేవా నీ ||
  • WhatsApp
  • Aug 8, 2021

    Dhushtula aalochana choppuna naduvaka | దుష్టుల ఆలోచన చొప్పున నడువక

    "యెహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు." కీర్తన Psalm 1

    దుష్టుల ఆలోచన చొప్పున నడువక
    పాపుల మార్గములయందు నిలిచియుండక


    యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు
    యెల్లప్పుడు ధ్యానముచేయువాడే ధన్యుడు || దుష్టుల ||


    కాలువ నీటియోర నతడు నాటబడి
    కాలమున ఫలించు చెట్టువలె యుండును || దుష్టుల ||


    ఆకు వాడని చెట్టువలె నాతడుండును
    ఆయన చేయునదియెల్ల సఫలమగును || దుష్టుల ||

    దుష్టజనులు ఆ విధముగా నుండక
    పొట్టువలె గాలికి చెదరగొట్టబడుదురు || దుష్టుల ||


    న్యాయ విమర్శ సభల యందు దుష్టజనులు
    నీతిమంతుల సభలో పాపులును నిలువరు || దుష్టుల ||


    నీతిమంతుల మార్గము యెహోవా ఎరుగును
    నడుపును దుష్టుల దారి నాశనమునకు || దుష్టుల ||

    _______________________________________

    Dustula allochana choppuna naduvaka 
    papulamaargamulayandu nilichiyundaka


    Apahasinchunatti prajalu kurchundedu 
    Aa chota kurchundaka yunduvaade dhanyudu  

     
    Yehovaa darmasastramandu anandinchuchu 
    yallappudu dyanamu cheyuvade dhanyudu  

     
    Kaaluva neetiyora nathadu naatabadi thana 

    kaalamuna phalinchu chettuvale yundunu

      

    Aaku vadani chettuvale nathadundunu

    ayana cheyunadiyella saphalamagunu 


    Dhusta janulu a vidhamuga nundaka 

    pottuvale gaaliki chedaragottabadudhuru 


    Nyaya vimarsa sabhalayandu dhustajanulu 

    neetimantula sabhalo paapulunu niluvaru 


    Nethimanthula maargamu Yehova yerugunu

    nadupunu dustula dhari nashanamunaku

  • WhatsApp