Dhootha Ganamu | దూత గణము పాడేను | Telugu Christmas song
దూత గణము పాడేను మధుర గీతము
నా నోట నిండేను స్తోత్ర గీతము
అ.ప.: సర్వోన్నత స్థలములలో-దేవునికి మహిమ
ఇష్టులైనవారికి -ఇల సమాధానము
ఘనుడు - ఆశ్చర్యకరుడు
ప్రియుడు - అతి సుందరుడు
దేవాదిదేవుడే దీనుడై
ఉదయించె పాకలో బాలుడై
నవ్వులు - సొగసైన పువ్వులు
చూపులు - మణిదీప కాంతులు
ఆ యేసు జననమే రమ్యము
నమ్మిన ప్రతి హృదయము ధన్యము
No comments:
Post a Comment