Search Here

Mar 3, 2022

Hosanna Ministries 32nd Album [Srikaruda Naa Yesayya] Song 1 "కరుణా సంపన్నుడా" Pas.John Wesley

Hosanna Ministries 32nd Album [Srikaruda Naa Yesayya] Song 1 "కరుణా సంపన్నుడా" Pas.John Wesley

కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా ||2||
నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వీకుడా
నీకోసమే నా జీవితం ||కరుణా||

1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే - సందడిని చేసెను ||2||
అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే
ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను ||2||
ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా||

2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని ||2||
నీ కృపలో నిలిపినది - నీ ప్రేమ సంబందమే
అనుదినము మకరందమే - నీ స్నేహబంధము ||2||
ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా||

3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది ||2||
నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో
ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం ||2||
తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా||






  • WhatsApp
  • No comments:

    Post a Comment